హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడంటే?
హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు? నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? షెడ్యూలు విడుదలయ్యేది ఎప్పుడు? ఈ ప్రశ్నలకు ఇంతవరకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ, ఇప్పుడు, విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఇంకా అట్టే కాలం, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రకటన కోసం ఎంతో కాలం నిరీక్షించ వలసిన అవసరమ లేదని తెలుస్తోంది. హుజూరాబాద్ కు డిసెంబర్ 12 వరకు సమయం ఉన్నా, పొరుగు రాష్ట్రం ఏపీలో సిట్టింగ్ శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన బద్వేల్ స్థానానికి, సెప్టెంబర్ 28 లోగా ఉపఎన్నిక జరగవలసివుంది. ఈనేపధ్యంలో బద్వేల్ తో పాటుగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు కూడా, సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
వచ్చే సంవత్సరం (2022) ప్రారంభ నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఐదు రాష్టాలు సహా, దేశంలో వివిధ కారణాల చేత ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికలు నిర్వహించాడంపై వారి వారి అభిప్రాయాలను తెలియచేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన రాజకీయ పార్టీలకు 15 రోజుల క్రితం లేఖలు రాసింది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ఆగష్టు 30తో ముగుస్తోంది. ఈ నేపధ్యంలో, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2/3 తేదీలలో సమావేశమై ఒక నిర్ణయానికి రావచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అందులో భాగంగా ఆరు నెలల గడువు సమీపించిన లేదా ఒకే ఒక్క అసెంబ్లీ సీటు ఖాలేగా ఉన్న రాష్టాలలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా, ఉప ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టే ఆలోచనా, అవకాశం ఉన్నాయని అధికార వర్గాల సమాచారంగా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అదే జరిగితే, సెప్టెంబర్ 28తో గడువు ముగుస్తున్న ఏపీలోని బుద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంతో పాటుగా, తెలంగాణలో ఖాళీగా ఉన ఏకైక స్థానం, హుజూరాబాద్ స్థానానికి సెప్టెంబర్ 20 – 25 తేదీల మధ్య ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది అంటున్నారు. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల అభిప్రాయాలతో పాటుగా, కరోనా పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని, అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే క్షేత్ర స్థాయి నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది.
అదలా ఉంటే, రానున్న రెండు నెలలు కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ చేఇసిన తాజా హెచ్చరికను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఎన్నికల సంఘం నిర్ణయం మరోలా ఉండే ఆకాశం లేక పోలేదని కూడా అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా, సెప్టెంబర్ మొదటి వారంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు అనే విషయంలో చాల వరకు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజకీయంగా చూసినా, ఉప ఎన్నిక ఎంతగా శీఘ్రంగా జరిగితే, బీజేపీ గెలుపు అవకాశాలు అంతగా మెరుగవుతాయి. కాబట్టి, ‘కేంద్ర’ ఎన్నికల సంఘం, గత మూడు నెలలుగా సాగుతున్నా హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రహసనానికి సెప్టెంబర్ లోనే చుక్క పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.