‘టి’ కి వ్యతిరేకంగా మాట్లాడితే, పరుగే పరుగు !

 

 

 

ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.

 

కాంగ్రెస్, తెలుగు దేశం, వై ఎస్ ఆర్ కాంగెస్ పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన సూచించారు. ఈ సమావేశం తేదీ దగ్గర పడుతుండడంతో టిఆర్ఎస్ దూకుడు పెంచినట్లుగా కనపడుతోంది. ప్రతి పార్టీ నుండి ఇద్దరేసి ప్రతినిధులు రావాలని కేంద్రం సూచించడంతో టిఆర్ఎస్ ఈ హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి.

 

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదని కేటిఆర్ విమర్శించారు.