సచిన్ ఎవరు?.. షరపోవా పొగరు!
posted on Jul 2, 2014 @ 4:38PM
ఇంటర్నేషనల్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా కళ్ళుచెదిరే అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి కూడా. అయితే అందం, కీర్తి, డబ్బు వున్న షరపోవాకి పొగరు కూడా బోలెడంత వుంది. ఆ పొగరు ఏ స్థాయిలో వుందంటే, సచిన్ టెండూల్కరా? అతనెవరు? ఈ పేరు నేనెప్పుడూ వినలేదు అనేంత స్థాయిలో వుంది. వింబుల్డన్ పోటీలను తిలకించడానికి సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు. అక్కడ ప్రముఖులు కూర్చునే గ్యాలరీలో పలువురు ప్రముఖులతో కలసి కూర్చుని షరపోవా ఆడే టెన్నిస్ చూశాడు. షరపోవా మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఒక టీవీ రిపోర్టర్ ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మీ మ్యాచ్ చూడటానికి సచిన్ టెండూల్కర్ కూడా వచ్చాడు తెలుసా అని గొప్పగా చెప్పాడు. దానికి షరపోవా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ‘సచిన్ టెండూల్కరా.. అతనెవరు?’ అంది దాంతో తెల్లబోవడం సదరు రిపోర్టు వంతయింది. క్రికెట్ రంగంలో తనకంటే ఎక్కువ స్థాయిలో వున్న సచిన్ టెండూల్కర్ గురించి షరపోవాకి నిజంగా తెలియదా.. లేక తెలిసి కూడా పొగరు చూపించిందా? నో డౌట్.. అది పొగరే!