విధ్వంసం రచయితను సన్మానించిన కేశినేని చిన్ని
posted on Feb 16, 2024 8:05AM
సీనియర జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ ను విజయవాడ పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ నాయకుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సన్మానించారు. 2019 నుంచి 2024 వరకు ఎపి రాజకీయాలు, రాష్ట్రంలో జరిగిన దారుణ సంఘటనలు, దాడులపై.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై, అమరావతి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఓ జర్నలిస్ట్ వ్యాఖ్యగా సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ గారు రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ గురువారం (ఫిబ్రవరి 15) విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభలో కేశినేని చిన్ని ప్రసంగిస్తూ.. జగన్ అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తన అనాలోచిత నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ ను ఇటు సంక్షేమంలో ...అటు అభివృద్దిలో అంథకారంలోకి నెట్టేశారని విమర్శించార. ఈ నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఇబ్బంది పడని వారంటూ ఎవరూ లేరనీ, మూడు రాజధానులంటూ అమరావతి రైతులను రోడ్డెక్కించారు, దళితులపై జరిగిన ఆకృత్యాలు... చేసిన అఘాయిత్యాలకు అయితే లెక్కే లేదన్నారు.
ఎపి లో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన అలాంటి సంఘటనలకు అక్షర రూపం...ఆలపాటి సురేష్ కుమార్ గారు రాసిన ఈ విధ్వంసం పుస్తకమన్నారు.. ఈ పుస్తకం కవర్ పేజీ చూస్తేనే జగన్ పాలన ఎలా సాగిందో..ఎంత దుర్మార్గ పూరిత ఆలోచనలు చేశారో అర్ధమవుతుందని కేశినేని శి చిన్న గారు అన్నారు.
ఈ పుస్తకాన్ని రచయిత ఆలపాటి సురేష్ కుమార్ అమరావతి మహిళలకు అంకితమిచ్చి వారి గౌరవం పెరిగేలా చేశారని వ్యాఖ్యానించారు. ఈ విధ్వంసం పుస్తకాన్ని రచయిత ఆలపాటి గారు 572 పేజీల్లో ముగించారు. జగన్ పాలనలో అవినీతి గురించి ఎన్ని పేజీలు రాసినా సరిపోదన్నారు.
ఆ పుస్తకావిష్కరణ సభకు విశాలాంధ్ర ఎడిటర్ ఆర్.వి.రామారావు అధ్యక్షత వహించారు.ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ తొలి ప్రతిని అందుకున్నారు. ఇంకా విశిష్ట అతిధులుగా సిపిఐ రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు ఏ.శివారెడ్డి, అమరావతి బహుజన జె.ఎ.సి అధ్యక్షులు పోతుల బాల కోటయ్య హాజరై ప్రసంగించారు..