ఏప్రిల్ లో 45 ఏళ్లు దాటిన వారికి టీకా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విలయ తాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చిందనే అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 60 ఏండ్లు పైబడిన వారికి, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇస్తున్నారు. 45 ఏండ్లు దాటిన వారందరికి టీకా ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ సిద్దమవుతోంది. 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారికి ఏప్రిల్‌ ఒకటి నుంచి టీకాలు అందించనున్నట్లు ప్రకటించింది.  కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు పంపిణీ చేసింది. రెండో దశలో 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకాలు ఇస్తున్నారు. రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న తరుణంలో..యువత, 45 ఏళ్లు పైబడిన వారిని కూడా టీకా కార్యక్రమం కిందికి తీసుకురావాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి తాజా ప్రకటన వెలువడింది.    ‘45 లేక అంతకంటే ఎక్కువ వయస్సున్న ప్రతి ఒక్కరు టీకా వేయించుకునే నిమిత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను. కరోనా వైరస్ టాస్క్‌ ఫోర్స్, నిపుణులు ఇచ్చిన సూచనలను అనుసరించి కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు.  మార్చి 22 నాటికి కేంద్రం 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది.  సోమవారం  ఒక్కరోజే 32,53,095 మందికి టీకాలు అందించింది.     

తండ్రి లై*గిక వేధింపులు.. కాల్చి చంపిన కూతురు... 

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వసంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని.. అని ఎన్ని పాటలు రాసిన, ఎన్ని శిక్షలు వేసిన ఎన్ని ప్రభుత్వాలు మరీనా..  మారాడు లోకం మారాడు కాలం. దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. అదే నిజం అదే కొందరి దుర్మగుల నైజం.. కసాయి కోతులకు తెగిపడుతున్న మహిళా కుత్తికెలు ఎన్నో.. మగాడి చీకటి చాటున వెలుగు చూడని మగువల మానాలు ఎన్నో.. అన్న, తమ్ముడు, బావ, మరిది, మామ, తాత, పేరు పేగు  బంధం ఏదైతేనేమి అందరూ మగాలే.. వారికీ కావాల్సిందే మగువలే.. మహిళపై నిత్యం దాడులు భారత దేశాన్ని మహిళా ఏడుపు దేశం గా చెప్పాలి.    ఆమె తల్లి లేదు. కన్నాతండ్రి దగ్గరే పెరిగింది. కానీ తండ్రి కూతురిపై యమా కింకరుడయ్యాడు. నిత్యం వేధింపులకు గురవుతూ ఉండేది. మేడలో తాళి పడితే తండ్రి బాధ తప్పుతుందనుకుంది. మేడలో తాళి మరింత బరువుగా మారింది. పెళ్లి జీవితం విడాకులు తీసుకుని యూటర్న్ తీసుకుని. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చింది. దాంతో మళ్లీ ఆ కసాయి తండ్రి కూతురిపై వేధింపులు స్టార్ట్ చేశాడు. ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడు. దీంతో ఆమె ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. కన్నతండ్రిని సజీవ దహనం చేయాలని డిసైడ్ అయింది. అందుకు పథకం వేసింది.   ఓ సాయంత్రం తన తండ్రిని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లింది. ఫుల్ గా మద్యం తాగించింది. తినిపించి.  ఆ తర్వాత హుగ్లీ నది ఒడ్డుకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న ఆ తండ్రి బెంచిపై కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఆ మహిళ తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను అతనిపై పోసి నిప్పంటించింది. కోల్‌కతాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు సంచలనంగా మారాయి. పోలీసుల విచారణలో నిందితురాలు తన తండ్రి అకృత్యాలను వెల్లడించింది. చిన్న వయసు నుంచి తండ్రి పెడుతున్న బాధలు తట్టుకోలేక అతడిని చంపేసినట్టు అంగీకరించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.   

శ్రీవారి హుండీలో చోరీ యత్నం

శ్రీవారి హుండీలో దొంగతనానికి ప్రయత్నం. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజం. అవును, కలియుగ దేవుని సన్నిధానంలో దొంగతనానికి తెగించాడో దొంగ. అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే.. హుండీలో నుంచే నగదు తస్కరించబోయాడు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. అతగాడు అదరలేదు, బెదరలేదు. దర్జాగా హుండీలో చేయిపెట్టి 30వేలు బయటకు తీసే ప్రయత్నం చేశాడు.  దొంగ కక్కుర్తి దొంగది. విజిలెన్స్ పని విజిలెన్స్ సిబ్బందిది. ఆ దొంగ శ్రీవారి హుండీ నుంచి డబ్బు తీస్తుండటాన్ని సీసీ కెమెరాల్లో చూశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. వెంటనే అప్రమత్తమయ్యారు. చోరీకి ప్రయత్నించిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడి పూర్వాపరాలు విచారిస్తున్నారు. 

ఇదేం చెత్త పన్ను కేసీఆర్?

అప్పట్లో తుగ్లక్ హయాంలో జుట్టు పన్ను ఉండేది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. అవును, ఇదేమీ ఆరోపణ కాదు. పచ్చి నిజం. వరంగల్ కార్పొరేషన్‌లో జరుగుతోంది ఈ తతంగం. ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు చెత్త రవాణా పన్ను కూడా జారీ చేస్తున్నారు. ప్లింత్ ఏరియా ఆధారంగా పన్ను విధిస్తున్నారు. ఎంత పెద్ద స్థలం ఉంటే.. అంత ఎక్కువ చెత్త పన్ను విధిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా.. కార్పొరేషన్ తీరుపై విమర్శలు వస్తున్నా.. అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు.  చెత్త తరలింపునకు ఇప్పటి వరరకూ ఒక్కో ఇంటి నుంచి నెలకు 60 రూపాయలు వసూలు చేసేవారు. ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్న వరంగల్ కార్పొరేషన్ కొత్తగా చెత్త రవాణా పన్ను తీసుకొచ్చారు. ఆస్తిపన్నుతో పాటు చెత్త తరలింపు పన్ను వసూలు చేసేందుకు 4 నెలల క్రితం గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. బిల్డింగ్ ప్లింత్‌ ఏరియా ఆధారంగా చెత్త పన్ను మదింపు చేస్తున్నారు. పన్ను నోటీసుల్లో కొత్తగా గార్బేజ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ (జీటీ) పన్ను విధించారు. భవనం విస్తీర్ణాన్ని బట్టి చెత్త పన్ను 100 నుంచి 150 వరకూ ఉంటోంది. గతంలో 60 రూపాయలతో అయిపోయేది.. ఇప్పుడు ఏకంగా డబుల్ అయిందని నగరవాసులు మండిపడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు- మార్చి నెల ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసులో చెత్త పన్ను కూడా కలిపి ఇచ్చారు. అయితే.. 42 విలీన గ్రామాలు, గ్రేటర్ పరిధిలోని 183 మురికివాడలకు చెత్త పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. నివాసిత గృహాలు, వ్యాపార, వాణిజ్య భవనాలకు ప్లింత్‌ ఏరియా ఆధారంగా పన్ను మదింపు చేయడం ఇబ్బందిగా మారనుంది. రెసిడెన్షియల్‌ కేటగిరీలో 1200-1500 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియా ఉంటే చెత్త తరలింపు పన్ను రూ.120-150 అవుతోంది. వాణిజ్య భవనమైతే 1000-2000 చదరపు అడుగులుంటే నెలకు రూ.120-240 వరకు వస్తోంది. చెత్త పన్ను చెత్త చెత్తగా ఉందంటూ వరంగల్ నగర పౌరులు కార్పొరేషన్‌ తీరుపై కస్సుమంటున్నారు. 

స్టూడెంట్ పై.. ప్రొఫెసర్ లై*గిక టార్చెర్ ..

ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. సొంత ఇంట్లోనూ, బంధువుల్లోనూ, స్కూల్ లోనూ, కాలేజీ లోనూ, బస్టాండ్ లోనూ, ఎక్కడ చూసిన ఆడవాళ్ల పై జరుగుతున్న అసభ్య ఘటనలకు, దాడులకు వారు ఆవేదన చెబుతూనే ఉన్నారు. చదువు సంస్కారం లేని చిల్లరగాళ్ళ ఆటుపోటు మాటలకూ, వారిపై దాడులకు మహిళలు బలవుతూనే ఉన్నారు. విశ్వవిద్యాలయాలు దేవాలయాలు అంటారు. అధ్యాపకులను దేవులు అంటారు. మరి విద్యబుద్దులు చెప్పే గురువులే విద్యార్థులు పై లైంగిక వేధింపులకు పాలుపడితే. గురుసాక్షత్తు పరబ్రమ్మ అన్న పదాన్ని అపవిత్రం చేస్తే.  మద్రాస్ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ తాను చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని  ఈ నెల 16వ తేదీన ఇతర విద్యార్థుల ముందు తనతో హెచ్‌వోడీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన శరీర భాగాలను తాకాడని 31 ఏళ్ల యువతి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే అతడిని కాపాడేందుకు యూనివర్సిటీ యాజమాన్యం నియమించిన ఇంటర్నెల్ కంప్లైంట్స్ కమిటీ ప్రయత్నిస్తోందని తెలిపింది. మనస్తాపానికి గురైన ఆ యువతి ఆదివారం యూనివర్సిటీలోని బాత్రూమ్‌లో ఆత్మహత్యాయత్నం చేయగా.  తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ఆమె సురక్షితంగా బయటపడింది. కాగా, ఆమెకు మద్దతుగా నలుగురు మగ విద్యార్థులు యూనివర్సిటీ బయట నిరసన వ్యక్తం చేశారు. 

సంగారెడ్డి జాతిరత్నాలు..

ఆగు అనగానే ఆగడానికి అది మనం పెంచుకునే కుక్క నా..  వాహనం ఇక్కడ బ్రేక్ తొక్కితే కొంత దూరం వెళ్లి ఆగుతుంది. అలా సడెన్ గా బ్రేక్ వేస్తె ప్రమాదం జరిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకనే ఆ డ్రైవర్ కొంత దూరం వెళ్లి వాహనం ఆపాడు.. వాళ్లు చెప్పిన చోట వాహనం ఆపలేదని కాస్త దూరం వెళ్లి ఆపిన పాపానికి బులెరో డ్రైవర్‌పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. బహుశా పోలీస్ కు ఇగో హర్ట్ అయిందో.. లేదంటే ఇంట్లో పెళ్ళాం టార్చెర్  ఎక్కువైయిందో ఏమోగాని ఫ్రస్టేషన్లో డ్రైవర్ ని బూటు కాలుతో తన్నుతూ.. లాఠీలతో రక్తం కల్ల చూసేలా చితకబాదారు. డ్రైవర్ లబోదిబో మని  అరిచినా ఆగలేదు సంగారెడ్డి ఫ్రెండ్లీ పోలీస్. ఇష్టమొచ్చినట్లు చితకబాదారు.  ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో చోటు చేసుకుంది. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలెరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళుతుండగా అయ్యప్పస్వామి గుడివద్ద పోలీసులు వాహనాలు తనికీలు చేశారు. ప్రధాన రహదారిపై ఆకస్మికంగా పోలీసులు రావడంతో వాహనాన్ని కొంచెం దూరం తీసుకువెళ్లి ఆపాడు వాజిద్ . దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీతో వాజిద్ ను చితకకొట్టరు.  అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ బండా బూతులు తిట్టారు. లాఠీ దెబ్బలకు వాజిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ వైపు ఫ్రెండ్రీ పోలీసు అని ఉన్నతాధికారులు చెబుతుంటే.. కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాజిద్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు తన వాళ్ళు.. 

ప్రత్యేక హోదా లేదు.. ప్యాకేజీనేనట! జగన్ రెడ్డి మౌనం వీడేనా..

ఆంధ్రప్రదేశ్ పై మళ్లీ పాత పాటే పాడింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా కుదరదని మరోసారి తేల్చి చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని వెల్లడించింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ అంశంపై తాను అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ..పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సినవని సమాధానమిచ్చారు.  ప్రత్యేక హోదాపై స్పందిస్తూ..  ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అంశాలని తెలిపారు. విభజన హామీల అమలుకు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయన్నారు.   ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేయడంతో వైసీపీ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా నినాదంతోనే ప్రచారం చేశారు జగన్. తమకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. కాని అధికారంలోకి వచ్చి రెండు ఏండ్లు కావస్తున్నా.. ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదు జగన్. 22 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంట్ లో కనీసం మాట్లాడటం లేదు. కేంద్ర సర్కార్ కు సరెండర్ అయినందువల్లే జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని బీజేపీ మినహా మిగితా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. తన కేసుల కోసం కేంద్రానికి ప్రత్యేక హోదాను జగన్ తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కు ప్రత్యేక హోదాపై జగన్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ ప్రత్యేక హోదా తమ మొదటి లక్ష్యమని చెబుతూ వస్తున్న వైసీపీ.. ఇప్పుడు ఎలా పోరాడుతుందన్నది ఏపీ జనాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. 

ఏపీకి కొత్త ఎస్‌ఈసీ ఎవరంటే..? 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హయాంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ కి పచ్చ జెండా ఊపినప్పటికీ, కరోనా కారణంగా రెడ్ సిగ్నల్ వేశారు. అది అలా ఉండగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. కావున కొత్తగా బాధ్యతలు చేపట్టే ఎస్‌ఈసీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో ఏపీ తదుపరి ఎస్‌ఈసీ ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎస్‌ నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్‌ పేర్లను గవర్నర్‌కు పంపినట్లు సమాచారం. చూడాలి మరి ఏపీ కి కొత్త ఎస్‌ఈసీ ఎవరనేది తెలియాలంటే వేయిట్ చేయాలి. 

మారటోరియం చక్రవడ్డీ నుంచి రిలీఫ్..

కరోనా లాక్‌డౌన్‌తో రుణాలపై మారటోరియం విధించింది కేంద్రం. పేరుకే మారటోరియం పెట్టినా.. వడ్డీపై వడ్డీ లాగుతూ రుణగ్రహీతలపై భారం మోపాయి బ్యాంకులు. లోన్లపై చక్రవడ్డీ వద్దంటూ వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. కేసు సుప్రీంకోర్టును చేరింది. తాజాగా, మారటోరియం వడ్డీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. మారటోరియం కాలానికి రుణాలపై ఎలాంటి చక్రవడ్డీ విధించొద్దని ఆదేశించింది. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం ఇప్పటికే మాఫీ చేసిందని కోర్టు గుర్తు చేసింది.  ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. మారటోరియం కాలాన్ని పొడిగించడం, మొత్తం వడ్డీని మాఫీ చేయమని ఆదేశించడం సాధ్యం కాదని తెలిపింది. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా నష్టపోయిందని, అయినప్పటికీ కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయని గుర్తు చేసింది సుప్రీంకోర్టు.

గంగవరం పోర్టు అదానీ పరం.. వాట్ నెక్స్ట్? 

ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక ప్రాజెక్టు ప్రైవేట్ పరమైంది. అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరం అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది. గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ సొంతం కానున్నట్లు అదానీ గ్రూపు ప్రకటించింది. డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటా కొనుగోలుకు రూ.3,604 కోట్ల ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలో 31.5 శాతం వాటాను రూ.1,954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ వాటా 89.6 శాతానికి చేరనుంది.   విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని రెండో అతిపెద్ద నాన్‌-మేజర్‌ పోర్టు. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లో అయినా సరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఈ పోర్టుకు ఉంది. బాగా లోతైన పోర్టు కావటంతో 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్‌ కేప్‌ సైజ్‌ ఓడలూ వచ్చిపోగలవు. దాదాపు 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పోర్టులో 9 బెర్తులు ఉన్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు,  దిగుమతులు పెద్దఎత్తున సాగుతున్నాయి. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది.   గంగవరం పోర్టు కంపెనీ జారీ మూలధనం 51.70 కోట్ల షేర్లు. ఇందులో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాటా 10.4 శాతం కాగా, వార్‌బర్గ్‌ పింకస్‌ చేతిలో 31.5 శాతం వాటా ఉంది. వార్‌బర్గ్‌ పింకస్‌, డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబ వాటానే తాజాగా అదానీ గ్రూపు కొనుగోలు చేస్తోంది. తూర్పు తీరంలో పోర్టులను ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటున్న అదానీ గ్రూప్ గత ఏడాది ఏపీలోని మరో పోర్ట్ అయిన కృష్ణపట్నాన్ని 12 వేల కోట్లతో కొనుగోలు చేసింది. కృష్ణపట్నం, గంగవరం పోర్టుల కొనుగోలుతో ఏపీ సముద్ర తీరంపై అదానీ పోర్ట్స్‌ ఆధిపత్యం సాధించినట్టయింది. గత నెలలో మహారాష్ట్రలోని డిఘి పోర్టును కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ ఇప్పుడు గంగవరం కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. పోర్ట్‌ అండ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ నిర్మాణంలో భాగంగా గంగవరం పోర్టు కొనుగోలు చేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద పోర్టుగా గుర్తింపు ఉన్న ముంద్రా పోర్టు కూడా అదానీ గ్రూప్‌దే. అదానీల సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ పోర్టు ఉంది. 2006లో పది మిలియన్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఒక పోర్టుకు అధిపతిగా ఉన్న అదానీ ఇప్పుడు 498 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 12 పోర్టుల అధిపతిగా అవతరించారు. దేశీయంగానే కాదు..పొరుగు దేశాల్లోనూ పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది అదాని గ్రూప్. ఇటీవలే శ్రీలంక ప్రభుత్వంతోనూ అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. కొలంబో పోర్టుకు సంబంధించి వెస్ట్ కంటెయినర్‌ టెర్మినల్‌ను నిర్మించి, 35 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీలంక పోర్టు అధారిటీతో  అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది.  

హోంమంత్రి బంధువంటూ లై*గిక దాడి!

ఏపీ హోంమంత్రి సుచరిత బంధువునంటూ బిల్డప్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్స్ చేస్తానంటూ నమ్మించాడు. భర్తతో గొడవ పడిన ఓ మహిళను ట్రాప్ చేశాడు. ఓ ఇంట్లో ఉంచి ఆమెపై లై*గిక దాడి చేశాడు. అతనితో పాటు ఓ కాంగ్రెస్ నాయకుడూ జత కలిశాడు. మహిళ న..గ్న వీడియోలు తీశారు. కేసు పెడితే పోలీసులూ పట్టించుకోవడం లేదు. ఇదంతా ఓ బాధితురాలి ఆరోపణ. తనకు న్యాయం చేయమంటూ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది ఆ మహిళ. నరసరావుపేటలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఓ యువతి భర్తతో గొడవ పడి విడిపోయింది. ఆ మేటర్ సెటిల్ చేస్తామంటూ నరసరావుపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రుకు చెందిన గుంజి శ్రీనివారావు ఆమెను నమ్మించారు. ఆ మహిళ దగ్గర ఉన్న 47 సవర్ల బంగారు ఆభరణాలు కాజేశారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేసేందుకు నరసరావుపేట టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది ఆ మహిళ. అక్కడ యడ్లపాడుకు చెందిన ఓ వ్యక్తి తాను హోంమంత్రి సుచరిత బంధువంటూ పరిచయం చేసుకున్నాడు. న్యాయం చేస్తానని ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై ఆ వ్యక్తితో పాటు ఓ కాంగ్రెస్‌ నాయకుడు లై*గిక దాడి చేశారు. అనంతరం న..గ్న వీడియోలు తీసి ఆమెను బెదిరించారు. రూరల్‌ ఎస్‌ఐ డబ్బులు తీసుకుని ఆమెకు అన్యాయం చేయటమేకాక కాంగ్రెస్‌ నాయకుడిపై కేసు పెట్టకుండా వదిలేశారు. వారిద్దరిపై తగు చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదులో నిజానిజాలు ఏంటని ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేనట్టే!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలపై ఎస్ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ  ఈనెల 30కి వాయిదా వేసింది.    ఏపీ హైకోర్టు తీర్పుతో జగన్ సర్కార్  ఆశలకు గండి పడినట్లైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై జగన్ సర్కార్ హడావుడి చేసింది.  ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఇంకా ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్నందున.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీపై ఒత్తిడి తెచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా ముగిస్తే మంచిదని కామెంట్ చేశారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం సెలవుపై వెళ్లారు.  మరోవైపు గతంలో పంచాయతీ ఎన్నికలకు  నిమ్మగడ్డ షెడ్యూల్ ఇస్తే కరోనా సాకుతో అడ్డుకోవాలని చూసింది వైసీపీ సర్కార్. ఆయనపై యుద్ధమే చేసింది. ఎన్నికలను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టుకు వరకూ వెళ్లింది. ఎక్కడా వారికి అనుకూలంగా రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లింది వైసీపీ. ఇప్పుడు మాత్రం ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని మాట మార్చింది. దీంతో వైసీపీ నేతలు, సీఎం జగన్ తీరుపై జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

61పై ఆగ్రహం.. నిరుద్యోగులకు శాపం!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61ఏళ్లు. దేశంలోని అనేక రాష్ట్రాల్లోకెల్లా ఇది అత్యధిక వయసు. కేంద్ర ఉద్యోగులకు సైతం 60ఏళ్లు. పీఆర్సీ కమిటీ సైతం 60 వరకే సిఫార్సు చేసింది. కేసీఆర్ మాత్రం 61ఏళ్లకు పెంచారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీ అంటూ.. ఎవరూ అడగకపోయినా.. బిస్వాల్ కమిటీ సిఫార్సు చేయకపోయినా.. ఈ నిర్ణయం తీసేసుకున్నారు. ఉద్యోగులంతా ఖుషీ ఖుషీ. ఎంచక్కా 61ఏళ్ల వరకూ ఉద్యోగం చేసుకోవచ్చు.. దండిగా జీతం తీసుకోవచ్చు అంటూ ఫుల్ హ్యాపీ. రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 61కి పెంచడంతో.. ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారు మరో మూడేళ్ల పాటు అదనంగా ఉద్యోగంలో ఉంటారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మరి నిరుద్యోగుల సంగతి ఏంటి అనేది ప్రశ్న. తెలంగాణలో కొత్త ఉద్యోగాలనే మాటే మర్చిపోయి చాలా కాలమైంది. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఏళ్లుగా చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అవసరమైతే నిరుద్యోగ భ‌ృతి అయినా ఇస్తాం కానీ, కొత్త ఉద్యోగం అడగొద్దు అనేలా ఉంది సర్కారు తీరు. ఇక, ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన. మా కడుపు కొడుతున్నారంటూ మండిపాటు. అందుకే, పీఆర్సీ పెంపుతో ఉద్యోగులు కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేస్తే.. ఓయూ స్టూడెంట్స్ చెప్పులతో నిరసన తెలిపారు.  పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. ఉద్యోగులు రిటైర్ అవుతుంటే.. ఖాళీలు ఏర్పడి కొత్త ఉద్యోగాలు వస్తాయి. పదవి విరమణ వయసు మరో మూడేళ్లు పెంచడంతో.. ఇక ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్యోగులు తగ్గిపోతారు. ఖాళీలు ఏర్పడవు. కొత్త ఉద్యోగాలు రావు. నిరుద్యోగం మరింత పెరుగుతుంది. ఇప్పటికే ఏళ్లుగా జాబ్స్ లేక తీవ్ర అసంతృప్తి, అసహనంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌కి ఇది మరింత ఆశాపాతం. అందుకే, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచడంపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాలనలో ఇప్పుడంతా సాంకేతికత కమ్మేసింది. అంతా కంప్యూటరైజ్డ్ వర్క్. పదవీ విరమణ వయసు దగ్గర పడిన సీనియర్ మోస్ట్ ఎంప్లాయిస్.. ఈ కొత్త సాంకేతికతకు అంతగా అలవాటు పడటంలేదనేది ఓ ఆరోపణ. నిదానమైన పనితీరు, కంప్యూటర్ స్కిల్స్‌లో నైపుణ్యం లేకపోవడం వారికి మైనస్. రిటైర్మెంట్ ఏజ్ మరింత పెరిగితే.. అలాంటి సీనియర్ మోస్ట్ ఉద్యోగులు మరో మూడేళ్ల పాటు అదే సీటులో పాతుకుపోతారు. పని విధానమూ మరింత నెమ్మదిస్తుందని అంటున్నారు. అదే, కొత్త ఉద్యోగాలతో యువకులను ప్రభుత్వ శాఖల్లో తీసుకుంటే.. టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు ఉరిమే ఉత్సాహంతో మంచి పనితీరు కనిపిస్తుందనేది నిరుద్యోగుల వాదన. ఒక్కరికి ఉద్యోగం వస్తే.. వారి కుటుంబం అంతా సెటిల్ అవుతుందని.. సమాజమూ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్లేషిస్తున్నారు. పాత, కొత్త ఉద్యోగుల కలయికతో ప్రభుత్వ విభాగాలు సమతూకంతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అటు, సీనియర్ల అనుభవం, ఇటు యువకుల నైపుణ్యం రెండూ తోడైతే బాగుంటుంది కానీ, ఉన్న ఉద్యోగులనే మరింత కాలం కొనసాగిస్తే.. కొత్తదనం కరువవుతుందని అంటున్నారు.  ఇక, రిటైర్మెంట్ ఏజ్ పెంచడం ప్రభుత్వ ఖజానాపైనా ఆర్థిక భారం మోపుతుందని కొందరు అంటున్నారు. అప్పటికే సీనియర్లకు సుమారు లక్ష వరకూ శాలరీ వస్తుంటుంది. మరో మూడేళ్లు కొనసాగిస్తే.. జీతం లక్ష దాటిపోతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది సర్కారుకు పెను భారమే అంటున్నారు. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్‌లో పని చేసే సీనియర్ టీచర్లకు 80వేలకు పైనే జీతం ఉంటుంది. చాలా స్కూల్స్‌లో 10 నుంచి 50 పిల్లలు మాత్రమే ఉంటారు. వారికి చెప్పేది కూడా.. అ, ఆ..లు, 1,2,3లు. కూడికలు, తీసివేతలు. ఇంత తక్కువ మంది పిల్లలకు.. అంత ఎలిమెంటరీ పాఠాలు చెప్పే సీనియర్ టీచర్లకు దాదాపు లక్ష వరకూ శాలరీ ఉంటుంది. అదే కొత్త టీచర్లైతే.. 20-30వేలకే వచ్చేస్తారు. అనుభవంలో తేడా ఉన్నా.. అప్పటికే వారంతా టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటారు కాబట్టి ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనేది నిరుద్యోగుల వాదన. పదవీ విరమణ వయసు పెంపుతో కొత్త ఉద్యోగాలకు గండి పడినట్టే. అందుకే, రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ 61ఏళ్లకు పెంచడం దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయినా.. అంతకుమించి ఉన్న నిరుద్యోగులకు మాత్రం ఇది చేదువార్త.

బీటెక్ స్టూడెంట్ సూసైడ్.. 

కారణం ఏదైనా కావచ్చు. ఈ మధ్య స్టూడెంట్ తమ భవిత మరిచి. తల్లి దండ్రులను మరిచి తనువులు చలిస్తూ ఆత్మహత్యలకు పాలుపడుతున్నారు. క్షణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని చంద్రిక ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షల ప్రిపరేషన్ కోసం వెళ్లిన చంద్రిక హాస్టల్ భవనం పై నుండి దూకి మరణించింది.  చంద్రిక స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతోంది. కళాశాల సమీపంలో ఉన్న కృపా అనే ప్రైవేటు హాస్టల్ లో  ఉంటోంది. హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో చంద్రిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.  హాస్టల్ భవనం  పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.    విద్యార్థిని చంద్రిక ఫిబ్రవరి 4న వసతిగృహాంలో చేరి.. పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఎందుకు మరణించింది. తన మృతి వెనుక ఏ కారణాలు ఉన్నాయి అనేది వివరాలు తెలియరాలేదని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

శానిటైజర్ చావులు కావు.. జగన్ సర్కారు హత్యలు! 

వాళ్లంతా నిరు పేదలు.. రోజువారీ కూలీ చేసుకుని జీవితం గడిపేవారు. రోజంతా కష్టపడి పని చేసే ఆ కూలీలకు  సాయంత్రం మద్యం తాగడం అలవాటు. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న  వైసీపీ సర్కార్ మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో మద్యానికి అలవాటు పడిన పేదలు.. ఎక్కువ ధరకు మద్యం కొనలేక అవస్థలు పడ్డారు. మత్తుకు బానిసలుగా మారడంతో మర్చిపోలేకపోయారు. లిక్కర్ కు బదులుగా శానిటైజర్ తాగారు. మత్తు కోసం నీళ్లలో శానిటైజర్ కలుపుకుని తాగారు. శానిటైజర్ డోస్ ఎక్కువ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరూ ప్రాణాలు కూడా కోల్పోయారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే విజయవాడ వన్‌టౌన్‌‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ  చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు.  శానిటైజర్ తాగి ఇద్దరు చనిపోయిన ఘటనకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యపాన నిషేదం పేరుతో మహిళల ఓట్లు దండుకున్న సీఎం జగన్.. మద్యం అమ్మకాలు, రేట్లు పెంచి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.  సీఎం మద్యం ధరలు పెంచి పేదల రక్తం తాగుతున్నారన్నారు. మద్యం రేట్లు పెరగడంతో సామాన్యులు తన రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ వారి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మద్యానికి అలవాటుపడిన వారు మద్యలో మానలేక, పెరిగిన ధరలకు మద్యం కొనలేక డబ్బుల కోసం ఇంట్లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని, మరికొంత మంది శానిటైజర్ తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం రేట్లు పెరిగాక రాష్ట్రంలో శానిటైజర్, నాటుసారా తాగి సుమారు 50 మంది చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు జవహర్. పక్కనున్న తెలంగాణలో దేశంలో లభించే బ్రాండ్లన్నీ లభిస్తుంటే ఏపీలో మాత్రం జగన్ సొంత బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, వాలంటీర్లే మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని, మద్యం రేట్లు పెంచి, అమ్మకాలు పెంచి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవాలన్న ధ్యాస తప్ప మద్యపాన నిషేధం అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్ధమైందని జవహర్ మండిపడ్డారు. 

వాళ్ళు సర్వ నాశనమైపోతారు..

దేవుడి సొమ్ములను టచ్ చేయాలంటే.. జనం భయపడి వెనక్కు తగ్గే రోజులు పోయాయి. దేవుడి సొమ్ములు ఆస్తులు అయితే మాత్రం ఏంటి నొక్కేద్దామనే ఆలోచనలు ప్రస్తుతం జనంలో బాగా పెరిగిపోయాయి. దీంతో రెండు తెలుగు  రాష్ట్రాలలో అనేక దేవాలయాలు సొంత భూములు, ఆస్తులు ఉన్నా నిత్య ధూప, దీప నైవేద్యాలకు కూడా నోచుకోకుండా ఉన్నాయి. అంతేకాకుండా ఇలా దేవుడి ఆస్తులు, సొమ్ములు బొక్కేసే వారిలో బడాబాబుల హస్తాలు కూడా ఉన్న సంగతి తెల్సిందే.   తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఒక దేవాలయం దుస్థితి వెలుగు చూసింది. ఈ ఆలయ పారిస్తాటిని చూసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని గుళ్ళ సీతారామపురం ఆలయమ యొక్క దుస్థితిని చూసిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా స్వామీజీ నేడు గుళ్ళ సీతారామపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి ఆలయానికి మూడు వేల ఎకరాల భూములున్నా..  ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఆలయ భూముల్ని అన్యాక్రాంతం చేసిన, ఆక్రమించిన వారికి నాశనం తప్పదన్నారు. వారు దోచుకున్న భూముల్ని అలయానికి తిరిగి అప్పగించాలని స్వాత్మానందేంద్ర స్వామి డిమాండ్ చేశారు. గుళ్ళ సీతారామపురం ఆలయ దుస్థితిపై రాష్ట్ర దేవాదాయ శాఖతో చర్చిస్తామన్నారు. వచ్చే శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను పంపిస్తామన్నారు. అంతేకాకుండా సీతారాములకు వెండి కిరీటాలను కూడా చేయిస్తామని స్వాత్మానందేంద్ర స్వామి పేర్కొన్నారు.  

నీటితో ఆట.. నీటిపై మృత్యువాత..

కొందరిని వారి సరదానే ప్రాణం తీస్తుంది. మరి కొందరిని వాళ్ళ పాపం ప్రాణం తీస్తుంది.. చాలా మందిని వారి వయసు ప్రాణం తీస్తుందని తెలుసు. కానీ, ఎప్పుడైనా ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుండగా ఆ లక్ష్యం వారి ప్రాణాలు తీస్తుందనుకుంటారా..? అనుకోరు, ఎందుకంటే.. అలా జరుగుతుందని భయపడితే ఎవరు తమ లక్షణాన్నిసాధించలేరు. ఇక్కడ మాత్రం ఆమె లక్ష్యమే తన ప్రాణం తీసింది. వాటర్ పై పయనించడమంటే ఆమెకు మహా సరదా. అందుకే సర్ఫింగ్ క్రీడా నేర్చుకుంది. క్రీడతో పాటు ఆమెకు దేశ భక్తి కూడా ఎక్కువే అందుకే  టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని తెలిసిన ఆమె క్రీడాకారిణి ఆనందానికి సద్దులు లేవు. ఎలాగైనా ఒలంపిక్స్ లో ఎలాగైనా అర్హత దాచింది దేశానికి స్వర్ణ పధకం సాధించాలని. కలకంది. కానీ చివరికి ఆ కల కలగానే మిగిలిపోయింది.  ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని. ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగి. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై తేలింది. క్రీడలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. నీళ్లే తన శ్వాసగా, ద్యాసగా, ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.. చివరికి నీటిలోనే ప్రాణాల తో పాటు తన లక్ష్యాన్ని వదిలింది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే  అందరికి కన్నీళ్లు మిగిల్చిచి , తాను పిడుగుపాటుకు గురై మరణించింది.  ఆమె సాల్వడోర్‌కు చెందిన 22 ఏళ్ల కేథరిన్‌ డియాజ్‌. ఆ దేశంలోని అగ్రశ్రేణి సర్ఫర్‌ అయిన తను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్‌ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన తను.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ టుంకో బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. తమ దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్‌ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప యోధురాలని . దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది  అని ఆ దేశ సర్ఫ్‌ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లో పోస్టు తెలుపుతుంది.   

తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా? 

తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా.. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టబోతున్నారా అంటే వైద్య శాఖ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఏకంగా 4 వందలు క్రాస్ అయ్యాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు గురుకులాల్లలోనే వచ్చాయి. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో  రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. కేసుల సంఖ్య తగ్గాలంటే లాక్ డౌన్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. లాక్ డౌన్ అంశంపైనే చర్చించారని తెలుస్తోంది. దీంతో దీంతో తెలంగాణలో కూడా  లాక్ డౌన్. లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్క‌రోజే కరోనాతో ముగ్గురు చనిపోయారు. అదే సమయంలో 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,042 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,674గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,151 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,285 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 103 మందికి క‌రోనా సోకింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖపై మంత్రి  సమీక్ష నిర్వహించారు. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు.  వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు మంత్రి ఈటల. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, నిర్లక్ష్యం కూడదని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని మంత్రి రాజేందర్ అన్నారు.  

ఒకే కాలేజీలో 163 మందికి వైరస్.. ఏపీలో కరోనా కల్లోలం 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరిలో అదుపులోనికి వచ్చినట్లుగా కనిపించిన వైరస్... గత రెండు వారాలుగా మళ్లీ కోరలు చాస్తోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ  కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కల్లోలం రేపింది. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఉన్న ఓ కాలేజీలో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులను టెస్ట్ చేస్తే 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందని భావించారు.  తాజాగా సోమవారం చేసిన టెస్టుల్లో ఏకంగా 140 కరోనా కేసులు బయటపడటంతో కాలేజీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 700 మంది విద్యార్థుల నుంచి నమూనాలను యాజమాన్యం సేకరించింది. వీటిల్లో 140 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ కాలేజీలో 163 మంది కరోనా సోకినట్లైంది. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఒకే క్యాంపస్ లో ఉంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్ గా చేశామని అధికారులు వెల్లడించారు. నెగిటివ్ వచ్చిన 450 మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు. ఈ పరిణామంతో తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థుల్లో కరోనా కేసులు రావడంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.