బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు...ఎందుకంటే?

  జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ కారు గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునీతపై వచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ఈ ఉప ఎన్నికలో అత్యధికంగా 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు.  

ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా

  తెలంగాణ క్యాబినేట్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా పదవులను సీఎం రేవంత్‌రెడ్డికి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. రామకృష్ణరావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (గవర్నమెంట్ అడ్వైజర్)గా నియమించారు.  మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్‌సాగర్ రావుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమించారు.. గత కొన్ని రోజులుగా ఇద్దరు సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారిని సంతృప్తిపరిచేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  వారి అనుభవాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకోవడంతో పాటు, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పి. సుదర్శన్ రెడ్డికి క్యాబినేట్ హోదా కల్పించారు. ఆయనకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రభుత్వ సలహాదారులు ఉండగా ఎవరికీ కేబినెట్ హోదా లేదని సుదర్శన్ రెడ్డిని ఒప్పించి క్యాబినేట్ హోదాలో సలహాదారుగా నియమించారు  

జ‌గ‌న్ ఒంటెత్తు పాల‌న‌.. కూట‌మి ప్ర‌జాస్వామిక‌ పాల‌న‌.. తేడా తెలిసిందిగా?

జ‌గ‌న్ పాల‌న గ‌త ఐదేళ్ల పాటు చూశాం. అంతా ఒంటెత్తు పోక‌డ‌. ఎక్క‌డా  పార‌ద‌ర్శ‌క‌త  అనేదే ఉండ‌దు. ప్ర‌జాస్వామిక‌త  అస్సలు కనిపించదు.  అంద‌రూ నోటికి తాళం వేసుకుని  ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇలా ఎవ‌రైనా స‌రే వారి వారి  స్వ‌శ‌క్తితో గెలిచిన‌ట్టుగా  జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లో భావించ‌రు. వారిని సంబంధం లేని  ప్రాంతాల‌కు పంపి పోటీ చేయించ‌డం ఇందులో భాగ‌మే. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెట్టినా వారంతా త‌న బొమ్మ మీద గెలుస్తార‌నే గ‌ట్టి న‌మ్మ‌కం.. మొత్తానికి జగన్ ది నియంతృత్వ పోక‌డ.  ఇదంతా ఇలా ఉంటే కూట‌మిలో కేవ‌లం సింగిల్ ఫేజ్ కాదు. ట్రిపుల్ ఫేజ్. ఏదైనా ఒక స‌మ‌స్య వ‌స్తే స్పందించ‌డానికి ఇక్క‌డ మూడు ర‌కాల ముఖ‌చిత్రాలున్నట్టు క‌నిపిస్తోంది. అందులో ఫ‌స్ట్ అండ్ మెయిన్ ఫేస్  సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న త‌న అనుభ‌వమంతా  రంగ‌రించి.. మ‌రీ రంగంలోకి దిగుతారు. ఇక్క‌డ రెండో ఫేస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌వ‌న్ నేర్చుకోవాల‌న్న త‌న ఉత్సాహాన్నంతా వాడి.. ఆయా స‌మీక్ష‌లు, స‌మావేశాలు, ప‌రిశీల‌న‌లు చేసి ఆదేశాలు ఇస్తుంటారు. ఇక థ‌ర్డ్ ఫేస్ ఆఫ్ కూట‌మి మంత్రి లోకేష్. నారా లోకేష్ త‌న తండ్రి  ద్వారా నేర్చుకున్న‌దంతా వాడి.. ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను వెతుకుతుంటారు. చాలా మంది కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ రెండింటినీ క‌లిపి డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ గా చెబుతుంటారు.   అలాగే ఇక్క‌డ ఏపీలో న‌డిచే కూట‌మి ప్ర‌భుత్వం   ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కార్ న‌డుస్తోందా? అంటే అవున‌నే  చెప్పుకోవాలి. అదే.. జ‌గ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ లో అయితే.. కేవ‌లం ఒకే ఒక్క మోనార్క్ జ‌గ‌న్ మాత్ర‌మే న‌డిపిస్తారు. అన్నీ త‌న‌కే తెలుసు అన్న కోణంలో చేసే  రొడ్డ  కొట్టుడు ప‌రిపాల‌న మాత్ర‌మే సాగింది. అదే కూట‌మిలో చంద్ర‌బాబుకూ, లోకేష్ కీ ఎంతో భిన్న‌మైన వైరుధ్యంతో కూడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌డెన్ ఎంట్రీ ఇచ్చి.. ఆయా ప‌నులు చ‌క్క బెట్ట‌డం  తెలిసిందే. ఆయ‌న ఒక డిప్యూటీ  సీఎంగా ఏ విష‌యం లోనైనా త‌న అభిప్రాయాల‌ను వెలిబుచ్చుతుంటారు. ఆపై కొన్ని కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలూ తీసుకుంటూ ఉంటారు.  ఇది క‌దా ప్ర‌జాస్వామిక ప‌రిపాల‌న అంటే.. జగన్ ఒంటెత్తు పాలనకూ.. కూటమి ప్రజాస్వామిక పాలనకూ తేడా ఇక్కడే కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్

తెలంగాణ కేబినెట్ లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజారుద్దీన్ సభ్యుడయ్యారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అజారుద్దీన్ సీఎం రేవంత్ కు కృతజ్ణతలు తెలిపారు.  కాగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు గురువారం (అక్టోబర్ 30) నాడే చేశారు. శుక్రవారం  (అక్టోబర్ 31) ఉదయం సరిగ్గా 12.15 గంటలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్దమంటూ బీజేపీ నేతలు పాయల శంకర్‌, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు  గురువారం (అక్టోబర్ 30)  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్‌ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమంటే ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదును సుదర్శన్‌రెడ్డి ఈసీ పరిశీలన కోసం పంపారు. అయితే  ప్రమాణ స్వీకారానికి ఎన్నికల కోడ్ అడ్డురాదన్న క్లారిటీ రావడంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా సాగిపోయింది. 

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రేపు

తెలంగాణ కేబినెట్ లో అజారుద్దీన్ చేరనున్నారు. రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ చేరికకు ముహూర్తం ఖారారైంది. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12గంటల 15 నిముషాలకు అజారుద్దీన్ మంత్రగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  రాజ్ భవన్ లో ఆయన  చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు తెలిపారు.    ఇలా ఉండగా అజారుద్దీన్‌కి హోం లేదా మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలియవస్తున్నది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేసి ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకుంటున్నారు.  కాగా జూబ్లీ ఉప ఎన్నిక వేళ  అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించింది.  అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మైనారిటీ వర్గాలకు మంత్రిపదవి ఇస్తుంటే బీజేపీకి అభ్యంతరం ఎందుకని డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క అన్నారు. అలాగే  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అయితే అజారుద్దీన్ కు మంత్రిపదవిపై బీజేపీ అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే, బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారన్నారు.   రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని   బీజేపీ గతంలో  మంత్రిని చేసిందని గుర్తు చేశారు.  శ్రీ గంగానగర్ జిల్లా  శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ  అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ను ఉప ఎన్నికకు సరిగ్గా 20 రోజుల ముందు మంత్రిని చేసిందనీ, అటువంటి బీజేపీ ఇప్పుడు అజారుద్దీన్ ను మంత్రిని చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతోందని ప్రశ్నించారు. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయ‌స్సుకోసం కృషి చేస్తార‌న్న న‌మ్మ‌క‌ముందన్నారు.

కావలి ఎమ్మెల్యేపై దాడియత్నం

కావలి  తెలుగుదేశంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.మాలేపాటి సుబ్బారాయుడు, మాలేపాటి భాను చందర్ ల ఉత్తర క్రియల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డిని మాలేపాటి సుబ్బారాయుడు అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో ఆయనపై దాడికి కూడా ప్రయత్నించారు.  మాలేపాటి  సుబ్బా నాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డే కారణమంటూ ఆయన కారు అద్వాలను ధ్వంసం చేశారు.  ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నేతలు మాలేపాటి అభిమానులను ఆపడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. మాలేపాటి అనుచరుల నిరసనలతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు.   తొలి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చిన మాలేపాటిని కాదని గత ఎన్నికలలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన కావలి కృష్ణారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా మాలేపాటి సుబ్బారాయుడికి కీలక పదవి ఇస్తానన్న హామీ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పదవి అయితే వచ్చింది కానీ, నియోజకవర్గంలో ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయిందని అప్పటి నుంచీ మాలేపాటి అభిమానులు ఆరోపిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో మాలేపాటి ఆస్తులపై దాడులు జరిగాయి.   ఎమ్మెల్యే నుంచి వేధింపులు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితోనే మాలేపాటి తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యం పాలయ్యారని ఆయన అభిమానులు చెబుతారు. ఆ కారణంగానే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై మరణించారనీ మాలేపాటి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఉత్తర క్రియలకు హాజరైన కావ్య కృష్ణారెడ్డిపై దాడి యత్నం జరిగిందని అంటున్నారు. 

ఎన్నేళ్లకెన్నేళ్లకు.. కోర్టు మెట్లెక్కనున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మిన‌హాయింపు పొందుతూ వచ్చారు. అలా మినహాయింపు పొందడానికి ఆయన చెబుతూ వచ్చిన  కారణం పాలనాపరమైన బాధ్యతలు. అయితే 2024 ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా కాదు. అయినా ఇప్పటి వరకూ ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరైంది లేదు. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదంటున్నారు సీబీఐ అధికారులు. ఇక ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ముందు వచ్చే నెల 14న హాజరు కాకతప్పదు. అంటే ఏడేళ్ల తరువాత తొలి సారిగా నవంబర్ 14 జగన్ నాంపల్లి  కోర్టు మెట్లెక్కనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారిస్తున్నసీబీఐ కోర్టు ఎదుట ఆయన హాజరు కానున్నారు.  ఇటీవల జగన్ సకుటుంబ సమేతంగా లండన్ పర్యటించారు. ఆ సమయంలో లండన్ పర్యటనకు కోర్టు అనుమతస్తూ విధించిన షరతును జగన్ ఉల్లంఘించారు. కోర్టు ఆదేశాల మేరకు జగన్ తన కాంటాక్ట్ ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా జగన్ అందుకు భిన్నంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అయితే దానిపై కోర్టు నిర్ణయం తీసుకునేలోగానే జగన్ లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేశారు. అయితే ఇటీవలి విచారణలో కోర్టు ఆయనను తదుపరి విచారణకు తప్పని సరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు నవంరబ్ 14న జరిగే విచారణకు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తీరాలి.  

చంద్రబాబుకు ఎప్పుడూ బెటర్ దేన్ ది బెస్టే కావాలి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నోట తన మంత్రివర్గ సహచరుల గురించి కానీ, పార్టీ కేడర్, అధికారుల గురించి పొగడ్త రావడం అత్యంత అరుదు. ఎంద కష్టపడి పని చేసినా, ఓకే ఇంకా బాగా చేయాలి అన్న మాటలే ఆయన నుంచి తరచూ వింటుంటాం. నిజమే ఆయన ప్రతి విషయంలోనూ కేడా బెటర్ దేన్ ది బెస్ట్ కావాలంటారు. అందుకే బాగా పని చేసిన వారిని ఆయన భేష్ అంటూ భుజం తట్టి అభినందించినా.. మరుక్షణంలోనే ఇంకా బాగా చేయాలన్న మాట కూడా వస్తుంది. అటువంటి చంద్రబాబు తాజాగా అధికార యంత్రాంగాన్నీ, తన మంత్రివర్గ సహచరులను, కూటమి ఎమ్మెల్యేలను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మాండంగా పని చేశారంటూ కితాబులిచ్చేశారు. సందర్భం ఏమిటంటే మొంథా తుపాను సమయంలో నష్టాన్ని కనిష్ఠానికి తగ్గించేందుకు మొత్తం యంత్రాగం, కేబినెట్, పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్రాంతంగా శ్రమించి ఫలితం సాధించారు. దీనిపై ఆయన ఫిదా అయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌చివాల‌య సిబ్బంది ప‌గ‌లు రేయి తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో సేవ‌లు అందించారనీ, ఇళ్లకు కూడా వెళ్ల కుండా కార్యాలయాలలోనే ఉండి నిరంతరం పరిస్థితిని గమనిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారనీ చంద్రబాబు ప్రశంసించారు.   అలాగే అలసత్వం వహిస్తున్నారు అంటూ నిన్నమొన్నటి దాకా చంద్రబాబు ఆగ్రహాన్నే చవి చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబు ప్రశంసలకు పాత్రులయ్యారు.  తుఫాను నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో  పర్యటనలు చేస్తూ ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా దగ్గరుండి మరీ పని చేయడాన్ని ఆయన అభినందించారు.  ఎమ్మెల్యులు, మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాలలోని ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు చేర్చ‌డమే కాకుండా అక్కడే ఉండి వారితో పాటు అక్కడే భోజనం చేయడం చంద్రబాబు ప్రశంసలకు పాత్రమైంది. దీంతో చంద్రబాబు తన అలవాటుకు ప్రకారం ఇంకా బాగా పని చేయాలంటూ ముక్తాయించకుండా, వారి సేవలను, శ్రమను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు ఎప్పటికీ మననే ఆదరిస్తారంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు.  

అజారుద్దీన్ కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా జూబ్లీ బైపోల్ లో ప్రయోజనం పొందుదామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు సొంత పార్టీ నుంచే కాకుండా, బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముందుగా కాంగ్రెస్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా తనకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలంటూ ఊరూవాడా ఏకం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అజారుద్దీన్ కు మంత్రి పదవి వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తాను పార్టీ వీడడానికి కూడా వెనుకాడబోనని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. సరే కాంగ్రెస్ లో ఇలాంటి అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులూ సహజమేనని లైట్ తీసుకున్నా.. బీజేపీ ఏకంగా అజారుద్దీన్ కు మంత్రిపదవిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.  వాస్తవానికి అజారుద్దీన్ కు రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతన్న మాట వాస్తవమే అయినా, ఇందుకు శుక్రవారం (అక్టోబర్ 31) ముహూర్తం అని గట్టిగా వినిపిస్తున్నా... ఇందుకు సంబంధించిన అదికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే బీజేపీ ఆజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకునే కార్యక్రమం వాయిదా పడేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు  పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి గురువారం (అక్టోబర్ 30) ఉదయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జూబ్లీ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడమంటే.. ఈ ఎన్నికలో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని బీజేపీ అంటోంది.  చూడాలి మరి ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందో? 

మంత్రి వ‌ర్గంలోకి అజారుద్దీన్.. అల‌క‌లో రాజ‌గోపాల్ !?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల వేళ‌..  అజ‌హరుద్దీన్ కి మంత్రి వ‌ర్గంలోకి చోటు క‌ల్పించి ఇటు ఎంఐఎం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు క‌వ‌ర్ చేస్తూనే.. అటు గ‌తంలో ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీని కి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. వారిని మ‌రింత ఆక‌ట్టుకునే య‌త్నంలో  కాంగ్రెస్ ఉంది. అయితే.. అజ‌హరుద్దీన్ కి మంత్రి ప‌ద‌వి ఇవ్వాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు...    ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌న్న‌ప్ప‌టి  రేవంత్ కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది.  దానికి తోడు ఇప్ప‌టి వ‌ర‌కూ కేబినెట్ లో మైనారిటీకి చోటు లేకపోవడంతో అజార్ కు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  అదే స‌మ‌యంలో హోం మంత్రిత్వశాఖఎలాగూ రేవంత్ ద‌గ్గ‌రే ఉంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకోవ‌డంతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స‌మ‌యంలో  అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా  స్వామికార్యం-  అంటే న‌వీన్ కార్యం కూడా పూర్తి చేయాల‌న్న‌ది రేవంత్ స్కెచ్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గ‌తంలో ఆరు మంత్రి ప‌ద‌వులు ఖాళీగా ఉండ‌గా.. వాటిలో మూడింటిని మాత్ర‌మే ఇచ్చి మిగిలిన మూడింటినీ అట్టేపెట్టి ఉంచారు. ఇదంతా ఇంఛార్జ్ మీనాక్షీ  నటరాజన్ ఆలోచ‌న‌. ఇప్పుడు అవ‌స‌రానికి ఇందులో ఒక మంత్రి ప‌ద‌వి బ‌య‌ట‌కు తీశారు. మిగిలిన రెండింటి ప‌రిస్థితి ఏంట‌ని చూస్తే.. ఇప్ప‌ట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.   దీంతో గ‌త కొన్నాళ్లుగా మంత్రి  ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్న రాజ‌గోపాల్ రెడ్డి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు.. అస‌లీ పార్టీలోనే ఉండ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌న్న వ‌దంతి ఒక‌టి గుప్పు మంటోంది. ఇటు అజ‌హరుద్దీన్ కి మంత్రి ప‌ద‌వి ఇస్తారో లేదో  కానీ అటు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపార్టీ వీడేలా  క‌నిపిస్తోంది. రాజ‌గోపాల్ రెడ్డి గ‌తంలో కూడా ఇలాగే పార్టీ వీడి త‌ర్వాత తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కూ ఆయ‌న‌కున్న భావ‌ప్ర‌క‌ట‌నా  స్వేచ్ఛ‌కు కాంగ్రెస్ లో త‌ప్ప మ‌రెక్కడా వీలు కాదు. కాబ‌ట్టి.. ఆయ‌న వెళ్తే వెళ్లాడు-మ‌ళ్లీ వ‌చ్చేస్తాడులెమ్మ‌న్నభావనలో అధిష్టానం ఉన్న‌ట్టుగా స‌మాచారం. మ‌రి చూడాలి ఈ ప‌రిణామ క్ర‌మాలు ఏ రీతిన మారుతాయో తేలాల్సి ఉంది.

ఓట్ల కోసం నరేంద్ర మోదీ కూడా చేస్తారు : రాహుల్ గాంధీ

  బీహార్ ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతు ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏమైన చేస్తారని..డ్యాన్స్ చేయాలని అడిగితే మోదీ వేదికపైనే డ్యాన్స్ చేస్తారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చత్ పూజ సందర్బంగా ప్రజలు ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజలు చేసుకుంటున్నారు. కానీ ప్రధాని ప్రత్యేకంగా తయారు చేసిన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారని రాహుల్ విమర్శించారు.  బీహార్‌లో బీజేపీ నేతలు ఓట్ల చోరీలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానలో ఓట్ల దొంగిలించారని బీహార్‌లోనూ అదే ప్రయత్నిస్తారని అగ్రనేత తెలిపారు. బీజేపీ కేవలం సీఎం నీతీశ్ కుమార్‌ను వాడుకుంటోంది.  దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బిహార్‌ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు.   మహాగఠ్‌బంధన్‌ అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్‌  హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్‌ హయాంలోనే నాంది పడిందని విపక్ష నేత తెలిపారు  

బాధ్యత వద్దు..విమర్శలే ముద్దు.. జగన్ పై లోకేష్ ఫైర్

మొంథా తుఫాను.. ప‌లు ప్ర‌భావిత జిల్లాల ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేసింది. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అన్న ఆందోళనలో క్షణమొక యుగంగా గడిపారు. కానీ వారిని మించి.. ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బందీ లేకుండా తుపాను గండం గడిచేలా చేయడానికి ముఖ్యమం్తరి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ రెండు రోజులూ కంటిమీద కునుకు సంగతి పక్కన పెడితే రెప్ప కూడా వాల్చకుండా అప్రమత్తంగా ఉన్నారు. నిరంతర సమీక్షలతో, ఆర్టీజీఎస్ నుంచి క్షణం క్షణం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తూ, వాతావరణ కేంద్రం నుంచి వచ్చే సంకేతాలను, సందేశాలను పరిశీలిస్తూ గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకధాటిగా 12 గంటల పాటు ఆర్టీజీఎస్ లోనే తిష్ఠవేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించారు.  ఇలా అనుక్షణం ప్రజల క్షేమం కోసం, తుపాను నష్టాన్ని కనిష్ఠస్థాయికి తగ్గించడం కోసం తపనపడ్డారు. తుపాను తీరం దాటిన తరువాత నష్టం అత్యంత తక్కువగా ఉండటంతో ఆయన శ్రమ ఫలించింది. అయినా ఆయన క్షణం తీరిక చేసుకోలేదు. వెంటనే అంటు బుధవారం (అక్టోబర్ 29) తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వేకు బయలుదేరడానికి ముందు ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను స్పీడప్ చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సూచనలు చేశారు.    అయితే.. ప్రజలు కష్టాలలో ఉన్న సమయంలో ఏ నాయకుడైనా సరే.. అధికారంలో ఉన్నా, లేకున్నా బయటకు వచ్చి ప్రజలకు సహాయ హస్తం అందించాలి. ఇది కనీస బాధ్యత. అలా బయటకు వచ్చేందుకు మనస్కరించకుండా నోరు మెదపకుండా.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు, బాధితులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ సైలంట్ గా ఉండాలి. కానీ వైసీపీ ఎకో సిస్టమే వేరు. ఆ పార్టీ తాను చేయదు.. మరొకరు చేస్తుంటే ఓర్వదు. మొంథా తుపానును ఎదుర్కోవడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా సర్వశక్తులూ ఒడ్డి ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటుంటే.. వైసీపీయులు మాత్రం సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఎత్తి చూపించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన సంక్షోభ సమయంలో కరుణ ఉన్న నాయకుడెవరైనా సరే ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వస్తారనీ, అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటూ.. తన మీడియా నెట్ వర్క్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.  అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తమది ప్రజల ప్రభుత్వమని పేర్కొన్న లోకేష్ మొంథా తుపాను కారణంగా ప్రజలు ఎటువంటి కష్టనష్టాలూ ఎదుర్కోకుండా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. ఆ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు.   ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న జగన్.. మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కనీసం తాడేపల్లికి కూడా రాకుండా బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటూ అబద్ధాల ప్రచారానికి పాల్పడు తున్నారని విమర్శించారు.  కష్టసమయంలో ప్రజలకు అండగా నిలవడానికి బదులుగా  బెంగళూరులో రెస్ట్ తీసుకోవడాన్నే జగన్ ఎంచుకున్నారని లోకేష్ విమర్శించారు. 

చంద్రబాబు సర్కార్.. టీమ్ఆంధ్రా!

సోషల్ మీడియా లో వైసీపీ పోస్టులు వెగటు పుట్టిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.   మొంథా తుపాను ప్రభావ తీవ్రతను గుర్తించి.. సాధ్యమైనంత వరకూ ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేయాలన్న తపనతో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,  హోం మంత్రి వంగలపూడి అనిత, మానవ వనరుల  మంత్రి నారాలోకేష్ నిర్విరామంగా ఆర్టీజీఎస్ లో కూర్చుని సమీక్షలు, పర్యవేక్షణ చేయడంపై వైసీపీయూలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. పెను తుపాను నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డి విజయం సాధించిన విషయం తుపాను తీరం దాటిన తరువాత అందరికీ అవగతమైనా.. వైసీపీయులు మాత్రం ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చుని షో చేశారంటూ పోస్టులు పెట్టడంపై సామాన్య జనాలలో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  తీరా తుపాను దాటి.. నష్టం కనిష్ట స్థాయికి తగ్గించడానికి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం, అధికారులు చేసిన కృషి, తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన తరువాత  తీరిగ్గా కొందరు అసలు తుపాను ప్రభావం ఏమీ ఆంధ్రప్రదేశ్ మీద లేదు అంటూ మాట్లాడటం చూస్తుంటే వీరిక మారరా అన్న అభిప్రాయం కలుగుతోందంటున్నారు.  కాకినాడ ఓడరేవులో 10 వ నంబర్ ,మచిలీపట్నం పోర్టులో ఎనిమిదో నంబర్  ప్రమాద సూచికలు ఎగురవేసినా అవి వీరికి కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తి లో స్వర్ణముఖి నది పొంగి, కాళహస్తి రోడ్లు మునిగిపోయాయిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఇప్పుడు మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు  స్వర్ణముఖి నది పొంగి ప్రవహించింది. కాళహస్తి రోడ్లు జలమయమయ్యాయి. ఆ పరిస్థితి కళ్లెదుట కనిపిస్తున్నా.. వీళ్ల కళ్లకు కనబడటం లేదా అని నిలదీస్తున్నారు. పెట్టుబడుల కోసం లోకేష్ ఆస్ట్రేలియాలో, చంద్రబాబు దుబాయ్ లలో పర్యటించి, ఒక రోజు విశ్రాంతి కోసం హైదరాబాద్లో మకాం వేస్తే.. విమర్శిస్తున్న వీరు, రాష్ట్రం తుపాను పంజాకు విలవిలలాడుతున్నా.. రాష్ట్రం ముఖం చూడకుండా బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్ గురించి ఎందుకు మాట్లాడరని పరిశీలకుల నుంచి సామాన్య జనం వరకూ ప్రశ్నిస్తున్నారు.  మొత్తంగా మొంథా తుపాన్ బారి నుంచి రాష్ట్రం కనిష్ట నష్టంతో  బయటపడిందంటే అందుకు కారణం చంద్రబాబు నాయకత్వంలో మంత్రులు, అధికారులూ అంతా టీమ్ఆంధ్రా అన్నట్లుగా కృషి చేయడమేనని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సినీ కార్మికుల‌కు వ‌రాలు.. సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా?

ఒక ప‌క్క న‌వీన్ యాద‌వ్.. త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి కేటీఆర్ కి స‌వాల్ విసిరి.. తానేంటో ప్రూవ్ చేసుకోడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఓట‌ర్లే టార్గెట్ గా కొన్ని లెక్క‌లు స‌రి  చేస్తున్నారు. అవెలాంటి లెక్క‌లో చూస్తే.. బేసిగ్గా జూబ్లీహిల్స్ అన‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది సినిమా జ‌నాలు.  కృష్ణాన‌గ‌ర్, ఇంద్రా న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో అధికంగా నివ‌సించే సినీ కార్మికుల ను ఆక‌ట్టుకునేలా రేవంత్ వ‌రాల జ‌ల్లు కురిపించేశారు. ఇక‌పై పెద్ద పెద్ద సినిమా హీరోల సినిమాల టికెట్ ధ‌ర‌లుపెంచాలంటే లాభాల్లో 20 శాతం వాటా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలా సినీ కార్మికుల‌ను క‌ల‌వ‌డానికి ఏ సీఎం కూడా రాలేద‌నీ.. తాను అలాక్కాద‌ని.. మీ వ‌ల్లే మ‌న తెలుగు సినిమా ఏకంగా ఆస్కార్ మెట్లు ఎక్కింద‌ని.. అలాంటి కార్మికుల‌కు సీఎం గా కాకుండా ఒక ఇంటి స‌భ్యుడిగా మీ ముందుకు వ‌చ్చాన‌నీ.. వ‌చ్చే న‌వంబ‌ర్ చివ‌రి వారంలో.. మిమ్మ‌ల్ని త‌ప్ప‌క క‌లుస్తాన‌నీ.. ఆపై డిసెంబ‌ర్ 9న మీపై వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ఖాయ‌మ‌ని అన‌డంతో ఒక్క‌సారిగా వారిలో ఆనందం పొంగిపొర్లింది. ఇదిలా ఉంటే హఠాత్తుగా సీఎంకు సినీ కార్మికులపై ప్రేమ పొంగి పొర్లడానికి ఇక్క‌డ అధికంగా ఉండే సీమాంధ్ర సెటిలర్స్, అలాగే ఒక సామాజిక వర్గం కారణమని అంటున్నారు.  సీఎం ఇలా వీరందరినీ కలసే విషయంలో  మంత్రి  తుమ్మ‌ల కీల‌క పాత్ర వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా  ఇటు క్లాస్ అటు మాస్ రెండు వ‌ర్గాల ఓట‌ర్ల‌ను జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ కలయిక ద్వారా సీఎం క‌వ‌ర్ చేశారు సీఎం రేవంత్. దీంతో న‌వీన్ గెలుపు న‌ల్లేరు న‌డ‌క అన్న ధీమా కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది.

జూబ్లీ ఉప ఎన్నిక.. మంత్రులకు కీలక బాధ్యతలు

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. యూసఫ్ గూడ డివిజన్  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్  రహమత్ నగర్ డివిజన్‌కు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంగల్ రావు నగర్ డివిజన్‌‌కు  తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సోమాజిగూడ డివిజన్‌‌కు   శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్  బోరబండ డివిజన్ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి  షేక్ పేట్ డివిజన్‌‌కు  కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి ఎర్రగడ్డ డివిజన్‌‌కు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ప్రచార బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు జూబ్లీ బైపోల్  కీలక దశకు చేరుకున్నది. ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీల నేతలూ చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.  మరోవైపు బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దానిని మరింత ముమ్మరంచేసింది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్‌, హరీశ్‌ రావు గత వారం రోజులుగా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది.    

తుపాను వేళ.. జగన్ ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు మంగళవారం (అక్టోబర్ 28) ఓ పిలుపు నిచ్చారు. మొంథా తుపాను సమయంలో బాధితులకు అండగా నిలవాలి, సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలన్నది ఆ పిలుపు సారాంశం. సరే  రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉండాలన్న పిలుపునివ్వడం ముదావహం. కానీ ఇంతకీ ఆ పిలుపునిచ్చిన నాయకుడు ఎక్కడున్నారు? రాష్ట్రాన్ని పెను తుపాను అతలాకుతలం చేస్తుంటే.. దగ్గరుండి పార్టీ శ్రేణులకు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేలా దిశా నిర్దేశం చేయాల్సిన ఆయన రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడకుండా.. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతిగా కూర్చుని పార్టీ నేతలూ, శ్రేణులను సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలంటూ పిలుపునచ్చి చేతులు దులిపేసుకోవడమేంటని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు బెంగళూరు వెళ్లారు. ఆయన ముందుగా నిర్ణయించిన మేరకు మంగళవారం (అక్టోబర్ 28)కి తాడేపల్లి రావాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా విమానాలు రద్దు కావడం వల్ల రాలేకపోతున్నారంటూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ.. శుక్రవారం నుంచే రాష్ట్రాన్ని పెను తుపాను ముప్పు ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆదివారం (అక్టోబర్ 26)నాటికి అయితే తుపాను తీవ్రత అధికంగా ఉండబోతోందన్న క్లారిటీ కూడా వాతావరణ శాఖ ఇచ్చేసింది. తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందనీ ప్రకటించింది. అంటే జగన్ కు  తుపాను సహాయ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో సీరియస్ నెస్ ఉంటే.. ఆదివారమే బయలుదేరి తాడేపల్లికి చేరుకోవచ్చు. కానీ మంగళవారం వరకూ అంటే తుపాను తీరం దాటే రోజు వరకూ బెంగళూరులోనే ఉండిపోయారు. ఇప్పుడు తీరిగ్గా విమానాలు రద్దయ్యాయి కనుక రాలేకపోతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేయించారు.  అయితే జగన్ తీరు తొలి నుంచీ ఇదే విధంగా ఉందనీ, గతంలో కూడా ఆయన విపత్తు సమయంలో కాకుండా, ఆ తరువాత అంతా సర్దుమణిగాకా ఆర్భాటంగా పరామర్శ యాత్రలు చేసే వారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఆయన సీఎంగా ఉన్న సమయంలో విపత్తులు సంభవించిన సమయాలలో కూడా ఆయన తీరిగ్గా వీలు చూసుకుని ఓ సారి వెళ్లి పరామర్శించి రావడం తప్ప సహాయ పునరావాస కార్యక్ర మాలను పర్యవేక్షించి, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సందర్భం లేదని అంటున్నారు.

ఆంధ్రా ఫస్ట్.. చంద్రబాబు బెస్ట్!

నాలుగు దశాబ్దాలకు పైబడిన ప్రజా జీవితంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని రాజకీయ వైరంతో విమర్శలు చేసే వారు ఉంటే ఉండొచ్చు కానీ, దార్శనికత, పాలనా దక్షతకు సంబంధించి ఆయనను వేలెత్తి చూపేవారెవరూ దాదాపు ఉండరనే చెప్పాలి. ఎప్పుడో.. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వమే..  కొండలు గుట్టల నడుమ చంద్రబాబు నాయుడు  ముందు చూపుతో  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై ఇప్పుడు సైబరాబాద్ గా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ నాడు చంద్రబాబు విజన్  యువత  భవితకు బంగరు బాటలు పరిచింది. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు.. కాదనలేరు.  నిజానికి ఐటీ అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ కూడా చంద్రబాబే గుర్తుకు వస్తారు.  చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. రాజకీయ విభేదాలతో ఆయన ఘనతను పొలిటీషియన్లు బాహాటంగా అంగీకరించకపోవచ్చు.. కానీ మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని అధికారులు, అందులోనూ కేంద్రంలో ఉన్నత స్థాయిలో  వివిధ విభాగాలకు అధిపతులుగా పని చేసిన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అవ్వడమే కాదు.. పదవీ విరమణ తరువాత వారి ఆత్మకథలలో చంద్రబాబు విశిష్ఠతను, ఆయన ఔన్నత్యాన్ని గొప్పగా ప్రస్తావించారు. ప్రస్తావిస్తున్నారు.  అలాంటి వారిలో నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్‌.  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ లు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని వారే. పైగా వారు చంద్రబాబును ప్రస్తుతిస్తూ, ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప.. ఎవరి ఒత్తడి, ప్రోద్బలంతో చేశారని అనుకునేందుకు అవకాశమే లేదు.    ముందుగా నీతి ఆయోగ్ మాజీ  సీఈవో అమితాబ్ కాంత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో విశాఖ‌కు గూగుల్‌ డేటా కేంద్రం రావ‌డంపై స్పందించారు.  విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అన్నది మామూలు వ్యక్తులు, సీఎంల వల్ల సాధ్యమయ్యే పని కాదనీ,  చంద్రబాబు వంటి విజనరీ వల్ల మాత్రమే సాధ్యమౌతుందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి విశాఖపట్నాన్ని మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ను, ఇండియాను కూడా ప్రపంచానికి మేటిగా నిలబెడతాయని పేర్కొన్నారు.   ఇది కూడా చదవండి అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ గార్గ్ కూడా చంద్రబాబు ఆంధ్రాఫస్ట్ విధానాన్ని ఒకింత క్రిటికల్ గా ప్రశంసించారు. చంద్రబాబు స్వార్థపరుడు అంటూనే.. ఆయన స్వార్థం వ్యక్తిగతమైనది కాదనీ, ఏపీని అత్యున్నతంగా నిలబట్టాలన్నదే ఆయన స్వార్థమని పేర్కొన్నారు. చంద్రబాబు   విజ‌న్‌.. ప్రణాళిక‌లు అనితర సాధ్యమంటూ ఆయన తన బయోగ్రఫిలో పేర్కొన్నారు. గ‌తం లో వాజ‌పేయిని ఒప్పించి ఉమ్మ‌డి రాష్ట్రానికి స్వ‌ర్ణ చ‌తుర్భుజి జాతీయ ర‌హ‌దారులు తెచ్చుకోవడాన్నీ, ఇప్పుడు ప్రధాని మోడీని మెప్పించి.. పలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా చేసుకుంటున్నారనీ వివరించారు.  నిజమే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు కాదు.. ఆంధ్రఫస్ట్ అన్నదే నినాదం. అందుకే చంద్రబాబు   అవకాశం వచ్చిన ఏ సందర్భంలోనూ ఆయన  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడలేదు.  రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మాత్రమే పాటుపడుతున్నారు. అవకాసం ఉన్న అన్ని విధాలుగానూ కేంద్ర నిధుల కోసం  వెంట పడుతున్నారు.   కేంద్రం ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రానికి  ప్రాజెక్టుల్ని ప్రటికటించేలా తన పరపతిని ఉపయోగిస్తున్నారు. 

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం : టీపీసీసీ చీఫ్

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధిక మెజార్టీతో గెలవడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.  అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వర్తించాల్సిన అవసరాన్ని ఆయన హితవు పలికారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా నేతలతో చర్చించి, ప్రచార వ్యూహంపై మార్గదర్శకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించేలా అందరూ కృషి చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వివిధ డివిజన్‌లకు బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారు.

కొడాలి నాని కొత్త లుక్.. ఇలా అయిపోయారేంటి?

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సోమవారం (అక్టోబర్ 27) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఇద్దరు మాజీలూ తిరుమలలో కలిసి తిరగడం కనిపించింది. అయితే ఈ ఇద్దరిలో కొడాలి నాని మాత్రం పూర్తి కొత్త లుక్ లో కనిపించారు. సన్నగా, పీలగా పూర్తిగా గుండుతో  ఆయన గుర్తుప ట్టలేనంతగా మారిపోయారు. కొడాలి నాని ఇటీవలే అనారోగ్యం నుంచి కోలకుున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన బయట కనిపించడం  అన్నది చాలా చాలా అరుదుగా జరుగుతోంది. ఇటీవలే జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా ఒక సారి కనిపించారు. వైసీపీ నాయకులతో కలిసి విమానాశ్రయంలో  జగన్ కు స్వాగతం పలికారు. ఆ తరువాత కొడాలి నాని బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి.