కొత్త స్నేహితులకోసం మోడీ ప్రయత్నాలు ఫలించేనా

  బీజేపీ కొత్త రధ సారధిగా నరేంద్ర మోడీ పేరు ఖాయం చేయగానే, ఆ పార్టీకి బీహార్ లో మంచి బలమయిన స్నేహితుడిగా పేరున్ననితీష్ కుమార్ బీజేపీ అధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీయే కూటమి నుండి తప్పుకోవడంతో, ఆ లోటును తిరిగి భర్తీ చేయవలసిన భాద్యత సహజంగానే మోడీపై పడింది.   అందుకే నిన్న హైదరాబాద్ లో జరిగిన నవభారత్ యువ భేరీ సభలో ప్రసంగిస్తూ స్వర్గీయ యన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి, కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టడమే ఆయనకు అసలయిన నివాళి అవుతుందని, అందువలన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఆయన నెలకొల్పిన తెదేపా ఆయన అడుగుజాడలలో నడుస్తుందో లేదో తేల్చుకోవాలని అన్నారు. భారత దేశాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించే యుద్ధంలో తెదేపా కూడా పాలు పంచుకోవాలని చెపుతూ తమ ఇద్దరి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీయే గనుక, తమతో చేతులు కలపాలని ఆయన పరోక్షంగా తేదేపాకు సూచించారు.   ఇక అదేవిధంగా తమిళనాడులో కరుణానిధికి చెందిన డీయంకే పార్టీతో కాంగ్రెస్ పోత్తుపెట్టుకొనే అవకాశం ఉంది గనుక, ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖించే ఎ.ఐ.ఎ.డీ.యం.కే. పార్టీ అధినేత్రి మరియు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రసన్నం చేసుకొనేందుకు మోడీ తన ప్రసంగంలో గట్టి ప్రయత్నమే చేసారు. కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవడానికి నామోషీగా ఉంటే, పొరుగునున్న జయలలిత పాలిస్తున్నతమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు. తద్వారా తమిళనాడులో తమ పార్టీ ఎ.ఐ.ఎ.డీ.యం.కే.తో స్నేహంచేసే ప్రయత్నం చేసారు.   ఇంతవరకు బీజీపీ దక్షిణాదిన కేవలం కర్ణాటకలో మాత్రమే కాలుపెట్టగలిగింది. కానీ, ఎడ్యురప్ప పుణ్యమాని దానిని కూడా ఇటీవల జరిగిన ఎన్నికలలో పోగొట్టుకొని, మళ్ళీ మొదటికొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ దక్షిణాదిన నిలద్రొక్కుకోవడానికే మోడీ వ్యూహాత్మకంగా అన్ని సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న హైదరాబాదును ఎంచుకొన్నారని అర్ధం అవుతోంది.   అయితే రానున్న కాలంలో ఆయన దేశప్రజలపై ఏమేరకు ప్రభావం చూపగలరనే దాని మీదనే ఆధారపడి కొత్త స్నేహితులు ఏర్పడుతారు తప్ప, ఆయన పొగడ్తలకు చంద్రబాబు, జయలలిత వంటి వారు అంత తొందరగా పడిపోయే అవకాశం లేదు. ఏమయినప్పటికీ, మోడీ వారందరికీ ‘ద్వారములు తెరిచేయే ఉంచెను’ అని చెప్పకనే చెప్పారు.

అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్‌

  ట్రాఫిక్ చ‌లానాల భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర‌సిస్తూ ఆటో యూనియ‌న్‌లు ఆటోల బంద్ కు పిలుపునిచ్చాయి. ఆటో పార్కింగ్ స‌మ‌స్యకు ఎలాంటి ప‌రిష్కారం చూపించ‌కుండానే ట్రాపిక్ ఉల్లంఘ‌న‌కు జ‌రిమానాను ఏక‌ప‌క్షంగా వేయి రూపాయ‌ల‌కు పెంచుతూ ట్రాపిక్ పోలీస్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఆటో డ్రైవ‌ర్స్ జేఏసి ఖండించింది. దీనికి వ్యతిరేకంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్ పాటిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది ఆటోడ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తుంద‌ని చెప్పారు. సిగ్నల్ జంపిగ్ లాంటి వాటికి చ‌లానాలు రాస్తున్న ప్రభుత్వం 20కిపైగా కూడ‌ళ్లలో సిగ్నల్స్ ప‌నిచేయ‌టం లేద‌ని ప్రభుత్నానికి తెలియ‌దా అని చెప్పాడు. అమిత్‌గార్గ్ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపిం చారు. నగరంలో ఆటోల‌కు పార్కింగ్ ఏర్పాటు చేసే వ‌ర‌కు చ‌లాన్లను పెంచ‌వద్దని కోరారు.అలా చేయ‌ని ప‌క్షంలో నిర‌వ‌దిక స‌మ్మెకు దిగుతామ‌ని హెచ్చరించారు.  న్యాయపరమైన డిమాం డ్లను అంగీకరించే వరకూ సమ్మెను కొనసాగించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు.

కాంగ్రెస్ నుంచి విముక్తే ఎన్టీఆర్‌కు నివాళి : మోడి

  అంద‌రు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోడి ప్రసంగం అనుకున్నట్టుగా అంద‌రిని ఆక‌ట్టుకుంది. మొద‌ట త‌న ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోడి తరువాత త‌న మార్క్ విమ‌ర్శనాస్త్రాల‌తో కాంగ్రెస్ పార్టీపై విరుచు ప‌డ్డారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ 85 ఏళ్ల వృద్ధురాలికి, స్వాతంత్య సమర యోధులకు పాదాభివందనం చేసి ఆయన ప్రసంగాన్ని మొద‌లు పెట్టారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నాన్నరు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచనం దినం అని.. అలాగే నా పుట్టిన రోజు కూడా  అదే రోజని ఆయన తెలిపారు. ప్రసంగం అంతా ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌భ‌లాగే జ‌రిగింది. యుపిఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్న ఆయ‌న‌ కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్కు సద్బుద్ధి ప్రసాదించమని దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని దేశ ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్థుతం రాష్ట్రంలోనె  కొన్న ప‌రిస్థితుల‌ను కూడా మోడి త‌న ప్రసంగంలో ప్రస్థావించారు. తెలుగు ప్రజ‌లు రెండు వ‌ర్గాలు విడిపోయి ఘ‌ర్షణ‌లు ప‌డ‌టానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే సీమాంద్ర అభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే 2004లోనే ఎందుకు తెలంగాణ ప్రక్రియ  మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. తెలుగు నేల మీద కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్టీఆరే కారణం అన్న ఆయ‌న కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి లభిస్తేనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అన్నారు.

సమైక్య జంతర్ మంతర్ పనిచేస్తుందా

  కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, యంయల్సీలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఈనెల 13న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చెప్పటనున్నారు. అయితే, కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని ఖరాఖండిగా చెపుతున్ననేపధ్యంలో వారి నిరసన దీక్షలు ఏమయినా ప్రభావం చూపగలవా? అనే ధర్మసందేహానికి మంత్రి శైలజానాథ్ జవాబు చెపుతూ, “ఇక చర్చలే లేవని తేల్చి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానాన్నితమ ఒత్తిడితో ఇప్పుడు ఆంటోనీ కమిటీ పేరిట చర్చలకు ఒప్పించగలిగామని, అదే విధంగా ఆఖరి నిమిషం వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర కోరుకొంటున్న నేతలందరూ 12వ తేదీ సాయంత్రానికల్లా డిల్లీ చేరుకొని 13న జరిగే నిరసన దీక్షలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తధ్యమని ఒకసారి, ఆంటోనీ కమిటీకి నిర్దిష్ట వ్యవధి ఏదీ లేదని మరొకసారి చెపుతూ రెండు ప్రాంతాల ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నదిగ్విజయ్ సింగ్ పై సీమాంధ్ర నేతలు ప్రయోగించనున్నఈ సమైక్య జంతర్ మంతర్ పనిచేస్తుందా? లేదా? లేక కొద్ది రోజుల క్రితం టీ-కాంగ్రెస్ నేతల చేత తెలంగాణా సాధన సభ పెట్టించి పదిరోజులోనే చాలా నాటకీయంగా నరేంద్ర మోడీ సభకు ముందుగానే తెలంగాణా ప్రకటించేసి, తెలంగాణపై మోడీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, నేడు మోడీ సభ ముగిసిపోతుంది గనుక ఇప్పుడు సీమంద్రాలో తన పార్టీని కాపాడుకొనేందుకు మళ్ళీ తన తెలంగాణా నేతల మీద ఈ జంతర్ మంతర్ ని ప్రయోగిస్తోందా? లేక సమైక్యవాదులు నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం మీద ఈ జంతర్ మంతర్ ను ప్రయోగిస్తున్నారా? తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

కొండా దంపతులకు దిగ్విజయ్ డిసపాయింట్మెంట్

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకొన్న తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకి వచ్చిన కొండా సురేఖ దంపతులు తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకొనేందుకు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ ను ఆశ్రయించారు. ఆయితే ఆయన రాయభారం పనిచేయలేదని సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలవాలనుకొన్న కొండా దంపతులకు ఆయన అప్పాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. గతంలో వైకాపాలో ఉన్న సమయంలో వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వారు తీవ్రంగా దూషించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోయినట్లతే, వారు బీజేపీలో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే, తెలంగాణా ప్రాంతంలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ మరింత బలపడి, మరికొన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకొనే వీలుకలుగుతుంది. ఇది కాంగ్రెస్ తెరాస రెండు పార్టీలకి నష్టమేనని చెప్పవచ్చును.

మోడీని కలిసేందుకు క్యూ కట్టిన తెలుగు సినీ పరిశ్రమ

  ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో ‘నవ భారత్ యువ భేరి’ బహిరంగ సభలో ప్రసంగించేందుకు హైదరాబాద్ చేరుకొన్నారు. ఆయనను కలుసుకొనేందుకు తెలుగు చిత్ర సీమకు చెందిన ప్రముఖులు చాలా మంది తరలి రావడం విశేషం.   ఆయన కలిసిన వారిలో డా.డీ.రామానాయుడు, కే.రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ, వీవీ వినాయక్, కోట శ్రీనివాస రావు, మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు, కృష్ణం రాజు, కీరవాణి, రవి తేజ, ఆలి, నిర్మాత సి. కళ్యాణ్, జగపతి బాబు తదితతరులున్నారు.   తెలుగు చిత్ర సీమలో దాదాపు 70 శాతం మంది సీమాంధ్ర జిల్లాలకు చెందినవారే కావడంతో, రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్న ఈ తరుణంలో వారందరూ మోడీని కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొంది. వారు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తూ మోడీకి మద్దతుగా నిలుస్తున్నామని తెలిపేందుకు కలిసారా? లేక రాష్ట్ర విభజనకు మద్దతునిచ్చిన బీజేపీ తరపున ఆయనను హైదరాబాద్ విషయంలో రెండు ప్రాంతాల మధ్య చెలరేగుతున్న వివాదంపై తన ప్రసంగంలో ప్రస్తావించామని కోరేందుకే వెళ్లి కలిసారా? లేక బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా చెప్పబడుతున్నఆయనను కేవలం మర్యాదపూర్వకంగా కలిసారా? అంటే వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో కలిసి ఉండవచ్చును.   ఏమయినప్పటికీ, ఇంత మంది సినీ ప్రముఖులు నరేంద్ర మోడీని కలవడానికి ఉత్సుకత చూపించడం రానున్నఎన్నికలలో వారిలో కొందరయినా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పవచ్చును. హాస్య నటుడు ఆలీపై రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే మీడియాలో వార్తలు రావడం, వాటిని ఆయన ఖండించడం అందరూ ఎరిగిన విషయమే. కానీ, నేడు ఆయన కూడా మోడీని కలవడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.

తిరుప‌తిని మాకిచ్చేయండి

ఆంద్రప్రదేశ్ లో విభ‌జ‌న స‌మైక్య సెగ‌ల‌తో భ‌గ్గుమంటుంటే, ఓ తమిళ నాయ‌కుడు కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకు వ‌చ్చాడు. తెలంగాణ,సీమాంద్ర ప్రాంతాల వారే పంప‌కాలు తేల‌క గొడ‌వ‌లు ప‌డుతుంటే ఇప్పుడు కొత్త గా తిరుప‌తిని మాకు ఇచ్చేయండి అంటూ ఓ ఫ‌న్నీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు పిఎంకే నేత రాందాస్ . రాష్ట్రంలో నేల కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల మూలంగానే ఇలా పొరుగు రాష్ట్రాల వారికి లోక‌వ‌వున్నామంటున్నారు సీమాంద్ర నాయ‌కులు. ఇన్నాళ్లు విభ‌జ‌న సెగ‌ల‌తో అబివృద్దిలో వెనుక‌ప‌డిన రాష్ట్రం ఇప్పుడు స‌మైక్య సెగ‌ల‌తో అట్టుడుకుతుంది. దీంతో మ‌రోసారి అభివృద్ది ఆగిపోయింది. తిరుప‌తిలో తెలుగు మాట్లాడే వారికంటే అర‌వం మాట్లాడేవారే ఎక్కువ‌గా ఉన్నార‌న్న రాందాస్ ఈ కార‌ణం తోనే తిరుప‌తిని మాకు ఇచ్చేయాల‌ని కోరుతున్నామ‌న్నానరు. అయితే రాందాస్ వ్యాఖ్యల‌తో తిరుప‌తి విడిపోక‌పోయినా.. మనం పొరుగు రాష్ట్రాల దృష్టిలో ఎంత చుల‌క అయ్యామో మాత్రం అర్ధం అవుతుంది.

13 న డిల్లీకి సియం

  సీమాంద్ర నిర‌స‌న జ్వాల‌ల నేప‌ధ్యంలో సియం కిర‌ణ్‌కుమార్ రెడ్డి మ‌రోసారి డిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 13 న డిల్లీ వెళ్లనున్నా ఆయ‌న‌రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోని కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఇప్ప‌టికే డిల్లీలో ఉన్న పిసిసి చీఫ్ బోత్స స‌త్యనారాయ‌ణ కూడా అదే రోజు ఆంటోని క‌మిటీతో టేటి కానున్నారు.  13న డిల్లీ అందుబాటులో ఉండాల‌న్న హైక‌మాండ్ ఆదేశంతో ఇద్దరు నేత‌లు ఆ రోజు డిల్ల ఈ వెళ్లనున్నారు. సియం, పిసిసి చీఫ్‌ల‌తో స‌మావేశాల త‌రువాత ఆంటోని క‌మిటీ రాష్ట్ర పర్యట‌న‌కు సంభందించి ఓ ప్రక‌ట‌న విలువ‌డ‌నుంది. ఆంటోని కమిటీతో భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఇతర పెద్దలను కూడా సీఎం కలవనున్నారు. సోనియాగాంది అపాయింట్‌మెంట్ కోసం కూడా సియం ప్రయ‌త్నిస్తున్నారు.

హైద‌రాబాద్ చేరుకున్న మోడి

బిజెపి పార్టీ ఎన్నిక‌ల ర‌థ‌సార‌థి, గుజ‌రాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ  బేగంపేట‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి. కృష్ణంరాజుల‌తోపాటు పలువురు ప్రముఖులు మోడీకి స్వాగతం పలికారు.  నగరంలోని ఎల్ బీ స్టేడియంలో మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొననున్నారు. కాసేపు పార్క్ హాయ‌త్ హోట‌ల్ లో బ‌స చేయ‌నున్న ఆయ‌న ప‌లువురు పారీశ్రామిక‌,సినీ, విద్యా రంగ నిపుణుల‌తో స‌మాశేం కానున్నారు. త‌రువాత ఎల్ బి స్టేడియంలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. ఆ త‌రువాత ఓ స్కూల్ ఆవ‌ర‌ణ‌లోని  స‌ర్దార్ వ‌ల్లాబాయ్ ప‌టేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.   ఎన్నిక‌ల సార‌థిగా ఎంపిక అయిన త‌రువాత త‌న తొలి ఎన్నిక‌ల ప్రచారాన్ని ఈ వేదిక నుంచే ప్రారంభిస్తున్నారు మోడి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేందుకు దేశావ్యాప్తంగా వివిధ నగరాల్లో మోడీ 100 సభల్లో  పాల్గొనున్నారు. ఈ స‌భ వేదిక నుంచి మోడి చేసే ప్రసంగం కోసం యావ‌త్ భార‌తం ఉత్కంట‌గా ఎదురు చూస్తుంది.

తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర

రాష్ట్రంలో ఏర్పాడ్డ అనిశ్చితి నేప‌ధ్యంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మ‌రోసారి యాత్రకు సిద్దమ‌వుతున్నారు. ఈ సారి బ‌స్సులో రాష్ట్రవ్యాప్త ప‌ర్యట‌న చేయ‌నున్న ఆయ‌న ఈ యాత్రకు తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర‌గా నామ‌క‌ణం చుశారు. తెలంగాణ కు అన్ని పార్టీలు అనుకూలంగానే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రక‌టించిన తీరు త‌రువాతి ప‌రిణామాల‌ను ఈయాత్రలో ప్రజ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. చంద్రబాబు నిర్వహించిన పాట పాద‌యాత్రకు మంచి స్పంద‌న వ‌చ్చిన నేప‌ధ్యంలో ఇప్పుడ చేప‌ట్టబోయే ఆత్మ గౌర‌వ యాత్రకు సూప‌ర్ స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజ‌ల అభిప్రాయ‌న్ని గౌర‌వించి తెలంగాణకు అనుకూలంగా ప్రక‌ట‌న చేశాం గాని ఇలా సీమాంద్రకు అన్యాయం చేయ‌మ‌న‌లేద‌న్నారు. రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్‌తోనూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల‌ను క‌లిసి రాష్ట్రప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నారు.

వెనక్కి త‌గ్గే ప్రస‌క్తే లేదు

  తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు ఏస్థాయిలో ఉన్నా విభ‌జ‌న విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ప్రక‌టించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ వ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ ప్రక్రియను కొనసాగించే బాధ్యత భారత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామ‌న్న ఆయ‌న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కొన‌సాగుతుంద‌న్నారు. ప్రక‌ట‌న నేప‌ధ్యంలో స‌మ్మె దిగ‌బోతున్న ఏపి ఎన్జీవోల‌ను స‌మ్మె విర‌మించుకోవాల‌ని కోరారు. ఏ ప్రాంత వారైన త‌మ అభిప్రాయాల‌ను ఆంటోని క‌మిటీకి విన్నవించుకోవ‌చ్చన్నారు. రాష్ట్ర విభజన జరిగినందువల్ల సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎవరు ఎక్కడైనా స్థిరపడవచ్చు, జీవించవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యల‌పై స్పందించిన దిగ్వజ‌య్‌, ఆయ‌న‌తో మాట్లాడాన‌న్నారు. సియంపై ఎలాంటి వివ‌ర‌ణ కోర‌లేద‌న్న ఆయ‌న ఎలాంటి చ‌ర్యలు కూడా ఉంబడ‌బోవ‌ని తేల్చిచెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడిన తరువాత ఊహించినట్లుగానే ఆయనపై జైపాల్ రెడ్డితో సహా తెలంగాణావాదులు అందరూ తీవ్ర విమర్శలు చేసారు. ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అయితే కిరణ్ కుమార్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదంటూ హేళన చేయడమే కాకుండా, ఆయన కావాలనుకొంటే హైదరాబాదులో ‘కర్రీ పాయింటు’ నడుపుకోవచ్చునని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేరు.   ఇక టీ-కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ కు ఎంత మాత్రం తీసిపోకుండా ముఖ్యమంత్రిని దుమ్మెత్తిపోశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే, ఏకంగా గంటకు పైగా మీడియా సమావేశం నిర్వహించి, ఆయన లేవనెత్తిన ప్రతీ అంశాన్ని తప్పుపడుతూ వాదనలు చేసి, కమాండరు ఎన్నడూ కూడా కుట్రదారుడుగా వ్యవహరించడం కూడదని సున్నితంగా వాతలు పెట్టారు. కొంత మంది టీ-కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి పిర్యాదు చేయడానికి కూడా సిద్దపడుతున్నారు.   అయితే, వారందరినీ నివ్వెరపరుస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకు వస్తూ “ఆయన విధేయుడయిన క్రమశిక్షణగల పార్టీ కార్యకర్త” అని వర్ణించారు. అంతే గాకుండా, “ఆయన పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించి తప్పు చేసాడని భావించడం లేదని, అందువల్ల ఆయనని సంజాయిషీ కోరడం లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని” కూడా స్పష్టం చేసారు.   ఇక, దిగ్విజయ్ సింగ్ నిన్నఆంటోనీ కమిటీ గురించి మీడియాతో మాట్లాడుతూ ‘ఆ కమిటీకి తెలంగాణతో, రాష్ట్ర విభజన ప్రక్రియతో ఖచ్చితంగా సంబంధం ఉందని’ కుండ బ్రద్దలు కొట్టడంతో, అంతవరకు అందుకు విరుద్దంగా వాదిస్తున్న టీ-కాంగ్రెస్ నేతలే కాదు తెరాస నేతలు కూడా ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ‘అంటోనీ కమిటీ తన పని పూర్తిచేయడానికి నిర్దిష్ట కాలపరిమితి కూడా ఏమీ విధించలేదని ఆయన మరో బాంబు కూడా ప్రేల్చారు.   విభజనకు వ్యతిరేఖంగా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డిని దండించకపోగా ఆయనను వెనకేసుకు రావడం, అంటోనీ కమిటీ గురించి దిగ్విజయ్ సింగ్ అన్నమాటలతో తెలంగాణా వాదులందరిలో మళ్ళీ ఆందోళన, ఆనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు మంత్రి శైలజానాథ్ ‘తామే విభజన ప్రక్రియను వాయిదాపడేలా చేసామని’ చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అందుకే, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందేవరకు తెలంగాణాలో ఎటువంటి సంబరాలు, సన్మానాలు పెట్టుకోవద్దని సూచించారు.

వైఎస్ జగన్, విజయమ్మ రాజీనామా

      వైఎస్ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద వైఖరిని నిరసిస్తూ తమ యంపీ, శాసనసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసారు. వారు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లో ఫాక్స్ చేశారు. జగన్ కడప లోక్ సభకు, విజయమ్మ పులివెందులకు శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వారు తమ రాజీనామాలకు చెపుతున్న కారణాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ పార్టీ తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన తరువాత కూడా, నేటికీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పకుండా, ఇటువంటి కుంటి సాకులు చెపుతూ రాజీనామాలు చేయడం ఆ పార్టీ రాజకీయ దౌర్భాల్యాన్ని సూచిస్తోంది.   తమ పార్టీ శాసనసభ్యుల చేత సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయించినప్పుడు కూడా ఆ పార్టీ దైర్యంగా ఆమాట చెప్పలేకపోయింది. అందువల్ల ఆ పార్టీకి చెందిన కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలను కోల్పోవడమే కాకుండా, తెలంగాణాలో మళ్ళీ కాలుపెట్టే అవకాశం లేకుండా చేసుకొంది. మళ్ళీ ఇప్పుడు కూడా తమ రాజీనామాలకు డొంక తిరుగుడు కారణాలు చెప్పడం నవ్వుతెప్పిస్తుంది.

దేశ విచ్చిన్నమే దేశ భక్తా?

      దేశ సమగ్రతను కాపాడుకోవటానికి,దేశ సంక్షేమాన్ని పరిరక్షించు కోవటానికి,ప్రపంచ దేశాలలో తనదైన స్థానాన్ని సుస్థిర పరుచుకోవటానికి స్వాతంత్ర్యాననంతరం ఆనాటి పెద్దలు 525 సంస్థానాలుగా ఉన్న భారతావనిని 25 రాష్ట్రాలుగా నెలకొల్పారు. దీని ఉద్దేశ్యం దేశ ప్రజలందరికి ఒక జాతిని నిర్దేశించి అందరిని ఒక్కతాటి మీదికి తీసుకు రావటం. ఈ 25 రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏర్పాటు చేయబడినవి. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ భాషా ప్రాతిపదికన ఏర్పడినవే. అలా భారత దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్ట మొదటి రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్. భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పటిష్టంగా ఉండాలంటే బలమైన రాష్ట్రాలు ఉండాలని ఆనాటి నాయకుల ముఖ్య ఉద్దేశ్యం.    నేటి ఆధునిక భారతదేశాన్ని  ఏలుతున్నవి సంకీర్ణ ప్రభుత్వాలు. వీటి నేపధ్యంలో అతి తక్కువమంది ఎమ్.పి లు ఉన్న పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తమ ఇష్టానుసారం శాసిస్తున్న కారణంగా నేటి మేధావులు కూడా దేశ సమగ్రతను కాపాడుకోవటానికి బలమైన రాష్ట్రాలు ఉండాలనే కోరుకుంటున్నారు.                    కాని బి.జె.పి వారు తాము అధికారంలో ఉన్న సమయంలో చిన్న రాష్ట్రాలు అయితేనే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందనే అజ్ఞానంతో ఉత్తర్ ప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ నుండి ఛత్తీస్ ఘడ్,బీహార్ నుండి జార్ఖండ్ అనే మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ రాష్ట్రాలను అలా విభజించటం ద్వారా ఆయా రాష్ట్రాలు సాధించిన ప్రగతి ఏమిటో బి. జె. పి  వారు దేశ ప్రజలకు చెప్ప గలరా?                   ఛత్తీస్ ఘడ్ లోని చాలా భూభాగం మావోయిస్టుల అధీనంలో ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఉత్తరాఖండ్ ఏర్పడి ఇంత కాలమైన ఆ ప్రాంతం వారు అక్కడికి వచ్చే యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయం మీదనే ఆధారపడి బ్రతకవలిసి వస్తోంది. మొన్నటికి మొన్న వరదలోస్తే సహాయక చర్యల నిమిత్తం తక్షణ చర్యలు చేపట్టే సరైన ప్రభుత్వ యంత్రాంగం  కూడా లేని దుస్థితిలో ఆరాష్ట్రం ఉంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడి 11,12 సంత్సరాలు ఐన 9 ప్రభుత్వాలు మారి పూర్తి రాజకీయ అనిశ్చితిలో ఉంది.                     తమను తాము దేశ భక్తులుగా చెప్పుకొనే బి. జె. పి వారు ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేయటం ద్వారా సంభవించిన సంక్షోభానికి  ఏ మూల్యం చెల్లిస్తారు? కాంగ్రెస్ లౌకికవాద ముసుగుతో దేశాన్ని మోసం చేస్తుందని బి.జె.పి  విమర్శిస్తూ ఉంటుంది.బి.జె. పి మతవాదం తో దేశాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది. కానీ విధి విధానాల పరంగా ఈ రెండు పార్టీలకు ఎటువంటి భేదం కనిపించదు. ఉదాహరణకు ఎఫ్.డి.ఐ ల విషయం లో కాంగ్రెస్ ను బి.జె.పి  సమర్ధించింది. బి.జె.పి  వారు కోరుతున్నట్లుగా తెలంగాణ ఏర్పాటు చేయటానికి కాంగ్రెస్ ముందుకు వస్తోంది. వీరి చౌకబారు రాజకీయాల కారణంగా దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే,రాష్ట్రం అభివృద్ధి విషయంలో 10 సంత్సరాలు వెనక్కి పోయింది.                    సమైఖ్యాంధ్ర ఉద్యమంతో సీమాంద్ర  ప్రాంతం  అట్టుడికి పోతుంటే రాష్ట్రం నుండి బి.జె.పి కి ప్రముఖ పాత్ర వహిస్తున్న వెంకయ్యనాయుడు ఈ సంక్షోభానికి కారణం కాంగ్రెస్సే,ఆ పార్టీనే సమాధానం చెప్పుకోవాలి అని రాజ్యసభలో వ్యాఖ్యానించటం  ఆయన తద్వారా ఆయన పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం. రాష్ట్రంలో నేటి రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో అదే స్థాయిలో బి.జె. పి పాత్ర కూడా ఉందనే విషయం ప్రజలందరికి తెలుసు. ఈ రెండు పార్టీల రాజకీయదురుద్దేశ్యమే ఈ దుస్థితికి కారణం. చిన్న రాష్ట్రాల పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేయాలనే కోరుకుంటుంటే బి. జె. పి  దేశభక్తి అనే ముసుగును తొలగించు కుంటే మంచిది.

తెలంగాణ ప్రక్రియ ఆగలేదు: దిగ్విజయ్

      ఏపీ మీడియాకు వార్తల విషయంలో కల్పతరువుగా మారిన దిగ్విజయ్ సింగ్ ఏ రోజుకారోజు టచ్ లో ఉంటున్నారు. తెలంగాణ అంశం గురించి ఏవో ఒక అప్ డేట్స్ ఇస్తున్నారు. నిన్నంతా ఆంటోనీ కమిటీ గురించి మాట్లాడిన దిగ్విజయ్ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఏదైనా అంశాన్ని టేకప్ చేస్తే.. దాని మీదే కూర్చొనే నేతల్లో దిగ్విజయ్ కూడా ఒకరు. తాజా దిగ్విజయ్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని అన్నారు సీమాంధ్రులో నిరసనలు తము ప్రభావితం చేయలేదని దిగ్విజయ్ తేల్చిచెప్పారు.. సీమాంధ్రుల సమస్యల అధ్యాయనంపై ఏర్పాటు అయిన ఆంటోని కమిటీ తన పని మంగళవారం నుంచి ప్రారంభిస్తుందని చెప్పారు. ఆంటోనీ కమిటీ అందరి అభ్యంతరాలకు పరిష్కారం చూపుతుందని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ విధేయుడేనని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు దిగ్విజయ్ సింగ్ సూచించారు.

కిరణ్ దెబ్బకి యంపీలు, మంత్రులు అవుట్

  కేంద్రమంత్రి పదవి దక్కగానే రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించిన కావూరి సాంభశివరావు, నేడు మళ్ళీ సమైక్య రాగం అందుకొన్నారు. ఆయనలో ఆ మార్పుకు కారణం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు చేయడమేనని స్పష్టంగా తెలుస్తోంది. నేడు కావూరి రేపు చిరంజీవి, కృపా రాణీ, ఆ తరువాత పురందేశ్వరి ఈవిధంగా అందరూ కూడా తన వెనుక నడువక తప్పని పరిస్థితి ముఖ్యమంత్రి కల్పించారు. నిన్నటి వరకు రాజీనామాకు ససేమీరా అన్న మరో కేంద్రమంత్రి కిల్లి క్రుపారాణీ కూడా అవసరమయితే రాజీనామాకు సిద్దం అంటూ ప్రకటించడం ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ.   ఒకవేళ ముఖ్యమంత్రి గనుక అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభాజన ప్రక్రియను అమలుచేయడానికి సిద్దపడి ఉంటే, నేడు కావూరి కూడా ఈవిధంగా సమైక్య రాగం తీసేవారు కారని ఖచ్చితంగా చెప్పవచ్చును. త్వరలోచిరంజీవి తదితరులు కూడా కావూరి బాట పట్టినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి వారందరూ సమైక్యాంధ్రపై అభిమానంతో కాక, కేవలం తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే ఇటువంటి ఆలోచనలు చేయడం విషాదకరం. ఆ విధంగా చూసినట్లయితే, వీరందరి కంటే అధిష్టానంపై దైర్యంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రే అత్యంత నిజాయితీ కలవాడని భావించవచ్చును. ఆయన కేంద్రానికి నిర్ద్వందంగా తన అభిప్రాయలను చెప్పడమే కాకుండా దైర్యంగా ప్రశ్నించారు కూడా. కానీ మిగిలిన నేతలకు మాత్రం ఆయన పాటి దైర్యం, నిజాయితీ లేకపోయినా, ఏ ఎండకు ఆ గొడుగుపట్టడంలో తమకు మరొకరు సాటి ఉండరని రుజువు చేసుకొంటున్నారు.   ఒకవేళ మంత్రులు, యంపీలు కిరణ్ కుమార్ రెడ్డి ని అనుసరించినట్లయితే, త్వరలో పార్లమెంటులో వోటింగ్ కు రానున్న ఆహార భద్రత బిల్లు ఆమోదం పొందడం చాల కష్టం అవుతుంది.  ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాక్యలపై ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం చాల విచిత్రంగా ఉంది. ఆయనను ఆపదవిలో కొనసాగించాలా, వద్దా? ఏవిధంగా చేస్తే బాగుటుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు వోటింగ్ కు రాకమునుపే కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీకి పిలిపించుకొని మాట్లాడి పరిస్థితి సర్దుమనిగేలా ప్రయత్నం చేయవచ్చును.కానీ, కిరణ్ అందుకు అంగీకరించనట్లయితే, అప్పడు కేంద్రం ఏమి చేస్తుందనేది ఒక పెద్ద ప్రశ్. 

రాష్ట్ర విభజనపై కావూరి పిల్లిమొగ్గలు

  కావూరి సాంభశివరావు తన చిరకాల వంచ అయిన కేంద్రమంత్రి పదవి రాకపోవడంతో సమైక్యాలాపన కొంచెం గట్టిగానే చేసారు. వీలయితే దానికోసం ఓ స్వంత కుంపటి కూడా పెట్టుకోవడానికి సిద్దం అని తన అనుచరుల ద్వారా సంకేతాలు పంపారు. కానీ మంత్రి పదవి రాగానే, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెపుతూనే, ఎందుకయినా మంచిదని తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మార్పులేదని ఓ కొసరు డైలాగు కూడా పలికి జాగ్రత్తపడ్డారు. కానీ మంత్రి పదవి రాగానే ‘యు’ టర్న్ తీసుకొన్నారని పత్రికలు, ప్రత్యర్దులు అందరూ విమర్శించినపుడు, “బాధ్యతాయుతమయిన కేంద్రమంత్రి పదవిలోఉన్న నేను ఒక సాధారణ గ్రామ సర్పంచ్ లా మాట్లాడటం మర్యాద కాదు” అని అతి తెలివిగా జవాబిచ్చి తప్పుకొన్నారు.   కానీ, మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా అధిష్టానానికి ఎదురు తిరగడంతో, ఇక ఇంత వరకు పదవులు పట్టుకొని వ్రేలాడుతున్న యంపీలు, కేంద్ర మంత్రులు కూడా తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఆయనను అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.   అందువల్ల నేడు కావూరి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మరో పిల్లి మొగ్గ వేసారు. “నేను ఎప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొనే వాడినే. కానీ కొందరు నేను ‘యు’ టర్న్ తీసుకొన్నానని అనడం నాకు చాలా బాధ కలిగించింది. పదవులకోసమో, డబ్బు కోసమో నేను ప్రలోభపడి మాట మార్చేవాడిని కాను. నేను ఏది మాట్లాడినా శాస్త్రీయంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను. మన రాష్ట్రం ఒక్కటిగా ఉన్నపుడే మనకి 42 యంపీలు ఉంటారు. గనుక దేశంలో మన రాష్ట్రానికి ఒక విలువ ఉంటుంది. కానీ రెండుగా విడిపోయిన తరువాత ఇద్దరూ నష్టపోతాము. ఎనబై మంది యంపీలను కలిగి ఉన్నఅతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పుతోందో మనం చూస్తూనే ఉన్నాము. అంత పెద్ద రాష్ట్రం ఒక్కటిగా మనుగడ సాగిస్తున్నపుడు మనం మాత్రం ఎందుకు విడిపోవాలో నాకు అర్ధం కావడం లేదు. కేవలం కొందరు రాజకీయ నేతలని సంతృప్తి పరచడానికి రాష్ట్రాలు విడగోట్టుకొంటూ పోతే దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయి. రేపు మన రాష్ట్రం విడిపోతే ఇరువురికీ తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. అందువల్ల కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకొంటే బాగుటుందని నా అభిప్రాయం,” కావూరి బహుశః తను కేంద్ర మంత్రినని మరిచిపోయారో ఏమో, ఒక సాదారణ గ్రామ సర్పంచ్ లా మాట్లాడారు.

నేను సమైక్యవాదినే: కావూరి

      కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తాను సమైక్యవాదినేనని, యుటర్న్ తీసుకున్నాననడం వాస్తవం కాదని అంటున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు ఇంకా సంక్లిష్టమవుతాయని అన్నారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజన సరికాదని కావూరి పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేనేలేదన్నారు.హైదరాబాద్ మనదనుకుని పెట్టుబడులు పెట్టారని, రాష్ట్రం నలుమూల నుండి ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారని ఆయన అన్నారు.   ఐటీ, సినిమా, ఫార్మా, హోట్‌లు అభివృద్ధి చెందాయని, సంపన్న దేశాలకు పోటీ పడేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని కావూరి తెలిపారు. విభజన వద్దని 9 మంది కేంద్ర మంత్రులం చెప్పామని, భవిష్యత్‌లో వచ్చే ఇబ్బందులను అధిష్టానానికి వివరించామన్నారు. అందిరికీ అమోదయోగ్యంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి పునరాలోచించాలని కోరినట్లు కావూరి చెప్పారు.

పాపం ఎవరిది శాపం ఎవరికీ ?

......సాయి లక్ష్మీ మద్దాల         నేడు ఆంద్ర రాష్ట్రంలో రోజుకొక రాజకీయ క్రీడ ఆడుతున్నారు సోనియా గాంధి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే రాష్ట్ర విభజన ప్రకటన కాంగ్రెస్ పార్టీ వెలువరించిన తొమ్మిది రోజుల తరువాత రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన వెల్లడించిన అంశాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలేమిటో చెబుతూ,వీటన్నిటికి పరిష్కార మార్గం చూపిన తరువాతే విభజన చేయాలని అధిష్టానానికి సూచిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ విషయం లో అందరి హక్కులను,భద్రతను పరిగణ లోకి తీసుకోవాలని సూచిస్తున్నట్లు కూడా చెప్పారు. కానీ ఆయన ఈవిషయాలన్ని ఏకరువు పెట్టాల్సింది ప్రజల ముందు ఇప్పుడు కాదుకదా!అధిష్టానం వద్దకు నెలలో కొన్ని వందలసార్లు వెళ్లి వచ్చిన పెద్ద మనిషి అప్పుడు అధిష్టానం పెద్దలకు ఏరకంగా వివరణ ఇచ్చారో ఆరోజైనా ఈ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు వివరించి ఎందుకు చెప్పలేదు. ఇప్పుడెందుకు ఆయనకు ప్రజలు గుర్తుకొచ్చారు?ఆయన వివరించిన విషయాలలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఈ సమస్య కు దివంగత ముఖ్య మంత్రి వై. యస్. రాజశేఖర రెడ్డి కారణం గాను,2008లో చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇవ్వటం వల్లను వచ్చిందని చెప్పటం జరిగింది.   పై విషయాలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమ సెగలు లేని సమయంలో ఒకరకంగా చెప్పాలంటే టి.ఆర్. యస్ ఏర్పడటానికి కన్నా ముందే రాజశేఖర రెడ్డి 41 మంది MLA ల తో సంతకాలు పెట్టించి,అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న BJP  వద్దకు పంపిచారు,అయితే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ఆ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ,దానికి గల కారణాన్ని రాజధానిని విడగొట్టటం కుదరదని,అంతకు ముందు  ఏర్పడిన రాష్ట్రాలకు రాజధానిని ఇవ్వలేదు కనుక ఇక్కడ కూడా కుదరదని వివరించటం జరిగింది. కానీ అదే BJP 10 సం॥లుగా అధికారానికి దూరంగా ఉండేసరికి అధికార కాంక్ష తో 2014లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు అనుకూలం అని చెప్పింది. ఇదే పార్టీ అంతకు ముందు అధికారంలోకి వచ్చేటపుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే నినాదం తో వచ్చి ఆ తరువాత మాట మార్చిన వైనాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. మళ్లి 2004 ఎన్నికలలో అధికారం లోకి రావటానికి రాజశేఖర రెడ్డి TRS  తో పొత్తు పెట్టుకొని తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చిన విషయం అందరికి తెలిసిన నగ్న సత్యం. కాని ఆతరువాత  తెలంగాణ అంశం అంతగా ముందుకు సాగ లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రి అవటం జరిగింది,KCR చాలా నిశ్శబ్దం గా ఉండటం అందరూ గమనించారు. కాని 2006లో మళ్ళి చంద్రబాబు నాయిడు తాను అధికారంలోకి రావటానికి ఇదే TRS తో పొత్తు పెట్టుకోవటము జరిగింది కాని ఆయన అధికారంలోకి రాలేదు,అయితే ఇక్కడ గమనించాల్సింది ఇదే చంద్రబాబు 1995లో అధికారంలో ఉన్న BJP కి తెలంగాణ విషయంలో అడ్డుపడ్డాడని,కాని ఆయన మళ్ళి 2008 లో తెలంగాణ కు అనుకూలమని లెటర్ ఇచ్చి డిసెంబరు 9నాడు వెలువడిన ప్రకటన అనంతరం తన రెండు కళ్ళ సిద్దాంతం తెర మీదకు తెచ్చి,ఇప్పుడు మళ్ళి తాను తెలంగాణకు అనుకూలమని తెలంగాణలో తన పార్టీని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తున్నారు.                ఇహ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలంటే 9 సం॥ లుగా విషయాన్ని నానబెడుతూ ముఖ్యంగా పార్టీ పరంగా తన స్టాండ్ ఏమిటో చెప్పకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ సరిగ్గా 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ లబ్ధి కోసం రాహుల్ గాంధీని ప్రధానిని చేయటమే పరమావధిగా పెట్టుకున్న సోనియాగాంధి ఆలోచన మేరకు తెలంగాణ విభజన ప్రకటన పార్టీ పరంగా చేయటం జరిగింది. ఇంకా ప్రభుత్వ నిర్ణయం జరగలేదు. ఇక్కడ రాష్ట్ర విభజన అంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి,ఎంతో కసరత్తు జరగాలి అదే అసలు ప్రక్రియ. అయితే ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో నీటి పంపకాల విషయాలు కాని,రెవిన్యూ విషయం కాని,అభివృద్ధి విషయం కాని హైదరాబాద్ లో ఉంటున్న సెటిలర్స్ విషయం కాని అన్నీ ప్రజల ముందు ఏకరువు పెట్టారు. కానీ వీటన్నిటి మీద అధిష్టానం వద్ద ఎప్పుడు ప్రస్తావించాలి అనేది ఆయనకు తెలియదా?దీనిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అనిపించ లేదా?అన్నింటికీ మించి రోశయ్య తరహాలో ఒకసారి అందరి నేతలను పిలిచి సమావేశ పరిచి రాష్ట్ర విభజన వెనుక ఉన్న సాధక బాధకాలను వివరించి వారిని సమన్వయ పరచాలని ఎందుకు అనిపించలేదు?ఈనాడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఈ పెద్ద మనుషులు ఏళ్ళకేళ్ళుగా అధికారం లో ఉండి చేసిందేమిటి?ఒక్క హైదరాబాద్ మీదే దృష్టినంత పెట్టి రాజధానిని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను గాలికి అభివృద్ధికి ఆమడ దూరంలో వదిలేసిన పాపం ఎవరిది?ఎ చిన్న వైద్యానికైన,ఏ ఉద్యోగానికైనా,ఏ పరిశ్రమ స్థాపనకైన వందల కిలోమీటర్ల దూరం రావాల్సిన దుస్థితికి కారణం ఈ నేతల పాపం కాదా?                ఇప్పుడు కొత్తగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేది ఏముంది?ఆయన చెప్పిన విషయాలు ఏవైతే రాష్ట్ర విభజనకు తలెత్తే ఇబ్బందులు అని చెప్తున్నారో వాటిని శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడో తేల్చి చెప్పింది,కాని ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ముఖ్యమంత్రి చెప్పగలరా?కనీసం ఆ నివేదిక మీద పార్లమెంట్ లో చర్చైన ఎందుకు జరగలేదో ముఖ్యమంత్రి వివరించగలరా ఈ రాష్ట్ర ప్రజలకు?ఇప్పటికి కూడా ఆయన అధిష్టానం తరఫునే మాట్లాడుతున్నారనటంలో ఎలాంటి సందేహము లేదు. మళ్ళి సమైఖ్యాంద్ర ఉద్యమ నేపధ్యంలో సీమాంద్ర ప్రాంత వోట్లు ఎక్కడ పోతాయో అనే భయంతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఆడుతున్న నాటకం. ఆ ప్రాంత ప్రజల దృష్టిలో తానేదో సమైఖ్యాంద్ర కోసం కష్టపడుతున్నట్లు నమ్మకాన్ని కలిగించటం కోసం ఆడుతున్న మరో కొత్త నాటకం. ఒకవేళ రాష్ట్రపతి పాలన వచ్చిన తమ పార్టీకి ఏవిధమైన నష్టం రాకూడదనే ఒక తపన. ప్రజలు ఏమై పోయినా ఫర్వాలేదు,ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఫర్వాలేదు,ప్రజల మధ్యలో ఎలాంటి విద్వేషాలు చెలరేగినా ఫర్వాలేదు,తమ పార్టీలు,తమ పదవులు జాగ్రత్తగా ఉంటె చాలు మన రాజకీయ నేతలకు.                   అన్నిటికి మించి ఒక్కోసారి ఒక్కో పార్టీ ఈ తెలంగాణ వాదాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం ఎలావాడుకుందో అందరికి తెలుసు. మరీ ముఖ్యం గా నేడు తెలంగాణ ప్రాంతం  వెనుకుబాటుకు,అణచివేతకు గురవుతోందని అభివృద్ధికి నోచుకోలేదని  TRS పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆ పార్టీ నేత KCR అంతకు ముందు తెలుదేశం పార్టీలోను,కాంగ్రెస్ పార్టీలోను అనేక సంత్సరాలు మంత్రి పదవులు అనుభావించారే గానీ ఏనాడు ఆప్రాంత అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించలేదు?తాను మంత్రిగా ఉన్నన్ని రోజులు తన ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు కనిపించలేదు?నేడు పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని వివిధ పార్టీల నేతలు అంటున్నారు. కానీ నీళ్ళు ఎక్కడినుండి తెస్తారు పోలవరానికి?30 ఏళ్ళుగా పోలవరం ప్రాజెక్టు అలా మూలన పడి వేల క్యూసెక్కుల నీళ్ళు సముద్రంలో కలిసి పోతు సాగునీటికి ఇబ్బంది తలెత్తటానికి ఎవరు చేసిన పాపం ఇది. రాజకీయ నేతలు తమతమ పదవుల కోసం ఆడే  స్వార్ధపు ఆటలో చేస్తున్న పాపాలు ప్రజల పాలిట శాపాలుఅవుతున్నాయి. వాళ్ళ అధికార దాహానికి ప్రజలు బలై పోతున్నారు. దీనికి అంతం ఎప్పుడు?