మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు చాతీ నొప్పి... హాస్పిటల్ లో అడ్మిట్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చాతీ నొప్పిగా ఉండడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు ఎమ్మెల్యే ఆర్కే. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆర్కే ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుపై మంగళగిరిలో విజయం సాధించారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి.  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి శనివారం నియోజకవర్గంలో పర్యటించారు. మంగళగిరి-తాడేపల్లి పరిధిలోని పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నరసింహస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. సాయంత్రం పెదకాకానిలోని తన నివాసానికి బయలుదేరారు. ఈ క్రమంలో చాతీలో నొప్పి రావడంతో చూపించుకునేందుకు నగరంలోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

టిఫిన్ చేయడానికి కారులో వెళ్లి..  హుస్సేన్ సాగర్లోకి..

వాళ్లు ముగ్గురు స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్లలో ఒకరు నాలుగు రోజుల క్రితం కారు కొన్నాడు. దీంతో మూడు రోజుల నుంచి ముగ్గురు స్నేహితులు కొత్త కారులో షికారు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శనివారం రాత్రంతా కారులో హైదరాబాద్ తిరిగారు. తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు బయలుదేరారు. అయితే కారు అదుపు తప్పింది. హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ముగ్గురు స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది . అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎన్టీఆర్ పార్క్ ఎదుట హుస్సేన్సాగర్లోకి దూసుకెళ్లింది .దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది . అందులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు . కారులో ఉన్న యువకులను బయటకుతీసి .. యశోద దవాఖానకు తరలించారు. ఈ కారు ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యువకులను ఖైరతాబాద్ కు చెందిన నితిన్ , స్పత్రిక్ , కార్తీక్ గుర్తించారు . కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నారని , ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 

చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు.. జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్ ..

ఆంధ్రప్రదేశ్’లో వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం జోరుగా సాగుతోందనే ప్రచారం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అలాగే, జగన్ రెడ్డి ప్రభుత్వం లౌకికవాద మూల సూత్రాన్ని పక్కన పెట్టి, మత వివక్షకు పాల్పడుతోందనే ఆరోపణలు తరచూ వినవస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే, జగన్ రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారం కోసం క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసుకున్న పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి  నెల జీతాలు ఇవ్వడం కూడా విమర్శలను ఎదుర్కుంటోంది.  అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి నిబంధనలు, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా, చర్చిల నిర్మాణం, మరమ్మత్తులకు ఖజానా నుంచి నిధులను సమకురుస్తోందని, టెండర్ ప్రకటనల సాక్షిగా రుజువైంది. ఒక్క మాటలో చెప్పాలంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా చేసేదుకు కంకణం కట్టుకున్నదా, అనే అనుమానాలకు తావిచ్చే విధంగా పాలన సాగిస్తున్నారు.ఓ వంక క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరో వంక హిందూ దేవాలయాలపై దాడులు జరుగతున్న చర్యలు ఉండడం లేదు. ఈ రెడున్నర సంవత్సరాలలో 150కి ఫైగా, దేవాలయాల పై దాడులు జరిగిన ఇంట వరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మరోవంక  ఆలయాల ఆస్తుల దోపిడీని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి  సమర్ధిస్తున్నారనే ఆరోపణలున్నాయి.   అదలా ఉంటే ముఖ్యమంత్రి మెప్పు కోసమో, లేక గేదె చేనులో మేస్తే దూడ ఒడ్డున మేయడం బాగుండదనో గానీ, కొందరు ఎంపీలు, ఎంపీ ల్యాడ్స్‌ నిధులని చర్చిలకు ఖర్చుచేసినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తల ఆధారంగా వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎంపీలకు ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40 లక్షలకు పైగా నిధుల్ని ఎంపీ నందిగామ సురేశ్‌ చర్చిలకు వినియోగించినట్టుగా రెండు నెలల క్రితం పీఎంవోకు లేఖ రాశారు.ఈ లేఖపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేక పోవడంతో  కేంద్రం మరోసారి తాజాగా, వెంటనే నివేదిక పంపాలని ఆదేశించింది.   మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ రమ్య ఏపీ సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు.  కాగా, రఘురామ కృష్ణం రాజు పీఎంఓకు రాసిన లేఖలో  ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధుల్ని మత సంబంధ కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చుచేస్తున్నట్టుగా, పత్రికలలో వచ్చిన కథనాలను పీఎంవోకు నివేదించారు. దీంతో పాటు రాష్ట్రంలో మతమార్పిడులకు కూడా ఈ నిధులు వినియోగిస్తున్నట్టు ఆయన లేఖ రాశారు. ఈ లేఖపై రెండు నెలల క్రితమే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని తాజాగా కేంద్రం లేఖ రాసింది. ఇప్పటికే నివేదిక కోరినా పంపించలేదని, అందుకే మరోసారి గుర్తు చేస్తున్నట్టు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక పంపాలని లేఖలో డైరెక్టర్‌ రమ్య కోరారు. అయితే, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పదిస్తుందా లేక లైట్’ గా తీసుకుంటుందా? అదే జరిగితే కేంద్రం రియాక్షన్ ఎలా యుంటుంది ? చూడాలి ..అంటున్నారు విశ్లేషకులు.

ఏపీపై కేంద్రం సీరియస్.. బూతుల కొడాలి.. ఇ ఇద్దరూ కలిశారు..భారత్ భళా.. టాప్ న్యూస్@7PM

ఏపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం మరోసారి సీరియస్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానిక సమాధానం ఇవ్వలేదు. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని ఏపీని కేంద్రం ఆదేశించింది. ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా కేంద్ర గణాంకాలు, ప్రణాళికా మంత్రిత్వ శాఖ లేఖలు పంపింది -- ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తెస్తున్నారని తప్పుబట్టారు. దేశంలో ఇంతలా అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ తప్ప మరొకటి లేదన్నారు. ఆర్థిక విధ్వంసంపై ప్రధాని, ఆర్బీఐ బ్యాంక్‌లకు లేఖలు రాస్తానని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అప్పులు ఇచ్చి ప్రజలను బలిపశువులు చేయొద్దని సూచించారు.  ------ అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం ఎంపీ గోరంట్ల మాధవ్ వర్సెస్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నట్లుగా సాగింది. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదని ఎంపీ గోరంట్ల ఆరోపించారు. తిండికి తిప్పరాజు పనికి పోతురాజు అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితిని తప్పుబట్టారు. అయిపోయిన పెళ్లికి పయ్యావుల కేశవ్ మేళం వాయించినట్టుందని మాధవ్ ఎద్దేశాచేశారు. మాధవ్ వ్యాఖ్యలపై పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదలపై చర్చ జరుగుతుంటే తనపై వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యంతో పయ్యావుల కేశవ్ శాంతించారు. ----- అనంతపురం జిల్లాలోని వ్యవసాయ అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడతూ అధికారులు ఎవరూ కూడా పంటల ఈ- క్రాపింగ్ చేయడం లేదన్నారు. ఈ- క్రాపింగ్‌లో ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉందని  ప్రశ్నించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం లేదన్నారు. పంటలు సాగుచేసిన విస్తీర్ణం కూడా సరిగా నమోదు చేయడం లేదని రాంచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.  ---- మంత్రి కొడాలి నానికి బూతులు తప్ప ఏమీ తెలియదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. మనిషిగా మారడానికి కొడాలి నాని ప్రయత్నించాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్లపై సాష్టాంగపడే కొడాలి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. తనను విమర్శించే అర్హత కొడాలి నానికి లేదని హెచ్చరించారు. ‘‘ఓడినా, గెలిచినా.. నేను నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉంటా. నీలా ఊరకుక్కలా పార్టీల వెంట పరిగెత్తి గెలిచి.. బూతుల మంత్రి, బుద్ధిలేనివాడని పేరు తెచ్చుకోలే అని వర్గ రామయ్య అన్నారు.  ----- వరి కొనకపోతే ప్రదాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద వరి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనకపోతే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఈ రాత్రి ధర్నాచౌక్‌లోనే నిద్రిస్తామని ప్రకటించారు. రైతుల మృతికి సీఎం కేసీఆర్‌ కారణమని దుయ్యబట్టారు. వరి కుప్పలపైనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని తప్పుబట్టారు. ----- టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీలుగా నిలుచున్న భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ ఎక్కడైనా, ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అని సీఎం కేసీఆర్‌ను కరీంనగర్ మాజీ మేయర్, కార్పొరేటర్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల సమస్యలపై ఎప్పుడైనా భాను ప్రసాద్ మాట్లాడాడా అని ఆయన నిలదీశారు. 24 గంటల్లోనే కలెక్టర్ వెంకట్రామా రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉద్యమకారులను పక్కబెట్టడం ఏంటన్నారు. డబ్బుల సంచులతో వచ్చి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ------ ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని ప్రభావం ఇప్పుడు క్రీడారంగంపైనా పడింది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ కూడా కొత్త వేరియంట్ ప్రభావంతో నిలిచిపోయింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండడంతో టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చేసింది.  --- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  సభ్యుల సంక్షేమమే తమకు పరమావధి అని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి స్పష్టం చేశారు. 'మా' సభ్యుల ఆరోగ్యం, వైద్య చికిత్సల కోసం తాము పని ప్రారంభించామని, హైదరాబాదు నగరంలోని ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సౌజన్యంతో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, బిల్లుల్లో రాయితీలు లభిస్తాయని వివరించారు. -- న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్సులో భారత్ కు 49 పరుగుల కీలక ఆధిక్యత లభించింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 1, అశ్విన్ కు 3 వికెట్లు లభించాయి. పేసర్ ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.  ---

అక్షర్ పటేల్ కు ఐదు వికెట్లు.. భారత్ కు 49 పరుగుల లీడ్

న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్సులో భారత్ కు 49 పరుగుల కీలక ఆధిక్యత లభించింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 1, అశ్విన్ కు 3 వికెట్లు లభించాయి. పేసర్ ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం అక్షర్ కు ఇది ఐదోసారి.   129 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట షురూ చేసి కివీస్.... 151 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 89 పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్ అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తర్వాత కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శుక్రవారం ఆటలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన టీమిండియా స్పిన్నర్లు... మూడు రోజు  రెండో సెషన్ లో చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో కివీస్ తడబడ్డారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 11, కైల్ జేమీసన్ 23 పరుగులు చేశారు. భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర (13)ను రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు.  49 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్సులో ఆదిలోనే తడబడింది.  ఓపెనర్ శుభ్ మాన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయింది. ఒక పరుగు చేసిన గిల్... జేమీసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా ఉన్నారు. దీంతో భారత్ కు 63 పరుగుల లీడ్ తో ఉంది. ఈ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట కీలకంగా మారింది. భారత్ జట్టు టీ విరామ సమయం వరకు బ్యాటింగ్ చేసి.. 3 వందలకు పైగా టార్గెట్ కివీస్ ముందు ఉంచింతే గెలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఏపీని పట్టించుకోని టాటా గ్రూప్.. జగనన్న పాలనే శాపమా? 

ప్రభుత్వాలు ఏవైనా ఉపాధికల్పను ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుంటాయి. తమ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటాయి. ఇందుకోసం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుంటాయి. కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి లభిస్తుంది కాబట్టి.. పారిశ్రామిక వేత్తలకు వివిధ రాయితీలు ప్రకటించి తమ వైపు తిప్పుకోవాలని చూస్తాయి. అందుకే దిగ్గజ సంస్థలను ఆకర్షించడానికి రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం అలాంటిదేమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాకా కొత్త పరిశ్రమలు రాకపోగా.. గతంలో ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు కూడా బైబై చెప్పేస్తున్నాయి. ఇప్పటికే చాలా దిగ్గజ కంపెనీలు ఏపీని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. కొత్త కంపెనీల కోసం ఎవరూ ఏపీ వైపు చూడటం లేదు. తాజాగా తమ కొత్త పరిశ్రమ స్థాపన ఏర్పాట్లలో ఉన్న  టాటా గ్రూప్ కూడా ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకున్న పాపాన పోలేదు. దక్షిణాదిలో టాటాలు సెమీ కండక్టర్స్ యూనిట్ పెట్టాలని నిర్ణయించింది టాటా గ్రూప్. సాఫ్ట్ వేర్ పరిశ్రమలో నెంబర్ వన్‌గా ఉన్న టీసీఎస్‌కు తోడుగా హార్డ్ వేర్ విషయంలోనూ రాణించాలని భావించింది. ఇందుకోసం రూ. 2200 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ పెట్టాలని ప్రణాళికలు వేసింది. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటక , తమిళనాడులతో టాటా సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఆయా రాష్ట్రాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, పరిస్థితులను బట్టి టాటాలు వచ్చే నెలలో నిర్ణయం ప్రకటిస్తారు.  నిజానికి పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రానికి టాటాలు చేయూతనందించడానికి సిద్ధంగా ఉంటారు. విశాఖ, అనంతపురం, విజయవాడ వంటి చోట్ల ఇలాంటి పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతాలుగా ఉంటాయి. కాని టాటా గ్రూప్ మాత్రం తమ సెమీ కండక్టర్ పరిశ్రమ కోసం ఏపీని అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు. జగన్ సర్కార్ విధానాలే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరిశ్రమ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. అనంతపురం బెంగళూరుకు సమీపంలో ఉంటుంది. ఇలాంటి అడ్వాంటేజ్‌ను వాడుకుని టాటాలకు ప్రతిపాదనలు పంపి.. మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి పరిశ్రమను రాబడితే.. యువతకు ఎంతో మేలు జరుగుతుంది. టాటాల పరిశ్రమ వస్తే ఒక్క పరిశ్రమతో ఆగిపోదు. అలాంటి పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు చాలా వస్తాయి. వాటి వల్ల రాష్ట్రానికి మేలు. కాని జగన్ సర్కార్ మాత్రం అలాంటి ప్రయత్నాలేవి చేయడం లేదు.  కానీ అంత దీర్ఘంగా ఆలోచించే నాయకులు ప్రస్తుతం ఏపీలో లేరని అంటున్నారు. టాటాలకు ఏపీ అంటే అభిమానం ఉంది. టాటా ట్రస్ట్ మొత్తం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ పర్యటనకు కూడా టాటా వచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. ఎలాగైనా ఆ పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేవారనే చర్చ సాగుతోంది. టాటాలకు ఆ ఆలోచన ఉన్నప్పుడే ఆయన రంగంలోకి దిగేవారని, ఎలాగైనా ఒప్పంచి పరిశ్రమను ఏపీకి తీసుకువచ్చేవారని చెబుతున్నారు. ఇప్పుడు విపక్షాలను టార్గెట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న జగనన్న పాలనలో.. టాటా పరిశ్రమ కోసం ఏపీకి పోటీ పడే తీరిక లేదనే విమర్శలు వస్తున్నాయి.  ఏపీ ‘అభయహస్తా’నికి ఎల్ఐసీ గుడ్ బై! టాటా పరిశ్రమ ఏపీని పట్టించుకోవడం లేదనే అంశంపై డీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి పరిశ్రమలు గుడ్ బై చెప్పడమే కాదు, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేందుకు విముఖత చూపుతూ ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నాయని వివరించారు. టాటా గ్రూపు... 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయతలపెట్టిన సెమికండక్టర్ పరిశ్రమ కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వైపు చూస్తోందని వెల్లడించారు. ఆ మేరకు ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. అంతేకాదు, లులూ గ్రూప్ ఏపీకి ఇక జన్మలో వచ్చేది లేదని తీర్మానించుకుందంటూ మరో వెబ్ సైట్ లో వచ్చిన కథనాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో వైజాగ్ పెట్టుబడిదారులకు ఎంతో ఆకర్షణీయమైన గమ్యస్థానంలా విలసిల్లిందని, కానీ జగన్ వచ్చి ఒప్పందాలను రద్దు చేయడంతో 10 వేల ఉద్యోగాలు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. "లులూ గ్రూప్ కానివ్వండి, సింగపూర్ పరిశ్రమల కన్సార్టియం కానివ్వండి, టాటా రెన్యూవబుల్ పవర్, ఆసియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమలు కానివ్వండి ... జగన్ అతడి ముఠా కారణంగా ఏపీకి దూరమయ్యాయి. ఇక్కడి ప్రజలకు ఉపాధి దూరమైంది. ఏపీ ఇంత దుస్థితిలో చిక్కుకోవడానికి జగనే కారణం" అని నారా లోకేష్ విమర్శించారు. 

మండే నుంచి శీతాకాల మంటలు.. ఏపీ ఎంపీలు ఏం చేస్తారో?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల (నవంబర్) 29 న ప్రారంభమవుతాయి. సుమారు పక్షం రోజులకు పైగా జరిగే సమావేశాలు, ఒక విధంగా ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోందని రాజీకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక అధికార ప్రతిపక్షలు రెండూ కూడా అస్త్ర శస్త్రాలతో యుద్దానికి సిద్ధమవుతున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గడచిన ఏడేళ్ళలో, తొలి సారిగా ప్రతిపక్షాల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కుంటున్న సమయంలో జరుగుతున్న శీతాకాల సమావేశాలు గతానికి భిన్నంగా, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా ఉంటాయని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత వరకు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజాకర్షక శక్తి ముందు రాహుల్ గాంధీ సహ ప్రతిపక్ష నేతలు ఎవరు నిలవలేక పోయారు. అలాగే, ప్రజల మద్దతు దండిగా ఉందన్న భరోసాతో, విపక్షాలను  అధికార కూటమి పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా ప్రతిపక్షాన్ని అధికార కూటమి బేఖాతరు చేసింది.  కానీ  ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొవిడ్ నేపధ్యంగా తలెత్తిన సమస్యలు, ముఖ్యంగా  ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, వంటి సమస్యల కారణంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ గ్రాఫ్ కూడా నేల చూపులు చూస్తోంది. గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలన తగ్గించడం మొదలు కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. అయితే, గతంలో ఎప్పుడు లేని విధంగా, ధరల పెరుగుదల, వ్యవసాయ ఉత్పాతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)వంటి కీలక సమస్యల విషయంలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. మరో వంక  విపక్షాలు,ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సభ లోపలే కాకుండా, సభవెలుపల కూడా ఆందోళనకు సిద్దమవుతున్నాయి.  ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, విపక్ష కూటమి నాయకత్వం విషయంలో మమతా బెనర్జీ  తృణమూల్ కాంగ్రెస్ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కునేందుకు, పెద్దన్న పాత్రను నిలుపుకునేందుకు, ప్రజాందోళనకు కూడా సిద్దమవుతోంది.ఇందులో భాగంగా     పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే, పెరుగుతున్న ధరలను నిరసిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు డిసెంబర్ 12న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ఈ ర్యాలీలో భాగంగా ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అదలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలు దిల్లీలో సమావేశం కానున్నారు. పార్లమెంట్లో ఏకతాటిపై ఉండటం, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ, రాజ్యసభలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. లేఖ రాశారు. కీలకమైన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని సూచించారు.  ఇదలా ఉంటే, మూడు సాగు చట్టాల రద్దుకు సంబంధించి కేంద్రం తదుపరి ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో.. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజున  బీజేపీ  ఎంపీలందరూ లోక్‌సభకు హాజరుకావాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. రాజ్యసభ ఎంపీలకు దీనిపై ఇప్పటికే విప్‌ జారీ అయ్యింది. ఈసారి సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదానికి 26 బిల్లులు ఎదురుచూస్తున్నాయి. అందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఒకటి. దాంతో పాటు వివాదాస్పద క్రిప్టో కరెన్సీ బిల్లు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం వాటాను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.కేంద్రం గత ఏడాది వర్షాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. వాటిపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వారు చేపట్టిన నిరసనల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. కొద్ది రోజుల క్రితం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చట్టాల రద్దుతో సంతృప్తి చెందని సంఘాలు ఎం ఎస్ పీచట్టం, కేసుల ఉపసంహరణ వంటి కొత్త డిమాండ్లతో ఆందోళన కొనసాగించేందుకు నిరంయించాయి. సహజంగానే రైతుల కొత్త డిమాండ్స్’కు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలు వాటి అమలుకు పట్టు పట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. వారంతా తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని కోరుతున్నానని తోమర్ మీడియాతో వెల్లడించారు. మరోపక్క నిరసనల్లో భాగంగా రైతులపై పెట్టిన కేసులు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని మంత్రి అన్నారు. వాటి ఉపసంహరణపై రాష్ట్రాలదే నిర్ణయమన్నారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదటి రోజునుంచే సభలో ఉష్ణోగ్రతలు భాగ్గుమందం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కేసీఆర్ కు ఇక చుక్కలేనా? 

తెలంగాణ కాంగ్రెస్ లో అంతా సెట్ రైట్ అయిందా? సీనియర్లంతా ఒక్కటైపోయారా? కలిసికట్టుగా పోరాడుతూ కేసీఆర్ కు చుక్కలు చూపించబోతున్నారా? అంటే కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలకో గాంధీభవన్ లో ఖుషీ వాతావరణం కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎడమొఖం పెడ మొఖంగా ఉన్న నేతలంతా కలిసిపోయారు. ఇందుకు పీసీసీ చేపట్టిన వరి దీక్ష వేదికైంది. కొంత కాలంగా భిన్న దృవాలుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలుసుకోవడం చర్చగా మ మారింది. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపింది.  వరి దీక్ష వేదికగా కలిసిపోయిన ఆ ఇద్దరు నేతలో ఎవరో కాదు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు కలిసిపోయారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ  ధర్నాచౌక్‌లో రెండు రోజుల‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. అయితే. ఈ దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ ఒకరంటే ఒకరికి పడని.. ఒక్కసారీ మాట్లాడుకోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు... కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది.ఈ సన్నివేశం చూసిన జనాలు, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఒకింత ఆశ్చర్యపోయింది.  టీపీసీసీ చీఫ్‌ కోసం విశ్వప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి.. ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాదు రేవంత్ రెడ్డి టార్గెట్ గా వరుస ప్రకటనలు చేసి కాక రాజేశారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ పార్టీ ఇంచార్జీనే టార్గెట్ చేశారు. తర్వాత కూడా సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ లక్ష్యంగా కామెంట్లు చేశారు కోమటిరెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీకి డిపాజిట్ రాకపోవడంతో.. అందుకు పీసీసీ చీఫ్ కారణమనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. అయితే వాళ్లిద్దరి మధ్య సయోధ్య కోసం సీనియర్ నేత వీ హనుమంతరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు. రక్తం ధార పోసేందుకు సిద్ధమేనా.. తెలంగాణ‌కు మంచి రోజులు.. కొన్ని రోజుల క్రితం సీఎల్పీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు వీహెచ్. తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ చర్చించారు.  ఈ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఒకే తాటిపైకి తీసుకురావడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకట్రెండు సందర్భాల్లో వీహెచ్ ఫెయిల్ అయినప్పటికీ..  వరి దీక్షతో కోమటిరెడ్డి-రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో వీహెచ్ మంత్రాంగం ఫలించినట్లయ్యింది. అయితే ఇద్దరూ కలిసిపోయినట్టేనా..? లేకుంటే దీక్ష ముగిసే వరకు మాత్రమే ఇలా కలిసుంటారా..? అన్నదానిపై పార్టీ నేతలెవరు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి దీక్షలో కూర్చున్న విజువల్స్ మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తెగ వైరల్ చేస్తోంది. ఆ ఇద్దరూ కలిసిపోయారు.. ఇక కాస్కో కేసీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేస్తే గులాబీ పార్టీకి చెమటలు పట్టడం ఖాయమనే చర్చ గాంధీభవన్ తో పాటు కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.  

న‌డిరోడ్డుపై బైక్ త‌గ‌ల‌బెట్టి.. పోలీస్ చ‌లాన్ల‌పై తిరుగుబాటు..

ఇది ఇండియా. ఇక్క‌డ ఎలాగైనా ఉండొచ్చు. ఎవ‌డిష్టం వాడిది. జ‌నాలు బాగా ముదురు. రూల్స్ గీల్స్ ఏవీ పాటించ‌రు చాలామంది. మ‌న‌దాకా వ‌చ్చాక చూసుకుందాంలే అనుకుంటారు. అలానే ఓ యువ‌కుడు ట్రాఫిక్ రూల్స్‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. హెల్మెట్ పెట్టుకోడు. బైక్ నెంబ‌ర్ ప్లేట్ స‌రిగ్గా పెట్ట‌డు. సిగ్న‌ల్స్ జంప్ చేస్తుంటాడు. త్రిబుల్ రైడింగ్ స‌రేస‌రి. ట్రాఫికోళ్లు త‌న బండిని ఆప‌డం లేద‌నే ధీమాతో ఓవ‌ర్ చేస్తుంటాడు.  కానీ, మ‌న ఖాకీలు వాడికంటే ముదురు. అత‌న్ని ఒక్క‌సారి కూడా ఆప‌క‌పోయినా.. అనేక‌సార్లు కెమెరా క్లిక్ మ‌నిపించారు. వాడి బండిపై అనేక చ‌లాన్లు ఉన్నాయి. ఫ‌స్ట్ టైమ్ ఓ చ‌లాన్ చూసి అత‌డు షాక్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఇంకో చ‌లాన్‌. మ‌రోసారి మ‌రో చ‌లాన్‌. ఇలా చ‌లాన్లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ పోలీసోళ్లు మామూలోళ్లు కాదంటూ తెగ తిట్టేసుకుంటున్నాడు. కానీ, ఫైన్లు మాత్రం క‌ట్ట‌ట్లేదు.  క‌ట్‌చేస్తే.. లేటెస్ట్‌గా అత‌ను బైక్‌పై వెళుతుంటే.. ట్రాపిక్ పోలీసులు మ‌రోసారి ఫోటో తీశారు. అది చూసిన మ‌నోడు.. కోపం ప‌ట్ట‌లేక‌పోయాడు. నీ.... ఇంకా ఎన్నిసార్లు ఫైన్లు వేస్తారంటూ.. ఆవేశంతో ఊగిపోయాడు. న‌డిరోడ్డు మీద.. జంక్ష‌న్ మ‌ధ్య‌లో బైక్ ఆపేసి.. బండికి నిప్పు పెట్టాడు.  వాడి చేష్ట‌ల‌కు అక్క‌డున్న పోలీసులు అవాక్క‌య్యారు. వెంట‌నే వ‌చ్చి.. మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. స్థానికులు బండిపై నీళ్లు చ‌ల్లి మంట‌లు ఆర్పేశారు. బైక్‌నే త‌గ‌ల‌బెట్టేంత కోపం వ‌చ్చిందంటే.. ఖాకీలు అత‌నికి ఎన్నిసార్లు ఫైన్లు వేశారో ఏమో.. అయినా, రూల్స్ పాటిస్తే.. వాళ్లెందుకు చ‌లాన్లు వేస్తారు చెప్పండి. అలా కోపం తెచ్చుకునే బ‌దులు.. రూల్స్ ఫాలో అయితే స‌రిపోతుందిగా అంటున్నారు. ఇదంతా ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ఖానాపూర్‌లో జ‌రిగింది. బండి త‌గ‌ల‌బెట్టిన అత‌ని పేరు.. మ‌క్బూల్‌.

మహా సర్కార్‌కు రెండేళ్ళు.. ప్రభుత్వం కులనుందా?

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ (ఎంబీఏ)కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకు (నవంబర్ 27)కి రెండేళ్ళు పూర్తయ్యాయి. అనూహ్య పరిణామాల్ అంది 2019 లో శివసేన అధినేత్ ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఏర్పడిన మూడు పార్టీల (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) అఘాడీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో అటుపోట్లు అనేకం ఎదుర్కుంది. అయినా అంచనాలను తల్లకిందులు చేస్తూ నిలబడింది.  నిజానికి, లౌకిక (కాంగ్రెస్, ఎన్సీపీ)  మతోన్మాద (శివ సేన) పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం అట్టే కాలం మనుగడ సాగించేలదని, రాజకీయ పండితులు తొలి రోజు నుంచీ జోస్యం చెపుతూ వచ్చారు. బీజేపే అయితే, ప్రభుత్వాని  పడగొట్టేందుకు, తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునేదుకు, అడుగడుగున విఫల ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది.  మహా అయితే ఆరు నెలలు, ఆ తర్వాత కష్టం అన్నారు. అయితే, ఆరు నెలలు, సంవత్సరం దాటి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి, శివసేన  అధినేత ఉద్దవ థాకరేకు గతంలో ప్రత్యక్ష పరిపాలన అనుభవం లేక పోయినా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పరిపాలనా అనుభవంలో ఆరి తేరిన కాంగ్రెస్ నాయకుల సహాయ సహకారాలతో ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అంత సంతృప్తిగా లేక పోయినా, కూటమి గడప దాటే సాహసం చేయలేక పోతోంది.  అయితే, మరో రెండు నెలలలో ముంబై మహానగర్ పాలిక సహా ఆరేడు కీలక కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కూటమిలో కొత్తగా లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే  ప్రకటిచింది. నిజానికి, కార్పొరేషన్ ఎన్నికలు మినీ అసెంబ్ీద ఎన్నికల స్థాయిలో జరుగుతాయని, ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని అవిష్కరిస్తాయని అంటున్నారు.  ఇదలా ఉంటే, మహారాష్ట్రలో  మార్చి నెలలో బీజీపే  ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో శివసేనలో ఉన్నరాణే, శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగానూ పని చేశారు.  మరో  ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌లు ఢిల్లీల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్‌ పటేల్‌లు కూడా దేశ రాజధానిలోనే ఉండడంతో ఊహాగానాలు వ్యాపించాయి. శివ సేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్‌ అఘాడీ ఏర్పడి శనివారం నాటికి రెండేళ్లు పూర్తి కానుండడం గమనార్హం. తొలుత నారాయణ్‌ రాణే రాజస్థాన్‌లోని జైపుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ "మహారాష్ట్రలో మార్చి నెలలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది" అని చెప్పారు. దీనిని వివరించమని కోరినప్పుడు "ప్రభుత్వాలు కూలగొట్టడం, ఏర్పాటు వంటివి రహస్యంగా జరుగుతాయి. బహిరంగంగా వీటిపై చర్చలు జరపరని అన్నారు.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కూడా రాణే లెక్క తప్పదని, అది నిజమవుతుందన్న ఆశాభావం వ్యక్తపరిచారు. ఢిల్లీలో ఫడ్నవీస్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి చర్చలు జరిపినట్టు సమాచారం.ఈ విషయమై నాగ్‌పుర్‌లో పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం, అది రాణే  కోరిక కావచ్చని అంటున్నారు. గతంలో ఫడ్నవీస్ సైతం ఆఘాడీ ప్రభుత్వం అంతర్గత విభేదాలతో దానికదే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానే, అదేమీ జరగా లేదు. ఆయినా తాజాగా నారాయణ్ రాణే మార్చి లోపు మార్పు ఖాయమని వ్యాఖ్యానించడం మహా రాజకీయాలను హీటెక్కిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో గతంలో చోటు చేసుకున్న అధికార మార్పిడి పరిణామాల రీత్యా మహా రాజకీయాల్లోనూ బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.

ఏపీ ‘అభయహస్తా’నికి ఎల్ఐసీ గుడ్ బై!

అప్పుల్లో కూరుకుపోయిన జగన్రెడ్డి సర్కార్ డబ్బుల కోసం సంస్థల్ని, వ్యవస్థల్ని ఎంతగా వేధించి, వెంటాడుతోందో రోజు మీడియాలో కథనాలు కథనాలుగా వస్తున్నాయి. వైసీపీ సర్కార్తో వేగలేక గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కొక్క సంస్థ రద్దు చేసుకుంటున్నాయి. అభయహస్తం పంథకం అమలు కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ)తో 2009 అక్టోబర్ 27న జీవిత బీమా సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు చేసుకుంది. ఈ మేరకు జీవిత బీమా సంస్థ 2021 నవంబర్ 3న ఓ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అవగాహన ఒప్పందం రద్దు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా ఆ ప్రకటనలో ఎల్ఐసీ స్పష్టంగా పేర్కొంది. అవగాహన ఒప్పందం రద్దు చేయడంతో అంతవరకు తమ సంస్థ వద్ద జమ అయిన నిధిని అభయ హస్తం పథకం నోడల్ ఏజెన్సీ ఎస్ఇఆర్పికి బదిలీ చేసినట్లు ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా జారీచేసిన మాస్టర్ పాలసీ నెంబర్ 514888, అభయహస్తం పథకం కింద తన అన్ని కర్తవ్యాలు, బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు జీవిత బీమా సంస్థ ప్రకటనలో తేటతెల్లం చేసింది. అభయ హస్తం పథకంలో తనకు ఇకపై ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది. ఇక నుంచి లబ్ధిదారుల క్లెయిమ్లు, పెండింగ్లో ఉన్న  క్లెయిమ్లు, భవిష్యత్లో వచ్చే క్లెయిమ్లు అన్నింటినీ పరిష్కరించే పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ)దే అని ఎల్ఐసీ సంస్థ తన ప్రకటనలో వివరించింది. ఇక నుంచి అభయ హస్తం పథకం కింద ఉన్న ఎలాంటి క్లెయిమ్లనూ జీవిత బీమా సంస్థ అంగీకరించబోదని స్పష్టంగా ప్రకటనలో వెల్లడించింది.

అప్పుల కోసం చట్టాలకు తూట్లు   జగన్ సర్కార్ కొత్త ఎత్తులు

ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్  ప్రభుత్వం అన్ని  గీతలు  దారేసింది. ఆర్హతకు, ఆదాయానికి  మించి అప్పులు చేసింది. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి మిగల కుండా అన్ని అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకుంది. అలా అప్పుపుట్టే దారులన్నీ ఇంచుమించుగా మూసుకు పోయాయి . మరో వంక అప్పు లేకుండా పూట గడిచే మార్గం లేదు.ఇలాంటి పరిస్థితిలో మాములుగా అయితే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క మార్గం చేతులు ఎత్తేయడం.అంతకు మించి మరో మార్గం లేదని ఆర్థిక నిపుణులు ఎప్పుడోనే ఒక నిర్ణయానికి వచ్చారు.  అవును కేవలం ఆర్ధిక శాస్త్రం మాత్రమే చదువుకున్న,ఆర్థిక రంగ నిపుణులకు, చట్టాలు మాత్రమే తెలిసి వాటి ఉల్లంఘన మార్గాలు తెలియని అధికారులకు చేతులు ఎత్తేయడం సహజం. వారికి అది మినహా మరో మార్గం కనిపించక పోవచ్చును.  కానీ, రవి గాంచనిచో కవి గాంచున్’ అన్నట్లుగా ఆర్థిక రంగ నిపుణలకు కనిపించని ఆప్పు దారులు,అక్రమ మార్గాలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వారి బృందం దివ్య నేత్రాలకు కనిపిస్తాయి కావచ్చును.. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పుకు మరో కొత్త మార్గాన్ని కనుగొంది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీల పరిమితిని ఏకంగా రెట్టింపు చేసుకుంటూ చట్టాన్ని సవరించింది.   అదికూడా ఓ వంక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర సర్కారు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని లెక్క తేల్చిన రోజునే మరో లక్ష కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు ‘కల్పించుకుంటూ’ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.నిజానికి ‘కాగ్’ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభ నియంత్రన దాటిపోయే, స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు అడ్డదారులు తొక్కాయని తప్పు పట్టింది. బడ్జెట్’లో చూపకుండా చేస్తున్నఖర్చులు, అందుకోసం చేస్తున్న అప్పులు కొండలా పెరిగిపోతున్నాయని అక్షింతలు వేసింది.వచ్చే ఏడేళ్లలో ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు చెల్లించవలసి ఉంటుందన్న కాగ్, అప్పు తీర్చడానికి కొత్త అప్పులు చేయడం ఏమిటని విస్మయాన్ని ప్రకటించింది.  అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం కాగ్’ ఏమి చెప్పిందన్న విషయాన్ని పక్కన పెట్టి కొత్త కొత్త ఇన్నోవేటివ్ పద్దతుల్లో అప్పులు చేస్తోంది. కేంద్రంతో సంబంధం లేకుండానే,చట్టాలను  సవరించి కొత్త అప్పులకు సిద్దమవుతోంది. నిజానికి కేంద్రం రూపొందించిన గ్యారెంటీ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం  రూ.5600 కోట్ల రుణానికి మాత్రమే హామీ ఇవ్వగలదు. కానీ... ఇప్పటికే ఇంచుమించుగా అంతకు రెట్టింపు రూ.1,10,000 కోట్లకు గ్యారెంటీ ఇచ్చింది .ఇది కూడా సరిపోదని ఇప్పుడు చట్టాన్ని సవరించింది. మరో రూ.లక్ష కోట్లకు హామీ చ్చేందుకు వీలుగా ప్రభుత్వం సభలో ఉన్నబలంతో చట్టాని సవరించింది. అయితే, ఇలా సవరించిన చట్టం చెల్లుతుందా, అంటే, ప్రభుత్వ వైఖరి  నిండా మునిగిన వణికి చలేమిటి అన్నట్లుగా ఉందని అధికారులు అంటున్నారు.  అయితే ఇలా వంద రూపాయల విలువైన వస్తువును కుదువ పెట్టి రూ.200 అప్పు తీసుకోవడం మాములుగా అయితే కుదిరే వ్యవహారం కాదు. కానీ, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చిన జగన్‌ ప్రభుత్వానికి మాత్రం సాధ్యం కావచ్చని, అయితే ఇలా అడ్డ దారుల్లో తెచ్చిన అప్పులు  చివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను  ఏ అధః పాతాళానికి తీసుకుపోతాయో మాత్రం చెప్పలేమని ఇటు అధికారులు, అటు ఆర్థిక రంగ నిపుణులు  అంటున్నారు.

చంద్రబాబు కన్నీళ్లు డ్రామా కాదు.. సీఎంగా జ‌గ‌న్ ఘోరంగా విఫ‌లం..

ఏపీ అసెంబ్లీ ప‌రిణామాలు.. భువ‌నేశ్వ‌రిపై కామెంట్లు.. చంద్ర‌బాబు ఏడ్వ‌డంపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌రెడ్డి అండ్ బ్యాచ్ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. చంద్ర‌బాబుకు పూర్తి మ‌ద్ద‌తు పలికారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని.. అసెంబ్లీలో ప్ర‌జాస్వామ్యం అబాసుపాలైంద‌ని ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే...  "ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి నేనెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదు. హరికృష్ణ, పురందేశ్వరితో నాకు పరిచయం ఉంది, వాళ్లు చాలా మంచివారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని అనుకోవడం లేదు. చంద్రబాబుకు తెలియదా.. సింపతీ పనిచేయదని? చంద్రబాబును ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్‌ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదు" అని ఉండవల్లి అన్నారు.  "ఓ మంత్రి అయితే రేయ్‌, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబును అంతలా దారుణంగా తిడితే ఎవరు గౌరవిస్తారు? విపక్ష నేతలు, మనుషులకు వైసీపీ మంత్రులు గౌరవించాలి. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు భజన చేశారు.. పాటలు పాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే" అని చెప్పారు ఉండవల్లి.  ఏపీ సీఎం జగన్‌ పాలనలో ఘోర వైఫల్యం చెందారని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. "సీఎంగా జగన్‌ ఇంత ఘోరంగా విఫలమవుతారని ఊహించలేదు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని.. మళ్లీ పెడతాం అనడం ప్రభుత్వ వైఫల్యమే". ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని.. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుందని ఉండ‌వ‌ల్లి స‌ల‌హా ఇచ్చారు. --రోజా పొగడ్తలు మంత్రి పదవి కోసమేనా?

రక్తం ధార పోసేందుకు సిద్ధమేనా.. తెలంగాణ‌కు మంచి రోజులు..

ఈట‌ల గెలుపు త‌ర్వాత‌ బీజేపీ ఫుల్ జోష్ మీదుంది. తెలంగాణ‌లో అధికారం త‌మ‌దేన‌ని ఫిక్స్ అయింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌- ఫామ్ హౌజ్ వీడి బ‌య‌ట‌కు రాని సీఎం కేసీఆర్‌ను.. ధ‌ర్నా చౌక్‌లో దీక్ష‌కు దిగొచ్చేలా చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని ఉత్సాహంగా ఉంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ దూకుడు మామూలుగా లేదు. వ‌రి కొనుగోళ్ల‌పై జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేసి.. కేసీఆర్‌ను బెదిరిపోయేలా చేశారు. కేసీఆర్‌ మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టేలా చేశారు. ముఖ్య‌మంత్రిని ఢిల్లీకి ప‌రుగులు పెట్టించారు. ఇంతా చేసి.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేసిన‌ట్టు? ఏం సాధించిన‌ట్టు? అని ప్ర‌శ్నిస్తున్నారు బండి సంజ‌య్‌. సీఎం కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని బండి సంజయ్‌ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వెళ్లినట్టు ఆరోపించారు. సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారని.. బీజేపీను అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలు పన్నారని విమర్శించారు.  "తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రక్తం ధార పోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ప్రగతిభవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. తమను సీఎంను చేయాలని కుమారుడు, బిడ్డ, అల్లుడు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు." అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు బండి సంజ‌య్‌.   "సీఎం పోకడలతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్‌ చిచ్చు పెట్టారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 17నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అవుతుంది" అని బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు.   --ర‌వీంద‌ర్‌సింగ్‌తో ఈట‌ల స్కెచ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌..

వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ప్రధాని మోడీ హై లెవల్ మీటింగ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుందని అనుకుంటున్న సమయంలోనే మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. పుట్టుకొస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్‌లు దేశాలను వణికిస్తున్నాయి.  సౌతాఫ్రికా పొరుగు దేశమైన బోత్సవానాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. B.1.1529 పేరు కలిగిన ఈ వేరియంట్‌ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లుగా ఎన్ఐసీడీ తెలిపింది.  దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్‌ కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు ఏ రకంలోనూ లేని విధంగా ఈ కొత్త రకం కొమ్ముల్లో భారీగా ఉత్పరివర్తనాలు జరిగినట్టు వారు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్‌ వివరాలను లండన్‌ ఇంపీరియల్‌ కళాశాల వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టామ్‌ పీకాక్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది ఆందోళనకరమైన వేరియంటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎంత వేగంగా విస్తృతంగా వ్యాపిస్తుందనే సంకేతాలను వారు గమనిస్తున్నారు. స్పైక్‌ మ్యుటేషన్లు (కరోనా వైరస్‌పై కొమ్ముల్లాంటి వాటిలో ఉత్పరివర్తనాలు) పెద్దసంఖ్యలో జరుగడం ఆందోళన కలించే అంశమని హెచ్చరిస్తున్నారు.  B.1.1529 కొత్త వేరియంట్‌ వైరస్ వ్యాప్తిని నిపుణులు, డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేస్తోంది. HIV రోగిలోంచి ఈ రకం వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియదంటున్న నిపుణులు ఫ్యూచర్‌లో వైరస్ వ్యాప్తి పెరిగితేనే ముప్పు అంటున్నారు.ఇది భారీగా వ్యాపించడానికి, ప్రజల రోగ నిరోధకతను తప్పించుకొనేందుకు వైరస్‌కు బలాన్నిస్తుందని విశ్లేషిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే 22 కొత్త వేరియంట్‌ కేసులను గుర్తించారు. అర్హులంతా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని, గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ప్రదేశాల్లోనే సమావేశం కావాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొత్త వేరియంట్‌పై లండన్‌లో కూడా పరిశోధనలుజరుగుతున్నాయి. హైదరాబాద్ యూనివర్శిటీలో కరోనా పంజా.. థర్డ్ వేవ్ వచ్చినట్టేనా?  కొత్త వేరియంట్ ఎంట్రీతో కర్నాటకలో కోవిడ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. ధార్వాడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో 182 మంది స్టూడెంట్స్‌కు కరోనా సోకింది. ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్‌ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా యూనివర్శిటీలోనూ కరోనా పంజా విసిరింది. 25 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. క్యాంపస్ లో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  దక్షిణాఫ్రికాలో B.1.1.529 కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చిందన్న వార్తతో భారత్‌ అలర్ట్ అయింది. B.1.1.529 స్పైక్ ప్రోటీన్‌లో 32 మ్యుటేషన్లు ఉన్నట్లుగా భావిస్తోంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తిగా మూడంచెల స్క్రీనింగ్‌ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. కోరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వెంటనే విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధాని మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఎంతో కృషి, ఎన్నో కష్టాల తర్వాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని చెప్పారు. ఈ కొత్త వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని నిపుణులను కోరానని తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఆరోగ్య శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడా తాజా పరిస్థితి, కొత్త వేరియంట్ , తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

క‌వితకు ఎమ్మెల్సీ.. మ‌రి, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఏవి?

ఎంపీగా కూతురు ఓట‌మిని తట్టుకోలేక‌పోయారు. కొన్నిరోజులు ఆగి ఎమ్మెల్సీని చేసేశారు. ఆ ప‌ద‌వీ కాల‌మూ ముగిసింది. బిడ్డ‌ను ఒక్క‌రోజు కూడా ఖాళీగా ఉంచ‌కుండా.. వెంట‌నే మ‌ళ్లీ రాజ‌కీయ ఉద్యోగం ఇచ్చేశారు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీని చేసేశారు. కూతురు కోసం అంత చేసిన కేసీఆర్‌.. మ‌రి, తెలంగాణ బిడ్డ‌లంతా ముఖ్య‌మంత్రిగా ఆయ‌నకు పిల్ల‌లులాంటి వారు కాదా? వారంతా ఉన్న‌త చ‌దువులు చ‌దివి.. ఏళ్లుగా ఖాళీగా ఉంటున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. నోటిఫికేష‌న్లు ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నారు. వారి గోడును మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు ప్ర‌భుత్వం. క‌విత‌కు వెంట‌నే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చిన‌ట్టు.. నిరుద్యోగుల‌కు కూడా ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌వా కేసీఆర్ అంటూ అంతా నిల‌దీస్తున్నారు.  ఇదే విష‌యంలో సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిడ్డ ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతేనే.. కేసీఆర్ గుండె తల్లడిల్లింది.. బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టేందుకు కేసీఆర్‌ రెడీగా ఉన్నారని మండిపడ్డారు.  నోటిఫికేషన్స్ లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రోజుకో నిరుద్యోగి చనిపోతుంటే దొరకు కనపడట్లేదని విమ‌ర్శించారు. నిరుద్యోగులను బలితీసుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని ఆరోపించారు. ‘‘నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా’’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.  --ఆ అన్నకు చెల్లే.. అందుకే మౌనం.. --ర‌వీంద‌ర్‌సింగ్‌తో ఈట‌ల స్కెచ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌..

వైసీపీ దుర్మార్గాలు.. చిట్టీల టోకరా.. శ్రీవారా మజాకా.. కరోనా పంజా.. టాప్ న్యూస్@1PM

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీపీఐ  కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలోని వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 5 జిల్లాల్లో దాదాపు 2 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. రెండు డ్యాంలు, చెరువులు, కాల్వలకు గండి పడి తీవ్ర నష్టం వాటిల్లిందని రామకృష్ణ తెలిపారు. 60 మంది మృతి చెందగా, పలువురు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారన్నారు.  ----- వైసీపీ దాష్టీకాలు, దుర్మార్గాలు అధికమయ్యాయని  టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తుమ్మల చెరువుకు చెందిన సైదాను విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. దాచేపల్లిలో ఒకర్ని, తంగెళ్ళులో ఒకర్ని కొట్టి చంపారని చెప్పారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఏడుగుర్ని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను ప్రశ్నించినవారిపై దాడులా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు.  --- పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉణుదుర్రు పంచాయతీ కార్యదర్శి  తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఆరోపించింది. ఈ మేరకు యువతి దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి  సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అయితే తాను ఏతప్పూ చెయ్యలేదు నిజాలు విచారణలో బయట పడతాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి అంటున్నారు. -- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చిట్టీల పేరుతో శ్రీనివాసగుప్తా అనే వ్యక్తి 5 కోట్లకు టోకరా వేశాడు. దాదాపు 200 మంది నుంచి చిట్టీలు కట్టించుకుని పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీనివాసగుప్తా వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధపడుతున్నారు.  --  శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తయ్యింది. 20 నిముషాల వ్యవధిలోనే 3లక్షల 10వేల టోకెన్లను భక్తులు పొందారు. కోటా పూర్తయినప్పటికీ సమాచారం తెలియక ఇప్పటికీ వేల సంఖ్యలో టిక్కెట్ల కోసం వెబ్‌సైట్‌లో లాగిన్ అవుతున్నారు. టీటీడీ దర్శనం కోటాను పెంచకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ---- తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై వైధ్యాధికారులతో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. బి.1.1.259 వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కరోనా భయం వెంటాడుతోంది.  మేడ్చల్ జిల్లాలోని టెక్‌ మహీంద్రా వర్సిటీలో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.  ----- బీజేపీని బద్నాం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయని ఓ జ్యోతిష్యుడు తనకు చెప్పారన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.  -- వరి రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వరి దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు తమ చేతిలో అధికారం ఉన్నా... రైతులతో రాజకీయం చేసిందన్నారు. గతంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని సమయంలో కూడా కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. --- ఇప్పటికే డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా సప్లై చేస్తోందంటూ అమెజాన్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఓ యువకుడికి సెల్‌ఫోస్ ట్యాబ్లెట్స్ అందించి అతని చావుకి కారణమైంది. ఆదిత్య అనే యువకుడు ఆమెజాన్‌లో సెల్‌ఫోస్ ట్యాబ్లెట్ల కోసం ఆర్డర్ పెట్టగా... వెంటనే అమెజాన్ వాటిని అతనికి అందించింది. అయితే ఆ యువకుడు ఆ ట్యాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి తండ్రి.. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఇండోర్ పోలీసులను ఆదేశించారు. ---- సహోద్యోగిపై అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని జార్ఖండ్‌ రాష్ట్రంలో 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించారు.తూర్పు సింగ్‌భూమ్‌కు చెందిన దాదాపు 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగాల నుంచి అకస్మాత్తుగా తొలగించారు. ఓ మహిళా కార్మికురాలిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా తోటి మహిళా కార్మికులు ఆందోళన చేశారు.

తెలుగు భాషకు లుంగీతో పోలికా?  వైసీపీ ఎమ్మెల్యేకు తగునా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే తాపత్రయమో, సభలో సభ్యులను నవ్వించాలనే సరదా తెలియదు కాని.. ఓ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో వింత వాదన చేశారు. తన ప్రసంగంలో అనవసరమైన పోలీకలు తెచ్చారు. ఇందుకోసం తెలుగు భాషపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, సభలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన ప్రసంగంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  ఏపీ అసెంబ్లీలో చివరి రోజు ఇంగ్లీష్ భాషపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న  శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వింత ప్రసంగం చేశారు. ఇంగ్లిష్‌ మీడియం అవసరాన్ని గురించి మాట్లాడుతూ విచిత్రమైన పోలికలు తెచ్చారు. ఇంగ్లీషు రాకపోతే ఏ బాత్రూమ్‌లోకి వెళ్లాలో కూడా తెలియక ఇబ్బంది పడతామని  వ్యాఖ్యానించారు. అలాగే లుంగీలను తెలుగుతోనూ, ప్యాంట్లను ఇంగ్లి‌షుతోనూ ఆయన పోల్చారు. రోజంతా ప్యాంట్లు వేసుకున్నా రాత్రి లుంగీలు కట్టుకుంటామంటూ...రెండు భాషలూ అవసరమేనన్నారు. తెలుగు తల్లిలాంటిదని, ఇంగ్లిష్‌ భార్యలాంటిదని చెప్పారు.  ఇంగ్లీష్ భాషపై ఎమ్మెల్యే బియ్యం మాట్లాడుతున్నంతసేపూ సభలో స్పీకర్‌ తమ్మినేని సహా అందరూ నవ్వుతూనే కనిపించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తమిళనాడులో పుట్టి ఇంగ్లిష్‌ నేర్చుకుని అమెరికా వెళ్లారని చెప్పారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ...గ్రీకులో ఒక సామెత ఉందని దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన తెచ్చుకున్న పేపరు కనిపించలేదు.. ‘కావాలంటే గూగుల్‌లో కొట్టి చూడాల’ని సభ్యులకు సూచించారు మధుసూధన్ రెడ్డి. చివరకు ఆయన తెచ్చుకున్న సామెతలపేపరు దొరికింది. అందులో ఏముందో చదివి వినిపించాలని సహచర సభ్యులు కోరగా....‘అది గ్రీకులో ఉంది’ అని తన ప్రసంగాన్ని ముగించారు.  జ‌గ‌న‌న్న‌కు మందుబాబుల బూస్టింగ్‌.. ప్ర‌భుత్వం ఫిదా.. ఇంగ్లీష్ భాషపై అసెంబ్లీలో బియ్యం మదుసూధన్ రెడ్డి చేసిన ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ప్రసంగం సరదాగా ఉందని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ భాషకు చెప్పుకునే తెలుగుకు వింత పోలీకలు తేవడంపై అభ్యంతరం చెబుతున్నారు. లుంగీతో తెలుగు భాషను పోల్చడమేంటనీ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్ భాషపై ప్రేమ చూపడంలో తప్పు లేదు కాని.. అందుకోసం తెలుగు భాషను తక్కువ చేస్తూ మాట్లాడటం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇంగ్లీష్ భాషపై మాట్లాడిన బియ్యం మదుసూధన్ రెడ్డి.. అమెరికాలో ఆంగ్లం రాక తాను ఇబ్బంది పడ్డానంటూ కొన్ని ఘటనలు చెప్పి సభలో అందరిని నవ్వించారు. 

జ‌గ‌న‌న్న‌కు మందుబాబుల బూస్టింగ్‌.. ప్ర‌భుత్వం ఫిదా..

ఏపీ ఖ‌జానా వెల‌వెల‌. అప్పులు కూడా ముట్ట‌ని దుస్థితి. జీతాలు వేళ‌కు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. న‌వ‌ర‌త్నాల్లో ఒక్కో ర‌త్నం రాలిపోతోంది. ప‌థ‌కాల‌కు భారీగా కోత ప‌డుతోంది. ఇలా, దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న జ‌గ‌న‌న్న‌ను.. మందుబాబులు మేమున్నామంటూ ఆదుకుంటున్నారు. ప్ర‌భుత్వా ఖ‌జానా నింపే బాధ్య‌త మాదంటూ తెగ తాగేస్తున్నారు. షాపులు త‌గ్గించినా.. ప‌నివేళ‌లు కుదించినా.. ప‌ర్మిట్ రూమ్‌లు ర‌ద్దు చేసినా.. బెల్టు షాపులు తీసేసినా.. ఊరూపేరు లేని ప‌నికిమాలిన బ్రాండ్లు అమ్ముతున్నా.. మందుబాబులు మంచి మ‌న‌సుతో జ‌గ‌న్ స‌ర్కారును ఉద్ద‌రిస్తున్నారు. ఉన్న షాపుల‌తోనే అడ్జ‌స్ట్ అవుతూ.. చేదు మందునే తాగేస్తూ.. క‌ష్ట‌న‌ష్టాల‌కు తాము ఓరుస్తూ.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి మాత్రం ఓదార్పు ఇస్తున్నారు.  మద్యం విక్రయాలను తగ్గించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. సర్కారు చెప్పేదాని ప్రకారం మద్యం అమ్మకాలతో పాటు ఆదాయమూ తగ్గాలి. అయితే ఆదాయం తగ్గకపోగా గతంలో కంటే ప్రతినెలా పెరుగుతూ పోతోంది. నెలకు రూ.1800 కోట్ల చొప్పున.. 6 నెలల్లోనే రూ.10,675 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ప్రతినెలా దాదాపు రూ.1800 కోట్లు ఇచ్చే రంగం మరొకటి లేదు. మ‌ద్యం ఆదాయంతోనే ప్ర‌భుత్వం మ‌నుగ‌డ సాగిస్తోందంటే న‌మ్మాల్సిందే. వైసీపీ సర్కారు పైకి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదు. షాపుల సంఖ్య భారీగా తగ్గించామంటూనే కొత్త బార్లకు, టూరిజం షాపులకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తోంది. మద్యపాన నియంత్రణ అంటూనే.. అమ్మకాలు పెంచాలంటూ టార్గెట్లు పెడుతుంది. గతంలో ఎక్సైజ్‌ స్టేషన్లకు అమ్మకాలపై టార్గెట్లు పెట్టేవారు. ఇప్పుడు షాపుల సూపర్‌ వైజర్లపై ఒత్తిడి పెడుతున్నారు. ఇక ప్ర‌భుత్వ‌ షాపుల్లో అమ్మకాలు పెంచడం కోసం ప్రభుత్వం పరోక్షంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. నాటుసారా తయారీపై వరుస దాడులు చేస్తోంది. ఇదంతా అక్రమాల నివారణ కోసం అన్నట్టుగా కనిపించినా.. షాపుల్లో మద్యం అమ్మకాలు పెంచ‌డం కోస‌మేన‌ని అంటున్నారు. ఇలా మందుబాబుల‌తో ప్ర‌భుత్వ మ‌ద్యం షాపుల్లో పూటుగా తాగించి.. నిండుగా ఖ‌జానా నింపుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం దూసుకుపోతోంది. అందుకు, మ‌ద్యంప్రియులు కూడా జ‌గ‌న‌న్న‌కు బాగా స‌హ‌క‌రిస్తున్నారు.  కొందరే టార్గెట్? ఇదీ జగనన్న సినిమా లెక్క..