బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దోషి.. ఢిల్లీ కోర్టు తీర్పు
posted on Oct 6, 2020 @ 1:58PM
బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రితో పాటు మరో ముగ్గుఋ ఉన్నతాధికారులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ణయిస్తూ తీర్పు ఇచ్చింది. 1999లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో నాటి బొగ్గుగనుల మంత్రి దిలీప్ రే అక్రమాలకు పాల్పడినట్టు న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఝార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపుల్లోఈ అవకతవకలకు జరిగినట్లు తేల్చింది. కేంద్రమంత్రితో పాటు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద గౌతమ్, క్యాస్ట్రన్ టెక్నాలజీ, ఆ సంస్థ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌ను దోషులుగా తేల్చారు. జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు గనులను కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ గనుల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది. ఈ కేసులో దోషులకు శిక్షల విషయాన్ని మాత్రం ఈనెల 14న కోర్టు తన తుది తీర్పులో ప్రకటించనుంది.