వైభవంగా బాలయ్య కుమార్తె వివాహం
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహం ఈ రోజు హైటెక్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం 8.52గంటలకు వరుడు శ్రీభరత్, వధువు తేజస్విని మెడలో మూడుముళ్లు వేసారు. ఈ వివాహం కార్యక్రమాన్ని టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. బాలకృష్ణ స్వయంగా అతిధులందరినీ ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పెళ్లికి ఆయన అల్లుడు, నందమూరి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వదూవరునలు ఆశీర్వదించేందుకు... కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఎంపీ నామా నాగేశ్వరరావు, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ, మోహన్ బాబు, మంచు లక్ష్మీప్రసన్న, మోత్కుపల్లి నర్సింహులు, ఈనాడు అధినేత రామోజీరావు, కేంద్రమంత్రి చిరంజీవి లతో పాటు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.