తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ
posted on Jun 4, 2024 @ 11:38AM
తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో ఆధిక్యతలు అందుబాటులోక వచ్చాయి. కాంగ్రెస్ 8 లోక్ సభ స్థానాలలో, బీజేపీ 7 లోక్ సభ స్థానాలలో ఆధిక్యతలో ఉండగా ఎంఐఎం, బీఆర్ఎస్ లు ఒక్కొక్క స్థానంలో ఆధిక్యత కనబరుస్తున్నాయి.
కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న స్థానాలు జహీరాబాద్, నాగర్ కర్నూల్ , నల్గొండ, వరంగల్, మహబూబా బాద్, ఖమ్మం, పెద్దపల్లి , భువనగిరి. ఇక బీజేపీ ఆధిక్యతలో ఉన్న స్థానాలు అదిలాబాద్, కరీం నగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్. బీఆర్ఎస్ మెదక్ లోక్ సభ స్థానంలోనూ, ఎంఐఎం హైదరాబాద్ లోనూ ఆధిక్యతలో ఉన్నాయి.