యజమానిని కాల్చిన పెంపుడు కుక్క

  పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు. కుక్కే తన యజమానిపై కాల్పులు జరిపిన సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటు చేసుకుంది. ప్లోరిడాకు చెందిన జార్జ్ డెలి లానియర్...తన దగ్గరున్న బెరెట్టా 9ఎంఎం ఆటోమేటిక్ తుపాకీని క్లీన్ చేసి నేలమీదే పెట్టి బయటకు వెళ్ళిపోయాడు.   అతను బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి, కారు ఆపి దిగిన వెంటనే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఏం జరిగింది! అని చూసుకొనే సరికి తన కాలులో నుంచి పొగ రావడం గమనించాడు. లైట్ గా రక్తం కూడా కారుతుంది. తీరా చూసుకొనే సరికి తన పెంపుడు కుక్క తాను క్లీన్ చేసినా గన్ పై నిలుచోని వుంది. యజమాని ఇంటికి రావడాన్ని గమనించిన కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గన్ ట్రిగ్గర్ పైన కాలు పెట్టడంతో అది కాస్త పేలి అతనికే తగిలింది. అయితే తన నిర్లక్ష్యానికి తగిన శాస్తి జరిగిందని ఆయన బాధపడ్డాడు.  
Publish Date: Mar 1, 2013 4:09PM

ఆమెను హింసించింది ఆ మైనరే !

      ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.   అత్యాచారం అనంతరం ఆ అభాగ్యురాలిని బస్సులోనుండి తోసివేయాలనే నిర్ణయం తీసుకొనడంతో పాటు, ఆమెను బస్సులో చిత్ర హింసలకు గురి చేసిన ఆ బాలుడు మాత్రం ప్రస్తుతం కఠిన శిక్ష నుండి మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఉద్యమకారులతో పాటు, పోలీసులకు కూడా మింగుడు పడని ఈ విషయంలో ఏమీ చేయలేని పోలీసులు ఆ బాలుడి పేరును చార్జ్ షీట్ లో నుండి తొలగించారు. ఇప్పటి చట్టాల ప్రకారం బాల నిందితులు ఎంత నేరానికి పాల్పడినా మూడు సంవత్సరాలకు మించి జైలులో పెట్టడానికి వీలు లేదు.   అసలు బస్సులో వారందరినీ అత్యాచారానికి ఉసిగొల్పింది ఆ బాలుడేనని సమాచారం ! ఆ యువతిఫై ఆ బాలుడు రెండు సార్లు అత్యాచారం చేశాడు కూడా. ఆమె జననాంగాలలోకి రాం సింగ్ తో కలిసి రాడ్ దూర్చడం వంటి దారుణ పనులకు ఒడిగట్టిన ఆ బాలుడు ప్రస్తుతం మైనర్ అయిన కారణంగా అతి తక్కువ శిక్షతో బయట పడే అవకాశం ఉంది. మైనర్ అయినా కూడా ఆ బాలుడు చేసిన పనులు దారుణంగా ఉన్నాయని, అవసరమైతే ఈ విషయంలో చట్టాలను సవరించాలని ఆ యువతి సోదరుడు మీడియా తో అన్నారు.   ఈ కారణాలతో బాల నేరస్తుల చట్టాన్ని సవరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.సాక్షాత్తు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజేంద్ర ఖన్నా కూడా ఇలా డిమాండ్ లు చేస్తున్న వారిలో ముందు వరసలో ఉన్నారు.  
Publish Date: Jan 5, 2013 7:28PM

ఎంఎల్ఏ బెయిల్ కు పోలీసుల గండి

      ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. దీనితో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నరసరావుపేట 13 వ అదనపు జిల్లా న్యాయమూర్తి రామారావు ఎదుట నిన్న ఈ పిటీషన్ ఫై విచారణ జరిగింది. ఆ ఎంఎల్ఏ తరపున వాదించిన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, అధికార పార్టీకి చెందిన ఎంఎల్సీ కృష్ణా రెడ్డి తన క్లెయింట్ ఫై కక్ష సాధించడానికే ఈ కేసులో ఇరికించారనీ, అసలు పోలీసుల ఎఫ్ఐఆర్ లో ఎంఎల్ఏ పేరు లేదని అన్నారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితులకు, తన క్లెయింట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. అయితే, యరపతినేని చేసిన ఈ బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు, ప్రాసిక్యూషన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. యరపతినేని నిర్వహించిన ఓ బహిరంగసభలో రాళ్ళు రువ్విన నరేంద్రను ఉద్దేశించి ‘రాళ్ళు రువ్విన వారిని స్మశానానికి పంపే వరకూ నిద్రపోను’ అన్న వీడియో క్లిప్పింగ్ ను స్థానిక సిఐ తన లాప్ టాప్ ద్వారా న్యాయమూర్తికి చూపించారు. అలాగే, ఈ హత్య జరిగిన తర్వాత ఈ కేసులోని నిందితులతో ఎంఎల్ఏ ఫోన్లో మాట్లాడిన విషయాన్ని దానికి రుజువుగా ఆయన కాల్ లిస్టు ను న్యాయమూర్తికి చూపించారు. దీనితో, ఆ ఎంఎల్ఏ కు బెయిల్ నిరాకరిస్తూ, న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Publish Date: Jan 1, 2013 3:40PM

టిడిపి సీనియర్లఫై నన్నపనేని అసంతృప్తి

      గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   పార్టీ తీసుకొన్న వైఖరిఫై మొన్న టిడిపి పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తి గళం విప్పితే, నిన్న ఆ పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఈ కోవలోకి చేరారు. తాను సమైఖ్య వాదినని ప్రకటించారు. తమ పార్టీ అధిష్టానం నుండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని, అందువల్ల ఈ విషయంలో ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. కొంత మంది పార్టీ నాయకులు పార్టీలో ఏమి చేసినా జరిగిపోతుందని ఆమె విమర్శలు చేశారు.   చంద్రబాబు చుట్టూ ఉండే వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ఆమె సూచించారు. తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడిన వేణుగోపాల్ రెడ్డి ని తాను అభినందిస్తున్నానని ఆమె అన్నారు. తాను సుదీర్ఘ కాలం పార్టీ కోసం కష్టపడటం వల్లే తనకు శాసన మండలి సభ్యత్వం ఇచ్చారని ఆమె అన్నారు.  
Publish Date: Jan 1, 2013 11:18AM

సైకిలు ఎదురొస్తే కారుకు భయమెందుకు?

      ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు తెలంగాణా పై పూర్తీ పేటెంట్ హక్కులు తనవేఅన్నట్లు వ్యహరిస్తున్న తెరాసకి, ఇప్పుడు తెలుగుదేశం ఈ విదంగా ప్రకటించడం మింగుడు పడకపోవడంలో పెద్ద వింతేమి లేదు.   బిజెపి, సి.పి.ఐ.వంటి పార్టీలు తెలంగాణాకి అనుకూలమని చెప్పినప్పటికీ కంగారు పాడనీ తెరాస ఇప్పుడు తెలుగుదేశంపార్టీ అనుకూలమని ప్రకటించేసరికి మాత్రం ఎందుకో కొంచెం అసౌకర్యంగా భావిస్తోంది. ఎందుకంటే, బిజెపి, సిపిఐ పార్టీలు రెండూ కూడా తనని ఎన్నికలలో సవాలు చేసే స్థాయిలో లేవు గనుకనే వాటిని చూసి భయపడని తెరాస, తెలంగాణాలో తెలుగుదేశంపార్టీకున్న పటిష్టమయిన క్యాడర్, ప్రజల మద్దతును చూసి అది ఇప్పుడు మరింత బలపడి, మున్ముందు ఎన్నికలనాటికి తనకి సవాలు విసిరే అవకాశం ఉండవచ్చనుననే ఆందోళనతోనే గులాబిదండు తెలుగుదేశం వెంటపడినట్లు కనిపిస్తోంది. ఇంతవరకూ, తెలుగుదేశంపార్టీ తెలంగాణా వ్యతిరేఖి అంటూ ఆ పార్టీపట్ల ప్రజలలో ఏహ్యత కల్పించగాలిగిన తెరాస, ఆ పార్టీ ఎన్నటికీ తెలంగాణా వ్యతిరేఖిగానే ఉంటేనే తనకు రాజకీయంగా మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తద్వారా, తెలంగాణాలో తన మాటే వేదవాక్కుగా చెలామణి అవుతుంది, ఎన్నికలలో కూడా మరే పార్టీ తనకు పోటీ ఉండదు. గానీ, తెలుగుదేశంపార్టీ ఈవిదంగా తెలంగాణా అనుకూల వైఖరిని ప్రదర్శించి తనకు పోటీగా తయారవడం సహించలేని కారణంగానే తెరాస తెలుగుదేశంపార్టీపై విమర్శలు చేస్తోంది.    తెలుగుదేశంపార్టీ షిండేకి ఇచ్చిన లేఖలో ఆ పార్టీ ప్రత్యేకతెలంగాణా కోరినట్లు తెరాసకు అర్దమయినపటికీ, రాజకీయంగా తెలుగుదేశంపార్టీని ఎదుర్కోక తప్పదు గాబట్టి, ఆ లేఖలో ఎక్కడా కూడా ‘తెలంగాణా అనేపదం’ లేకుండా వ్రాసి ప్రజలని మరోమారు మోసంచేస్తోందని ఒక అర్ధం లేని వితండవాదం మొదలు పెట్టింది. అఖిలపక్షసమావేశంలో పాల్గొన్న అన్నిపార్టీలకు అర్ధమయిన సంగతి తెరాసకు అర్ధం కాలేదంటే ఎవరు కూడా విశ్వసించరు.   తెలుగుదేశంపార్టీ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాకి అనుకూలంగా తన నిర్ణయం ప్రకటించిన తరువాత ప్రజా సంఘాల ఐ.క.స., ఉస్మానియా.ఐ.క.స.కు చందిన నేతలు గజ్జెల ఖంతం, రాజారామ్ యాదవ్ వంటి అనేక తెలంగాణా సంఘాలవారు  అభినందలు తెలుపుతూ చంద్రబాబును కలుస్తున్న ఈ సమయంలోనే, సీమంధ్ర వైపునుండి అతనికి మెల్లగా నిరసనలు పలకరిస్తున్నాయి. గుంటూరు జిల్లా, నరసరావుపేటకు చెందిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మరోఅడుగు ముందుకువేస్తూ, త్వరలో తానూ చంద్రబాబును కలిసి పార్టీ నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు తెలియజేసి, సమైక్యంద్ర కోసం పార్టీని వీడాలనుకొంటున్నట్లు ప్రకటించేరు. మరో వైపు, సీమంద్రకు చెందిన కాంగ్రేసు నేతలయిన శైలజానాథ్ వంటివారు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతుండగా, అదే పార్టీకి చెందిన తెలంగాణా యం.పీ.లు ఆయనని అభినందిస్తూ తెలంగాణా ఏర్పడేవరకూ మాట తప్పవద్దని హెచ్చరించారు.   ఇంతమందికి అర్ధమయిన విషయం మరి తెరాసకు అర్ధం కాలేదంటే నమ్మశక్యంగా లేదు. తెలుగుదేశంపార్టీకి చెందిన తెలంగాణానేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదే విషయాన్నీ ప్రశ్నిస్తూ, “మా పార్టీ ప్రత్యేక తెలంగాణా కోరడం మీకు అయిష్టంగా ఉందా లేక మేము ఆవిధంగా ప్రకటించి మీ పార్టీకి సవాలుగా తయారయమని మీరు భయపడుతున్నారా చెప్పండి? అంటూ ప్రశ్నించారు.   ఇక చంద్రబాబు కూడా తాము 2008 సం.లో వ్రాసిన ఏలేఖని చూసి తమతో తెరాస పొత్తుకు అంగీకరించిందో ఇప్పుడు అదే లేఖకి విలువలేదని ఎందుకు అంటోంది అని సూటిగా ప్రశ్నించేరు. అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ నిజంగానే సమైక్యాంద్రకి మొగ్గు చూపుతూ మాట్లాడి ఉంటే, తెలంగాణా ఉద్యామలకి పురిటిగడ్డ అని పేరుపడ్డ వరంగల్ లో చంద్రబాబుని కాలుమోపనీయ కుండా అక్కడి స్థానిక ప్రజలే అడ్డుపడేవారు. గానీ, చంద్రబాబు యాత్రకి ప్రజలు చాలచోట్ల సంఘీభావం కనబరుస్తున్నట్లు వస్తున్నవార్తలును చూస్తే, వారు కూడా తెలుగుదేశంపార్టీ ఈసారి తెలంగాణాకి అనుకూలనిర్ణయం ప్రకటించిందని విశ్వసించినట్లు అర్ధం అవుతోంది.   తెలంగాణాలో తనకి మరే ఇతర పార్టీ కూడా పోటీ ఉండకూడదని కోరుకొనే తెరాస, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వై.యస్సార్.పార్టీలపై  ‘తెలంగాణా వ్యతిరేఖముద్ర’ లేదా ‘సీమంద్రా ముద్ర’ వేసి ఉన్న మూడు బలమయిన పార్టీలను తెలంగాణానుండి తరిమేయాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం కేసిర్ తననోటితోనే కాంగ్రెస్ పార్టీలో తెరాసను కలిపేయడానికికూడా సిద్ద పడ్డానని చెప్పిన సంగతి మరిచిపోయి, తెలంగాణా ఈయకపోతే కాంగ్రెసుకు బొంద పెడతానని, నామరూపాలు లేకుండా చేస్తామని బీరాలు పలకడం చాలా విచిత్రం. రేపు అదే కాంగ్రెస్ మళ్ళీ ఏదయినా చక్రం తిప్పినట్లయితే, మళ్ళీ ఆ పార్టీ చుట్టూనే తెరాస అదినేత కేసిర్ తిరిగినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. గానీ, అతను తమ పార్టీని అంతగా కించపరుస్తుంటే దానిని ఖండించకపోగా అతనితోనే రాసుకుపూసుకు తిరగడం కాంగ్రెస్ నేతల దౌర్భాగ్యం.  తప్పనిసరయితే, అతనికే ఊడిగం కూడా చేసేందుకు సిద్దం అని కాంగ్రేసు నేతలు కొందరు చెప్పడం మరింత సిగ్గుచేటయిన విషయం. ఈ విదంగా తెలంగాణా కాంగ్రెసు సభ్యులను మెల్లగా తన దారికితెచ్చుకొంటూ, మిగిలిన రెంటినీ అడ్డుతోలగించుకొనే ప్రయత్నంలోనే, తెరాస ఇప్పుడు వై.యస్సార్.పార్టీ, తెలుగుదేశంపార్టీలపై దాడి చేస్తోందని భావించవలసి ఉంటుంది. గులాభి దండు  వై.యస్సార్.పార్టీపై ఆగ్రహం చూపడానికి కొంత అర్ధం ఉన్నపటికీ,తెలంగాణాకి అనుకూలమని చెప్పిన తెలుగుదేశంపార్టీపై కూడా విమర్శల వర్షం కురిపిస్తోందంటే, తెలుగుదేశం పార్టీ నేతలు చెపుతున్నట్లు నిజంగానే తమపార్టీని చూసి తెరాస గుండెల్లో రైళ్ళు పరుగేడుతున్నాయని భావవించవలసి వస్తుంది.
Publish Date: Dec 31, 2012 7:18PM

సన్నీ లియోన్ చాలా కాస్ట్ లీ గురూ..!

      అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు. అది కాస్తా పోయాక ఎవరు పలకరిస్తారులే అనుకుందేమో సన్నీ లియోన్ తను చెప్పిన రేటుకు ఒక్క రూపాయి తగ్గేది లేదు. చేతనయితే కార్యక్రమం ఫిక్స్ చేసుకోండి..లేకుంటే మీ ఇష్టం అని తెగేసి చెప్పిందట. దీంతో దిమ్మ తిరిగిన ఆ స్టార్ హోటల్ నిర్వాహకులు సన్నీ చెప్పిన రేటుకు ఓకే అన్నారట. ఇక ఇప్పుడు ఢిల్లీలోని స్టార్ హోటల్ రేట్లకు కూడా రెక్కలొచ్చాయి మరి. ఒక్కటా రెండా ఏకంగా ఒక్క రాత్రికి కోటి రూపాయలు అఫర్ చేశారు. ఆ మాత్రం ధరలు పెంచకుంటే గిట్టుబాటవుతుందా ? సన్నీ లియోన్ అందాలు తెరమీద కాకుండా ప్రత్యక్ష్యంగా చూడాలంటే ఈ నెల 31న ఢిల్లీలోని ఆ స్టార్ హోటల్ కు వెళ్లాల్సిందే. పోర్స్ స్టార్ గా అంతంత మాత్రం ఆదాయంతో నెగ్గుకొచ్చిన సన్నీ భారతీయ మార్కెట్ బాగానే రుచి చూస్తోందన్న మాట.
Publish Date: Dec 27, 2012 6:19PM

‘టి’ కి వ్యతిరేకంగా మాట్లాడితే, పరుగే పరుగు !

      ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.   కాంగ్రెస్, తెలుగు దేశం, వై ఎస్ ఆర్ కాంగెస్ పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన సూచించారు. ఈ సమావేశం తేదీ దగ్గర పడుతుండడంతో టిఆర్ఎస్ దూకుడు పెంచినట్లుగా కనపడుతోంది. ప్రతి పార్టీ నుండి ఇద్దరేసి ప్రతినిధులు రావాలని కేంద్రం సూచించడంతో టిఆర్ఎస్ ఈ హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి.   రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదని కేటిఆర్ విమర్శించారు.
Publish Date: Dec 15, 2012 6:26PM

అమెరికా పాఠశాలలో కాల్పులు : 18 విద్యార్దులు మృతి

       అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కనెక్టికట్ లోని న్యూస్ టౌన్ లో గల శాండీ హుక్ అనే ప్రైమరీ స్కూల్ లో ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది.   ఈ సంఘటనలో18 మంది విద్యార్దులు, 9 మంది స్కూల్ సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఇదే స్కూల్ లో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి తనయుడు 20 ఏళ్ల లాన్జా రెండు తుపాకులతో స్కూల్ లోపలికి చొరబడ్డాడు. నర్సరీ తరగతి గదిలోకి వెళ్లి విచక్షణారహితంగా చిన్నారులఫై కాల్పులు జరిపాడు. మొత్తం 27 మందిని పొట్టన బెట్టుకున్న అనంతరం ఈ ఉన్మాది తనఫై కాల్పులు జరుపుకొని చనిపోయాడు.   ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్కూల్ సమీపంలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఈ స్కూల్ లో మొత్తం ఆరు వందల మంది విద్యార్దులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కాల్పులలో గాయపడిన విద్యార్దులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే, విద్యార్దుల తల్లి తండ్రులు ఆందోళనతో స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈ కాల్పులలో లాన్జా కు సహకరించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.   ఈ సంఘటన ఫై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా విచారం వ్యక్తం చేశారు. ఇంత మంది చిన్నారులు మరణించడం తట్టుకోలేని ఆయన కంట తడి పెట్టారు. దీని ఫై విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని అధ్యక్షుడు ప్రకటించారు.
Publish Date: Dec 15, 2012 12:05PM

జైల్లో జగన్ ని కలిసిన కాసాని జ్ఞానేశ్వర్

            మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం ఆయన ఆ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి ని చంచల్ గూడ జైలులో కలుసుకున్నారు.   అందరూ జగన్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ ప్రముఖ బిసి నేత వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే బహిరంగ సభలో తన అభిప్రాయాలను ప్రజలకు చెపుతానని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కాసాని ఆ రంగంలో సంపాదించిన డబ్బుతో ఆయన కులం ‘ముదిరాజ్’ కోసం పలు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. ఓ సమయంలో తెలుగు దేశం కు దగ్గరయినప్పటికి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు.   కాసాని గతంలో ‘మన పార్టీ’ అనే రాజకీయ పార్టీని కూడా నడిపారు. రంగా రెడ్డి జిల్లా నుండి గతంలో ఆయన శాసనమండలి కి పోటీ చేసి ఓడిపోయారు.
Publish Date: Dec 14, 2012 2:33PM

ప్రేమించలేదని నిఖిత గొంతు కోసిన ప్రేమోన్మాది

    ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు. రాఘవేందర్ రెడ్డిది కందుకూరు మండలం దాసరపల్లి. నిఖిత కుటుంబ సభ్యులు సైదాబాదు ప్రాంతంలో ఉన్నప్పుడు వీరి ఇంటి పక్కనే రాఘవేందర్ రెడ్డి కుటుంబం ఉండేది. అప్పట్లో అతను ప్రేమ పేరుతో నిఖిలను వేధించాడు. మూడేళ్ల క్రితం నిఖిత కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడకు మారిపోయాడు. దీంతో రాఘవేందర్ రెడ్డి అక్కడకు కూడా వెళ్లి ఆమెను వెంటాడేవాడు.   బుధవారం సాయంత్రం నిఖిత తన ఇంట్లో చదువుకుంటుండగా తల్లి భాగ్యలత కూరగాయల కోసం బయటకు వెళ్లారు. తండ్రి బాలరాజ్ దుకాణంలో ఉన్నాడు. ఆ సమయంలో రాఘవేందర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి బెడ్ రూమ్ లో చదువుకుంటున్న నిఖితను కత్తితో గొంతుకోసి చంపాడు. ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు ఎంతకూ తలుపు తీయక పోవడంతో బలవంతంగా తీశారు. నిఖితను తాను హత్య చేయలేదని అరుస్తూ రాఘవేందర్ రెడ్డి ఆమె తల్లిని నెట్టేసి బయటకు వచ్చాడు. తన వద్ద ఉన్న కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని ఇబ్రహీంపట్నంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Publish Date: Dec 13, 2012 11:04AM

పురంధేశ్వరిని అంటే నారక్త౦ ఉడుకుతోంది: జయకృష్ణ

    నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు. పత్రికల్లో వార్తలు చూసి బాలయ్యకు ఫోన్ చేశాను. లేఖపై సంతకం కోసం నా వద్దకు రాలేదని చెప్పాడు. ఈ విషయంలో వివాదం లేదు. విగ్రహం ఇవ్వాలని స్పీకర్ నుంచి తనకు లేఖ అందగానే తనకంటే పెద్దవాళ్లైన అందరి ఇళ్లకు తానే స్వయంగా వెళ్లి విషయం చెప్పాను’’ అని కేంద్రమంత్రి పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు నివాసానికి కూడా మూడు సార్లు లేఖలు పంపించాను. కానీ ఎవ్వరూ దానిని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నాకు ఉంది. నా ఉద్దేశం కూడా అదే అని ఆమె అన్నారు. ఇక పురంధేశ్వరికి ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ మద్దతు పలికారు. దారిన పొయ్యే దానయ్యలంతా నా చెల్లెలు పురంధేశ్వరి గురించి మాట్లాడితే నా రక్త ఉడుకుతోంది అని ఘాటుగా హెచ్చరించాడు. ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో పెడుతున్నందుకు అంతా సంతోషించాలి కానీ వివాదాలు సరికాదు అని అన్నారు.  
Publish Date: Dec 13, 2012 10:26AM

చంద్ర బాబు ఫై యార్లగడ్డ ఫైర్

            పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది.ఇంతవరకూ ఇది చంద్ర బాబు నాయుడు, దగ్గుబాటి దంపతులకే పరిమితమయింది. ప్రస్తుతం ఈ జాబితాలో ఎన్ టి ఆర్ కు వీరాభిమాని అయిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేరారు.   ఈ అంశంలో చంద్ర బాబు నాయుడు రాసిన లేఖలోని విషయాలన్నీ అబద్ధాలేనని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో విగ్రహాల కమిటీలో అసలు ఎర్రం నాయుడు లేడని ఆయన అన్నారు. 2000 సంవత్సరపు విగ్రహాల కమిటీ ప్రొసీడింగ్స్ ను ఆయన బయట పెట్టారు.ఈ లేఖ విషయంలో చంద్ర బాబు నాయుడు క్షమాపణ చెప్పాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు.   విగ్రహం వివాదం లో ఆయన దగ్గుబాటి దంపతులకు అండగా నిలుస్తున్నారు. యార్లగడ్డ ఎన్ టి ఆర్ కు వీరాభిమాని అయినప్పటికీ, చంద్ర బాబు తిరుగుబాటు సమయంలో ఆయన హరి కృష్ణ వెనుక నడిచారు. ఏది ఏమైనా, ఈ అంశం చంద్ర బాబు కు మాత్రం తలనొప్పిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Publish Date: Dec 11, 2012 6:38PM