బ్రేకింగ్ న్యూస్.. యువతి గొంతు కోసిన ఉన్మాది..
posted on Aug 31, 2021 @ 11:59AM
తెలుగు రాష్ట్రాల్లో ఉన్మాదుల ఆగడాలు అసలేమాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలతో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. కఠిన చట్టాలు, వేగంగా శిక్షలు పడకపోవడమే ఈ బరితెగింపునకు కారణమనే విమర్శలు ఉన్నాయి. మొన్నటికి మొన్న తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై అత్యా*చారం జరిగినా ఇప్పటికీ మరో నిందితుడిని పట్టుకోలేక పోయారు పోలీసులు. ఆ తర్వాత గుంటూరు, విజయనగరం లాంటి మరిన్ని దారుణ ఘటనలు ఏపీలో భయాందోళనలు రేపాయి. ఏపీతో పోటీనా అన్నట్టు తెలంగాణలోనూ దారుణం జరిగింది. ఓ యువతిపై ఘాతుకానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు.
కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్పుర కాలనీలో ఉండే యువతి ఇంట్లోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి.. ఆ ఇంట్లో ఉన్న యువతి గొంతు కోసాడు. కుటుంబీకులు తెరుకునేలోగా ఆ ఉన్మాది అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చింది ఎవరు? ఎందుకు ఆమెపై దాడి చేశాడు? తెలిసిన వాడేనా? అఘంతుకుడా? అనే వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు.