చంద్ర బాబు ఫై యార్లగడ్డ ఫైర్

 

 

 

 

 

 

పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది.ఇంతవరకూ ఇది చంద్ర బాబు నాయుడు, దగ్గుబాటి దంపతులకే పరిమితమయింది. ప్రస్తుతం ఈ జాబితాలో ఎన్ టి ఆర్ కు వీరాభిమాని అయిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేరారు.

 

ఈ అంశంలో చంద్ర బాబు నాయుడు రాసిన లేఖలోని విషయాలన్నీ అబద్ధాలేనని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో విగ్రహాల కమిటీలో అసలు ఎర్రం నాయుడు లేడని ఆయన అన్నారు. 2000 సంవత్సరపు విగ్రహాల కమిటీ ప్రొసీడింగ్స్ ను ఆయన బయట పెట్టారు.ఈ లేఖ విషయంలో చంద్ర బాబు నాయుడు క్షమాపణ చెప్పాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు.

 

విగ్రహం వివాదం లో ఆయన దగ్గుబాటి దంపతులకు అండగా నిలుస్తున్నారు. యార్లగడ్డ ఎన్ టి ఆర్ కు వీరాభిమాని అయినప్పటికీ, చంద్ర బాబు తిరుగుబాటు సమయంలో ఆయన హరి కృష్ణ వెనుక నడిచారు. ఏది ఏమైనా, ఈ అంశం చంద్ర బాబు కు మాత్రం తలనొప్పిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.