34 ఏళ్ళలో ఇదే ఆసీస్ చెత్తజట్టు
Publish Date:Mar 26, 2013
భారత పర్యటనలో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టుపై ఆ దేశ మీడియా విమర్శల వర్షం కురిపించింది. 34 ఏళ్లలో ఇదే చెత్త జట్టని క్లార్క్‌సేనను తీవ్రంగా దుయ్యబట్టింది. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో పిచ్చిగా వ్యవహరించారని పేర్కొంది. 'భారత పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెట్ ప్ర దర్శన అధ్వాన్నంగా ఉంది' అని టెలీగ్రాఫ్ పేర్కొంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్, తాత్కాలిక కెప్టెన్ షేన్‌వాట్సన్ పేలవ ఆటతీరును విమర్శించింది. వాట్సన్ ఇదే ఫామ్‌తో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సిడిల్, స్టార్క్ వం టి టెయిలెండర్లు కీలక పరుగులు చేసినపుడు టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఏమైందని ప్రశ్నించారు.