జనాలకు జగన్ మరో షాక్.. ఈ బాదుడు మాములుగా లేదుగా! 

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో బాదుడుకు రంగం సిద్ధమవుతోంది.  పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం కోసం రవాణాశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. హరిత పన్నును రద్దు చేయాలని రవాణా రంగం ప్రతినిధులు కోరుతున్నారు.   ఖజానా ఖాళీ కావడంతో ఎక్కడెక్కడ పన్నులు వేయాలా అని ఆలోచిస్తున్న జగన్ సర్కార్ .. రవాణాశాఖ అధికారుల ప్రతిపాదనలను వెంటనే ఆమోదించే అవకాశాలున్నాయి. కొన్ని రోజులుగా జనాలపై భారాలు మోపుతూనే ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇంటి పన్నులు పెంచింది. చెత్తకు పన్ను వసూల్ చేస్తోంది. లిక్కర్ పైనా ట్యాక్సులు పెంచుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. దేశంలో పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్న టాప్ రాష్ట్రాల్లో ఏపీ ఉంది.  ఇటీవల ఎక్సైజ్ ట్యాక్ తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యాట్ తగ్గించాలని సూచించింది. కేంద్రం సూచనతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై కొంత వ్యాట్ తగ్గించాయి. కాని జగనన్న సర్కార్ మాత్రం పైసా కూడా తగ్గించలేదు. తాజాగా గ్రీన్ ట్యాక్స్ విధించాలని చూస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చమురు ధరలతోనే తమకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇంకా గ్రీన్ ట్యాక్స్ తో మరింత భారం పడుుతుందని గగ్గోలు పడుతున్నారు. 

అసెంబ్లీ ఆవరణలో లిక్కర్ సీసాలు.. సీఎం రాజీనామాకు డిమాండ్

అసెంబ్లీ అంటే అత్యంత భద్రత ఉండే ప్రాంతం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే సెక్యూరిటీ మరింత పెరుగుతుంది. సామాన్యులు అక్కడికి వెళ్లడం కుదరదు. అలాంటిది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ఇదే దారుణం అనుకుంటే.. మరో సంచలన విషయం కూడా ఉంది. ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలవుతోంది. అంటే మద్యపాన నిషేదం ఉన్న రాష్ట్రంలో. అసెంబ్లీ ఆవరణలో ఖాళీ లిక్కర్ బాటిల్స్ దొరకడం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది.  మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం రేపింది. మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన మరునాడే ఈ మద్యం సీసాలు వెలుగు చూశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. మద్యంపై రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధాన్ని ‘కంటితుడుపు’గా అభివర్ణించిన తేజస్వీయాదవ్.. నితీశ్ కుమార్ పోలీసులు మద్యం కొనే వినియోగదారులను మాత్రమే అరెస్ట్ చేస్తారని, అసలు దోషులైన లిక్కర్ మాఫియాపై కన్నెత్తి కూడా చూడరని మండిపడ్డారు.  అసెంబ్లీలోనూ నితీశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో మద్యం మాఫియాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాయి. అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు బయటపడడంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ కనుక అనుమతిస్తే ముఖ్యకార్యదర్శి, డీజీపీని దర్యాప్తు కోరుతామని అన్నారు. 

ప్రత్యేక హోదాను మరిచిపోవాలన్న కేంద్రం.. జగనన్న చేసేనా పోరాటం?

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యంత కీలక అంశం. విభజనతో నష్టపోయిన ఆంధ్రాకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందన్నది అందరి మాట. విభజన చట్టంలోనూ  ఏపీకి ప్రత్యేక హోదా  అంశం ఉంది. కాని ఏడున్నర ఏండ్లు అవుతున్నా ప్రత్యేక హోదా కలగానే మిగిలిపోయింది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను సాధిస్తామనే హామీతోనే ఎన్నికల ప్రచారం చేసింది. గెలిచి అధికారం చేపట్టింది. కాని హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది లేదు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదు వైసీపీ ఎంపీలు. తన కేసుల కోసం కేంద్రానికి ప్రత్యేక హోదాను జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రత్యేక హోదాపై మరో షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని స్పష్టం చేశారు.   విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి  చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు నిత్యానందరాయ్. 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించామని తెలిపారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుందని నిత్యానందరాయ్‌ తెలిపారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానంలో  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

ఈటల దెబ్బకు టీఆర్ఎస్ విలవిల! కరీంనగర్ మంత్రి ఆడియో లీక్ రచ్చ.. 

హుజురాబాద్ ఉప ఎన్నికలో అద్బుత విజయం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ ఓటమిని సీఎం కేసీఆర్ ఇంకా మరిచిపోకముందే మరో దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా కేసీఆర్ చెప్పుకునే కరీంనగర్ నుంచే మరో షాక్ ఇచ్చేందుకు ఈటల రాజేందర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈటల ఎత్తులతో గులాబీ పార్టీ ఆగమాగమవుతోందని తెలుస్తోంది.  రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు ఏకగ్రీవం కాగా... మిగితా ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. ఇందులో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు జరగనున్న ఎన్నిక రసవత్తరంగా మారింది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గులాబీ పార్టీకి హ్యాండిచ్చి... ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ డైరెక్షన్ లో రవీందర్ సింగ్ బరిలో నిలిచారు. హుజురాబాద్ తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు ఈటల వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార పార్టీకే ఎక్కువగా ఉన్నా రవీందర్ సింగ్ గెలుపు కోసం తనదైన శైలిలో  పావులు కదుపుతున్నారు ఈటల రాజేందర్. రవీందర్ సింగ్ కూడా కాంగ్రెస్ మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి మద్దతు కోరారు. ఈటల కూడా రవీందర్ సింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు రోజుకు రవీందర్ సింగ్ కు బలం పెరుగుతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ తమ సభ్యులను క్యాంపులకు తరలించినా.. ఆ పార్టీలో భయం కనిపిస్తోంది. క్యాంపులో ఉన్న సభ్యులు కూడా లోపాయకారిగా ఈటలతో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలు హడలిపోతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తేడా జరిగితే కేసీఆర్ ఆగ్రహిస్తారనే భయంతో పార్టీ సభ్యులను కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఎంపీటీసీతో ఫోన్ లో మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది.  పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు ఫోన్‌ చేసిన మంత్రి కొప్పుల ‘‘ ఏం వెంకటేశ్‌! అందర్ని జమ చేస్తున్నవట! అవతలి వాళ్లిచ్చే రూ. 50 వేలే కావాల్నా? మేమిచ్చేది అవసరం లేదా?’’ అంటూ ప్రశ్నించారు. తాను ఎవరినీ జమ చేయలేదని, తన వద్దకు వస్తే తీసుకోలేదని వెంకటేశ్వర్లు చెప్పగా, ‘‘అందరూ నీ పేరే చెప్తున్నరు. ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడు. వాళ్ల పేరు, వీళ్ల పేరు ఎందుకు చెప్పుతవ్‌? పైసలు కావాలంటే ఇప్పించేది మనమే. ఏం చేయాలన్నా చేసేది మనమే. వేరేటోడికి మంది ఉన్నరా? మనకు 900 మంది ఉన్నరు’’ అని మంత్రి కొప్పుల అన్నారు. అయితే తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి వద్దకూ వెళ్లలేదని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. దీంతో, ‘‘కొందరు పి.. కుంట్లోళ్లు ఉన్నరు. వాళ్లు పోతే పోనియ్యి. రఘువీర్‌సింగ్‌ అనేటోడు పి.. కుంట్లోడు. ఉంటే ఉంటడు.. పీకితే పీ కుతడు. పుట్ట మధు వాళ్లు ఈటల రాజేందర్‌తో పోతరు. నువ్వు కూడా పోతవా?’’ అని మంత్రి ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదని వెంకటేశ్‌ చెప్పగా.. ఎవరన్నా వస్తే తన వద్దకు తీసుకురావాలని మంత్రి అన్నారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. 

భారత్ లో పుట్టిన టీకాలేని మహమ్మారి.. ఏంటో తెలుసా? 

కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా మహమ్మారితో వైరస్ పేరు ప్రస్తుతం పాపులర్ అయింది. చైనా వైరస్ అంటూ కరోనాను పిలుస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా వైరస్ తో పోల్చుతూ మాట్లాడుతున్నారు. తాజాగా ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ట్విట్టర్ పోస్టు వైరల్ గా మారింది. భారత్ లో పుట్టిన టీకాలేని మహమ్మారి అంటూ ఆయన పెట్టిన పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.  ట్విట్టర్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఎంపికయ్యారు. ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు ఎంపికవడంపై ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు అది టీకాలేని ఇండియన్ వైరస్ అంటూ చలోక్తి విసిరారు. ‘‘ఇది భారత్ లో పుట్టిన మహమ్మారి. ఆ విషయం చెప్పేందుకు ఎంతో గర్విస్తున్నా. ఆ వైరస్ పేరు ‘ఇండియన్ సీఈవో వైరస్’. దానికి టీకా కూడా లేదు’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు.  స్ట్రైప్ అనే కంపెనీ సీఈవో పెట్టిన పోస్టుకు మహీంద్రా ఈ విధంగా బదులిచ్చారు. ‘‘గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబి, ఐబీఎం, పాలో ఆల్టో నెట్ వర్క్స్.. ఇప్పుడు ట్విట్టర్ సీఈవోలంతా భారతీయులే. టెక్నాలజీ ప్రపంచంలో భారతీయుల ఇంతటి విజయాన్ని చూడడం అద్భుతంగా ఉంది. అంతేగాకుండా వలసవచ్చేవారికి అమెరికా ఎన్ని అవకాశాలిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది’’ అంటూ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. దానికి బదులుగానే ఇది ఇండియన్ సీఈవో వైరస్ అంటూ ఆనంద్ మహీంద్ర రిప్లై ఇచ్చారు.

కవితకు పెద్దల సభ ఎందుకు మిస్సైంది? అమిత్ షా తో కేసీఆర్ డీల్ ఏంటీ? 

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా రెండో సారి ఎన్నికయ్యారు కల్వకుంట్ల కవిత. ఆమె ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక లేకుండానే ఏకగ్రీవమయ్యారు. అయితే కవిత రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే ముందు రాజకీయంగా కీలక పరిణామాలు జరిగాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లతో టీఆర్ఎస్ మొదట ఇచ్చిన జాబితాలో కవిత పేరు లేదు. నిజామాబాద్ ను పెండింగులో పెట్టారు. తర్వాత నిజామాబాద్ నుంచి ఆకుల లలితను ఖరారు చేశారని లీకు ఇచ్చారు. అంతకు కొన్ని రోజుల ముందే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపిక సందర్భంగా కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ను మండలి పంపించారు. బండా ప్రకాశ్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.  దీంతో ఆ స్థానాన్ని కవితకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని,  అందుకే ఆమెకు రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వ లేదని అంతా భావించారు.  కవితకు రాజ్యసభ సీటు ఖారరైందని గులాబీ లీడర్లు కూడా ఓపెన్ గానే ఈ విషయం చెప్పారు. కాని ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు మళ్లీ సీన్ మారింది. పెద్దల సభకు కాకుండా కవితను శాసనమండలికే పంపిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ లీడర్లు కూడా షాకయ్యారు. రాజ్యసభకు వెళ్లాల్సిన కవిత మళ్లీ మండలికే ఎందుకు వెళుతోంది, కేసీఆర్ నిర్ణయం ఎందుకు మారిందన్నది ఎవరికి అర్ధం కాలేదు. అయితే కవితను రాజ్యసభకు కాకుండా మండలికి పంపించడం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కీలక రాజకీయ పరిణామాలు జరిగాయంటున్నారు.  కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ తో పాటు కవిత కూడా ఉన్నారు. కేసీఆర్ సతీమణి శోభకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమెకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు జరిపించారు. దీంతో ఆమెకు తోడుగా కుటుంబ సభ్యులంతా కేసీఆర్ ఢిల్లీ నివాసంలో ఉన్నారు. ఈ సందర్భంగా కవిత రాజకీయ కార్యాచరణకు  సంబంధించి కేసీఆర్ నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయంటున్నారు. కవిత మొదటి నుంచి తెలంగాణ మంత్రివర్గంలో మంత్రి కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ను ఆమె ఆదే డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కవితను కేబినెట్ లోకి తీసుకుంటే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించిన కేసీఆర్.. ఆమెను రాజ్యసభకు పంపి బీజేపీ పెద్దలతో మాట్లాడి కేబినెట్ మంత్రిని చేయాలని చూశారట. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లిన కేసీఆర్.. కవిత కేబినెట్ బెర్త్ అంశంపై చర్చించారని తెలుస్తోంది. ఇద్దరు అరెస్సెస్ నేతల ద్వారా ఆయన ఈ లాబీయింగ్ చేశారంటున్నారు. కవితకు కేంద్ర కేబినెట్ లో సహాయమంత్రి అయినా ఇవ్వాలని కోరారట కేసీఆర్. అందుకు ప్రతిఫలంగా 2024లో కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారట. అయితే కేసీఆర్ అభ్యర్థనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం చెబుతామని చెప్పిన అమిత్ షా.. తర్వాత ఏ హామీ ఇవ్వలేదట. కవిత విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదనే సమాచారాన్ని కేసీఆర్ కు పంపించారట అమిత్ షా. దీంతో బీజేపీ పెద్దల నుంచి కేబినెట్ బెర్త్ పై హామీ లభించకపోవడంతో... కవితను రాజ్యసభకు కాకుండా శాసనమండలికే పంపాలని నిర్ణయించి.. అప్పటికప్పుడు ప్రకటించేశారట కేసీఆర్.  ఢిల్లీలో జరిగిన పరిణామాలతో కవిత కూడా షాకయ్యారని చెబుతున్నారు. అయితే మండలికి ఎన్నికయ్యాక రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటానని కేసీఆర్ చెప్పడంతో ఆమె కూల్ అయ్యారని తెలుస్తోంది. కవితను మండలికి పంపించడంతో ఆకుల లలితకు మరో కీలక పదవి ఇస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే తమకు ఇస్తారన్న సీటును చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసినా.. కవిత నామినేషన్ కార్యక్రమంలో ఉత్సాహంగానే పాల్గొన్నారని చెబుతున్నారు. మొత్తంగా పెద్దల సభకు వెళ్లాల్సిన కవిత.. బీజేపీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో మండలికి వచ్చిందని, ఆమె త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరుతుందనే ప్రచారం తెలంగాణ భవన్ లో చక్కర్లు కొడుతోంది.  

మహా పాదయాత్రకు నెల రోజులు.. అమరావతి రైతులకు అడుగడుగునా హరతులు..

‘ఒకటే రాష్ట్రం ... ఒకటే  రాజధాని’,  ‘ఆంధ్ర ప్రదేశ్  ఏకైక రాజధాని అమరావతి’ అనే నిదానాలతో అమరావతిని ఏకైక రాజధానిగా నిలుపుకోవాలన్న సంకల్పంతో’ నవంబర్ ఒకటిన, చేపట్టిన మహా పాదయాత్ర నెలరోజులు పూర్తి చేసుకుని రెండవ నెలలోకి ఎంటర్ అవుతోంది.  ఒక లక్ష్య సాధనకోసం ఊరువాడా కదిలి రావడం, ముఖ్యంగా మహిళలు ముందుండి పాదయాత్ర సాగించడం చరిత్రలో నిలిచి పోతుందని అంటున్నారు. కాగా, 30వ రోజుకు చేరిన రైతుల మహాపాదయాత్ర అన్ని ప్రాంతాలనూ కదిలిస్తోంది.అన్ని వర్గాలప్రజలను నడిపిస్తోంది. కాగా, ఈ ఉదయం నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి మొదలైన పాదయాత్రలో విశేషంగా అధిక సంఖ్యలో స్థానిక ప్రజల పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని నినాడంలో గొంతు కలిపారు. కాలు కలిపి కదం తొక్కారు.  'న్యాయస్థానం నుంచి దేవస్థానం'’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకూ నవంబర్ 1న మహా పాదయాత్రను చేపట్టారు. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర... డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళికను రూపొందించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాదిరిగా వైకాపా నేతల అందరిలోనూ మార్పు రావాలని అమరావతి రైతులు ఆకాంక్షించారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌... మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేశారు. కుల, మతాలకు అతీతంగా పాదయాత్రలో పాల్గొనేందుకు ప్రచార రథాలు వస్తునాయని... వాటిని పోలీసులు అడ్డుకోవటం దారుణమన్నారు. అమరావతి అందరిదని చాటేందుకు తూళ్లూరు నుంచి వస్తున్న రథాలను అడ్డుకోవడం మంచిది కాదని హెచ్చరించారు

ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ కిరికిరి.. యాసంగి రైతుకు దారేది? 

యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, ఒక్క గింజ వరి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనిగోలు చేయదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేశారు. అందుకు కారణం కూడా ఆయన అంత స్పష్టంగానూ చెప్పారు. కేంద్రం బాయిల్డ్‌ రైస్ కొనమని తెగేసి చెప్పింది. కాబట్టి, రాష్ట్రానికి కొనే ఆర్థిక స్థోమత, నిల్వ సామర్ధ్యం లేవు కాబట్టి, రాష్ట్రం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా చావు కబురు చల్లగా చెప్పారు.  నిజానికి ఇదే ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీ సాక్షిగా, వరి పంట విస్తీర్ణం 78లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు చేరినా, 225 లక్షల టన్నులున్న వరి పంట ఇంకా పెరిగినా, వరి పంటకు బ్రహ్మాండమైన ధర వస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. వరి పంటను ప్రోత్సహించాలని, సభాముఖంగా వ్యవసాయ మంత్రిని ఆదేశించారు. అంతే కాదు రాష్ట్రంలో వరి పంట ఇంకింత పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటుందని హామీ ఇచ్చారు. అయితే,అదే ముఖ్యమంత్రి అపరిచితుడిలా వేషం మార్చారో ఏమో కానీ, ఈ మధ్య కాలంలో ఆయన స్వరం మారి, చివరకు కేంద్రం కొంటేనే కొంటాం, అనే వరకు వచ్చారు. కేంద్ర చేతులు ఎత్తేసింది కాబట్టీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందని చెప్పుకొచ్చారు.   అయితే, ఇక్కడ తప్పు  కేంద్రానిదా? రాష్ట్రనిదా? అనే చర్చను పక్కన పెట్టి, ఇప్పుడు రైతు ముందున్న ప్రత్యాన్మాయం ఏమిటని ఆలోచిస్తే, శూన్యం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు  పండ్ల తోటల సాగుకు అవసరమైన పనిముట్లు ఇతర ఇంపుట్స్’పై ఇచ్చిన సుబ్సిడీలను ఎత్తివేసింది. పందాల్ తోటల సాగుకు మంగళం పాడింది. పత్తి.  మిర్చి, పప్పు ధాన్యాలు, ఎర్రజొన్నలు, మొక్కజొన్నలు,  పసుపు  ఏ పంటకు సరైన ధర రాక రైతులు  దగా పడ్డారు.ఇదే విషయాన్ని, ఈరోజు రేవంత్ రెడ్డి  ప్రభుత్వానికి గుర్తు చేశారు. నిజానికి, ప్రస్తుత పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నట్లుగా,  ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెరాస, బీజేపీ పార్టీలు కలిసి రైతులను మోసంచేస్తున్నాయి. రాజకీయ చదరంగంలో పావులుగా చేసి ఆడుకుంటున్నాయి అన్నది నిజం.  ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి  వ్యవసాయ పనిముట్లతో పాటు విత్తనాలు, మెట్టపంటలపై రాయితీ ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు వరి పండిస్తున్నారని అన్నారు.  ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని ప్రశ్నించారు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం కొనలేదా అని పేర్కొన్నారు. ధాన్యం కొనలేకపోతే వేల కోట్ల ప్రాజెక్టులెందుకు, రైతుబంధు ఎందుకని నిలదీశారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదని విమర్శించారు. పసుపు బోర్డుపై నిజామాబాద్ రైతులను బీజేపీ  మోసం చేసిందని... చక్కెర పరిశ్రమలను మూసివేసి కేసీఆర్‌ చెరకు రైతులకు నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే తోటలు, మెట్ట పంటలు లేకుండా పోయాయన్నారు. ఏ పంటను కొనకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడా ఇక్కడా అధికారంలో ఉన్న బీజేపీ, తెరాస రాజకీయ ప్రయోజనాలకోసం ఆడుతున్ననాటకంలో రైతులు బాలి పశువులు అవుతున్నారని పరిశీలకులు బావిస్తున్నారు.

ధాన్యం కొనకుంటే రైతు బంధు ఎందుకు? కేసీఆర్ ను నిలదీసిన రేవంత్ రెడ్డి 

వరి ధాన్యం కొనుగోలుపై  టీఆర్ఎస్, బీజేపీ  కలిసి నాటాకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం తన రైతు వ్యతిరేక బుద్ధిని మరోసారి చాటుకుందన్నారు. రైతుల సంక్షేమం గురించి కేసీఆర్‌ ఎందుకు ఆలోచించడం లేదని రేవంత్‌ మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని రేవంత్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా దిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. 750 మంది రైతుల చావుకు కారణం మోడీ ప్రభుత్వం అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీతో కుమ్మక్కై  టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరాడుతామంటున్న టీఆర్ఎస్ ఎంపీలంతా సభకు ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  రైతుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం కొనలేదా? ధాన్యం కొనలేకపోతే వేల కోట్ల ప్రాజెక్టులెందుకు, రైతుబంధు ఎందుకు? అని నిలదీశారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదన్నారు రేవంత్ రెడ్డి.  దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా?  పసుపు బోర్డుపై నిజామాబాద్‌ రైతులను బీజేపీ మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ చక్కెర పరిశ్రమలను మూసివేసి రైతులకు నష్టం చేశారని ఆరోపించారు. రైతులకు రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందట్లేదన్నారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే తోటలు, మెట్ట పంటలు లేకుండా పోయాయని పీసీసీ చీఫ్ విమర్శించారు. ఏ పంటను కొనకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?'' అని రేవంత్‌ రెడ్డి  ప్రశ్నించారు.

మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా? జగన్ కు తిరుగుబాటు భయమా ? 

డిసెంబర్ 6..కు ఒక ప్రత్యేకత వుంది. అందుకే ఆరోజు కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అవును,ఆ రోజుతో ఆంధ్ర ప్రదేశ్’లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు  పూర్తవుతాయి.  సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది.  వైసీపీ అదికారంలోకి వచ్చినా,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక విచిత్ర నిర్ణయంతో, కొద్ది మంది మినహా సీనియర్లకు అయన మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు.ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నా అందులో అనుభవం ఉన్న వారు ఒకక్రు లేరు. అలాగే మంత్రుల్లోనూ ఇకరిద్దరిని మినహాయిస్తే, ఎవరికీ పరిపాలన అనుభవం లేదు. అనుభవరాహిత్యంతో జరగ వలసిన అనర్ధాలు అనేకం జరిగి పోయాయి.  రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి అప్పుడే మాటిచ్చారు. ఇప్పుడు ఆ రెండున్నరేళ్ళ గడవు, డిసెంబర్ 6 తో ముగుస్తుంది. సో .. ఆశావహులు అంతా ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.   అయితే, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఉండక పోవచ్చని, విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక దశలో ముఖ్యమంత్రి, మొత్తానికి మొత్తంగానే మంత్రి వర్గాన్ని కట్టకట్టేస్తారని, పక్షాలన పూర్తి స్థాయిలో ఉంటుందని , పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి మనసు మారిందని అదే పార్టీ  వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మరో ఆరు నెలలు వాయిదా’ అన్న వార్త పార్టీ వర్గాల్లో షికార్లు చేస్తోంది. సో.. ఇప్పట్లో ఆశావహులకు తీపి కబురు అందే అవకాశం లేదని తెలుస్తోంది.  ఆర్థిక పతనం మొదలైందా..? ఏపీలో ఎమర్జెన్సీ తప్పదా?  మంత్రివర్గ మధ్యంతర పక్షాలన వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరున ఇటు మంత్రులను, అటు ఆశవహులను కంట్రోల్లో పెట్టుకోవడం కోసమే, మంత్రివర్గ పునర్వ్యవ్యవస్థీకరణ అస్త్రాన్ని అప్పుడప్పుడు బయటకు తీస్తుంటారని అంటున్నారు. మంత్రివర్గంలో అందరినీ మార్చి, కొత్త వారిని నియమిస్తారని... జగన్‌ సన్నిహిత బంధువైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గతంలో ధ్రువీకరించారు. ఇంకొందరు సీనియర్లు మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి అభీష్టమని వ్యాఖ్యానించారు. అయితే నిధుల లేమి, కరోనా కారణంగా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే రెండున్నరేళ్లు గడచిపోయాయన్న అభిప్రాయం మంత్రుల్లో నెలకొంది. కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన నేతను ఆశ్రయించి... కనీసం మరో ఆరు నెలలయినా తమను కొనసాగించేలా చూడాలని కోరారన్న ప్రచారం జరుగుతుంది.  జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా? మరో వంక ముఖ్యమంత్రి కూడా ఒక్కసారిగా కాకుండా,అంచెల వారీగా, ఏరివేతలు, అదేసమయంలో కొత్త వారికి అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే,  అసమ్మతిని అదుపులో ఉంచుకోవచ్చన్న వ్యూహంలో అంచలవారీ విస్తరణ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

సజ్జలకు షాక్.. ఉద్యోగుల గర్జన.. కాల్ మనీ డెత్.. టాప్ న్యూస్@1PM

వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ----- ఎన్టీఆర్‌ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్‌తో ఉద్యోగ సంఘం నేతలు భేటీ అయ్యారు. రూ.400 కోట్లు వర్శిటీ నిధులు ఏపీ ఫైనాన్స్ సర్వేసెస్ కార్పొరేషన్‌కు తరలింపునకు ఆదేశాలు జారీ చేయడంపై నిరసన తెలిపారు. ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ కూడా నష్టపోయేలా అధికారుల చర్యలు చేపట్టారు. దీంతో వర్శిటీ పెద్దల నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. --- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా ఖాళీ చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా రూ. 400 కోట్లు స్వాహా చేసిందని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎస్ఎఫ్ఎస్సీకి మళ్లించిందని ఆరోపించారు.సీఎం తన పాలనా వైఫల్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలిచేస్తారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ------ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జలను బాధితులు నిలదీశారు. భారీ వర్షాల కారణంగా  అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో సజ్జల  పర్యటించారు. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదని పులపుత్తూరు గ్రామస్థులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ----- రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. అల్లా, ఏసుక్రీస్తు వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసుల కాళ్లుపట్టుకుని బ్రతిమిలాడే పరిస్థితి కలిగింది. మరికొందరు రైతులు, నేతలు మాత్రం ఈ వ్యవహారంపై పోలీసు అధికారులను నిలదీశారు. కొన్ని వాహనాలు ముందు.. మరికొన్ని వాహనాలు వెనకగా యాత్ర సాగుతోంది.  -- కాల్‌మనీ వేధింపులు తాళలేక వీఆర్వో  ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్‌గా గుర్తించారు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం వీఆర్వో కొంత అప్పు చేశారు. వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. వారి చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. --- కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ తరగతుల సందర్భంగా జరిగిన గొడవకు తనకు సంబంధం లేదని తెలిపారు. గాంధీ భవన్‌లో ఉన్న పెద్దలు ముందుగా క్రమశిక్షణగా ఉండి తమకు క్రమశిక్షణ గురించి చెప్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని గతంలో చాలామంది తిట్టారని.. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ------ తె  లంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వడ్లు కొనే చేతకానప్పుడు అధికారం మీకెందుకని నిల‌దీశారు. 'కష్టాలొస్తే ఆదుకుంటారని రైతులు ఓట్లు వేసింది మీకు.. రైతుకు భరోసా ఇవ్వండని బాధ్యత ఇచ్చింది మీకు.. వాళ్లెవరో కొనట్లేదని మీరు కూడా రైతును నట్టేట ముంచితే ఎట్లా? బాధ్యత మీది కానప్పుడు పదవి మీకెందుకు? వడ్లు కొనే చేతకానప్పుడు అధికారం మీకెందుకు?' అని ష‌ర్మిల నిల‌దీశారు. ------ బస్సు డిపోలను మూసేస్తున్నారని, భూములు అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అలాంటి ఆలచన ఆర్టీసీ యాజమాన్యానికి లేదని స్పష్టం చేశారు. కాగా ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. --- మహారాష్ట్ర కేబినెట్ మంత్రి,ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పై ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ రూ.1000 కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది.ఈ పరువు నష్టం దావాపై రిప్లై దాఖలు చేసేందుకు మంత్రి నవాబ్ మాలిక్, మరో ఏడుగురికి బాంబే హైకోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది. జులై 1, 4వతేదీల మధ్య బ్యాంకుకు వ్యతిరేకంగా నిరాధారమైన, దిగ్భ్రాంతికరమైన  పరువు నష్టం కలిగించే ప్రకటనలతో కూడిన హోర్డింగ్‌లు ముంబైలోని రద్దీ కూడళ్లలో ఉంచారు. 

కృష్ణా జిల్లాలో కాల్ మనీ కలకలం.. మాఫియా వేధింపులతో వీఆర్వో సూసైడ్.. 

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది. అధిక వడ్డీలు వసూల్ చేస్తూ జనం నడ్డి విరుస్తోంది. అప్పులు చెల్లించడం లేదంటూ వేధింపులకు దిగుతోంది కాల్ మనీ మాఫియా. దీంతో వేధింపులు భరించలేక కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా కాల్‌మనీ వేధింపులు తాళలేక వీఆర్వో  ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్‌గా గుర్తించారు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్తానికులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం గౌస్ కొండపల్లి గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం వీఆర్వో కొంత అప్పు చేశారు. వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. వారి చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని గౌస్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని  పోలీసులకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఆర్థిక పతనం మొదలైందా..? ఏపీలో ఎమర్జెన్సీ తప్పదా? 

ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పతనం మొదలైపోయిందా..? అంటే రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలు అవుననే సూచనలు స్పష్టం  చేస్తున్నాయి. రాష్ట్ర ఖజానాలో సొమ్మంతా ఇష్టం వచ్చినట్లు వాడేసిన వైసీపీ సర్కార్..  పలు శాఖలు, సంస్థల్లో ఉన్న సొమ్మంతా దోచుకుపోతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పరిమితికి మించి అప్పులు చేసిన సర్కార్కు మరి ఇంకెక్కడా రుణం దొరకని స్థితి దాపురించింది. ఒక పక్కన కేంద్రం, మరో పక్కన రిజర్వు బ్యాంకు కూడా ఏపీ ఆర్థిక మంత్రి దేబిరింపుల్ని పరిగణనలోకి తీసుకోవడం మానేశాయి. మరో పక్కన వివిధ సంస్థలకు జగన్ రెడ్డి సర్కార్ చెల్లించాల్సిన బకాయిల కోసం ఆయా సంస్థల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. పేరుకుపోయిన బకాయిలు వెంటనే చెల్లించకపోతే నోటీసులు ఇచ్చేందుకు, సేవలు నిలిపేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధం అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి యుద్ధ ప్రాతిపదికపై నోటీసులు ఇవ్వాలని డిస్కంలకు ఏపీఈఆర్సీ లేఖ రాసింది. 15 వేల కోట్ల రూపాయల చిల్లర బాకీలు వసూలు చెయ్యకపోతే, రెండు వారాల తరువాత కరెంటు సరఫరా కట్ చెయ్యమని కూడా హెచ్చరించింది. మరో పక్కన అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ ఏకంగా ఏపీ ప్రభుత్వానికి రెడ్ కార్నర్  వార్నింగ్ నోటీస్ జారీ చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాల సరఫరాకు సంబంధించిన బాకీలను జగన్ రెడ్డి సర్కార్ కట్టకుండా తాత్సారం చేస్తోంది. దీంతో నూరు శాతం డబ్బులు ముందుగానే కడితే గాని ఏపీకి పరికరాలు ఇవ్వొద్దని మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ స్పష్టం చేసింది. విద్యుత్, వైద్య రంగాలు ఆర్థికంగా పతనం కావడానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. అటు చూస్తే  తీసుకొనే అప్పు పరిమితిని పెంచడానికి కేంద్రం కుదరదని తెగేసి చెప్పేసింది. కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ సర్కార్ పెద్దమొత్తంలో చెల్లించాల్సిన తక్షణ ఆవశ్యకత నెలకొంది. ఖజానాలో నిల్వలు లేకపోవడం, డబ్బుల వచ్చే దారులన్నీ మూసుకుపోవడంతో ఏమీ పాలుపోని సంకట స్థితిలో ఢిల్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. చివరి అంకంలో భాగంగా.. దింపుడుకళ్లం ఆశలతో ‘యువతను అంబానీలను చేస్తా’ అనే బడాయి గౌతంరెడ్డిని ఏదో పొడుస్తాడని హస్తిన పంపినట్లున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి అవుట్.. వీర్రాజుకు బ్రేక్! అమిత్ షా డైరెక్షన్ లో బీజేపీ న్యూ టీమ్.. ఏపీలో పైసా ఆదాయాన్ని పెంచకుండా.. పన్నులు పెంచి పెంచి.. జనం తిరగబడే స్థితికి తెచ్చుకుంది జగన్ సర్కార్. అయినప్పటికీ తనకింకా ప్రజాభిమానం ఉందని, అధికార జులుం వాడి, ఫోర్జరీలతో నిధులు విత్ డ్రాలు చేసి, బెదిరింపులతో లొంగదీసుకొని, దొంగ ఓట్లు వేయించుకుని, రోడ్ల మీదకు వచ్చిన బాధితులపై లాఠీఛార్జీలు చేసి భయపెట్టి, నిత్యం సమీక్షా సమావేశాలు నెపంతో జగన్ సర్కార్ చేసే కాలక్షేపం కథ కంచికి చేరే పరిస్థితులు చివరి అంకానికి వచ్చాయని జనం అంటున్నారు. ఆంధ్రా ఆర్థిక పతనం గురించి ఎకనామిక్ టైమ్స్ వార్త ద్వారా యావద్దేశానికీ తెలుసు. అయితే.. తెలియనట్లు కొందరు నటిస్తున్నారంతే. ఆర్థిక పతనం నుంచి ఏపీ సర్కార్ ఎలా బయట పడుతుందనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం.  జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా? జగన్ సర్కార్ ఎక్కడికక్కడ ఆస్తుల్ని హోల్ సేల్గా అమ్మాలంటే ఆంధ్రా దివాళా తీసిందని కోర్టు ముందు ఒప్పుకోవాలి. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశం. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎందుకు దాపురించాయి? మీరు చక్కదిద్దుతారా? లేదా ఆర్థిక ఎమెర్జెన్సీ కోసం రాష్ట్రపతికి అధికారికంగా నివేదించండి అని కేంద్రం సలహా ఇవ్వవచ్చు. ఒక వేళ ఏపీ ఇలాగే కొనసాగాలంటే విద్య, వైద్య, ఆర్టీసీ, రోడ్లు & భవనాలు, ఏపీఐఐసీ ఇలా అన్ని సంస్థల ఆస్తుల్ని వేలం వేసే ప్రక్రియ మొదలెట్టినా అగ్రిగోల్డ్ తరహాలో కొన్నేళ్లు పడుతుంది. అంతవరకు అప్పు ఇచ్చిన వారు ఎందుకు వేచి ఉంటారు? దాంతో అన్ని రత్నాలకు జగన్ సర్కార్ మంగళం పాడాల్సి ఉంటుంది. ఉద్యోగులు జీతాల నుండి కొంత తగ్గించుకోవాలని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించే ధైర్యం జగన్ రెడ్డికి లేదు. అద్భుతాలు జరగవు. జనం వాస్తవాలు అంగీకరించక తప్పదు. తమ తప్పుడు నిర్ణయాలకు ప్రాయశ్చిత్తంగా, నవరత్నాలే కాదు, చాలా త్యాగాలు చెయ్యక తప్పదు. అనివార్యమైన ఆర్థిక పతనం స్థితికి మానసికంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధం కాక తప్పకపోవచ్చు.

జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా?

జస్టిస్ కనగరాజ్.. తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి. జగన్ ప్రభుత్వం గతంలో హడావుడిగా ఆయన కీలక పోస్టు కట్టబెట్టింది. అప్పటి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి.. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమించింది. అయితే నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లడంతో ఆయన పదవికి ఎసరొచ్చింది.  ఎస్ఈసీ పోస్టు అయినా తమకు ఉపయోగపడ్డారనే కారణంతో ఆయనను ఏదో ఒక పోస్టులో నియమించాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. జస్టిస్ కనగరాజ్‌కు ఎలాగైనా పదవి ఇవ్వాలని  పట్టుదలగా ఉన్న జగన్.. ఎస్‌ఈసీ  తర్వాత పోలీస్ కంప్లైంట్‌ అథారిటీకి చైర్మన్‌గా పదవి ఇచ్చారు. అయితే రెండో పదవి కూడా కోర్టులో నిలబడలేదు. తాజాగా  ఓ కమిటీలో సభ్యుడిగా కనగరాజ్ కు  పదవి ఇచ్చింది జగన్ సర్కార్. పీడీ చట్టం అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం అమలుకు ప్రతిరాష్ట్రంలో ఓ సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలిని ప్రభుత్వం నియమించింది. అందులో ప్రధానమైన పదవి చైర్మన్ ను కనగరాజ్‌కు ఇవ్వలేదు. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం ఉమ్మడి హైకోర్టులో పని చేసి రిటైరన జస్టిస్ సంజీవరెడ్డి అనే 85 ఏళ్ల పెద్దాయనకు చైర్మన్ పదవి ఇచ్చారు. సభ్యుడిగా మాత్రం కనగరాజ్‌కు చాన్సిచ్చారు.  జస్టిస్ కనగరాజ్‌ తమకు ఉపయోగపడ్డారు కాబట్టి ఆయనకు ఏమైనా చేయకపోతే ఉపయోగించుకుని వదిలేశామన్న ఆరోపణలు వస్తాయని జగన్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అందుకే కనగరాజ్ కు ఏదో ఓ పదవిని వెదికి మరీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇచ్చిన మూడో  పదవి అయినా నిలబడుతుందో లేదో చెప్పడం కష్టమే. పీడీ యాక్ట్ సలహా మండలి అంటే… ముందస్తుగా ఎవర్ని నిర్బంధం లోకి తీసుకోవాలని సలహా ఇచ్చే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో 80 ఏళ్లు పైబడిన వారికి పదవులు ఇవ్వొచ్చో లేదో స్పష్టత లేదు. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తేనే కనగరాజ్‌కు ఈ పదవి కూడా ఉంటుందా.. ఊడుతుందా అనేది తేలుతుంది. చూడాలి మరీ జస్టిస్ కనగరాజ్ కు మూడో పదవి మూడు రోజుల ముచ్చటగానే ఉంటుంగా లేక నిలబడుతుందా... 

విష్ణువర్ధన్ రెడ్డి అవుట్.. వీర్రాజుకు బ్రేక్! అమిత్ షా డైరెక్షన్ లో బీజేపీ న్యూ టీమ్..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉందా? సోము వీర్రాజు కోటరీతో పార్టీకి నష్టం కల్గుతుందని గుర్తించిందా? ఏపీ బీజేపీలో ప్రక్షాళన ప్రారంభమైందా? అంటే పార్టీ అధిష్టానం తీసుకుంటున్నతాజా నిర్ణయాలతో అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ బీజేపీకి కొత్త కోర్ కమిటీని ప్రకటించింది హైకమాండ్. తాజా కమిటీతో సోము వీర్రాజుకు బ్రేకులు వేయడంతో పాటు ఆయన టీమ్ కు చెక్ పడినట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీలో జగన్ టీమ్ గా ముద్ర పడిన నేతలను హైకమాండ్ పూర్తిగా దూరం పెట్టిందని తెలుస్తోంది. ఏపీ బీజేపీ కోర్ కమిటీలో పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి పేరు లేకపోవడం చర్చగా మారింది. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు తర్వాత అంతా తానే అన్నట్లుగా వ్యవహరించే విష్ణును ఎంపిక చేయకపోవడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.  పార్టీ చీఫ్ గా నియామకమయ్యాకా మొదట సోము వీర్రాజు దూకుడుగా వెళ్లారు. సస్పెషన్లు.., టీవీచానళ్ల బహిష్కరణల నిర్ణయాన్ని అలవోకగా  తీసుకున్నారు.  ఆయనకు ఇప్పుడు పదవి మిగిలింది కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేసింది హైకమాండ్. కొత్తగా కోర్ కమిటీని బీజేపీ హైకమాండ్ నియమించింది. అందులో  టీడీపీ సానుభూతిపరులుగా పేరు తెచ్చుకున్న వారికీ ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.  జేపీ నడ్డా తాజాగా ప్రకటించిన కోర్ కమిటీలో సోము వీర్రాజుతో  పాటు కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరి, సత్యకుమార్‌ , సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, మధుకర్‌, ఎమ్మెల్సీ మాధవ్‌ వంటి వారు ఉన్నారు.  మీ వల్లే వరదలు.. మీ పరిహారం మాకొద్దు.. సజ్జలకు షాకిచ్చిన వరద బాధితులు  ఇంతకు ముందు కూడా ఏపీ బీజేపీకి ఓ కోర్ కమిటీ ఉంది. కానీ దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నిర్ణయాలను సోము వీర్రాజు తనకు నచ్చిన వారితో సమావేశమై తీసుకునేవారు. టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలను అసలు పిలిచేవారు కాదు. పట్టించుకునేవారు కాదు. టీడీపీ నుంచి నేతలను టీడీపీ సానుభూతి పరులని.. ఓ సామాజికవర్గం వారని చెప్పి దూరంగా ఉంచుతూ వచ్చారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వారంతా వైసీపీ సానుభూతిపరులుగా గుర్తింపు పొందారు. వీళ్లు అధికారంలో ఉన్న వైసీపీని వదిలేసి టీడీపీని విమర్శిస్తూ ఉంటారు. ఈ పరిణామాలపై అమిత్ షాకు పూర్తి నివేదిక అందిందట.ఇటీవల తిరుపతిలో అమిత్ షా నిర్వహించిన సమావేశంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయని అంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలను దూరం పెట్టడంపై సోము వీర్రాజుపై  అమిత్ షా అక్షింతలు వేసినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో కొత్త, పాత ఉండదని, అందరిని కలుపుకునిపోవాలని ఆదేశించారట. అంతేకాదు ఏపీ బీజేపీ పరిణామాలపై నడ్డాకు సూచనలు చేశారట అమిత్ షా.  అమిత్ షా ఆదేశాలతో ఏపీ కొత్త కోర్ కమిటిని నియమించారు జేపీ నడ్డా. ఈ కమిటీలో దూకుడు రాజకీయాలు చేసే విష్ణువర్ధన్ రెడ్డి లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి విష్ణుపై వైసీపీ సానుభూతి పరుడనే టాక్ ఉంది. ప్రతి విషయంలోనూ అధికార పార్టీని టార్గెట్ చేయకుండా ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు చేస్తారని విష్ణుపై ఆరోపణలు ఉన్నాయి. సీఎం జగన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మీడియా డిస్కషన్లలో మాట్లాడుతారనే ఆరోపణలు ఉన్నాయి. విష్ణు తీరుపై అమిత్ షాకు కొందరు నేతలుఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అందుకే ఆయన్ను కోర్ కమిటిలో తీసుకోలేదని తెలుస్తోంది.  విష్ణును పక్కన పెట్టడం ద్వారా.. జగన్ కు, వైసీపీకి అనుకూలంగా ఉంటున్న నేతలకు పార్టీ హైకమాండ్ వార్నింగ్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ సాగుతోంది. అంతేకాదు ఇకపై వైసీపీపై దూకుడుగా వెళ్లాలనే సంకేతం ఏపీ నేతలకు ఇచ్చిందని అంటున్నారు. మొత్తంగా కొత్త కోర్ కమిటీతో ఇప్పటి వరకూ వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించిన ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఇక ముందు కాస్తంత మార్పు వచ్చే అవకాశం మాత్రం ఉందని అంటున్నారు. 

ఆస్తి కోసం కొడుకు వేధింపులు.. ప్రభుత్వానికి రాసిచ్చిన తండ్రి

కుటుంబాల్లో ఆస్తి గొడవలు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో కొడుకులకు ఘర్షణలు జరుగుతున్నాయి.  కొడుకుల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు రోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం తల్లిదండ్రులను, సోదరులను చంపేస్తున్న కిరాతకులు కూడా ఉంటున్నారు.  ఇటీవలే డిశాకు చెందిన ఓ మహిళ ఇటీవల తన ఆస్తి మొత్తాన్ని కుమారులకు కాకుండా ఓ రిక్షా కార్మికుడికి రాసిచ్చేసింది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. కుమారుడితో విభేదాల కారణంగా 83 ఏళ్ల తండ్రి తన రూ. 2.5 కోట్ల స్థిరాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చేశారు. ఆగ్రాకు చెందిన గణేశ్ శంకర్ పాండే పొగాకు వ్యాపారి. ఆయన పెద్ద కుమారుడు దిగ్విజయ్.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రితోనే ఉంటున్నారు.  ఆస్తిని తన పేర బదిలీ చేయాలంటూ తండ్రిని రోజూ వేధింపులకు గురిచేసేవాడు. తండ్రిని ఎప్పుడూ గౌరవించకపోగా, ఆస్తి తన పేర రాసివ్వాలంటూ ఇబ్బంది పెట్టేవాడు.  ఆస్తి సంగతిని పక్కనపెట్టి ఏళ్ల తరబడి తాను కష్టపడి అభివృద్ధి చేసిన వ్యాపారంపై దృష్టిసారించాలని గణేశ్ పాండే కుమారుడికి హితవు పలికారు. అయితే, అతడు ఆ విషయాన్ని పక్కనపెట్టి ఆస్తిని దక్కించుకునేందుకు ప్రయత్నించాడు.  కుమారుడి తీరుపై కలత చెందిన గణేశ్ పాండే తన ఆస్తి మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆస్తిని ప్రభుత్వం పేర రాయించి అందుకు సంబంధించిన పత్రాలను నగర కలెక్టర్ ప్రతిపాల్ సింగ్‌కు అప్పగించారు. తాను మరణించిన తర్వాత ఈ ఆస్తిని ప్రభుత్వం వినియోగించుకోవాలని ఆ పత్రాల్లో పేర్కొన్నారు గణేశ్ పాండే. తాను జీవించడానికి అవసరమైన ధనం తన వద్ద ఉందని చెప్పారు.  గణేశ్ శంకర్ పాండే తన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి 1983లో 1000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో నలుగురూ కలిసి ఇల్లు కట్టుకున్నారు. అందరూ కలిసి అదే ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరస్పర అంగీకారంతో ఆస్తిని నాలుగు భాగాలుగా విభజించారు.ప్రస్తుత ధర ప్రకారం ఈ ఆస్తి విలువ కోట్లలో ఉంటుందని కలెక్టర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్.సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయమై గణేశ్  పాండేతో చర్చిస్తామన్నారు. ఆయనకు సాయం చేస్తామని చెప్పారు. గణేశ్ కనుక ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజెన్స్ చట్టం కింద కుమారుడిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన ఒడిశాలో సంచలనంగా మారింది. 

మీ వల్లే వరదలు.. మీ పరిహారం మాకొద్దు.. సజ్జలకు షాకిచ్చిన వరద బాధితులు 

ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. వారం రోజులుగా కొన్ని గ్రామాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరద సహాయక చర్యల్లో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. వరదల సమయంలో ఎవరూ తమకు అండగా నిలవలేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని బాధితులు మండిపడుతున్నారు. తీరిగ్గా ఇప్పుడు వెళుతున్న వైసీపీ ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జనాలు. తాజాగా సీఎం జగన్ అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జలను బాధితులు నిలదీశారు. భారీ వర్షాల కారణంగా  అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో సజ్జల  పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆయనకు నిరసన వ్యక్తమైంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదని పులపుత్తూరు గ్రామస్థులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా? వరదల సమయంలో ఎవరూ తమ దగ్గరకు రాలేదని, రెండు, మూడు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వరదల్లోనో ఉన్నామని కొందరు బాధితులు ఆవేశంగా చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగాకా ఇప్పుడొస్తే ఏం లాభమని మరికొందరు మండిపడ్డారు. వరద బాధితుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన సజ్జల.. వాళ్లన సముదాయించే ప్రయత్నం చేశారు. ఒక ఏడాదిలో నమోదు కావాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతోనే జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సర్వే చేసి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఇళ్లను పూర్తిగా కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లను నిర్మించి ఇస్తామని  హామీ ఇచ్చారు.

దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా? 

సోమవారం తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న వరి కొనుగోళ్లు సహా ప్రభుత్వ పథకాలపై చర్చించింది. కేబినెట్ సమావేశంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకంపైనా చర్చ జరుగుతుందని అంతా భావించారు. రాష్ట్రంలోని దళితులంతా సీఎం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూశారు. నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించి దాన్ని మర్చిపోయారు  కేసీఆర్. నెల రోజుల ఆలస్యంగా డిసెంబర్ లోనైనా అమలు చేస్తారని భావించారు. కాని దళితుల ఆశలు అడియాశలయ్యాయి. మంత్రివర్గ సమావేశం ముగిశాకా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ నోటి నుంచి దళిత బంధు అనే పదమే రాలేదు. దీంతో లక్షలాది మంది దళితులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దళిత బంధు... హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త పథకం. దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించే స్కీమ్ అది. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో చేపట్టిన ప్రభుత్వం.. ఆ నియోజకవర్గంలోని దాదాపు 20 వేల కుటుంబాలను ఎంపిక చేసింది. వాళ్ల అకౌంట్లలో 10 లక్షల రూపాయల జమ చేసింది. కాని లబ్దిదారులకు అందించలేదు. నిధులు జమ చేసిన అకౌంట్లను ఫ్రీజ్ చేసింది ప్రభుత్వం. దీంతో తమ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయని మురిసిపోవడమే హుజురాబాద్ దళితుల వంతైంది. ఎప్పుడెప్పుడు తాము ఎంపిక చేసుకున్న యూనిట్లను సర్కార్ అందిస్తుందా అని దళిత బంధు లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు.  హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు ఈ పథకాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు పేరుతో డ్రామా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. హుజురాబాద్ లో దాదాపు 45 వేల దళిత ఓటర్లు ఉండటంతో.. వాళ్ల ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకే ఈ స్కీమ్ తెచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం దళిత బంధు హుజురాబాద్ కే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలను ఉన్నాయని.. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతేకాదు దళిత ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగా  కొన్ని రోజుల పాటు దళిత బంధు అమలును ఎన్నికల సంఘం ఆపేసింది. దీంతో ఎన్నికల సంఘంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం నవంబర్ 4వరకు మాత్రమే పథకాన్ని ఆపగలదని, తర్వాత దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ బ్రేకులు వేస్తారని సవాల్ చేశారు. నవంబర్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేస్తామని తెలిపారు. హుజురాబాద్ తో పాటు ఖమ్మం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, జుక్కల్ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితులందరికి 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే నవంబర్ 4వ తారీఖు ముగిసి నెల రోజులు కావొస్తోంది. కాని దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్ సర్కార్. నవంబర్ 4 తర్వాత పథకం అమలు కాకుండా ఎవరూ ఆపుతారే చూస్తానంటూ ప్రకటనలు చేసిన కేసీఆరే.. స్కీమ్ ను పట్టించుకోవడం మానేశారు. రోజులు గడుస్తున్నా దళిత బంధుపై ముందడుగు పడకపోవడంతో దళితులు ఆగ్రహంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూ పంపిణి లాగే దళిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అటకెక్కించదనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే కేబినెట్ సమావేశంలో దళిత బంధు ప్రస్తావనే రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదంటే దళిత బంధును ఆపేయాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

బీజేపీ హంతక పార్టీ..కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మ! 

కేంద్ర ప్రభుత్వంలో మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.గత రెండేళ్లలో దేశంలో భయంకరంగా పేదరికం పెరిగిందని చెప్పారు. కేంద్రం పవర్ రిఫామ్స్‌ పేరుతో రాష్ట్రం మెడమీద కత్తి పెడుతోందని తెలిపారు. ప్రతి బోర్‌ దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిందని పేర్కొన్నారు. కేంద్రం దుష్టా పాలనతో దేశంలో ఆకలి కేకలు పెరిగాయన్నారు. 750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.  దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా?  యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. బాయిల్డ్‌ రైస్ కొనమని కేంద్రం చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని నమ్ముకుంటే సర్వనాశనం కావ్వాల్సిందేనన్నారు. మత చిచ్చు పెట్టి దేశ సమగ్రతను దెబ్బతీస్తారని చెప్పారు. దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్లలో బీజేపీ ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలన్నారు. రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని వ్యాఖ్యానించారు. కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్‌ రైస్ కొనించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. వరి విషయంలో కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100శాతం ముంచుతుందని కేసీఆర్ ఆరోపించారు.