cease fire just a break

కాల్పుల విరమణ కాదు.. విరామం మాత్రమే.. ప్రధాని మోడీ

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలపై ప్రధాని మోడీ జాతి నుద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రస్ధావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసిన అనంతరం పాక్ ప్రతీకార దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా తాను మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపేశానంటూ తన భుజాలు తానే చరుచుకుని తనను తానే అభినందించేసుకుంది. మరో వైపు హఠాత్తుగా, బేషరతుగా భారత్ పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అప్పటి వరకూ నమో జపంతో ఊగిపోయిన దేశంలో ఒక్కసారిగా మోడీపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే ముందు అఖిలపక్ష నేతలను విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందంటూ విమర్శలు గుప్పించాయి. అన్ని విధాలుగా పై చేయి సాధించి పాక్ పై ఒత్తడి తీసుకువచ్చి ఆ దేశ భూభాగంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అప్పగింత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం వంటి అంశాలను ప్రస్తావించకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి అమెరికా ఒత్తిడికి మోడీ తలొగ్గారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి తదననంతర పరిణామాలప ప్రధాని మోడీ తొలి సారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉద్వేగ భరితంగా, ఘన విజయం సాధించామంటూ ప్రధాని మోడీ ప్రసంగం సాగింది. దాయాది దేశంలోతలదాచుకుని అక్కడ నుంచి దేశం లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముష్కరుణను అణచివేశామని ఉద్ఘాటించారు.   ఆపరేషన్ సిందూర్ ఆగదనీ, కాల్పుల విరమణ తాత్కాలిక విరామం మాత్రమేనని విస్పష్టంగా చెప్పారు.   ఆప‌రేష‌న్ సిందూర్ అంటే.. కే దేశంలోని కోట్లాది మంది మ‌హిళ‌ల సిందూరానికి ప్ర‌తీక‌గా అభివర్ణించారు.   శౌర్య ప‌రాక్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించిన భార‌త సైన్యానికి, స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌కు సెల్యూట్ చేశారు.   ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌ని పునరుద్ఘాటించారు. ఇక పాకిస్థాన్ తో చర్చలు అంటూ వస్తున్న సూచనలు, వార్తలు, అమెరికా మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను ఆయన నిర్ద్వంద్వంగా కొట్టి పారేశారు. పాకిస్థాన్ తో చర్చు అంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనేనని కుండబద్దలు కొట్టేశారు. ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్న ప్రధాని మోడీ.. ఉగ్రవాదుల మూలాలను గుర్తించి ఏరివేస్తామని హెచ్చరించారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమన్న ఆయన.. కాల్పుల విరమణపై కూడా వివరణ ఇచ్చారు. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. అదే సమయంలో ఉగ్రవాదానికి ఈ భూమి మీద స్థానం లేదన్నారు. ఇక జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ పాకిస్థాన్ కు ఘాటు హెచ్చరిక పంపారు. తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే..పాకిస్థాన్ నే ఉనికిలో లేకుండా చేస్తామని మోడీ విస్పష్ట సందేశాన్ని దాయాది దేశానికి పంపారు.  ప‌హ‌ల్గాంలో  మ‌తం పేరు అడిగి మ‌రీ అమాయకుల ప్రాణాలు తీశార‌ని,  దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌న్నారు. కుటుంబ స‌భ్యుల ముందే.. అయి న వారిని పొట్ట‌న పెట్టుకున్నార‌ని.. ఇలాంటి వాటిని భార‌త దేశం ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌బోద‌న్నారు. గ‌త నాలుగు రోజులు గా భార‌త సైన్యం సంయ‌మ‌నంతో   వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు. ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేయాల్సిన పాకిస్థాన్‌.. ఎదురు మ‌న‌పై దాడులు చేసింద‌న్న మోడీ. భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌.. పాకిస్థాన్‌కు త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు.ఇండియన్ ఆర్మీ ధాటికి పాక్ తోకముడిచిందనీ, అచేత‌న స్థితికి చేరుకుంద‌నీ,  భార‌త్ చేస్తున్న దాడుల‌తో పాక్ కు దిమ్మ‌తిరిగి బోమ్మకనిపించిందనీ వ్యాఖ్యానించారు.  తాను ముందే చెప్పినట్లు ఉగ్రవాదులకు వారి ఊహకు అందని రీతిలో బుద్ధి చెప్పామన్నారు. అయితే మోడీ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగం తరువాత కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ ఎందుకు అంగీకరించిందన్న విషయంపై జనబాహుల్యంలో నెలకొన్న అనుమానాలు. సందేహాలు అలాగే ఉండిపోయాయి.  ఈ సందర్భంగా పాక్ కు గతంలో జరిగిన మూడు యుద్ధాలలో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, వాజ్ పేయిలు అగ్రరాజ్యం ఒత్తిడికి, ఆంక్షఁలకు లొంగకుండా నిర్భయంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

Pakistan

పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే.. పీవోకే మీద అయితేనే జరుపుతాం : ప్రధాని మోదీ

  పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే.. అది ఉగ్రవాదం మీద, పీవోకే మీద అయితేనే జరుపుతామని  ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు దాడి చేస్తే మా పద్ధతిలో వారి మూలలను గుర్తించి సంహరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరు వేరుగా చూడం.. మా దృష్టిలో ఇద్దరు ఒక్కటే ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ప్ర‌యోగించిన డ్రోన్లు, మిస్సైళ్ల‌ను భార‌త్ క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ స‌రిహ‌ద్దులు దాట‌కుండానే కూల్చేసింది. భార‌త మిస్సైళ్లు పాక్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఛిన్నాభిన్నం చేసేశాయి. పాక్ గ‌ర్వంగా చెప్పుకునే మిస్సైళ్లు, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను భార‌త్ నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్ వైమానిక స్థావ‌రాలు, రాడార్ స్టేష‌న్ల‌లో భార‌త్ మిస్సైళ్లు విధ్వంసం సృష్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగ‌ర‌లేని స్థితిని భార‌త్ క‌ల్పించింది అని మోదీ పేర్కొన్నారు.  పాకిస్తాన్ మ‌ళ్లీ ఎలాంటి దుస్సాహ‌సానికి పాల్ప‌డ‌కుండా భార‌త్ బుద్ధి చెప్పింది. భార‌త్ ప్ర‌తిచ‌ర్య‌ల‌కు బెంబేలెత్తిన పాక్.. కాల్పుల విర‌మ‌ణ‌కు ప్ర‌పంచం మొత్తాన్ని వేడుకుంది. భార‌త త్రివిధ ద‌ళాలు స‌ర్వ‌స‌న్నద్ధంగా ఉన్నాయి. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆప‌రేష‌న్ సిందూర్.. ఉగ్ర‌వాదంపై భార‌త్ వైఖ‌రిని విస్ప‌ష్టంగా చెప్పాయి. ఉగ్ర‌వాదంపై భార‌త్ ష‌ర‌తులు మేర‌కే చ‌ర్చ‌లు ఉంటాయి. భార‌త్ నిర్ణ‌యాల‌కు అనుగుణంగానే చ‌ర్చ‌లు ఉంటాయని మోదీ స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చారించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు.

Pakistan

ఉగ్రవాదం అంతం చేయకుంటే పాకిస్ధాన్‌‌ను అంతం చేస్తాం..ప్రధాని మోదీ హెచ్చరిక

    భారత దళాల దాడితో పాకిస్ధాన్‌కు మూడు రోజుల్లోనే ముచ్చెమటలు పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. పాక్ భయాందోళనకు గురై మన డీజీఎంఓతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులు మా చెల్లెళ్ళ సిందూరాన్ని తుడిచారు.. అందుకే ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశామని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఒక్క దెబ్బతో ఖతం చేశామని వెల్లడించారు"ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచివేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో... అదే ఆపరేషన్ సిందూర్. గత నాలుగు రోజులుగా భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని చూస్తున్నాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో దాడులు చేశాయి.  బహావల్ పూర్, మురిడ్కే వంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా మనదేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సత్తా ఏంటనేది దేశం మొత్తానికి తెలిసింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం మొత్తం చూసింది. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికంగా నిలుస్తాయి" అని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు మాత్రమే కాదు.. దేశ ప్రజల భావనల ప్రతిబింబం అని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి ప్రతీక ఆయన అన్నారు.  ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు మ‌తం పేరు అడిగి మ‌రీ కుటుంబ స‌భ్యుల ముందు కాల్చిచంపారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో దేశ‌మంతా నివ్వెర‌పోయింది. ఉగ్ర‌వాద దాడుల‌పై ప్ర‌తి హృద‌యం జ్వ‌లించిపోయింది. పౌరులు, పార్టీలు అన్ని ఒక్క‌తాటిపైకి వ‌చ్చి ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డాయి అని మోదీ తెలిపారు.సైన్యం, సాహ‌సం, ప‌రాక్ర‌మాన్ని దేశం చూసింది. భార‌తీయ మ‌హిళ‌ల నుదుటిపై సిందూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆప‌రేష‌న్ సిందూర్.. ఆప‌రేష‌న్ సిందూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేద‌న. ఆప‌రేష‌న్ సిందూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్ర‌తిజ్ఞ‌. ఈ నెల ఏడో తేదీ తెల్ల‌వాజుమ‌న ఈ ప్ర‌తిజ్ఞ నెర‌వేర‌డం ప్ర‌పంచ‌మంతా చూసింది అని మోదీ పేర్కొన్నారు.పాకిస్ధాన్ తెగబడినా భారత్‌ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయిని ప్రధాని మోదీ హెచ్చరించారు.

Donald Trump

భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపాను..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

  భారత్-పాక్ మధ్య అణుయుద్దాన్ని ఆపాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ యుద్దం జరిగి ఉంటే లక్షలాది ప్రజలు ప్రాణాలు పోయేవని తెలిపారు. కాల్పుల విరమణ కోసం రెండు దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఘర్షణలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పామని.. వారు గొడవలు ఆపేశారని  ట్రంప్ పేర్కొన్నారు. తన మాట విని భారత్, పాక్ సీజ్‌ఫైర్ అమలు చేశాయని పేర్కొన్నారు. ఇకపై ఆ దేశలతో వాణిజ్యాన్ని పెంచుతానన్నారు. నా పరిపాలన హయాంలో, అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాం అని ఆయన తెలిపారు.  ఆ సమయంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, ఇరు దేశాలు భీకరంగా పోరాడుకునే స్థితిలో ఉన్నాయని ట్రంప్ వివరించారు.ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాల నాయకత్వాల గురించి ప్రస్తావిస్తూ, "భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నాయకత్వాలు శక్తిమంతమైనవి, దృఢంగా నిలబడ్డాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని చల్లార్చడానికి వాణిజ్యాన్ని ఒక దౌత్య వ్యూహంగా ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఈ జోక్యం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న అణు సంఘర్షణను తాము ఆపగలిగామని ట్రంప్ ముగించారు.  

CM Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటెల ఘాటు వ్యాఖ్యలు ...కొట్లాడితే ధీరుడితో కొట్లాడుతా

  సీఎం రేవంత్‌రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్  ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ఒక సైకో.. ఎవరు చెప్పినా వినడు అంటూ ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు. కొట్లాడితే దీరుడితో కొట్లడతాం కానీ రండలతో ఏం కొట్లాడతామన్నారు. ముఖ్యమంత్రి కానప్పుడు తడిబట్టలపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశాడు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసు కోవాలని ఆయన అన్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి… ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గతంలో ధనిక రాష్ట్రమని చెప్పిన రైతులకు రూ.లక్ష కూడా రుణమాఫీ చేయలేకపోయారని ఆరోపించారు.  మాజీ సీఎం కేసీఆర్  విచ్చలవిడిగా అప్పులు చేసిన రైతుబంధు ఇచ్చారని ఈటల అన్నారు. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కష్టమని ఆనాడే చెప్పానని అన్నారు. ప్రజలకు అబద్ధాలే నచ్చుతాయని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. సరిగ్గా 16 నెలలు గడిచే సరికి సీఎం రేవంత్ చెప్పిన అబద్ధాలు అక్షరాల నిజం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో నిరుపేదల ఇళ్లను కూల్చేస్తున్నారని.. అదేంటని ప్రశ్నిస్తే ఇదే ముఖ్యమంత్రి ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్లతో తొక్కిస్తామని కామెంట్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రిపై ఈటల చేసిన కామెంట్స్‌పై యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Pakistan

పాకిస్తాన్‎ను దడ పుట్టిస్తున్న బలూచిస్తాన్

  పాకిస్తాన్‎ను గత కొన్ని రోజులుగా నిద్రపట్టినివ్వకుండా చేస్తున్న చిన్న దేశం అది. పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పటికీ.. తన పోరాటం మాత్రం వీడటం లేదు. బలూచిస్తాన్.. ప్రస్తుతం దీని పేరు వింటే పాక్ కు దడ పుడుతోంది. నిద్రలో ఉన్నా ఉలిక్కిపడే రోజులు పోయి అసలు నిద్రే పట్టకుండా పోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో 71 మందికి పైగా పాక్ సైన్యాన్ని పొట్టన పెట్టుకుంది.  భారత్‌‌, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ బీఎల్‌‌ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్‌‌లో పాక్‌‌ సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంది. పాక్ మిలటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా భీకరమైన దాడులు చేస్తోంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మిసైళ్ల వర్షంతో పాక్ కు ముచ్చెమటలు పిట్టించింది. పాక్ పై సమరానికి ఇదే సరైన సమయం అని భావించిన బీఎల్‌‌ఏ.. తనదైన శైలిలో దాడులకు పాల్పడుతూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బలూచిస్తాన్ సైనికులు. గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు.  బీఎల్‌‌ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం, మిలటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. ఈ నెల 3న గ్వాదర్‌‌‌‌లో పాక్ ఆర్మీ వెహికల్‌‌ను ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాక్ సైనికులు మరణించినట్టు బీఎల్‌‌ఏ అధికారికంగా తెలిపింది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోనూ పాక్ మిలటరీ కాన్వాయ్‌‌పై ఐఈడీ దాడి చేసింది. ఇందులో 12 మంది పాక్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఈ నెల 7న కెచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌‌పైనా ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో ఒక పాక్ సైనికుడు మరణించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ దాడులను తిప్పి కొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. బలూచిస్తాన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాక్ సైన్యాన్ని మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై బీఎల్‌‌ఏ దాడులు చేస్తూ, ఒక్కో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటోంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి.. ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్‌‌క్వార్టర్స్‌‌తో పాటు కీలకమైన చెక్‌‌ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్‌‌ఏ ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. అయితే, బలూచిస్తాన్‌‌లోని 39 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసినట్టు బీఎల్‌‌ఏ శనివారం ప్రకటించింది.  ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోస్టులు, హైవేలను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని బీఎల్‌‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ తెలిపారు.బలూచిస్తాన్ తన పోరాటాన్ని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో రైలును హైజాగ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో నిలిచింది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. క్వెట్టా నుంచి పెషావర్‌‌‌‌కు వెళ్తున్న జఫర్ ఎక్స్‌‌ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో బీఎల్‌‌ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే రైలులో ప్రయాణిస్తున్న 400 మంది ప్రయాణికులను చంపుతామని పాకిస్తాన్ ​ను హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను రక్షించింది. ఈ ఆపరేషన్‌‌లో 33 మంది బీఎల్‌‌ఏ తిరుగుబాటుదారులతోపాటు 21 మంది ప్రయాణికులు, నలుగురు పాక్ సైనికులు మరణించారు.   పాకిస్తాన్‌‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44శాతం ఒక్క బలూచిస్తాన్‌‌లోనే ఉండటంతో తమ హక్కుల కోసం తిరుగుబాటు ప్రారంభించారు బీఎల్ఏ సైన్యం. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజాలు, వనరులు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి బలూచిస్తాన్ గురవుతోంది. తమ వనరులను దోచుకుంటూ, తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి  ప్రారంభమైంది. అదికాస్తా తిరుగుబాటుగా మారి నేడు యుద్దంగా రూపాంతరం చెందింది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలాత్ ఖాన్ పాక్‌‌లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీనికి అంగీకరించని బలూచిస్తాన్ ప్రజలు.. అప్పటి నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు కొనసాగుతూనే వచ్చింది. అయితే పాక్ ను దెబ్బ తీయాలంటే సరైన టీం అవసరమని భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అయింది. అలా దశాబ్దాల కాలం నుంచి పోరాడుతూ తమ హక్కుల కోసం మన దాయాది దేశమైన పాకిస్తాన్ పై అంతర్యుద్దం చేస్తూనే ఉన్నారు.  

YS Jagan

జగన్‌ హెలికాప్టర్‌ ఘటన కేసు...ముగిసిన తోపుదుర్తి విచారణ

  వైసీపీ అధినేత జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విచారణ ముగిసింది. పోలీసులు తోపుదుర్తికి 102 ప్రశ్నలు అడిగారని అన్నింటికీ సమాధానం ఇచ్చానని ఆయన తెలిపారు. విచారణ అనంతరం వెలుపలికి వచ్చి మీడియాపై తోపుదుర్తి అక్కసు వెళ్లబోసుకున్నారు. హెలిప్యాడ్ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమని, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాశ్​ రెడ్డి చెప్పారు. పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తమపై కేసులు పెట్టారని అన్నారు. హత్య కేసు విచారణ నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. ప్రకాశ్ రెడ్డిని విచారించామని అవసరమైతే మరోసారి పిలుస్తామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 70 మందిని నిందితులుగా చేర్చామని మిగతా వారిని కూడా విచారించాల్సి ఉందని, మరో నెల రోజుల్లో ఛార్జ్​షీట్ వేస్తామని సీఐ చెప్పారు. కాగా జగన్‌ పర్యటనలో హెలికాప్టర్‌ కేసులో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.జగన్‌ పర్యటనలో హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు.  జగన్‌ పర్యటన సందర్భంగా హెలికాప్టర్‌ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఆయన హెలికాప్టర్‌ దిగకముందే వైసీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ ఘటనలో కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. జగన్‌ భద్రతపై పోలీసులు చేసిన సూచనలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పాటించలేదు. హెలిప్యాడ్‌ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు.. భద్రతా వైఫల్యంగా చూపేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 

modi silense or stretegy

మౌనమేలనోయి.. మోడీది మౌనమా? వ్యూహమా?

గత మూడు వారాలుగా భారత్ పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రకటిత యుద్ధం జరుగుతోందా అన్నంతగా పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెల 22న కాశ్మీర్ లోని పహల్గాం లో ఉగ్రవాదులు 26 మంది పౌరలను అత్యంత దారుణంగా, కృరంగా ఖతం చేశారు. ఈ సంఘటనను 2008 ముంబై దాడుల అనంతరం సాధారణ పౌరుల మీద జరిగిన అత్యంత దారుణమైన దాడి అనడంలో సందేహం లేదు. ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ బీహార్ లోని ఒక సభలో మాట్లాడుతూ.. ఉగ్రదాడికి వారి ఊహలకు అందనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఆ తరువాత ఈ నెల 7 భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా వంద మందికి పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. అప్పటి నుంచీ రెండు దేశాల మధ్యా యుద్ధం కొనసాగుతోందా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ప్రతి నిత్యం రాత్రి వేళల్లో భారత భూభాగంపైకి పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడితే.. పాక్ దాడులను భారత ఆర్మీ సమర్ధంగా తిప్పి కొట్టింది. పాక్ లోని నిర్దేశిల లక్ష్యాలపై భారత్ దాడులు చేసింది. ఈ తరుణంలో హఠాత్తుగా ఉరుములేని పిడుగులా శనివారం ( మే10) సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఘనతగా చెప్పుకుంటూ తన జబ్బలు తానే చరిచేసుకున్నారు. భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కరెక్టే కానీ, ఇందులో మూడో దేశం ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కోరిక మేరకు మానవతా దృక్ఫథంతో తాము పాక్ వినతిని మన్నించామని చెప్పింది. అసలు కాల్పుల విరమణ ఒప్పందం గురించి వెల్లడి కాగానే అప్పటి వరకూ మోడీ జపం చేస్తున్న యావత్ దేశం ఒక్కసారిగా ఆయనై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది.  సరే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించింది. దీనిపై మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా అటువైపు నుంచి బుల్లెట్ వస్తే ఇటు నుంచి మిస్సైల్ తో బదులు చెప్పండని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే షెడ్యూల్ ప్రకారం సోమవారం (మే 12) ఇరు దేశాల సైన్యాధ్యక్షుల స్థాయి వర్చువల్ సమావేశంలో సంధికి స్పష్టమైన షరతులు విధించనున్నట్లు కూడా మోడీ మీడియా ముఖంగా ప్రకటించారు.   అయితే ఇంత జరిగినా, జరుగుతున్నా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించకపోవడం పట్ల పరిశీలకులు, రాజకీయనాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణం అలుముకున్న వేళ మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి వారిలో భరోసా నింపాల్సి ఉండగా అందుకు భిన్నంగా మోడీ మౌనముద్ర వహించడం ఏమిటన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.  

Deputy CM

నర్సులు అందిస్తున్న సేవలను వెలకట్టలేము : డిప్యూటీ సీఎం ప‌వ‌న్

  వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలను వెలకట్టలేమని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం  ప్ర‌భుత్వ హాస్పిటల్ స్టాఫ్ న‌ర్సుల‌తో ఆయన సమావేశం అయ్యారు. ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని నర్సింగ్ అసిస్టెంట్‌లను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగుల‌కు స్వ‌స్థ‌త క‌లిగేలా వృత్తికి గౌర‌వాన్ని తీసుకువ‌స్తున్నార‌ని పవన్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవ‌లు అనన్య సామాన్యమని అన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న న‌ర్సుల సేవ‌ల‌ను ఎవ‌రూ మ‌రిచిపోర‌ని తెలిపారు.  మ‌హ‌మ్మారి క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా న‌ర్సులు చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయమ‌ని పేర్కొన్నారు. ఇక‌, ఇటీవ‌ల సింగ‌పూర్‌లో త‌న కుమారుడు మార్క్ శంక‌ర్ స్కూల్లో సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ త‌ర్వాత ఆసుప‌త్రిలో చేరాడ‌ని, అక్క‌డ న‌ర్సులు చేసిన సేవ‌లు చూసిన‌ప్పుడు మ‌రోసారి వారి క‌ష్టం గుర్తుకొచ్చింద‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా వారిని క‌లవ‌డం ఎంతో సంతోషన్ని ఇచ్చింద‌ని పవన్ అన్నారు. ఈ సంద‌ర్భంగా నర్సింగ్ అసిస్టెంట్‌‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని, వాటిని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

BRS Party

సొంత పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు...బీఆర్‌ఎస్ పార్టీలో బయటపడ్డ విభేదాలు

  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని ఆమె అన్నారు.  కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నేను ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా... ఇంకా నా సహనాన్ని పరీక్షించవద్దని కవిత అన్నారు. ఇటీవల మేడే రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  కామెంట్స్  రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు కారణం అయ్యాయి. ఈ రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సేనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు.  దీంతో కవిత తీరు సొంత బీఆర్‌ఎస్ పార్టీ పరిపాలన, అందులోను తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చెప్పేలా ఉందని కవిత వైఖరి చూస్తే త్వరలో కవిత నూతన పార్టీ పెట్టే ఆలోచన ఉందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె ప్రత్యేకంగా బీసీ వాదం ఎత్తుకుంది. దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. కేసీఆర్ తర్వాత నెక్ట్స్ కవిత అని ప్రజల్లో బలంగా వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా కవిత వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్త  కుంపటి పెడుతున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఏ సభకు వెళ్లిన సీఎం సీఎం అని అనుచరులు పదే పదే అంటున్నారు. దీంతో బీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది

jagan government supplied harmful liquor

జగన్ హయాంలో మద్యం పేరిట విషం!

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం పేరిట విషాన్ని విక్రయించారు. ఆ పనిని స్వయంగా అప్పటి జగన్ ప్రభుత్వమే చేసింది. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానం ప్రజారోగ్యాన్ని పీల్చి పిప్పి చేసింది. ఆ కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించి విక్రయించిన రకరకాల బ్రాండ్ల మద్యంలో ప్రాణాలకు హానికరమైన రసాయనాలు ఉన్నాయని అప్పట్లోనే నివేదికలు తేల్చి చెప్పాయి. ఆయా మద్యం బ్రాండ్లను కెమికల్ ల్యాబ్ లలో పరీక్షించి ఆయా బ్రాండల్లో హానికర కెమికల్స్ ఉన్నట్లు తేలినట్లు అప్పట్లోనే వార్తలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఆయా మద్యం బ్రాండ్ల తయారీదారులంతా వైసీపీ పెద్దలు, వారి సన్నిహితులేనని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అప్పటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఆ దర్యాప్తు ఇప్పుడు వేగవంతమైంది. పలు అరెస్టులు కూడా జరిగాయి. అది పక్కన పెడితే.. జగన్ హయాంలో అవలంబించి మద్యం విధానం ప్రజారోగ్యాన్ని గుల్ల చేసిందన్న ఆరోపణలు అక్షర సత్యాలన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ రుజువైంది.  జగన్ హయాంలో సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా మద్యం సేవించిన వా రి ఆరోగ్యం క్షీణించిందన్న ఆరోపణలపై అధ్యయనానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక బృందాన్ని నియమించింది. ఆ బృందం తన అధ్యయన నివేదికను తాజాగా వెల్లడించింది. జగన్ హయాంలో సరఫరా చేసిన మద్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమని ఆ నివేదిక పేర్కొంది. 2019, 2024 మధ్య కాలంలో మద్యం సేవించే వారిలో మూత్ర పిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులలో పెరుగుదల కనిపించిందని పేర్కొంది.  ఆ నివేదిక మేరకు మద్యం సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగాయి. 2014-2019 మధ్య కాలంలో మద్యం సంబధిత వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య 14, 026 కాగా  సంఖ్య 2019-24 మధ్య కాలంలో దాదాపు రెట్టింపైంది.  ఈ గణాంకాలు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందిన వారిది మాత్రమే. అలాగే కల్తీ మద్యం కారణంగా వ్యాధుల బారిన పడిన వారిలో 34 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల సంఖ్య అధికంగా ఉంది.  కాగా ఈ జేబ్రాండ్ లిక్కర్ కారణంగా పలువురు నరాలకు సంబంధించిన వ్యాధుల బారిన కూడా పడ్డారని నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. 

pvnarasimharao statue in delhi

హస్తినలో పీవీ కాంస్య విగ్రహం

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు.. అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీ నరసింహరావు కాంస్య విగ్రహం త్వరలో హస్తినలో ఏర్పాటు కానుంది. జీవిత కాలం కాంగ్రస్ తోనే పయనించి, ఈ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఎదిగి.. దేశానికి ఎనలేని సేవలందించిన పీవీ నరసింహరావుకు ఎట్టకేలకు దేశ రాజధాని హస్తినలో ఒకింత చోటు, గుర్తింపు లభించనుంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఈ మహా మేధావి.. కాంగ్రెస్ పార్టీకే ప్రత్యేకమైన రాజకీయాలు, అంతర్గత విభేదాల కారణంగా ఆ పార్టీలో కనీస గౌరవానికి కూడా నోచుకోలేదు. చివరాఖరికి ఆయన మరణించినప్పుడు, ఆయన పార్ధివ దేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదు. చివరికి హస్తినలో అంత్యక్రియలు కూడా జగరలేదు. అక్కడ నుంచి హైదరాబాద్ కు ఆయన పార్ధివదేహాన్ని తరలించి.. అక్కడ అంత్యక్రియలు జరిపించారు. ఇందుకు ఆయన విధానాలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా విభేదించడమే కారణం. అంతెందుకు ప్రధానిగా దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన ఆయనకు ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇన్నేళ్లకు హస్తినలోని బీజేపీ ప్రభుత్వం ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.   పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని ఢిల్లీ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. పీవీ విగ్రహ ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్   ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్   ఆమోదం తెలిపింది. దీంతో అతి త్వరలోనే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇంకొంచం వెనక్కు వెడితే.. గత ఏడాది ఏప్రిల్ లో పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్   పీవీ విగ్రహాన్ని హస్తినలోని ఆంధ్రా భవన్ లేదా తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌ కు లేఖ రాసింది.    ఈ లేఖపై ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్  ఈ ఏడాది మార్చి 27న జరిగిన సమావేశంలో చర్చించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కు పంపింది. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో త్వరలో పీవీ కాంస్య విగ్రహం హస్తినలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్నది. .

రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌ భేటీ

  రాజ్ భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా భేటీ అయ్యారు. హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌తో  సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.  ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్ పై గవర్నర్ తో చర్చించిన సీఎం.. మిస్ వరల్డ్ 2025 వేడుకలకు ఆహ్వానించినట్లు సమాచారం. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త  పరిస్థితుల మధ్య హైదరాబాద్ లో మిస్ వరల్డ్ వేడుకలు జరుగుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆథిత్యం వహిస్తుండగా.. మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా  జరగనున్న ఈ వేడుకను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో 120 పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు గవర్నర్‌‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  

రాఫెల్ ఫెయిల్?.. పీఎల్ 15 హిట్?

పాకిస్థాన్ కి చైనా నిశ్శ‌బ్ధ సాయం ఎలా చేసింది? మ‌న  రాఫెల్ చైనా సాయంతో పాక్ కూల్చేసిందా? అస‌లు ఈ యుద్ధంలో చైనా దాని ఆయుధ పాత్ర ఏంటి? రాఫెల్ పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మేనా? టెలిగ్రాఫ్ క‌థ‌న  సారాంశ‌మేంటి? ఈ వ్యాసంపై వ‌స్తున్న అభ్యంత‌రాలు ఎలాంటివి? పాకిస్థాన్ భార‌త యుద్ధ విమానాలు కూల్చ‌డంలో చైనా పాత్ర ఎలాంటిద‌న్న‌దొక చ‌ర్చ‌. అయితే చైనా చాప కింద నీరులా పాకిస్థాన్ కి అందించాల్సిన సాయ‌మంతా అందిస్తోన్న‌ట్టు పెద్ద పెద్ద అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు, వాటిలోని రాత‌గాళ్ళ క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. మ‌న‌మెంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే రాఫెల్ యుద్ధ విమానాల‌ను చైనా సాయంతో పాక్ పేల్చేసిన ఘ‌ట‌న తాలూకూ క‌థ‌నాలు.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్త‌ంగా ర‌క్ష‌ణ వ‌ర్గాల వారిని అట్టుడికిస్తోంది. టెలిగ్రాఫ్ లో వ‌చ్చిన ఓ క‌థ‌నం మేరకు.. ఆ రోజు ఉద‌యం 4 గంట‌ల‌కు ఒక అసాధార‌ణ ఘ‌ట‌న న‌మోద‌య్యింది. అది యుద్ధ భూమిలో కాదు.. దౌత్య ప‌ర‌మైన విష‌యంలో.  పాక్ లోని చైనా రాయ‌బారి రావ‌ల్పిండికి అత్య‌వ‌స‌రంగా ఫోన్ చేశారు. త‌ర్వాత కొన్ని గంట‌ల్లోనే భ‌రత వైమానిక బ‌లాన్నది బ‌ద్ధ‌లు కొట్టేసింది. భార‌త వైమానిక ద‌ళం రోజుల త‌ర‌బ‌డి స‌మావేశ‌మ‌వుతోంది. దాదాపు 180 విమానాలు ప‌శ్చిమ స‌రిహ‌ద్దులో కేంద్రీకృత‌మై ఉన్నాయి. ల‌క్ష్యం ఎంతో స్ప‌ష్టంగా ఉంది. బాలాకోట్ ను పున‌రావృతం చేయ‌డ‌మే టార్గెట్. పాకిస్థాన్ ర‌క్ష‌ణ గోడ‌ల‌ను విచ్చిన్నం చేయ‌డం.. వ్యూహాత్మాక ఆధిప‌త్యాన్ని పున‌రుద్ద‌రించ‌డం. కానీ యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. యుద్ధ విమానాలు ఎగిరే ఆకాశాలు కూడా ఎప్పుడూ నీలిరంగులోనే ఉండ‌వు. అప్పుడ‌ప్పుడూ త‌న రూపును షేపును.. మార్చుకుంటూ ఉంటుందా వార్ స్కై. భార‌త వైమానిక ద‌ళం ఎప్పుడూ ప్ర‌వేశ ద్వారాలు దాట లేదు. దాని అవ‌త‌ల ఏముందో వారికి ఎంతో స్ప‌ష్టంగా  తెలుసు.  చైనా J-10C ఫైటర్లు, అధునాత‌న PL-15 క్షిపణులు, 300 కి.మీ కంటే ఎక్కువ పరిధి కలిగిన మాక్ 5 హంట‌ర్స్, షూట‌ర్ ఎవ‌రైనా త‌మ ప‌రిధిలోకి తేగ‌లిగే.. ఏరియల్ రాడార్లు.. బేసిగ్గా భార‌త్ కేవ‌లం పాకిస్థాన్ పైలెట్ల‌ను మాత్ర‌మే చూడ‌దు. ఇది స్కార్దు నుంచి ప‌స్నీ వ‌ర‌కూ విస్త‌రించి ఉన్న చైనా వైమానిక సామ‌ర్ధ్యాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక త‌ప్ప‌దు.   అయితే చైనా ఇచ్చిన ఈ స‌పోర్టుతో సుమారు 250 మిలియ‌న్ల‌కు పైగా విలువైన ఒక రాఫెల్ ని గాల్లోనే కూల్చి వేసిన‌ట్టు స‌మాచారం. మ‌రొక‌టి అతి త్వ‌ర‌గా తిరిగి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. దీన్ని కాపాడ్డానికి ఉప‌యోగించే  స్పెక్ట్రా EW వ్యవస్థ సైతం నిర్వీర్య‌మైంది. PL-15 రాడార్‌తో రాలేదు. ఇది AI- గైడెడ్ సైలెన్స్ ద్వారా వచ్చిన‌ట్టు స‌మాచారం.  చైనా వార్ ఫేర్ కేవ‌లం స్కై, స‌ర్ఫేస్ ద్వారా మాత్ర‌మే సాగేది కాదు. దాని రేంజే వేరు. అది ఏకంగా స్పేస్ ద్వారా వార్ ని ఆప‌రేట్ చేయ‌గ‌ల‌దు. ఆ స్థాయికి ఎప్పుడో త‌న యుద్ధ విన్యాసాన్ని సిద్ధం చేసి ఉంచింది డ్రాగ‌న్ కంట్రీ. అందులో భాగంగా చైనా  ఉపగ్రహాలు, AWACS సహాయంతో పాకిస్తాన్ వైమానిక దళం సెన్సార్- ఫ్యూజన్ కిల్‌ను అమలు చేసింది. రాఫెల్స్‌కు ఎప్పుడూ ఈ దిశ‌గా సిగ్న‌ల్స్ రాలేదు, వారి ప్రత్యర్థిని కూడా అవి చూడ‌లేక పోయాయి. క్షిపణులు ఢీకొడుతున్న విష‌యం తెలిసే లోప‌లే క‌థ ముగిసిపోయింది. భార‌త్ కు ఒక విష‌యం స్ప‌ష్టంగా తెలుసు. ఒక రాఫెల్ ని ప‌డ‌గొట్ట‌గ‌లిగితే ఐదింటినీ కూడా ప‌డగొట్టొచ్చు. అందుకే వారు స‌రిహ‌ద్దుల‌కు మూడు వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నారు. వారికి ధైర్యం లేక పోవ‌డం వ‌ల్ల కాదు.. అక్క‌డున్న స్థితిగ‌తుల మీదున్న అవ‌గాహ‌న వ‌ల్ల‌.   దీని ప్ర‌భావం ఏమంత త‌క్కువైన‌ది కాదు. ఇది భార‌త‌దేశ ప్ర‌తిష్టాత్మ‌క రాఫెల్, పాకిస్థాన్ జెట్ ప్ర‌యోగించిన ఒక చైనా క్షిప‌ణి దెబ్బ‌కు ప‌డిపోయిందంటే.. కేవ‌లం యుద్ధ వ్యూహం మాత్ర‌మే కాదిది.. ఒక భౌగోళిక రాజ‌కీయ సందేశం కూడా. బ్లూమ్‌బెర్గ్ వంటి కొంద‌రు నిపుణులు చెప్పేదాన్ని బ‌ట్టిచూస్తే ఇది చైనా పాక్ స‌మ‌గ్ర యుద్ధానికి ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న‌. ఈ చైనా మార్క్ వార్ స్ట్రాట‌జీకి పెద్ద పెద్ద పాశ్చాత్య యుద్ధ విశ్లేష‌కులు కూడా ఆశ్చ‌ర్య పోయారు. ఫ్రెంచ్ ర‌క్ష‌ణ ఒప్పందాలు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో  చైనా చిరున‌గ‌వులు చిందిస్తోంది. మేమంతా నిశ్శ‌బ్ధంగానే చేస్తాం. మీలా సౌండ్ చేయం. అది మేమైనా మా పీఎల్ ఫిఫ్టీన్ త‌ర‌హా క్షిప‌ణులైనా.. అంతా సౌండ్ లెస్ అన్న మెసేజ్ పాస్ చేస్తోంది చైనా. వార్ గేమ్ మొత్తం మారిపోయేలాంటి సీన్. ఇది 2019 కాదు.. బాలాకోట్ దాడి స‌మ‌యం అంత‌క‌న్నా  కాదు. యుద్ధ వ్యూహం ఎంతో ముదిరిపోయిన 2025లో ఉన్నాం. నాటి నుంచి నేటి వ‌ర‌కూ మారిన ప్ర‌పంచ యుద్ధ నీతి అసాధార‌ణ‌మైన‌ది. ఇప్పుడు మ‌నం.. ఆయుధం క‌నిపిస్తుంది- కానీ శ‌తృవు క‌నిపించ‌ని మాయా యుద్ధాన్ని చూస్తున్నాం. వ‌చ్చే రోజుల్లో చైనా బేస్ చేసుకుని మ‌ల‌చ‌బ‌డుతోన్న వ్యూహంలో.. ఆయుధం, శ‌తృవు రెండు క‌నిపించ‌ని మ‌రింత మాయామేయ యుద్ధాన్ని చూడ‌బోతున్నాం.. అది వేరే సంగ‌తి. చైనీకృత‌మైన పాక్ వైమానిక స్థ‌లంలోకి ప్ర‌వేశించే సాహసం చేస్తే..  J-10Cలు, PL-15లు వేసే డెడ్లీ స్కెచ్ లోకి కోరి వెళ్ల‌డ‌మే అవుతుంది. ఈ విష‌యం భార‌త్ కి బాగానే తెలుసు.  కాబ‌ట్టి భార‌త్ త‌ప్ప‌క వెన‌క్కి త‌గ్గి తీరాల్సిందే అన్న సిట్యువేష‌న్. మా ఆయుధం అక్క‌ర్లేదు- భ‌యం చాలు అన్న‌ట్టుగా అటు వైపు ఆట  మొద‌లై పోయింది. రాడార్ అంధ‌త్వం, నిశ్శ‌బ్ధ వ్యూహం ద్వారా భార‌త్ ని క‌ట్టి  ప‌డేసింది చైనా అధీకృత పాక్ వార్ ఫీల్డ్.   ఇది భార‌త పైలెట్ల నైపుణ్య లేమికి సంబంధించిన ప‌రాజ‌యం కాదు. ఆ పైలెట్ యుద్ధ భూమిలో చూడ‌లేని ఒక గాడాంధ‌కారం కార‌ణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇది ఉప‌గ్ర‌హ నిర్మిత యుద్ధం. సెన్సార్ల ద్వారా అనుసంధానించ‌బ‌డిన  యుద్ధం. అక్క‌డెక్క‌డో చైనాలో కూర్చుని ఆప‌రేట్ చేస్తే ఆ సిగ్న‌ల్ చైనా శాటిలైట్లు అందుకుని.. ఇక్క‌డి యుద్ధ‌ యంత్రాల‌కు ప‌ని చెబుతాయి. ఆ యంత్రాలు కంటికి  క‌నిపించ‌కుండా వ‌చ్చి.. ఢీ కొట్టేస్తాయి. ఇదీ ఇక్క‌డ అమ‌లు చేస్తోన్న అస‌లు సిస‌లైన యుద్ధ వ్యూహం.   2025 మేలో భార‌త్ పాక్ మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ యుద్ధంలో వార్ గేమ్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. 36 జెట్ ఫైట‌ర్ల కొనుగోలు ద్వారా భార‌త్ నిర్మించుకున్న వైమానిక ఆధిప‌త్య‌పు క‌ల ఒక్క‌సారిగా కాశ్మీర్ కొండ‌ల్లో ద‌భేల్మ‌ని కూలిపోయిందని అంటుంది మెంఫిస్ బార్క‌ర్ రాసిన క‌థ‌న సారాంశం. ఇది వ్యూహాత్మ‌క యుద్ధం, న్యాయ‌పోరాటానికి సంబంధించిన యుద్ధం కాదు. ఒక సైద్ధాంతిక స‌మ‌రం. దానిక తాలూకూ ప‌త‌నం. ఇక్క‌డ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ  ఆధిప‌త్య పోరు.. అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ అమ‌లుకు సంబంధించిన అంశం. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ ఆయుధ మేథావులంతా క‌ల‌సి.. రియ‌ల్ టైమ్ లో అస‌లు విష‌య‌మేంటో ప‌రిగ్ర‌హిస్తున్నారు. ప‌రిశీలిస్తున్నారు. రాఫెల్ ఒక అన్ ట‌చ‌బుల్. దాని రేంజ్ నెక్స్ట్ లెవ‌ల్. దాని టెక్నాల‌జీ తిరుగులేనిది. దాని పైలెట్లు వ‌ర‌ల్డ్స్ బెస్ట్. వారి రేంజే వేరు అనే బిరుదులు, విశేష‌ణాలెన్నో. అలాంటి రాఫెల్ ప్ర‌స్తుతం చైనా వేసిన ఉచ్చులో చిక్కింది. ఇక అది త‌ప్పించుకోలేదు. దాని టైం బ్యాడ్ డే రోజున.. ఖ‌చ్చితంగా ఫాల్ డౌన్ కావ‌ల్సిందే అన్న థియ‌రీకి సంబ‌ధించిన వ్య‌వ‌హార‌మిది. అంద‌రూ అనుకున్న‌ట్టు చైనా ఏం చూస్తూ ఊరుకోవ‌డం లేదు. ఈ యుద్ధంలోకి నిశ్శ‌బ్ధంగానే అడుగు పెట్టింది. కొంద‌రు పాశ్చాత్య విశ్లేష‌కులు త‌మ‌కు అనువుగా మార్చి రాసుకున్న యుద్ధ వ్యూహాలు సిద్దాంతాల‌కిక్క‌డ తావు లేదు. ఇక్క‌డొక వార్ ఆల్రెడీ జ‌రుగుతోంది. చైనా అపార‌మైన సైనిక శ‌క్తికి దీటుగా ఇప్ప‌టికే ఏఐ బేస్డ్ స్మార్ట్ వార్ గేమ్ త‌యారు చేయాల‌న్న కృత‌నిశ్చ‌యంతో పాశ్చాత్య దేశాలుండ‌గా.. వాటికి పాక్ వంటి  యుద్ధ  క్షేత్రం వేదిక‌గా గ‌ట్టి బ‌దులు ఇవ్వాల‌న్న ఆలోచ‌నతో చైనా వార్ మైండ్ లో.. బ్లైండ్ గా ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది.   నిశ్శబ్దంగా గస్తీ తిరుగుతున్న సబ్ ఎరియ‌ల్ AWACS, నిష్క్రియాత్మక రీతిలో ఎగురుతున్న J-10C యుద్ధ విమానాలు, PL-15E క్షిపణులు 300 కి.మీ కంటే ఎక్కువ దూరంలోని  మాక్ 5 వేగంతో దేశీయ వేరియంట్లు లాక్ చేసి ఉంచారు. అందులో భాగంగా రాఫెల్ ఒక‌టి చిక్కి శ‌ల్య‌మైందని అంటున్నారు.   ఒక క్షిప‌ణి త‌న‌కు 50 కిలోమీట‌ర్ల దూరంలోకి వ‌చ్చే వ‌ర‌కూ.. తానే దాని టార్గెట్ అని ఆ రాఫెల్ కి తెలియ‌దు. ఆ వేగంతో పోటీ ప‌డ్డానికి భార‌త పైలెట్ కి కేవ‌లం 9 సెక‌న్లు మాత్ర‌మే ఉన్నాయ్. స్పందించ‌డానిక‌ది స‌రిపోలేదు. దీంతో రాఫెల్ నేల‌మ‌ట్టం కాక త‌ప్ప‌లేద‌ని చెబుతోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం. ఇక‌పై కాశ్మీర్ లోని భార‌త వైమానిక ద‌ళాన్ని ర‌క్షించుకోవ‌డం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఫైట‌ర్ జెట్ ఎగిరిన  ప్ర‌తిసారీ పాకిస్థాన్ రాడార్లు దాన్ని వెంట‌నే ప‌సిగ‌ట్టేస్తాయి. పీఎల్ ఫిఫ్టీన్ ద్వారా దాన్ని సౌండ్ లెస్ గానే ఢీకొట్టేస్తుందని హెచ్చ‌రిస్తోందీ క‌థ‌నం. ప్ర‌స్తుతం ప్రపంచం ఈ యుద్ధ  ప‌త‌నాన్ని ఆయుధ విన్యాసాన్ని త‌న రెండు క‌ళ్లతో చూస్తోంది. డ‌స్సాల్ట్ ఏవియేష‌న్ షేర్ ధ‌ర  స్థ‌బ్ధుగా ఉండ‌గా.. చైనా డిఫెన్స్ స్టాక్స్ అయిన  AVIC, ALD చెంగ్డు ధ‌ర‌లు  పెరుగుతున్నాయనీ తెలుస్తోంది. ఎందుకంటే C4ISR ఆధిపత్యం - కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, నిఘా ద్వారా ఇదంతా నిర్ణయించబడిన‌ట్టు అభిప్రాయ ప‌డుతున్నారు నిపుణులు. ఇప్పుడు భార‌త్ పాక్ కంటే ముందుకు వెళ్ల‌లేదు. అది భార‌త్ ని ఎప్పుడో మించి పోయింది. భార‌త్ ఆశ్చ‌ర్య‌పోయేలోప‌ల‌.. దాని వార్ బ‌ర్డ్స్ ని అదెప్పుడో నేల మ‌ట్టం చేసేసింది. భార‌త్ కి క‌లిగించే ఈ వార్ పెయిన్ పాక్ ఈ ప్ర‌పంచానిక తెలియ చేస్తోన్న చైనా సైనిక సామ‌ర్ధ్య సందేశంగా భావించాల్సి ఉంటుందని చెబుతోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం.   ఈ వార్ క‌మ్ మైండ్ గేమ్ లో ఇప్పుడు భార‌త్ పాక్ కేవ‌లం నిమిత్త మాత్రం. మిగిలిన‌దంతా చైనా వ‌ర్సెస్ యూఎస్, యూకే వంటి పాశ్చాత్య దేశాల మ‌ధ్య జ‌రిగే సంకుల స‌మ‌రం. అందుకే ఈ విష‌యంలోకి అంత తేలిగ్గా అడుగు పెట్ట‌కూడ‌ద‌నుకున్నారు మోడీ. మ‌న ద‌గ్గ‌రున్న ఫ్రెంచ్ రాఫెల్స్, ర‌ష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్స్ కి దీటుగా చైనా త‌న అస్త్ర‌శ‌స్త్ర విన్యాస‌మంతా ముందుకు తెచ్చింది. అది నేరుగా శ‌తృవును ఢీ కొట్ట‌డం లేదు. ఎక్క‌డో అంత‌రిక్ష కేంద్రంగా త‌న  వార్ గేమ్ స్టార్ట్ చేస్తోంది. పాకిస్థాన్ అన్న‌దొక భుజం మాత్ర‌మే. భార‌త్ ఒక ఆబ్జెక్ట్ మాత్ర‌మే. దాని గురి వేరు. దాని ల‌క్ష్యం వేరని అంటోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం. ఇపుడే స్పెక్ట్రా వ్య‌వ‌స్థ కూడా దాన్ని గుర్తించ‌లేదు. ఉప‌గ్రహం ద్వారా ఆప‌రేట్ అయ్యే ఆ క్షిప‌ణిని ఏ EW సూట్ కూడా మోసగించ‌లేదు. ఏ ఫైట‌ర్ జెట్ కూడా రాబోయే మ‌ర‌ణ స‌మ‌యాన్ని క‌నీసం ఊహించ‌లేదు. ఆకాశ‌మిప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది వైమానిక వైమానిక యుద్ధ ముగింపు కాదు. నిశ్శ‌బ్ధ,  అదృశ్య‌, జ‌వాబు చెప్ప‌న‌ల‌వి  కాని వైమానిక ఆధిప‌త్యానికి సంబంధించిన ఘ‌న ప్రారంభంగా అభివ‌ర్ణిస్తున్నారు అంత‌ర్జాతీయ యుద్ధ వ్య‌వ‌హారాల నిపుణులు. ఇది టెలిగ్రాఫ్ క‌థ‌న సారాంశం కాగా. దీనిపై ప్ర‌తిస్పంద‌న‌లు సైతం తీవ్రంగానే వ‌స్తున్నాయి. ఇదొక ఊహాజ‌నిత క‌ల్పిత గాథ అని అభివ‌ర్ణిస్తున్నారు కొంద‌రు యుద్ధ  నిపుణులు. ఇది కేవ‌లం రాఫెల్ పై బుర‌ద‌జ‌ల్లే క్ర‌మ‌మ‌ని. ఈ ఉచ్చులో చిక్క‌రాద‌న్ని వీరి వాద‌న‌. అయితే పీఎల్ 15 క్షిప‌ణుల‌ను చైనా పాక్ కి ఇచ్చిన మాట నిజ‌మే అయినా రాఫెల్ విమానాలు కూల్చిన‌ట్టు ఎక్క‌డా ఆధారాలు లేవ‌న్న మాట వినిపిస్తోంది.

భార‌త్- పాక్ కాల్పుల విర‌మ‌ణ‌లో అమెరికా పాత్ర ఎంత‌?

అణుముప్పు మేట‌రేంటి?  భార‌త్- పాక్ మ‌ధ్య ఆక‌స్మిక కాల్పుల విర‌మ‌ణ  విష‌యంలో అస‌లేం జ‌రిగింది? ఎందుక‌ని ఈ రెండు దేశాలు స‌డెన్ గా  ఈ డెసిష‌న్ తీసుకున్నాయి?  ఇరు దేశాల మధ్యా  ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన కారణంగానే  కాల్పుల విర‌మ‌ణ ప్రకటన చేశాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అయితే ఇక్క‌డే కొన్ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటి సారం ఎలా ఉందో చూస్తే.. 1. ఆక‌స్మికంగా ఉద్రిక్త‌త పెర‌గ‌డం  2. భార‌త ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి ప్ర‌క‌ట‌న వెలువ‌డటం 3. అంత‌ర్జాతీయ ప్ర‌తిచ‌ర్య‌లు, హెచ్చ‌రిక‌లు జారీ కావ‌డం 4. అణ్వాయుధ ముప్పు క‌నిపించ‌డం 5. భౌగోళిక రాజ‌కీయ ఒత్తిడి రావ‌డం 6. యునైటెడ్ స్టేట్స్ పాత్ర పెర‌గ‌డం 7. భ‌ద్ర‌తా స‌మ‌న్వ‌య స‌మావేశం ద్వారా నిర్ణ‌యం ఈ ఏడింటిలో ఏది ఈ కాల్పుల విర‌మ‌ణ‌కు ప్ర‌ధాన పాత్ర పోషించి ఉంటుంద‌న్న‌ది ఒక చ‌ర్చ కాగా..  మే ప‌దో తేదీన జ‌రిగిన ఆ 90 నిమిషాల దాడి కీల‌కంగా భావిస్తున్నారు. అదే అణు దాడి. ఈ మొత్తం పాయింట్ల‌లో నాలుగో పాయింట్ అణ్వాయుధ ముప్పు, ఆపై ఆరో పాయింట్లోని యునైటెడ్ స్టేట్స్ పాత్ర అత్యంత కీల‌కంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఏంటీ రెండు పాయింట్ల ద్వారా మ‌న‌కు తెలిసే నీతి అని చూస్తే.. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉంచిన సర్గోధ వైమానిక స్థావరం కూడా భారత దాడుల ధాటికి నేలమ‌ట్ట‌మైంది. అంతే కాదు, సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలలో పాకిస్తాన్ రహస్యంగా దాచిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది.  మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల త‌ర్వాత‌, పాకిస్తాన్ తమ ద‌గ్గ‌ర మందుగుండు సామాగ్రి అయిపోయింద‌నీ.. కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపిన‌ట్టు తెలుస్తోంది. కానీ, భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలపై బాంబుల వర్షం కురిపించిన‌ట్టు చెబుతున్నారు.  ఈ ఆరు సొరంగాల ప్రవేశ ద్వారాల వద్ద జరిగిన పేలుళ్ల వల్ల లోపల ఉన్న అణ్వాయుధాలు వేడికి ధ్వంసమై ఉండవచ్చని భావిస్తున్నారు నిపుణులు. ఈ దాడుల కారణంగా 4.0 తీవ్రతతో భూ కంపం సంభవించిన‌ట్టు కూడా వార్తలు  వ‌చ్చాయి. అంతకుముందు చెఘాయి హిల్స్ ప్రాంతంలో కూడా ఇదే తీవ్రతతో భూ కంపం రావడం ప‌లు అనుమానాలకు దారి తీసింది. భారతదేశం చెఘాయి హిల్స్‌పై దాడి చేయడంతో అమెరికా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు, తమ ఆయుధాలు ఇలా పేలిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా తమ ఆయుధ మార్కెట్ పడి పోతుందనే ఆందోళన మరోవైపు అమెరికాను కలవర‌పాటుకు గురిచేసిన‌ట్టు తెలుస్తోంది.  దీంతో హుటాహుటిన అమెరికా రంగంలోకి దిగి.. కాల్పులను ఆపడానికి ప్రయత్నించింద‌ని స‌మాచారం. అదే సమయంలో, భారత్ బలూచిస్తాన్‌లోని బోలారి వైమానిక స్థావరంపైనా క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయ యుద్ధ విమానాలు పాల్గొనలేదు, కేవలం ఖచ్చితత్వంతో కూడిన‌ క్షిపణి దాడులు మాత్ర‌మే జ‌రిగాయి.  ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన 40 మంది వ‌ర‌కూ సైనికులు మ‌ర‌ణించిన‌ట్టు చెబుతున్నారు మ‌న అధికారులు. పాకిస్తాన్ కూడా స్వయంగా ఈ విష‌యం అంగీకరించింది. అంతే కాదు, పాకిస్తాన్  హెచ్చరిక వ్యవస్థగా పనిచేసే అమెరికన్ ఎవాక్స్ విమానాలు కూడా దాడుల్లో దెబ్బ తిన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద అమెరికన్ ఆయుధాల విశ్వసనీయత ప్రశ్నార్థం కావ‌డ‌మే అత్యంత కీలకంగా భావిస్తున్నారు. భారతదేశం ఎవరి సహాయం లేకుండా, కేవలం తన స్వ‌శక్తితో ఈ దాడులను విజయ వంతంగా నిర్వహించడం ద్వారా  ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చిన‌ట్ట‌య్యింది. దీంతో అమెరికా తన ఆయుధ మార్కెట్‌ను కాపాడుకోవడానికి, అణ్వాయుధ యుద్ధాన్ని నివారించడానికి తీవ్ర‌య‌త్నాలుసాగించిన‌ట్టు తెలుస్తోంది.  ఇందువ‌ల్లే అమెరికా ఈ చ‌ర్చ‌ల కోసం భార‌త్ పై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చ‌ని అంటున్నారు. అయితే అమెరికా నేరుగా సంప్ర‌దించ‌క ముందే పాక్ డీజీ, భార‌త్ తో మాట్లాడారు. ఆ త‌ర్వాత భార‌త్ సైతం చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైంది. కానీ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఈ విజ‌యం త‌న  ఖాతాలో వేస్కునే య‌త్నం చేశారు. అయితే మోడీ మాత్రం క‌శ్మీర్ విష‌యంలో ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వం అవ‌స‌రం లేద‌ని.. పీవోకే స్వాధీనం, ఉగ్ర‌వాదుల అప్ప‌గింత‌లో మాత్ర‌మే చ‌ర్చ‌లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఆప‌రేష‌న్ సిందూర్ ఇక్క‌డితో ముగియ‌లేద‌ని కూడా అన్నారు. మ‌రి చూడాలి త‌ద‌నంత‌ర   ప‌రిణామ క్ర‌మాలు ఎలా ఉండ‌నున్నాయో?

కాల్పుల విరమణ.. భారత్ చేసిన చారిత్రక తప్పిదం!?

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్  ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ భారత్ భూభాగం లక్ష్యంగా నిర్వహించిన డ్రోన్ దాడులతో రెండు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులతో  యుద్ధం తప్పదన్న వాతావరణం ఏర్పడింది. అయితే అదే సమయంలో పాకిస్థాన్ డొల్లతనం కూడా ప్రస్ఫుటంగా ప్రపంచ దేశాలకు అర్ధమైంది. భారత్ తో తలపడే సత్తా కానీ, శక్తి కానీ పాకిస్థాన్ కు లేవన్నది తేటతెల్లమైంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సంధి అంటూ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. భారత్ అందుకు సై అంది. అది పక్కన పెడితే ఇరు దేశాల మధ్యా సంధి కుదర్చడం వెనుక తన పెద్దన్న పాత్ర కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకున్నారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న విషయం అందరి కంటే ముందే తాను వెల్లడించి క్రెడిట్ కొట్టేయాలని చూశారు. అయితే కాల్పుల విరమణలో అమెరికా పాత్ర కానీ, ఆ ధేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రకానీ ఇసుమంతైనా లేదని భారత్ కుండబద్దలు కొట్టేసింది. పాకిస్థాన్ కోరిన మీదటే మానవతా దృక్పథంతో అంగీకరించినట్లు స్పష్టంగా చెప్పేసింది.  అయితే పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ బేషరతుగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడాన్ని యుద్ధరంగ నిపుణులు చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందం రైటా, రాంగా అన్న విషయంలో దేశంలో ఎక్కడా భిన్నాభిప్రాయానికి తావే లేకుండా ముక్తకంఠంతో భారత్ నిర్ణయం సరికాదని అంటున్నారు. యుద్ధం వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది, మరణాలు సంభవిస్తాయి కనుక యుద్ధం ఎప్పడూ మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, భారత్ కు వ్యతిరేకంగా ప్రేరిపించి దేశంలో సృష్టిస్తున్న నిత్య మారణహోమానికి ఫుల్ స్టాప్ పడాలంటే.. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, పాక్  అధినంలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని స్వాధీనం చేసుకోవడమే మార్గమని జనం భావిస్తున్నారు.    ఈ నేపథ్యంలోనే అత్యధికుల నుంచి కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అంటున్నారు.  ప్రస్తుతం పాకిస్థాన్ అత్యంత దుర్బలంగా ఉందనీ, ఆ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదనీ, ఆర్థికంగా, రాజకీయంగా క్లిష్టపరిస్థుతులను ఎదుర్కొంటోందనీ, ఇటువంటి సమయంలో భారత్ మరింత ఒత్తిడి పెంచి.. ఆ దేశంలో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరినీ సరండర్ చేయాలన్న షరతు విధించి ఉండాల్సిందనీ అంటున్నారు.  భారత్ ఒత్తిడి పెంచి ఉంటేపాకిస్థాన్ భారత్ కు దాసోహం అని ఉండేదనీ, అలా కాకుండా కాల్పుల విరమణ ఒంప్పదం కుదుర్చుకోవడం ద్వారా  పాకిస్థాన్ కు అనవసరంగా మళ్లీ శక్తియుక్తులను కూడదీసుకోవడానికి సమయం ఇచ్చినట్లైందని అంటున్నారు.