chandrababu vastunna meekosam

ఏప్రిల్ 27న పాదయాత్ర ముగింపు

      చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర విశాఖ జిల్లాలో ముగియనుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆయన.. నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు. ఏప్రిల్ 27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు. అదే రోజు విశాఖ మధురవాడలో బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర ముగిస్తారు. కాగా, విశాఖ జిల్లాలో మొత్తం 19 రోజులపాటు 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 163 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.   జిల్లాలో చోడవరం, మాడుగుల, పాడేరు, అరకులోయ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరి ఆదివారం వెల్లడించారు. యాత్ర ముగించేనాటికి ఆయన 2750 నుంచి 2800 కిలోమీటర్ల దూరం నడుస్తారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడూ ఇంత సుదీర్ఘకాలం, ఇంత ఎక్కువ దూరం పాదయాత్ర చేయలేదని గుర్తుచేశారు. పాదయాత్ర ముగింపునకు గుర్తుగా మధురవాడలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

No Mercy Petition To Sanjay Dutt

సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదు

  1993 ముంబాయి వరుస బాంబు కేసులో టాడా సంజయ్ దత్ దగ్గర చట్టవిరుద్ధ, లైసెన్స్ లేని ఆయుధాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాల శిక్ష విధించింది. పద్దెనిమిది నెలలు జైలులో ఉన్న సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. ఇరవై సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు సంజయ్ దత్ ను నిందితుడిగా పేర్కొంటూ ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ తారలు సంజయ్ ఇంటికి వచ్చి అతన్ని పరామర్శించి సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టాలని సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్రమంత్రి చిరంజీవి, టాలీవుడ్ నటుడు రాం చరణ్ తేజ్, హృతిక్ రోషన్, విద్యాబాలన్ ప్రభుత్వాన్ని కోరారు. సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సంజయ్ దత్ క్షమాభిక్షకు అర్హుడేనని తెల్చేశాయి కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదని అంటోంది. సీనియర్ బిజెపి నేత గోపీనాథ్ ముందే మాట్లాడుతూ సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదు అతను సెలబ్రిటీ కాబట్టి అతనికి క్షమాభిక్ష పెడితే ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అని చెప్పారు. మరొక బిజెపి ఎంపి బల్బీర్ పుంజ్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలి, గొప్పవారికి ఒక న్యాయం, బీదవాడికి మరొక న్యాయం అని  ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతాయని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న అన్నా హజారే మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంజయ్ దత్ కట్టుబడి ఉండాలి అంతేకాని దేశ అత్యుత్తమ న్యాయస్థానం విధించిన శిక్షకు వ్యతిరేకంగా క్షమాభిక్ష పెట్టమని కోరరాదని హితవు పలికారు. ఆర్.ఎస్.ఎస్. నేత పాంచజన్య మాట్లాడుతూ బాంబు పేలుళ్ళలొ మరణించిన వారి బంధువుల ఆగ్రహం చల్లారి ఉంటుందని, రెండు దశాబ్ధాలుగా వీరంతా దోషులకు శిక్ష పడాలని ఎదురు చూస్తున్నారని, మరొక పక్క సంజయ్ దత్ కు ఇద్దరు చిన్నపిల్లలున్నారని, కోట్లాది రూపాయలు సంజయ్ దత్ నటించే చిత్రాలు నిలిచిపోతాయని సంజయ్ దత్ కు బాటగా నిలుస్తున్నవారు అంటున్నారని అన్నారు. ఏమైతే నేమి సంజయ్ దత్ కు ఒక పక్క క్షమాభిక్ష పెట్టాలని కొన్ని వర్గాలు కోరుతుండగా మరోపక్క క్షమాభిక్ష పెట్టరాదని మరికొన్ని వర్గాలు కోరుతున్నాయి. ఆఖరికి ఏ వర్గం గెలుస్తుందో వేచి చూడాల్సిందే

kesineni Nani tdp

టిడిపి విజయవాడ ఎంపీ సీటు కేసినేని నానికే

  టిడిపి విజయవాడ లోక్ సభ అభ్యర్ధిగా పోటి చేసేందుకు ట్రావెల్స్ అధినేత కేసినేని నానికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో చంద్రబాబు ఆదివారం విజయవాడ నాయకులతో భేటి అయ్యారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..విజయవాడ లోక్సభ అభ్యర్ధిగా కేసినేని నాని ని ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు కృష్ణాజిల్లా పాదయాత్ర ప్రారంభానికి ముందే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీటుకు హామీ పొందారు. విజయవాడ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఖర్చంతా ఆయనే భరించారు. చంద్రబాబు యాత్రకు గుర్తుగా పరిటాల వద్ద కేశినేని నాని సుమారు రూ.70 లక్షల వ్యయంతో పైలాన్ నిర్మించారు. విజయవాడ సీటు తనకే ఖరారు అవడంతో.. అర్బన్ అధ్యక్ష పదవి కూడా కావాలని అడిగారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.   ఈ నేపథ్యంలో అర్బన్ అధ్యక్ష పదవి నుంచి వంశీని తప్పించడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన స్థానంలో నాని సూచించిన నాగుల్ మీరాను నియమించనున్నట్టు అధినేత స్వయంగా సంకేతాలు ఇచ్చారు. అదేసమయంలో నాలుగేళ్లుగా నగర పార్టీ బాధ్యతలు మోస్తున్న వంశీకి నెమ్మదిగా నచ్చచెప్పి మార్పులు చేద్దామని చంద్రబాబు నిర్ణయించారు.

Danam Nagender Warning to Corporator

దానం నాగేందర్ వార్నింగ్

  బంజారాహిల్స్ లోని భగత్ సింగ్ నగర్ అభివృద్ధి కోసం ప్రతియేటా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి పోటీచేస్తుంటాయి. ఈ సంవత్సరం జరిగే  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేష్, నాగరాజు అనే ఇద్దరు రెండు ప్యానల్స్ గా ఏర్పడి పోటీ చేశారు. వీరిద్దరూ తమ ప్యానెల్ కే మద్ధతునివ్వాలని కార్పోరేటర్ ను కోరారు. కార్పోరేటర్ ఒక వర్గానికి తన మద్ధతు ప్రకటించారు. దీంతో నిరాశకు గురైన రెండవ ప్యానల్ మంత్రి దానం నాగేందర్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో దానం కార్పోరేటర్ ను పిలిచి ఆగ్రహం వ్యటం చేసినట్లు తెలిసింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యా సయోధ్య కుదర్చాలి గాని ఏదో ఒక అభ్యర్థికి మద్ధతు తెలిపితే ఎలా అని గట్టిగా మందలించారు. కార్పోరేటర్ ఆ ఇద్దరు అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా విఫలమవడంతో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వెంకటేష్ ప్యానెల్ విజయం సాధించింది. నాగరాజు వర్గ ప్యానెల్ ఓటమి పాలైంది. దీంతో ఒకే పార్టీలో వర్గాలు ఏర్పడటం మంచిది కాదని దీని పర్యవసానం భవిష్యత్తులో ప్రతిఫలిస్తుందని భగత్ సింగ్ నగర్ వాసులు వాపోతున్నారు

kVP Statement To CBI

సిబీఐకి కెవిపి వాంగ్మూలం

  సిబీఐ కెవిపి రామచంద్రా రావును శనివారం విచారించింది. జగన్ తనని ఎప్పుడూ ఏదీ అడగలేదని, తన ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదని చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. తాను ప్రభుత్వ సలహాదారుగా పనిచేశానని, ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫైళ్ళూ చూడలేదని, ఎక్కడా తన పేరుతొ లావాదేవీలు, సంతకాలు ఉండవని, అడిగితే సలహా చెప్పేవాడినని, ఏదైనా అంశంపై సలహాలు కావలసి వచ్చినప్పుడు మాత్రమే తాను సమావేశాలలో పాల్గొనేవాడినని తెలిపారు. తానెప్పుడూ ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, ఫైళ్ళ వల్ల ఎవరెవరికి లాభం జరిగిందో తనకు తెలియదని, ప్రభుత్వం అడిగినప్పుడు మాత్రమే సలహాలు, సూచనలు ఇచ్సువాదినని, దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారో, ఆ సలహాలు అమలయ్యాయో లేదో కూడా తనకు తెలియదని, తాను రాజశేఖర రెడ్డికి సన్నిహితుడినే అయినా తనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని సిబీఐకి తెలిపినట్లు తెలిసింది.

90 Seats To TRS in Assembly Elections Byreddy Rajasekhar Reddy

బైరెడ్డి భవిష్యత్ వాణి టి.ఆర్.ఎస్.కు 90 సీట్లు

  ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉద్యమం చేస్తున్నారు. ఆదివారం కర్నూలుజిల్లా నందికొట్కూరులొ జరిగిన కార్యకర్తల సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ ... రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతానని తెలిపారు. అలాగే తెలంగాణలో ఎవరిని కదిలించినా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర నినాదం వినిపిస్తుందని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ప్రజల్లో బాగా ఉందని, రాబోయే ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.కు 90 సీట్లు ఖాయంగా వచ్చే సూచనలు కన్పిస్తున్నాయని, అదే కనుక జరిగితే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని,టి.ఆర్.ఎస్.కు దీటుగా రాయలసీమ వాసుల్లో కూడా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం నినాదం కావాలని, ఇప్పటికే రాయలసీమ వెనుకబడి ఉందని, రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను రాయలసీమ పరిరక్షణ సమితికి కట్టబెట్టాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీలు రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీలే అని ధ్వజమెత్తారు.

Disputes In Congress Leaders Mahaboob Nagar Dist

కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక్కింది

  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు చెలరేగాయి. కాంగ్రెస్ అధిష్ఠానం జైపాల్ ను కాదని కిరణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసింది. మరొక వైపు మహబూబ్ జిల్లాలో కేంద్రమంత్రి జైపాల్ కు రాష్ట్రమంత్రి డి.కె.అరుణల మధ్య ఆధిపత్య, వర్గపోరు ఉంది. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్య నివారణకు 100కోట్ల నిథులను కేటాయించి ఆ పనులను ప్రారంభించేందుకు, ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు విచ్చేశారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు సుదర్శన్ రెడ్డి, జానారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపి మంథా జగన్నాథం, ఎమ్మెల్యేలు రాములు, జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు జిల్లా ఇన్ ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా రాష్ట్రమంత్రి డి.కె. అరుణలకు ఆహ్వానాలు పంపించారు. కానీ వీరిద్దరూ గైర్హాజరయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అనునాయులకు కట్టబెట్టారని డి.కె.అరుణ అనుచరులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో జైపాల్ రెడ్డి, డి.కె. అరుణల మధ్య వర్గపోరు బహిర్గతం అయ్యిందని.

telangana issue

తెలంగాణ సమస్య మండే అగ్ని లావా

        కల్వకుర్తిలో 17 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ తపస్సు చేశానని, కల్వకుర్తి ప్రజలకు రుణపడి ఉంటానని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకు చేరుకున్న ఆయన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి తనకు రాజకీయా పాఠశాల అని, పుస్తకాలు చదివి రాజకీయాలు చేయలేరని ఆయన తెలిపారు. తెలంగాణ మండే అగ్ని లావాలా ఉందని, అప్పుడప్పుడు జ్వాలలు ఎగసి పడుతున్నాయని జైపాల్ రెడ్డి అన్నారు.కేంద్రంలో అధికార పార్టీ పక్షాన మంత్రిగా ఉన్నాను కాబట్టి మాట్లాడలేకపోతున్నానని ఆయన అన్నారు. తెలంగాణపై తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

 chandrababu tdp

వైఎస్ దృతరాష్ట్రుడు

        వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ దృతరాష్ట్రుడు... మహాభారతంలో దృతరాష్ట్రుడిలాగే వైఎస్ కూడా తన కుమారుడితో అక్రమాలు చేయించాడు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వారి దోపిడీతో పేదలకు దక్కాల్సిన నిధులు మాయమయ్యాయి. అయితే అన్యాయం ఎంతో కాలం సాగదు. వైఎస్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలమీద మా పార్టీ పోరాటం చేస్తుంది. చివరికి ధర్మం గెలుస్తుంది. ఈ ధర్మపోరాటానికి తెలుగుదేశం పార్టీకి ప్రజలు సహకరించాలి” అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేవీపీ రాంచంద్రరావును విచారిస్తే వైఎస్ అక్రమాలన్ని బయటకు వస్తాయని, రాజకీయాలకు వైఎస్ కుటుంబం చెడ్డ పేరు తెచ్చిందని అన్నారు. మతం ముసుగులో వైఎస్ అల్లుడు, కల్తీ ఎరువులతో వైఎస్ బావమరిది, అక్రమ ఆస్తులతో వైఎస్ జగన్ రాజకీయాల బ్రష్టుపట్టించారని అన్నారు.

kodandaram telangana

కోదండరామ్ ఉద్యోగం ఊడనట్లే

        తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగం విషయంలో చాలా రోజులుగా వివాదం నడుస్తుండటం తెలిసిన విషయమే. ఒకవైపు ప్రభుత్వం నుంచి జీతం అందుకుంటూనే…ఈ ప్రభుత్వానిది దురహాంకారమని, దుర్మార్గపు ప్రభుత్వమని కోదండరాం విమర్శిస్తారని, ఆయన ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని అనేక విమర్శలు ఎదురయ్యాయి. అయితే కోదండరాం మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు! అయితే తాజాగా సడక్ బంద్ విషయంలో ఆయన అరెస్టవ్వడం, జైలులో గడపాల్సి రావడంతో ఆయన ఉద్యోగం ఇంతటితో ఠాం అనే విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా 48 గంటల కు మంచి జ్యూడిషియల్ కస్టడీలో ఉంటే వారు ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతారు. అయితే అదృష్టం కొద్దో, లేక ఏమైనా లాబీయింగ్ ఫలితమో కానీ… ఆ 48 గంటలు గడవకుండానే కోదండరాం విడుదల అయ్యారు. ఉద్యోగాన్ని కాపాడుకున్నారు. ఈసారి కూడా తన ఉద్యోగం గురించి కోదండరాం ఏమీ మాట్లాడలేదు.

sharmila

సెంచరీ చేసిన షర్మిల

  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల గత ఏడాది అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయలో మొదలు పెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయత్రకు ఆదివారంతో 100 రోజులు పూర్తయ్యాయి. 14 వందల కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ఆమె ఇప్పటివరకు 7 జిల్లాలలో, 43 అసెంబ్లీ నియోజకవర్గాలు, 750 గ్రామాలలో ప్రజలను కలిసారు. మద్యలో మోకాలి గాయానికి శస్త్రచికిత్స నిమిత్తం రెండు నెలలు విశ్రాంతి తీసుకొన్న ఆమె, తిరిగి తన పాదయాత్రను ఫిబ్రవరి 6న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ నుంచి మొదలుపెట్టి నాటి నుండి నేటి వరకు నిర్విరామంగా(యంయల్సీ ఎన్నికల వలన మద్యలో రెండు రోజులు పాదయాత్రకు విరామం ఈయవలసివచ్చింది.) తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆమెకు పాదయాత్ర 100రోజులు పూర్తైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం గుంటూరు జిల్లా మంగళ గిరిలో బస్టాండ్ సెంటరు వద్ద ఒక భారీ బహిరంగ సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది. ఆ సభలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మరియు ఆ పార్టీ నేతలు పాల్గొంటారు.

TDP mlc yadagiri died

టిడిపి ఎమ్మెల్సీ యాదగిరి కన్నుమూత

  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి గుండెపోటుతో కన్నుమూశారు. శాసన మండలి సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. దాదాపు ఏడాది కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో యాదగిరి బాధపడుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో.. శనివారం సాయంత్రం 6.45 నిమిషాలకు స్వగృహంలోనే కన్నుమూశారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు జయరాం ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. పొగాకు యాదగిరి మరణం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి యాదగిరి క్రియాశీలకంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. యాదగిరి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. యాదగిరి మృతికి సీఎం కిరణ్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, టీడీపీ నేతలు దేవేందర్ గౌడ్, టీఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు సంతాపం తెలిపారు.  

congress tdp

దోచుకో..దాచుకో అన్నది కాంగ్రెస్‌ నీతి: బాలయ్య

        'బతుకు, బతికించు.. పది మందిని బతికించుకోవడానికి అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలన్నది టిడిపి సిద్ధాంతమైతే, 'దోచుకో, దాచుకో...అవసరమైతే పది మందిని చంపించు' అన్నది నేటి కాంగ్రెస్‌పాలకుల నీతి అని సినీహీరో, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. పేద ప్రజలను ఆదుకోవడానికి టీడీపీ పుట్టిందన్నారు. అలాంటి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు, నేతలు శ్రమించాలని పిలుపునిచ్చారు. జాబ్ రావాలన్నా, బతుకు బాగుండాలన్నా బాబు గెలవాలని అన్నారు. తాను ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ మండలంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు.

కేవీపీని 8గంటలు ప్రశ్నించిన సీబీఐ

  జగన్ అక్రమాస్తుల కేసులో రాజ్యసభ సభ్యడు కె.వి.పి. రామచంద్రరావును సీబీఐ శనివారం నాడు దాదాపు 8 గంటలకు పైగా ప్రశ్నించింది. ఆయన మద్యాహ్నం భోజనం సీబీఐ ఆఫీసులోనే చేశారు. పొద్దున్న 11 గంటలకు మొదలయిన సీబీఐ విచారణ రాత్రి 7.30 వరకు సాగడంతో ఆయన బాగా అలసిపోయినట్లు కనిపించారు. అయినప్పటికీ, సీబీఐ ఆఫీసు నుండి బయటకి రాగానే, మీడియాతో కొంత సేపు మాట్లాడారు. తనను కేవలం సెక్షన్ 160 క్రింద సాక్షిగా మాత్రమే పిలిచారని ఆయన తెలిపారు. తనకు తెలిసిన సమాచారం అంతా సీబీఐకు తెలియజేసానని, అవసరమయితే మళ్ళీ వచ్చి సీబీఐకి సహకరించేందుకు కూడా తానూ సిద్ధంగా ఉన్నానని ఆయన మీడియాకు తెలిపారు. కానీ, కేసు విషయంలో ఏమేమి అడిగారు, తనేమి చెప్పారో వంటి విషయాలను మాత్రం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. సీబీఐ జాయింటు డైరెక్టరు లక్ష్మి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, కేవీపీ నుండి తమకు అవసరమయిన సమాచారాన్ని సేకరించామని, అవసరమయితే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. జగన్ కేసు ముగించడానికి సుప్రీం కోర్టు నిర్దిష్టమయిన గడువు పెట్టిన విషయాన్ని మీడియా ఆయనకు గుర్తుచేసి, ఆ కేసు ఎప్పటిలోగా ముగిస్తారని అడిగినప్పుడు, ఆయన సుప్రీం కోర్టు ఏమి చెప్పిందో వెబ్ సైటులో స్పష్టంగా ఉందని, వివరాలు కావలసిన వారు సదరు వెబ్ సైటును చూసుకోవచ్చునని ఆయన అన్నారు. తనకు తెలిసి మరెవరికీ సమన్లు జారీ చేయలేదని ఆయన అన్నారు.

కోదండరామ్, ఈటెలకు బెయిల్

        సడక్ బంద్ లో భాగంగా అరెస్టైన 8 మంది నేతలకు అలంపూర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండ రామ్, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష ఈటెల రాజేందర్ ,ఎమ్మెల్యే జూపల్లె కృష్ణారావు,మాజీ ఎమ్.పి జితేందర్ రెడ్డి, శ్రీనివాస గౌడ్ లతో సహా ఎనిమిది మందికి 10 వేల పూచీకత్తుతో, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోదండ రామ్ తో పాటు సడక్ బంద్ లో పాల్గొన్న 11మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో 8 మందికి ఈ రోజు బెయిల్ మంజూరు అయ్యింది. ఇవాళ్ళ కోర్టులో లొంగిపోయిన కావేటి సమ్మయ్య, గట్టు తిమ్మప్ప, తుమ్మల రవికు రోజుల రిమాండ్ ను కోర్ట్ విదించింది.

అసమ్మతి నేతలపై వేటుకి కాంగ్రెస్ పిర్యాదు

  ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ దైర్యం చేసి 9 మంది అసమ్మతి శాసన సభ్యులకు వ్యతిరేఖంగా ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి పిర్యాదు చేసింది. పార్టీకి వ్యతిరేఖంగా పనిచేస్తున్న ఆ 9 మందిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ గండ్రవెంకటరమణారెడ్డి స్పీకర్ ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.   అయితే స్పీకర్ వారిపై వేటువేసినట్లయితే, రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది గనుక, ఆయన నిర్ణయం తీసుకోవడానికి కొంచెం తాత్సారం చేయవచ్చును. ప్రస్తుత అనిశ్చిత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించకపోగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే లాభం కలిగించే అవకాశం ఉంది. గనుకనే, తెదేపా కూడా తన విప్పును దిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన తన 6మంది శాసన సభ్యులపై ఇంతవరకు స్పీకర్ కు పిర్యాదు చేయలేదు.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన 9 మంది శాసన సభ్యులపై వేటు వేసేందుకు సిద్ధం అయితే, అప్పుడు తెదేపా కూడా స్పీకర్ కు పిర్యాదు చేసి మొత్తం 15 స్థానాలకు ఒకేసారి ఉపఎన్నికలు వచ్చేలా చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, అన్ని పార్టీలు కూడా ఉపఎన్నికలను రాబోయే సాధారణ ఎన్నికలకి సెమీ ఫైనల్స్ గా భావించి విజయం సాదించేందుకు తీవ్ర పోరాటం చేయవచ్చును.   అయితే, సాధారణ ఎన్నికలకి కేవలం ఏడాది మాత్రమే సమయం మిగిలిఉన్న ఈ తరుణంలో రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, తెదేపాలు ఉపఎన్నికలు తెచ్చి చేజేతులా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకపోవచ్చును. ఒకవేళ ఉపఎన్నికలే జరిగి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో రెండు మూడు సీట్లు పెరిగినా అది ఆపార్టీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ప్రజలలో తనకు రాన్రాను సానుభూతి, మద్దతు తగ్గిపోతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి సరయిన జవాబు చెప్పినట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచి పరిణామం కాదు గనుక స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకకటించేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చును.

ఎమ్మెల్యే గానే బాలయ్య పోటి

      2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగానే పోటిచేస్తానని టిడిపి అదినేత చంద్రబాబు వియ్యంకుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా లావుకొత్తూరు మండలానికి చెందిన తునికి సమీపంలోగల తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికలలో పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను సామాన్య కార్యకర్తలాగా చేస్తానని ఆయన అన్నారు. విశాఖ జిల్లాకు చెందిన పాయకరావు పేటలో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు.