అగ్నిపర్వతం హిమాలయాన్నేమీ చేయలేదు..తమిళిసై
posted on Nov 7, 2022 @ 9:58AM
తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై మళ్లీ ఆగ్రహించారు. తాము తమిళులమని భావించుకునే వారు అసలుసిసలు తమిళుల వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. డిఎంకె పత్రిక మురసొలి లో ఆమె పై వచ్చిన వ్యాసం పై తమిళిసై స్పందించారు. తనను అగ్నిపర్వతంగా ప్రచారం చేసుకుం టున్న పార్టీ హిమాలయాన్నేమీ చేయలేదని అన్నారు. వాస్తవాలు మింగుడుపడనివారు, నిజాలు మాట్లాడని వారే భయానికి లోనవుతుంటారని, డీఎంకె కి మోదీ ఫోబియా పట్టుకుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలించే విధంగా, సహాయసహకారాలు అందించేవిధంగా పనిచేయాలని లేకుంటే తెలంగాణా గవర్నర్ తమిళిసై పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని డిఎంకే తమిళనాడు గవర్న ర్ను హెచ్చరించింది. గవర్నర్లు తమ తప్పులు తెలుసుకుని వ్యవహరించాలని, అందుకు గొప్ప ఉదాహ రణ తమిళిసై అంటూ డిఎంకె అధికార పత్రిక మునసోలీలో ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ విధంగా గవర్నర్ వ్యవస్థను హెచ్చరించచడం, అవమానించడంపై తమిళిసై మండిపడ్డారు. పిరికివారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారన్నారు. గవర్నర్ వ్యవస్థ గురించి డిఎంకె ఆ విధంగా వ్యాఖ్యానించడం ఎంత వరకూ సబబు అని తమిళ రాజకీయ పరిశీల కులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో తెలంగాణా ప్రభుత్వంతో కూడా తమిళిసై విభేదించారు. రాజ్ భవన్, తెలంగాణ సర్కార్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. నెలరోజుల తర్వాత హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా కలిసినపుడు మాట్లాడుకున్నారు. కానీ విబేదాలు మాత్రం కొనసాగి తనను కేసీఆర్ సర్కార్ అవమా నిస్తోందని ప్రకటనలూ చేశారు. ఇదే పరిస్థితుల్లో ఆమె గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేశారు.
తనది ఎవరికి భయపడే స్వభావం కాదన్న తమిళి సై... తనను ఎవరూ తక్కువగా చేసి చూసినా సహించ నని చెప్పారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిం చారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందన్నారు.ప్రభుత్వం చాలాసార్లు కావాలని ఇబ్బంది పెట్టినా తాను భయపడలేదని గవర్నర్ తమిళి సై తెలిపారు. తనపై ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.
గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. గవర్నర్ కార్యాలయం అయిన రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిందన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు