హోంమంత్రి బంధువంటూ లై*గిక దాడి!
posted on Mar 23, 2021 @ 12:58PM
ఏపీ హోంమంత్రి సుచరిత బంధువునంటూ బిల్డప్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్స్ చేస్తానంటూ నమ్మించాడు. భర్తతో గొడవ పడిన ఓ మహిళను ట్రాప్ చేశాడు. ఓ ఇంట్లో ఉంచి ఆమెపై లై*గిక దాడి చేశాడు. అతనితో పాటు ఓ కాంగ్రెస్ నాయకుడూ జత కలిశాడు. మహిళ న..గ్న వీడియోలు తీశారు. కేసు పెడితే పోలీసులూ పట్టించుకోవడం లేదు. ఇదంతా ఓ బాధితురాలి ఆరోపణ. తనకు న్యాయం చేయమంటూ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది ఆ మహిళ.
నరసరావుపేటలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఓ యువతి భర్తతో గొడవ పడి విడిపోయింది. ఆ మేటర్ సెటిల్ చేస్తామంటూ నరసరావుపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రుకు చెందిన గుంజి శ్రీనివారావు ఆమెను నమ్మించారు. ఆ మహిళ దగ్గర ఉన్న 47 సవర్ల బంగారు ఆభరణాలు కాజేశారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేసేందుకు నరసరావుపేట టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది ఆ మహిళ. అక్కడ యడ్లపాడుకు చెందిన ఓ వ్యక్తి తాను హోంమంత్రి సుచరిత బంధువంటూ పరిచయం చేసుకున్నాడు. న్యాయం చేస్తానని ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై ఆ వ్యక్తితో పాటు ఓ కాంగ్రెస్ నాయకుడు లై*గిక దాడి చేశారు. అనంతరం న..గ్న వీడియోలు తీసి ఆమెను బెదిరించారు. రూరల్ ఎస్‌ఐ డబ్బులు తీసుకుని ఆమెకు అన్యాయం చేయటమేకాక కాంగ్రెస్ నాయకుడిపై కేసు పెట్టకుండా వదిలేశారు. వారిద్దరిపై తగు చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదులో నిజానిజాలు ఏంటని ఆరా తీస్తున్నారు పోలీసులు.