మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బందీలుగా 170 మంది
పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మాలి రాజధాని బమాకాలో ఉన్నరాడిసన్ బ్లూ హోటల్ లోకి 10 మంది ఉగ్రవాదులు చొరబడి చేసి 170 మందిని (140 మంది టూరిస్ట్ లు, 30 మంది హోటల్ సిబ్బంది) నిర్భందించి.. తొమ్మిది మందిని చంపారు. బందీల్లో ఎక్కువగా అమెరికా, బ్రిటన్ కు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల దగ్గర భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాగా ఆటోమెటిక్ ఆయుధాలు, బాంబులు ధరించిన ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డులను హత్య చేసి, లోపలికి వెళ్లారని తెలుస్తోంది.