చంద్రగిరిలో క్రీ.శ. 16వ శతాబ్ది ఇటుక రాతి దిగుడు బావి

కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి  తిరుపతి జిల్లాలోని చారిత్రక నగరం చంద్రగిరిలోని విజయనగర కాలపు ఇటుక రాతి దిగుడుబావిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. తిరుపతికి చెందిన సూర్యదేవర హరికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు, ఎస్.వి భక్తి ఛానల్ బి.వి. రమణతో కలిసి సోమవారం ఆయన ఆ బావిని సందర్శించారు. చంద్రగిరి కోటలో రాజమహల్ ఎదురుగా ప్రైవేటు వ్యక్తులకు చెందిన మామిడి తోటలో గల ఈ దిగుడు బావి 20 అడుగుల వ్యాసంతో, 20 అడుగుల లోతుతో చుట్టూ ఇటుక రాతి గోడతో, దిగటానికి రాతిమెట్లతో నిర్మించబడిందని శివనాగిరెడ్డి చెప్పారు.  వృత్తాకారపు ఇటుక రాతి గోడపై, హంపిలోని రాతి దిగుడు బావి వాస్తు శిల్పశైలికి అద్దం పడుతున్న డిజైన్లు, మధ్యలో అలంకరణ పట్టిని అనుకరించి ఈ దిగుడు బావి క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిందని, అప్పటి చంద్రగిరి రాజ కుటుంబీకులు తాగునీటి కోసం ఈ బావిని అద్భుతంగా నిర్మించారని ఆయన అన్నారు.  దిగుడు బావి రాతి కట్టడాన్ని ఇంత నైపుణ్యవంతంగా నిర్మించిన ఆధారం, రాయలసీమలో ఇదొక్కటేనని, తర్వాత కాలంలో సాగునీటి కోసం వినియోగించినట్లుగా తెలిపే కట్టడాలను బట్టి చెప్పవచ్చు అన్నారు. అరుదైన, అద్భుత ఇటుక రాతి వాస్తు శిల్ప శైలి గల ఈ దిగుడు బావిని కాపాడి భవిష్యతరాలకు అందించాలని సూర్యదేవర హరికృష్ణకు, మామిడి తోట యజమానులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.  చారిత్రక ప్రాధాన్యత గల బావి అంచుల్ని పునరుద్ధరించి, గోడల్ని శుభ్రపరిచి, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే, చంద్రగిరి రాజమహల్ తో పాటు ఈ దిగుడు బావిని కూడా పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దవచ్చని వారసత్వ ప్రేమికుడు బి.వి రమణ అన్నారు.

వైసీపీ నేత పోసానికి బిగ్ షాక్..  టిడిపి తీర్థం పుచ్చుకున్న సోదరుడి కుమారుడు 

వైసీపీ నేతలు ఒక్కొక్కరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే దిశగా అడుగులేస్తున్నారు. తెలుగు దేశం పార్టీపై ఒంటి కాలిపై లేచే పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల వేళ ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ పోసాని టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీకి ఓటు వేసి మరోమారు అధికారంలో తీసుకురావాలని ఇప్పటికే పోసాని కృష్ణమురళి ఎన్నికల ప్రచార సభలో పిలుపునిస్తుంటే స్వయాన సోదరుడి కుమారుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ముందుచూపు ఏపీ అభివృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే తాను టీడీపీలో చేరినట్టు తెలిపారు. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. యూకేలో వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాథ్ హైదరాబాద్‌లోనూ తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి టీడీపీపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడి కుమారుడు టీడీపీవైపు మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణకు మళ్లీ తమిళిసై.. బీఆర్ఎస్ కు దబిడిదిబిడేనా?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సోమవారం (ఏప్రిల్ 29) నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా తమిళిసైను ఎన్నికల ప్రచారంలోకి దింపిందని అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడిందని భావిస్తున్న బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించుకుని రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలలో పేరుకే త్రిముఖ పోటీ అనీ, ప్రధానంగా ఎన్నికల పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్యే అన్నట్లుగా ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ బీఆర్ఎస్ అన్ని విషయాలలోనూ తడబడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోక్ సభ టికెట్ కేటాయించిన తరువాత కూడా అభ్యర్థులు పోటీకి వెనుకడుగు వేయడం, కేసీఆర్ వినా ఇతర నేతలెవరూ పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోవడం చూస్తుంటే ముందే బీఆర్ఎస్ చేతులెత్తేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ ఒక్కరే బస్సు యాత్రతో రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. ఇతర సీనియర్ నేతల ప్రచారం పార్టీ సమావేశాలు, సదస్సులకే పరిమితమైనట్లుగా కనిపిస్తున్నది.  ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై, అధికారంలో ఉండగా కేసీఆర్ సర్కార్ వ్యవహరించిన తీరుపై సాధికారికంగా విమర్శలు చేయగలిగే మాజీ గవర్నర్ తమిళిసైని స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ రంగంలోకి దింపింది.  తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అగ్రనేతలను బీజేపీ రంగంలోకి దింపి ప్రచారం హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ఓ దఫా ప్రచారం కంప్లీట్ చేయగా.. రెండో టర్మ్ ప్రచారానికి సైతం షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వీరితో పాటుగా తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళి సైతం తెలంగాణలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు తమిళి సై ప్రచార షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. కీలక నియోజకవర్గాలలో ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. పది రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేసి మరీ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.  తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళిసై లోక్ సభ ఎన్నికలకు ముందు గవర్నర్ పదవికి రాజీనామా చేసి సొంత రాష్ట్రమైన తమిళనాడులో చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఎన్నికలు తొలి దశలోనే పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సేవలను తెలంగాణలో బీజేపీ ప్రచారానికి ఉపయోగించుకోవాలని కమలం పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళిసై కు రాష్ట్రంలో పరిచయాలు ఉన్నాయి. అలాగే ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలతో గవర్నర్ గా ఆమె ప్రజాభిమానం కూడా సంపాదించుకున్నారు. అంతే కాకుండా గవర్నర్ గా  తనకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని అప్పట్లో పలు సందడర్భాలలో  తమిళిసై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  గవర్నర్ గా ఉన్న సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేసిన తమిళిసై ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మరింత జోరుగా బీఆర్ఎస్ ను విమర్శలతో చెండాడుతారని పరిశీలకులు అంటున్నారు. ఆమె ప్రచారం ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది, బీఆర్ఎస్ కు ఎంత మేర నష్టం చేకూరుస్తుంది అన్నవిషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

హస్తం గూటికి హరీష్..? బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ!

హరీష్ రావు.. బీఆర్ఎస్ లో అధిష్ఠానం పెద్దగా ఇష్టపడని కీలక నేత. పార్టీలో ఆల్ఈజ్ వెల్ పరిస్థితి ఉన్న సమయాలలో ఆయనకు ఎప్పుడూ పెద్ద ప్రాధాన్యత లభించలేదు. అదే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా, అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నా పార్టీ హైకమాండ్ కు ముందుగా గుర్తుకు వచ్చేది హరీష్ రావే. ఆఘమేఘాల మీద ఆయన మెడలో వీరతాళ్లేసేసి పార్టీని ఇబ్బందుల నుంచి గట్టెక్కించుందుకు తెరమీదకు తీసుకు వస్తుంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ సమస్యల పరిష్కారం విషయంలో హరీష్ రావుపైనే ఆధారపడుతున్న పరిస్థితి ఉంది.  బీఆర్ఎస్ 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ఆయనను కేబినెట్ లోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే విషయంలో హరీష్ రావుతో ట్రబుల్స్ వస్తాయన్న అంచనాతోనే అప్పట్లో హరీష్ రావును పక్కన పెట్టారని కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. కారణాలేమైతేనేం మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించక తప్పలేదు కేసీఆర్ కు. ఇప్పుడు బీఆర్ఎస్ విపక్షంలో ఉన్న సమయంలో కూడా హరీష్ రావు పార్టీకి బలం, బలహీనతగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో లేకపోవడంతో పార్టీలో గతంలోలా కేసీఆర్ మాట చెల్లు బాటు కావడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణగా పార్టీ శాసనసభాపక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడమేనని చెబుతున్నారు. అప్పట్లో హరీష్ రావును శాసనసభాపక్ష నేతను చేయాలని పలువురు ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలే చెప్పాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో, అయిష్టంగానైనా కేసీఆర్ సీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ హోదాలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు అది వేరే సంగతి. ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ కంటే హరీష్ రావే కాంగ్రెస్ పై విమర్శల విషయంలో, సవాళ్ల విషయంలో ఒకింత దూకుడు కనబరుస్తున్నారు. అటువంటి హరీష్ రావే తన మద్దతు దారులతో అంటే 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గూటికి చేరితే.. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ ఉనికి మాత్రంగానైనా మిగులుతుందా? అయినా అసలు హరీష్ రావు ఏమిటి? కాంగ్రెస్ గూటికి చేరడమేమిటి? అనుకుంటున్నారా?  ఇటీవలి కాలంలో మంత్రులు కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకటి రెండు సందర్భాలలో పాతిక మంది వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఏ క్షణంలోనైనా వారు కాంగ్రెస్ గూటికి చేరవచ్చు అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బీజేపీ శాసనసభాపతి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా అదే ఆరోపణ  చేశారు. ఎన్నికల తరువాత హరీష్ రావు 20 నుంచి 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ వెనుక ఉన్నది హరీష్ రావేనని ఆరోపించారు.  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా, తాజాగా బీజేపీఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి హరీష్ మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా దగ్గరదగ్గరగా ఉండటం గమనార్హం. 

గుట్టు రట్టైంది.. బీజేపీతో రహస్య బంధం ఎవరిదో తేలిపోయింది!?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ లో తీవ్ర నిర్వేదం కనిపిస్తోంది. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారు.. అందుకు ఫలితం అనుభవిస్తారు అన్నట్లుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం శాపనార్ధాలు పెడుతోంది. ఈ విషయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రెండాకులు ఎక్కువగానే తిన్నట్లు కనిపిస్తున్నారు. ఏడాది లోగా రేవంత్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని  జోస్యం చెబుతున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. బస్సు యాత్రతో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలోలా కేసీఆర్ ప్రసంగాలలలో వాడి వేడి కనిపించడం లేదు. ఎన్నికల జోస్యం చెబుతూ.. మళ్లీ కింగ్స్ మేమే అంటూ చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజలలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ముందు పార్టీని వదిలి వెళ్లిపోతున్న వారిని నియంత్రించే ప్రయత్నాలు చేసుకుంటే మంచిదని పరిశీలకులు సలహాలిస్తున్నారు.  సరిగ్గా ఎన్నికల వేళ కేసీఆర్, కేటీఆర్ రెండు వేర్వేరు సభలలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చకు దారి తీశాయి. గతంలో కేటీఆర్ ఒక సందర్భంగా రేవంత్ బీజేపీ గూటికి చేరడం ఖాయమని పేర్కొన్న సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఆయన మాట మార్చారు. రేవంత్ కాదు తామే బీజేపీ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నామని అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆదివారం ఆయన వేములవాడ, కరీంనగర్ లలో ప్రసంగించారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. ఏడాది తిరిగే సరికి మళ్లీ కేసీఆర్ తెలంగాణను శాసిస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యులు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు దారి తీశాయి. లోక్ సభ ఎన్నికలలో ఓ పది పన్నెండు స్ధానాలు గెలిస్తే బీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణను ఎలా శాసిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబు కేసీఆర్ చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో రాబోయేది హంగ్ ప్రభుత్వమేననీ, మళ్లీ మనమే కింగ్స్ అని పదే పదే చెబుతున్నారు. రెంటినీ కలిపి చూస్తే కేటీఆర్ అన్న కేసీఆర్ తెలంగాణను శాసిస్తారు అన్న మాట వెనుక ఉన్నది బీజేపీతో పొత్తు సంకేతమేనంటున్నారు. లోక్ సభ ఎన్నికలలో పది పన్నెండు స్థానాలలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో అధికారం కోసం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని ఆయన చెప్పకనే చెప్పేసినట్లైందని అంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్, బీజేపీ రహస్య బంధాన్ని కేటీఆర్ స్వయంగా బయటపెట్టేశారని అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ కు బీజేపీతో రహస్య బంధం ఉందని ఆరోపిస్తోంది.  ఇప్పుడు కేటీఆర్ తన వ్యాఖ్యలతో ఆ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఫెయిల్డ్ సీఎం జగన్.. హామీల అమల్లో అట్టర్ ఫ్లాఫ్

ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డం వంటి ప‌నుల‌కే జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. యువ‌తకు ఉద్యోగాలు క‌ల్పించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ కంపెనీల‌ను త‌రిమేసి యువ‌త‌కు ఉపాధిని దూరం చేశారు. వైసీపీ పాల‌న‌లో క‌నీసం చిన్న‌పాటి ప‌నులు చేసుకునేందుకు కూడా ఏపీలో అవ‌కాశం లేక‌పోవ‌టంతో అధిక‌శాతం మంది ప్ర‌జ‌లు ప‌క్క రాష్ట్రాల‌కు ప‌నుల‌కోసం వ‌స‌ల వెళ్లిన ప‌రిస్థితి. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు.. వ‌చ్చే నెలలో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. ప‌లు హామీల‌తోపాటు.. సానుభూతి నాట‌కాల‌కు తెర‌ లేపారు. వీటిలో  బ‌స్సు యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై గుల‌క‌రాయి దాడి ఘ‌ట‌న ఒక‌టి. గ‌తంలో కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ హ‌త్య‌కేసును చంద్ర‌బాబుపై నెట్ట‌డం వంటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌జ‌లు జగన్ గుల‌క‌రాయి డ్రామాను నమ్మలేదు. నవ్వి పోయారు. దీంతో జగన్ నవ్వుల పాలయ్యారు. దాంతో ఆ డ్రామాకు తెరదించేసి, నుదుటిపై బ్యాండ్ ఎయిడ్ ను కూడా తీసేసి మేనిఫెస్టోతో మాయ చేయాలని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. జగన్ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో శనివారం (ఏప్రిల్ 27) పార్టీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో  విడుద‌ల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో గ‌తంలోని హామీల‌నే ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌.. ప‌లు ప‌థ‌కాల‌కు నిధుల‌ను పెంచారు. అయితే  గ‌తంలో 99శాతం హామీలు అమ‌లు చేశామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. ఏపీలో ఏమాత్రం అభివృద్ధి జ‌రిగిన దాఖ‌లాలు లేవు.. కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న ప్ర‌సంగంలో దాదాపు అన్ని హామీల‌ను అమ‌లు చేశామ‌ని చెప్పడంపై  ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌ల్లో జ‌గ‌న్ మోహన్ రెడ్డి అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. జగన్ రెడ్డి హామీలఅమలు  ప్రోగ్రెస్ కార్డు ప‌రిశీలిస్తే.. హామీల అమ‌ల్లో జ‌గ‌న్ కు 10శాతం మార్కులు కూడా రాలేద‌ని చెప్ప‌డానికి సంకోచించాల్సిన అవ‌స‌ర‌మే లేదు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమ‌ల్లో ఫెయిల్ అయ్యారు. మహిళలు, బీసీలు, రైతులు, ఎస్సీలు, ఆదివాసీలు, మైనార్టీలకు గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో జగన్ సర్కార్ ఏమేరకు అమలు చేసిందన్న విషయంపై ఓ సంస్థ  చేసిన  క్షేత్ర స్థాయి పరిశీలనలో జగన్ కు 100కు 10 మార్కులు కూడా రాలేదు. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో మ‌హిళ‌లకు ల‌బ్ధి చేకూర్చ‌డంలో 100 మార్కులకుగాను కేవ‌లం 13 మార్కులే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ‌చ్చాయి. బీసీల‌కు ల‌బ్ధి చేకూర్చే విష‌యంలో 16 మార్కులు, రైతుల విష‌యంలో 16 మార్కులు, ఎస్సీల‌కు ల‌బ్ధిచేకూర్చే విష‌యంలో 13మార్కులు, ఆదివాసీల విష‌యంలో 13మార్కులు, మైనార్టీల ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో 10శాతం మార్కులు మాత్ర‌మే జగన్ ప్రభుత్వానికి వ‌చ్చాయి. ఈ ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 600 మార్కుల‌కు కేవ‌లం 83 మార్కులు మాత్ర‌మే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌కు వ‌చ్చాయి. దీంతో మ‌రోసారి అధికారానికి జ‌గ‌న్ అనర్హులని భావిస్తున్న ప్ర‌జ‌లు.. మే 13న జ‌రిగే పోలింగ్ లో ఓటు ద్వారా గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అయిపోయారు.  గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీల అమల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా సంవత్సరానికి 1 లక్ష నుంచి 5లక్షల వరకు లబ్ది కలుగుతుందని   తప్పు డు ప్రచారాలు చేసింది వైసీపీ పార్టీ. అదేవిధంగా పిల్లలందరికీ అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఒక్కరికే ఇచ్చారు. పేద అక్క చెల్లెమ్మల పేర్లపై సొంత ఇళ్ల రిజిస్ట్రేషన్ అని చెప్పిన జగన్ తెలుగుదేశం ప్రభుత్వంలో  నిర్మించిన టిడ్కొ ఇళ్లను కూడా  ఇవ్వలేకపోయారు..  ఇలా మహిళలకు ఇచ్చిన ప్రతి హామీలోనూ జగన్ విఫలమయ్యారు. క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాల మేరకు ఆయా హామీల అమలు విషయంలో   వైసీపీ ప్రభుత్వానికి వ‌చ్చిన మార్కుల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌తి కుటుంబానికి లబ్ది (ఒక‌ మార్కు), అమ్మఒడి ప‌థ‌కం (ఆరు మార్కులు), పేద‌లంద‌రికీ ఇళ్లు (2 మార్కులు), మ‌ద్య‌పాన నిషేదం (-2 మార్కులు), డ్వాక్రా గ్రూపుల‌కు ఆస‌రా విష‌యంలో (3 మార్కులు), పింఛ‌న్లు (2 మార్కులు), పెళ్లి కానుక (జీరో మార్కులు), అగ‌న్వాడీ వ‌ర్క‌ర్లు (ఒక మార్కు). మొత్తం 100 మార్కుల్లో వైసీపీ ప్రభుత్వానికి వ‌చ్చినవి 13మార్కులు మాత్ర‌మే. దీంతో ఐదేళ్ల‌లో మహిళలకు ఇచ్చిన హామీల అమల్లో జగన్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని స్పష్టమవుతుంది.  వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌న ఐదేళ్ల పాల‌న‌లో బీసీల ల‌బ్ధికోసం ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రత్యే క ఉప ప్రణాళిక ద్వారా రూ. 75,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి.. ఎలాంటి ప్రత్యే క చర్యలు తీసుకోకుండా నిధులు దారి మళ్లించేశారు. ఏ రకంగాకూడా వీటిని సబ్ ప్లాన్ నిధులు అనలేము. బీసీలకు పదవుల విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును, వారికిచ్చిన హామీల అమలు అంశంలో జగన్ ప్రభుత్వానికి 100కు కేవ‌లం 16మార్కులే ప్రజలు ఇచ్చారు. అదే విధంగా వైసీపీ హ‌యాంలో రైతులు కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతుల‌కు మేలు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. రైతులకు మేలు చేసిన అంశంలో వైసీపీ ప్ర‌భుత్వానికి 100కు కేవ‌లం 16 మార్కులే ప్రజలు ఇచ్చారు. ఏ స‌మావేశం జ‌రిగినా ఎస్సీలు నా బంధువులు అని చెప్పుకునే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్ల పాల‌న‌లో ఎస్సీ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను పూర్తిగా విస్మ‌రించారు. వారికి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌క పోవ‌టంతో పాటు.. వారికి కేటాయించిన నిధులు కూడా పూర్తిస్థాయిలో ల‌బ్ధిదారుల‌కు చేర‌లేదు. దీంతో ఎస్సీ, ఎస్టీల‌కు మేలుచేసే విష‌యంలోనూ జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఐదేళ్ల కాలంలో  ప్రజలు ఇచ్చింది కేవలం 13మార్కులు మాత్రమే.  గిరిజ‌నుల‌కు ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడు. గిరిజనులకు ప్రత్యే క జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయ‌లేదు. 500 మంది జ‌నాభా ఉన్న ప్ర‌తి తండాను, గూడెంను పంచాయితీగా మారుస్తామ‌ని ఇచ్చిన హామీని జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేదు. ఎస్సీ, ఎస్టీల‌కు పింఛ‌న్ల అర్హ‌త వ‌య‌స్సు 45ఏళ్ల‌కి త‌గ్గింపు అనే హామీని జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేదు. దీంతో గిరిజ‌నుల‌కు మేలు చేసే విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంకు ప్రజలు ఇచ్చిన మార్కులు 100కు కేవ‌లం 13 మాత్ర‌మే.  మైనార్టీలకు ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఐదేళ్ల కాలంలో అర‌కొర హామీల‌తోనే స‌రిపెట్టాడు. 2019 పాదయాత్రలో ఇస్లామిక్ బ్యాంకును ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన‌ జగన్.. మైనారిటీలను మోసం చేశారు. అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. ఐదేళ్ల‌లో కేవలం రూ. 14.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మసీదులో ఇమామ్ లు, మౌజామ్ ల‌కు గౌరవ వేతనంగా నెలకు రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.10,000 ఇస్తున్నారు. అదే విధంగా ఇమామ్‌ల‌కు ఇళ్ళ స్థలాలు కేటాయించి, వారికి ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మోసం చేశాడు. ఇలా ముస్లింకు మేలు చేసే విష‌యంలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం  పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ముస్లిం మైనారిటీలు ఇచ్చిన మార్కులు 100కు కేవ‌లం 10 మాత్ర‌మే. మొత్తంగా జగన్ రాష్ట్రంలో ఏ వర్గానికీ మేలు చేయకపోగా, అన్నివర్గాల వారినీ మోసం చేశారు. హామీల అమలు మాట అటుంచి.. పన్నుల రూపంలో వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఒక అంచనా ప్రకారం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వారి నుంచి వసూలు చేశారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో అంటూ మరోసారి మోసం చేయడానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని జనం తిప్పి కొట్టానికి సిద్ధంగా ఉన్నారు.  

జగన్ మేనిఫెస్టోపై వైసీపీ సోషల్ మీడియా అతి!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న వ‌ర్గీయుల అరాచ‌కం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇదేంట్రా బాబు.. మ‌నం ఏమైనా పిచ్చోళ్ల‌మా అని చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ  జ‌గ‌న‌న్న అంత మ‌తిపోయే ప‌ని ఏం చేశాడ‌ని అనుకుంటున్నారా..?  ఇన్నాళ్లు జ‌గ‌న‌న్న చేసిన‌వ‌న్నీ ప్ర‌జ‌ల‌కు మ‌తులు పోగ‌ట్టే ప‌నులే క‌దా.. ఇంకా కొత్త‌గా ఏముంది మ‌తిపోవ‌టానికి అనుకుంటున్నారా? తాజాగా వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీతో ఎవరికైనా మ‌తిపోవాల్సిందే. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైసీపీ మ్యానిఫెస్టోను శ‌నివారం (ఏప్రిల్ 27) విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలోనూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును తిట్ట‌డ‌మే ప‌నిగా జ‌గ‌న్ పెట్టుకున్నారు. చంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ట‌.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం దేశంలో ఏ ముఖ్య‌మంత్రి  చేయ‌లేనంత మంచి ప‌నులు పేద‌ల‌ కోసం చేశారంట‌. అడిగేవాడు లేక‌పోతే.. బెదిరించే వాడిదే రాజ్యం అన్న‌ట్లుగా మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌ ప్రసంగం ఉంది.  ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తాను ఏం చేసినా ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌నే స్వ‌భావంతోనే పాల‌న సాగించారు. ఐదేళ్ల కాలంలో ఆయ‌న్ను ప్ర‌శ్నిచిన ఎవ‌ర్నీ జ‌గ‌న్ వ‌దిలిపెట్ట‌లేదు. చంద్ర‌బాబు నుంచి.. ర‌ఘురామ కృష్ణంరాజు వ‌ర‌కు ఎవ్వ‌రూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క‌ పాలన నుంచి త‌ప్పించుకోలేక పోయారు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఏపీలో చంద్ర‌బాబు హ‌యాంలో తీసుకొచ్చిన కంపెనీల‌ను త‌రిమేసిన జ‌గ‌న్‌.. క‌నీసం రోడ్ల‌పై ప్యాచ్ వ‌ర్కులు కూడా చేయించ‌లేక పోయారు. ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై మండిప‌డుతున్నా.. వైసీపీ అనుకూల మీడియాలో, సోష‌ల్ మీడియాలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన   హామీలన్నీ నెర‌వేరుస్తున్నామంటూ ఢంకా మోగించారు. మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో 99శాతం హామీలు నెర‌వేర్చామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డంపై జనం విస్మయం  వ్య‌క్తం చేస్తున్నారు.  ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చి ఎలాంటి భ‌యం లేకుండా  ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ర్యాలీలు, స‌భ‌ల్లో పాల్గొంటుంటే ఆ ఆనంద‌మే వేరు అన్న‌ట్లుగా జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇది విన్న ప్ర‌జ‌లు.. మ‌రి   ఇన్నాళ్లు ప‌ర‌దాల మాటున ఎందుకు తిరిగావ్ జ‌గ‌న‌న్నా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కేసి.. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన కాసింత అభివృద్ధినికూడా నిర్వీర్యం చేయ‌డం త‌ప్పితే జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా  చేసింది ఏమీలేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌ళ్ల‌ముందు ఇన్ని వాస్త‌వాలు క‌నిపిస్తున్నా, వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీని చూసి ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో ప‌లు వీడియోలు ప్ర‌త్య‌క్ష మ‌య్యాయి. ఈ వీడియోల్లో ఓ వృద్ధురాలు మ్యానిఫెస్టోలో కొత్త ప‌థ‌కాలు ఏంఏం ప్ర‌క‌టిస్తున్నారోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.. మ‌రొక వీడియోలో మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కొంద‌రు మ‌హిళ‌లు ఏకంగా హార‌తి ఇచ్చేస్తున్నారు.. మ‌రో వీడియోలో కొంద‌రు గ్రామ‌స్తులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో చ‌దువుతుంటే ఉత్కంఠ‌భ‌రితంగా టీవీని వీక్షిస్తున్నారు. ఒక‌ప‌క్క వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న్ మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తుంటే.. మ‌రోప‌క్క వైసీపీ సోష‌ల్ మీడియా ముందుగానే ప్లాన్ చేసిన వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న టీంకు పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిందంటూ కామెంట్ల‌తో త‌మ ఆగ్ర‌హాన్ని వెలుబుచ్చారు. ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే   స‌ర్వేల‌న్నీ తేల్చేశాయి. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక పోతున్న జ‌గ‌న్.. ఎలాగైనా ప్ర‌జ‌ల‌ను మ‌యాచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని  అన్నిప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే గుల‌క‌రాయి డ్రామాను తెర‌పైకి తెచ్చిన‌ప్ప‌టికీ.. అది తుస్సుమంది. గ‌తంలో కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ హ‌త్య‌కేసును చంద్ర‌బాబుపై నెట్ట‌డం వంటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌జ‌లు గుల‌క‌రాయి డ్రామాను ఈడ్చిత‌న్నారు. అయినా  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకు త‌న ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి సినిమా లెవ‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ముంద‌స్తుగా రూపొందించిన వీడియోల‌ను వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్లాట్ ఫాంల‌లో ప్ర‌జ‌ల‌పైకి వ‌దిలారు. ఇలాంటి ట్రిక్ ల‌ను జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ ఎన్ని ప్ర‌యోగించినా ప్ర‌జ‌లు మాత్రం  ఓటు ద్వారా ఏపీ నుంచి వైసీపీని త‌రిమికొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

నవరత్నాలు ప్లస్ V/s ఆరు గ్యారెంటీలు

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్  రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే  సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ రెండు విష‌యాలు మ‌నం మాట్లాడుకుంటే  1. నామినేష‌న్ల ప‌ర్వం చాలా పేల‌వంగా, జ‌న‌మే లేకుండా వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. జ‌నాన్ని త‌ర‌లించాలంటే డ‌బ్బు పెట్టాలి. ఎలాగూ ఓడిపోతాం క‌దా అని అనుకున్నారేమో కానీ, నామినేష‌న్ల ఘ‌ట్టంలో వైసీపీ అభ్య‌ర్థులు జ‌నాన్ని త‌ర‌లించ‌లేక‌పోయారు.  2. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ప్ర‌చారం జ‌రిగిన మేనిఫెస్టో.... అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్ర‌క‌టించేశారు.  పాత‌ ఎన్నికల మేనిపెస్టోనే మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే.  వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి మార్పు క‌నిపించ‌లేదు. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు.   మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు.  క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశం ఇది. అయినా, మేనిఫెస్టోలో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని మ‌ళ్ళీ పాత పాటే పాడారు.   టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చ జ‌రుగుతోంది. వీటితో పాటు  జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి.. 10 గ్యారెంటీ హామీలను ఇస్తామంటోంది.  వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి, ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ‌త నెల‌కొంది. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

పిఠాపురంలో మెగాస్టార్ ప్రచారం.. డేట్ కన్ ఫర్మ్?

రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది.  అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత  కొంత కాలం రాజకీయాల్లో ఉండీ  లేనట్లు కొనసాగారు. అంతే  ఆ తర్వాత చిరంజీవి రాజకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు.  తమ్ముడు పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు  ఎన్నికల్లో పోటీ చేసినా చిరంజేవి మాత్రం   ఆ దిక్కు  అడుగేయలేదు సరికదా కనీసం ఓ లుక్కు కూడా వేయలేదు.   కానీ  చిరంజీవి  పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష  బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని  భావించారు. ఇందుకోసం చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని రాహుల్ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీటికి వేటికీ స్పందించలేదు. సై అనలేదు. రాజకీయం తన వంటికి పడదు అన్నట్లుగా మౌనంగానే ఉండి పోయారు.  ఆ తరువాత కూడా మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఎప్పుడంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సినిమా టికెట్  రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి  చర్చలు జరిపారు.  ఆ సమయంలో   చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూపెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వాటన్నిటినీ ఖండించి రాజకీయాలకు తాను దూరం అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపారు.  ఆ తరువాత మరోసారి చిరు పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ సందర్భం అల్లూరి సీతారామరాజు జయంతి సభ. భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజాలు ఉన్న ఆ వేదికపై ప్రధాని మోడీ వారందరి కంటే చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా ఎదురెళ్లీ మరీ స్వాగతం పలికారు. ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. దీంతో చిరంజీవి బీజేపీ గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు. తరువాత మళ్లీ మామూలే చిరంజీవి మాత్రం రాజకీయాలతో తన దూరాన్ని మెయిన్ టైన్ చేశారు.  అయితే ఇప్పుడు అంటే ఏపీలో ఎన్నికల వేళ ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన కూటమి తరఫున ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ సారి వాటిని చిరంజీవి ఖండించలేదు. దీంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు పలికి, ఆయనకు ఓటేసి గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చిన తరువాత సోదరుడు పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడరని అన్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా తన సోదరుడి విజయం కోసం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే నెల 5 నుంచి ఆయన పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలలో పాల్గొననున్నారు. తన కుమారుడు హీరో రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనున్నారు.  చిరు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులూ, బీజేపీ, తెలుగుదేశం శ్రేణులూ కూడా పాల్గొనేలా కూటమి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. అదే విధంగా ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కోసం కూడా ప్రచారం చేసే అవకాశం ఉందం టున్నారు. అంటే చిరంజీవి ప్రచారం పిఠాపురం, అనకాపల్లికే పరిమితమైనా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్లస్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రత్యేక హోదా పై ఆ ముగ్గురు నోరెత్తట్లేదుగా? మళ్లీ అదే డ్రామానా!

2014, 2019 ఏపీ ఎన్నికలలో ప్రత్యేక హోదా ప్రముఖ అంశం అయింది కానీ, 2024 ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఆ అంశాన్నే ప‌క్క‌న పెట్టేశాయి.  ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు.  25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి.  గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.   అయితే అంతగా ప్రాధాన్యం లేని కాంగ్రెస్ పార్టీ, అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌ ప్ర‌త్యేక హోదా అంటూ జ‌పం చేస్తున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు.  అయినా కాంగ్రెస్ పుంజుకునే సూచనలు కనిపించడం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వస్తాయా, రావా, అనే విషయాన్ని పక్కనపెడితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హోదా విషయంలో హామీ ఇవ్వడం మాత్రం విశేషమే.  ప్రత్యేక హోదా ప్రకటన విషయంలో ఆనాడు బీజేపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన ఆ నోళ్లు, ఆ తర్వాత మూతబడ్డాయి.  ఏపీలో కాంగ్రెస్ కి పట్టినగతే బీజేపీకి కూడా పట్టింది.  ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ఎప్పటికీ నెరవేర్చదనే విషయం తేలిపోయింది. ఏపీలో మొత్తానికి మొత్తం లోక్ సభ సీట్లు ఒకే పార్టీకి వచ్చినా ఆ పార్టీ పార్లమెంట్ ముందు తొడగొట్టే అవకాశం లేదు. కేంద్రాన్ని మెడలు వంచేంత సీన్ లేదని ఈపాటికే ఏపీ ప్రజలకు తెలిసొచ్చింది.  అందుకే  నేతలంతా హోదాపై రాజీ పడటంతో ప్రజలు కూడా హోదాపై ఆశలు వదులుకున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. ప్రత్యేక హోదా  గురించి మాట్లాడుతుంటే జ‌నం వింతగా చూస్తున్నారని  వైఎస్ షర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన పదేళ్లలో ప్రత్యేక హోదా కోసం ప్ర‌ధాన పార్టీలు పోరాటాలు చేయ‌లేద‌ని ఆమె ఆరోపించారు.   ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని.. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ష‌ర్మిల చెబుతున్నారు. 10 ఏళ్లు దాటిన ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలు అభివృద్ది దూసుకెళుతుంటే.. ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని.. అయితే ఏ ఒక్క హామీ సైతం నెరవేరలేదని ష‌ర్మిల చెబుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా, రాజకీయ వివాదంగా మారి ప‌దేళ్ళైంది. అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకుండా ప్రధాని చేత నోటి మాట అనిపించి మమ అనిపించారు. ఆ తరువాత వచ్చిన బీజేపీకి అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసింది. రాజకీయ సుడిగుండంలో త‌మ అవసరాల మేరకు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌త్యేక హోదా ఈ అస్త్రాన్ని వాడుకుంటున్నాయి.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

జలగన్నకి జలగ లేఖ!

నమస్తే జలగన్నా. అలియాస్ జగనన్నా. నాపేరు జలగశ్రీ. నువ్వేమో సింబాలిక్ జలగవి.. నేనేమో రియల్ జలగని! నేను ఈమధ్యే పుట్టాను. నేను రక్తం పీల్చడానికి ట్రై చేస్తున్నప్పుడు అంత టాలెంటెడ్‌గా పీల్చలేకపోతున్నాను. దాంతో మా పెద్దలందరూ నా మీద చాలా సీరియస్ అవుతున్నారు. జలగ పుటక పుట్టి జలగలాగా రక్తం పీల్చలేకపోవడం దారుణమని అన్నారు. మనిషిలాగా పుట్టి జలగలా జనం రక్తం పీలుస్తున్న నీ దగ్గర్నుంచి మన జలగ జాతి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయని చెప్పారు. నువ్వు జనం రక్తం ఎలా పీల్చావో మా పెద్దలు వివరిస్తుంటే విని, నాకు జలగ జన్మ మీదే విరక్తి కలిగింది. నువ్వు ఇంత బాగా జనం రక్తం పీల్చుతున్నావు కాబట్టే నిన్ను అందరూ ప్రేమగా ‘జలగన్నా’ అని పిలుస్తున్నారని అర్థమైంది. నువ్వు జనం నుంచి ఏయే పద్ధతుల ద్వారా వాళ్ళ రక్తం పీల్చావో మా పెద్దలు చెబుతుంటే, నాకు లీటర్ రక్తం ఒకేసారి తాగినంత ఆనందం కలిగింది. నీ రక్తం పీల్చుడు చరిత్రని మావాళ్ళు చెప్తే విని తరించాను. అవి నేను మరోసారి నీముందు ప్రస్తావించి తరించాలని అనుకుంటున్నాను. -- ‘రక్తం’తో లింకు వున్న రెండు సంఘటనలను క్రియేట్ చేయడం ద్వారా లాస్ట్ టైమ్ నువ్వు అధికారంలోకి వచ్చావంటగా. -- వచ్చీరాగానే రాజధాని రైతుల రక్తాన్ని పీల్చావంటగా. -- ఐదేళ్ళపాటు దిక్కుమాలిన మద్యంతో జనం రక్తాన్ని జుర్రేశావంటగా. -- రోడ్లు వేయకుండా జనాన్ని హింసించింది, ఆ రోడ్ల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నీ రక్త దాహాన్ని తీర్చుకున్నావంటగా. -- వందలాది మంది రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం నీ రక్తదాహమేనంటగా. -- పారిశ్రామికవేత్తల రక్తాన్నీ పీల్చి వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశావంటగా. -- పన్నులతో, ఛార్జీల పెంపుతో, అవినీతి, అక్రమాలతో జనం రక్తాన్ని స్ట్రా వేసి లాగేశావంటగా. -- ఇసుక, గనులు, కొండలు... ఇలాంటి ప్రకృతి వనరులని పీల్చి పిప్పిచేశావంటగా. -- భారీ సంఖ్యలో దాడులు, రక్తపాతాలతో నీ రుధిరదాహం తీర్చుకున్నావంటగా. -- లక్షల కోట్లు అప్పులు చేసి, జనాన్ని రుణగ్రస్థుల్ని చేసి, తరతరాల ప్రజల రక్తాన్ని ఎలా స్వాహా చేశావో తెలిసింది. .... ఇలా చెప్పుకుంటూ వెళ్తే ‘జలగన్న’ రక్త చరిత్రలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో హైలైట్స్ తెలుసుకుని తరించాను. నీ దగ్గరకి వచ్చి రక్తం పీల్చడం ఎలా అనే పాఠాలు నేర్చుకోవాలని నాక్కూడా వుందిగానీ, నువ్వు నా రక్తాన్ని కూడా పీల్చేస్తావని భయపడి నీ దగ్గరకి రావడం లేదు.. బైబై జలగన్నా.

 పల్నాటి బొబ్బిలి బ్రహ్మానందరెడ్డి రాకతో మాచర్లలో టిడిపి గెలుపు ఖాయం 

పౌరుషానికి మారు పేరు పల్నాడు. అయితే జగన్ ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధాల  దోచుకుంటున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుంబిగించారు. పల్నాడు పౌరుషం, ఆత్మాభిమానం నిలువెల్లా నిండి ఉన్న జూలకంటికి జనం జేజేలు కొడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో జూలకంటి పేరు చెబితేనే జనం కేరింతలు  కొడుతున్నారు. జూలకంటి మాతృమూర్తి దుర్గాంబ కూడా ఇదే నియోజకవర్గం నుంచి విశేష సేవలందించారు. ఆమె గుడ్ విల్   బ్రహ్మానందరెడ్డి గెలుపుకు దోహదపడనుంది.  1999లో మాచర్ల నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరడానికి ప్రధాన కారణం దుర్గాంబ. అయితే ఈ సారి కూడా టిడిపి జెండా ఎగరేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. తల్లిదండ్రులిద్దరూ ఎమ్మెల్యేగా సేవలందించడంతో బ్రహ్మనందరెడ్డికి సానుకూలాంశం. బ్రహ్మానందరెడ్డి  తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా మాచర్ల శాసనసభకి పోటీ చేసి విజయం సాధించగా 1983 లో గురజాల నుండి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు , రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న బ్రహ్మానందరెడ్డి  ఈ సారి కూటమి అభ్యర్థిగా గెలుపొందే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. పల్నాడులో గత 20 ఏళ్ల నుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయిన నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. ఈ సారి టీడీపీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వడంతో గెలుపు సునాయసం కానుంది. జగన్ ప్రభుత్వం పట్ల ప్ర జా  వ్యతిరేకత రోజు రోజుకు ఎక్కువ కావడంతో బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని   తేలిపోయింది.పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.  1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎన్నికయ్యారు. 1955లో మాచర్ల తొలి ఎమ్మెల్యేగా సీపీఐ నేత మండపాటి నాగి రెడ్డి విజయం సాధించారు. 1962లో ముదావత్ కేశవ్ నాయక్ గెలవగా.. 1967లో వెన్న లింగా రెడ్డి గెలిచారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1972లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జూలకంటి నాగిరెడ్డి గెలుపొందగా.. 1978లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి చల్లా నారప రెడ్డి గెలుపొందారు.1983 నుంచి 1999 వరకు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ హవా నడిచింది. 1985 మినహా మిగతా నాలుగు పర్యాయాలు తెలుగు దేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. కానీ 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1983లో కొర్రపాటి సుబ్బారావు విజయం సాధించగా.. 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణ ప్రసాద్, 1994లో కుర్రి పున్నా రెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1985లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటుడు , దివంగత నేత  కృష్ణ విజయం సాధించారు.2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ ఏరి కోరి మరీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి టికెట్ కేటాయించింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులైన జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ ఇద్దరూ మాచర్ల ఎమ్మెల్యేలుగా పని చేశారు. నాగిరెడ్డి 1972లో ఇండిపెండెంట్‌గా గెలవగా.. దుర్గాంబ 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలనే ఉద్దేశంతో టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోటీ వుంటుంది... ఇందులో ఒకటి పిన్నెల్లి, మరోటి జూలకంటి కుటుంబం. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందినవారే బరిలోకి దిగుతుండటంతో  మాచర్ల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అధికార వైసిపి మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపింది. పల్నాడులో టీడీపీ కంచుకోటగా పిలువబడే మాచర్ల నియోజకవర్గానికి ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మనందరెడ్డిని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. బ్రహ్మానందరెడ్డికి  బాధ్యతలు అప్పగించడంతో కార్యకర్తలు, నాయకులు  అప్పట్లో పండుగ చేసుకుంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టాలంటే, అందుకు సరైనోడు జేబీఆర్ మాత్రమేనని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది. రెండేళ్ల క్రితం  మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జిగా నియమితులైన బ్రహ్మానందరెడ్డి  అటు పార్టీకి ఇటు ప్రజలకు విశేష సేవలందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలుపును కన్ఫర్మ్ చేశారు. 

ఏపీలో అధికారం కూటమిదే.. తేల్చేసిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు. బీజేపీకి అందిన నివేదిక ప్రకారం ఏపీలో తెలుగుదేశం కూటమి 145 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ ఫ్యాన్ కొట్టుకు పోతుందని5 పేర్కొన్నారు.  సునీల్ బన్సల్ చెప్పిన సంఖ్యలు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వెలువడిన సర్వేలను మించి ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎపీ ఎన్నికలపై దాదాపు 11 సర్వేలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదనే చెప్పాయి. ఇప్పుడు తాజాగా సునీల్ బన్సల్ కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీ కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ బీజేపీపై చిన్న పాటి విమర్శకూడా చేయడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ చేసిన ప్రకటనను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముస్లింలను దగా చేయడానికి రెడీ అయిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  పొత్తులో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం 144, బీజేపీ 10. జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. వీటిలో 145 స్దానాలలో కూటమి అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తున్నట్లుగా తమకు నివేదిక అందిందని సునీల్ బన్సల్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. అంటే మిగిలిన 30 స్ఖానాలనూ వైసీపీ కాంగ్రెస్ లు పంచుకుంటాయని భావించాల్సి ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా వైనాట్ 175 అన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి 30 కంటే తక్కువ స్థానాలే వస్తాయని సునీల్ బన్సల్ చెబుతున్నారు. ఇక  లోక్ సభ స్థానాలైతే మరీ కనాకష్టంగా రెండు కంటే తక్కువ వస్తాయని బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. సునీల్ బన్సల్ ప్రకటనపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 

జగన్ బ్యాండేజీ తీసేశారు.. సెప్టిక్ భయమే కారణమా?!

జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ ఆయన చేపట్టిన బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో ఆయనపై రాయి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన కంటి పైభాగాన గాయమైంది.   ఆ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్ ను పండించి ఎన్నికల గండం గట్టెక్కాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది. కోడికత్తి దాడిలా ఈ దాడి కూడా జగన్ పై ప్రజలలో సానుభూతి పొంగి పొర్లిపోయి ఓట్లు రాలుస్తుందని భావించింది. అయితే వైసీపీ ప్రయత్నం నవ్వుల పాలైందది. జగన్ ప్రతిష్ఠ దిగజారింది. ఆ దాడి జగన్ చేత జగన్ కోసం జగనే చేయించుకున్న దాడి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. వాటిని వేటినీ పట్టించుకోకుండా ఆ దాడి హత్యాయత్నమేననీ, దీని వెనుక ఉన్నది చంద్రబాబు, తెలుగుదేశమేననీ వైసీపీ నేతలు జనాలను నమ్మించడానికి శతధా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దాడి కేసులో తెలుగుదేశం నేతను ఇరికించడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. దాడి విషయంలో భద్రతా వైఫల్యం ఏమీ లేదనీ, పోలీసుల వైఫల్యం అస్సలు లేదనీ ప్రభుత్వ సలహాదారు మీడియా ముందుకు వచ్చి మరీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. అయినా  ఎన్నికల సంఘం నమ్మలేదు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పొలీస్ పై బదలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధులను కేటాయించాల్సిందిగా ఆదేశించింది.  దీంతో జగన్ పరిస్థితి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదన్నట్లు తయారైంది. దానికి తోడు కుట్లు పడేలా అయిన గాయానికి బ్యాండ్ ఎయిడ్ తో జనం ముందుకు వచ్చి ఏదో కాస్తయినా సెంటిమెంటును పిండుకుందామనుకున్నారు. అయితే గాయం తగిలిన వెంటనే వేసిన బ్యాండ్ ఎయిడ్ కూ డాక్టర్ల బృందం చికిత్స తరువాత వేసిన బ్యాండ్ ఎయిడ్ కు సైజులో వ్యత్యాసం ఉండటంతో జగన్ గాయంపై నెటిజన్లు సెటైర్లు వేశారు.   ఆ ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతుండటం కారణమో, వైద్యులు సరైన సలహా ఇవ్వలేదా? బ్యాండేజీ ఎక్కువ రోజులు ఉంటే గాయం మానదు, సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అంటూ డాక్టర్ సునీత చేసిన హెచ్చరికతో భయపడో తెలియదు కానీ జగన్ మొత్తానికి శనివారం బ్యాండ్ ఎయిడ్ లేకుండా దర్శనమిచ్చారు. సరే ఇక్కడ విశేషం ఏమిటంటే రాయిదాడిలో తగిలిన గాయానికి కొన్ని కుట్లు కూడా పడ్డాయని చెప్పుకున్న జగన్ రెండు వారాల తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ తీసేసిన తరువాత గాయం జరిగిన ప్రాంతంలో చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం విశేషం. ఈ జగన్మాయ ఏమిటి ముఖ్యమంత్రిగారూ అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  

పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ప్రచారం? మెగా హీరోలందరూ కూడా!

రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే గతంలోలా కాకుండా పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడంతో పాటు తాను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రోడ్ షోలతో జనాలకు దగ్గరౌతున్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలోని బహిరంగ సభలలో పాల్గొనేందుకు మాత్రమే జనసేనాని నియోజకవర్గం వదిలి వెడుతున్నారు. అలా నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి విజయమే లక్ష్యంగా అగుడులు వేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా జనసేనాని గెలుపు లక్ష్యంగా పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. జబర్దన్ కమేడియన్లు ఆది, గెటప్ శ్రీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా శనివారం నియోజకవర్గంలో తన చిన్నాన్న తరఫున ప్రచారం చేశారు.  ఇవన్నీ ఒకెత్తైతే మెగాస్టార్ చిరంజీవి త్వరలో పిఠాపురంలో  పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనుండటం కూటమికి గట్టి బలం కానుంది. అయితే చిరంజీవి ప్రచారానికి వస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా చిరంజీవి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. ఏవో సినిమాలలో రాజకీయాలను నేను వదిలినా అవి తనను వదలడం లేదన్న డైలాగులు వినా చిరంజీవి ప్రత్యక్షంగా రాజకీయ ప్రసంగాలు చేసిన సందర్భం కూడా లేదు. అయితే ఇటీవల మాత్రం చిరంజీవి బహిరంగంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరు ప్రచారం చేయడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా చెబుతున్నారు. చిరు ప్రచారంతో పిఠాపురంలో జనసేనానికి ఇక తిరుగే ఉండదని అంటున్నారు. చిరు ప్రచారం ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూటమికి పెద్ద బూస్ట్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు, ముఖ్యంగా మెగా హీరోలు జనసేనానికి మద్దతుగా ప్రత్యక్షంగా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.   

కేటీఆర్ విశ్వాసం లేని డాష్.. డాష్..!

శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలావరకు ఖాళీ అయిపోగా, అక్కడక్కడ మిగిలి వున్న పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్లర్లో కొన్ని లైన్లు పోస్టు చేశారు. తమ పార్టీ పుట్టుక సంచలనం అని, దారిపొడవునా రాజీలేని రణం.. అని ఏవేవో సోత్కర్ష లాంటి పదాలు పోస్టు చేశారు. ఇండియాలో ఎవరూ ఇంకొకరి డబ్బా కొట్టరు.. ఎవరి డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి కాబట్టి కేటీఆర్ ట్విట్టర్లో సొంతడబ్బా కొట్టుకున్నారని అనుకోవచ్చు. కానీ ఆయన అందులో వాడిన ఒక వాక్యం చూస్తుంటే, కేటీఆర్ని విశ్వాసం లేని డాష్.. డాష్ అన్నా తప్పులేదని అనిపిస్తోంది. ఇంతకీ ఆ పదం ఏమిటంటే, ‘పరపీడన చెర విడిపించిన ఉద్యమ జెండా’.. ఈ పదం రాయడానికి సిగ్గు లేకుండా అయినా వుండాలి.. లేదా బుద్ధి అయినా లేకుండా వుండాలి. కేటీఆర్ తండ్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు తెలుగువాళ్ళందరి మీద అధికారం చెలాయించాడా లేక తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించాడా? తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగతా మంత్రులుగానీ, ముఖ్యమంత్రులుగానీ తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించారా? బ్రిటీష్ వాళ్ళ మీద ఉపయోగించిన ‘పరాయి పాలన’ అనే పదాన్ని తోటి భారతీయుల మీద ఉపయోగించడమంత దుర్మార్గం మరొకటి వుండదు. అలాంటి దుర్మార్గాలు ఎన్నో చేసిన పాపం మూటగట్టుకుంది కేసీఆర్ ఫ్యామిలీ.  మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకునిపోయింది. ఆ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం తప్ప అన్ని స్థానాలు దక్కాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావాళ్ళు ఓట్లు వేయబట్టే బీఆర్ఎస్ పరువు హైదరాబాద్‌లో అయినా మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వున్న తెలంగాణ స్థానికులు అందరూ బీఆర్ఎస్‌ని బొందపెడితే, హైదరాబాద్‌లో తమ పార్టీ పరువు నిలిపింది ఆంధ్రావాళ్ళేననే విశ్వాసం కూడా లేని డాష్ డాష్ కేటీఆర్‌కి పార్లమెంట్ ఎన్నికలలో ‘పరాయి’ వాళ్ళు బుద్ధి చెబుతారు.

నిప్పుల కుంపటి తెలంగాణ!

వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర  ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.  మొత్తంమీద ఈ నాలుగు రోజులూ రాష్ట్రంలో సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. మండే ఎండలకు తోడు వేడి గాలులు కూడా వీస్తాయనీ, వడదెబ్బ ప్రమాదం హెచ్చుగా ఉంటుందనీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మేలని పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయనీ, ఉక్కపోత తీవ్రత ఎక్కువ అవుతుందని తెలిపింది.   ఇక వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకూ నమోదౌతున్నాయనీ, రానున్న రోజులలో ఇవి 50 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయనీ పేర్కొంది.