LATEST NEWS
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారా? మంత్రుల శాఖల్లో భారీ ఎత్తున మార్పులతో పాటు.. కొందరికి ఉద్వాసన, మరొ కొందరికి చోటు కల్పించనున్నారా? అంటే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఔననే వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆరంచించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా మోడీ తన కేబినెట్ విస్తరణలో శాఖల మార్పు ఉండే మంత్రులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు చెబుతున్నారు. మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీకి చెందిన మంత్రులు పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడుల శాఖలను మార్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖను సైతం మారుస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ ఖాయమంటున్నారు. ఆయనకు స్వతంతర హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి శాఖ మార్చి అంతకంటే ప్రాధాన్యత ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఏపీ నుంచి అదనంగా మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిలో రాజమహేంద్రవరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు, అమలాపురం ఎంపీ హరీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే . బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అదలా ఉంచితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన తప్పదని కూడా తెలుస్తోంది. అలా ఉద్వాసన పలికిన మంత్రులకు పార్టీ పదవులు అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది అన్న భావనను నిలువెల్లా నింపుకున్న పార్టీ తెలుగుదేశం. అధకారంలో ఉన్నా, లేకున్నా తెలుగు జాతి అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 44 సంవత్సరాలు. 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చితికిపోయి, తెలుగు జాతి అవమానభారంతో కుంగిపోతున్న చారిత్రక సమయంలో కారు చీకటిలో కాంతి పుంజంలా తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించింది. సమాజమే దేవళం, ప్రజలే దేవుళ్ళు అని ఎలుగెత్తి చాటింది. నలభై నాలుగేళ్లుగా తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక , రాజకీయ, ఆర్ధిక పురోగమనంలో ప్రతి అడుగులోనూ తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర వేసింది. ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని పదిలం చేసుకుంది.
తెలుగు సినీ వినీలాకాశంలో దశాబ్దాల పాటు జగజ్జేయమానంగా వెలిగిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అరవైయేళ్ళ వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి.. తెలుగువాడిని, వేడినీ ప్రపంచానికి చాటారు.. పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచి అయన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై స్పూర్తి రగిలించిన తీరు అనితరసాధ్యం. తెలుగువారిలో నెలకొన్న నిస్తేజాన్ని పారదోలడానికి కంకణం కట్టుకున్న నందమూరి తారక రామారావును తెలుగు సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది. ఆత్మీయంగా హత్తుకుంది. తెలుగుదేశం అవతరణను తెలుగు జాతి రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా ఆహ్వానించింది. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! అని ఆయనిచ్చిన పిలుపునకు తెలుగుజాతి ఉవ్వెత్తున స్పందించింది. ఆంధ్రుల భవితను దేదీప్యమానం చేయాలని పరితపించిన ఎన్టీఆర్ కు కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది.
1983లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన చారిత్రక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టింది.
అప్పటి నుంచి తెలుగువారి కీర్తి పతాకను తెలుగుదేశం పార్టీ ప్రపంచం నలుచెరుగులా చాటుతూనే ఉంది. సమూల మార్పులు తీసుకురావడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తెలుగుదేశం పార్టీ ఆవిరళ కృషి చేసింది. ,చేస్తోంది. పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు అధికారంలోను, ప్రతిపక్షంగాను కూడా తెలుగుదేశం సదా ప్రజల పక్షానే నిలిచింది. ప్రజా ప్రయోజనాల కోసమే పరితపించింది.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
తెలుగు పౌరుషాన్ని తట్టిలేపిన కీర్తి ఎన్టీఆర్ దే అనడంలో సందేహం లేదు. ఇక తెలుగువారి జీవన ప్రమాణాలను పెంచిన ఘనత నిస్సందేహంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారాచంద్రబాబు నాయుడిది. విద్యా, ఉద్యోగ, ఆర్ధిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి ఎదుగుదల వెనుక అయన కృషి, దూరదృష్టి ఎవరూ కాదనలేరు. తెలుగు జాతికి ప్రపంచంలో ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే, తెలుగు ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని నిలిచేలా చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఒక రాజాకీయ శక్తిగా ఎదిగితే, చంద్రబాబు అధ్వర్యంలో రాజకీయంగానూ, ఆర్ధికంగానూ కూడా నిలబడింది. బలపడింది.
చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధునికతను సంతరించుకుంది. తెలుగువారి కీర్తీ ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసింది. ప్రపంచంలో జరుగుతున్నమార్పులను ముందే గ్రహించి, అందుకు అనుగుణంగా తెలుగువారిని, తెలుగు రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడంలో చంద్రబాబు దార్శనికత ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఏపీవైపు చూడక తప్పని పరిస్థితులను కల్పించింది. రాష్ట్ర విభజనతో పేరు వినా మరేం లేకుండా పోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తన నాయకత్వ పటిమతో దశ, దిశ నిర్దేశం చేసి, స్వర్ణాంధ్ర స్వప్నాన్ని సాకారం చేయడానికి రేయింబవళ్ళు శ్రమించారు. శ్రమిస్తున్న నిజమైన అభివృద్ది కాముకుడు నారా చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఈ 44 ఏళ్ల ప్రస్తానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. అన్నిటినీ అధిగమించి తెలుగువారి జీవీతాలలో తెలుగుదేశం పార్టీ ఒక భాగంగా మారింది.
అమరావతి రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం సంగతి సరే.. రేపు జగన్ వచ్చినా? ఈ ప్రాంతాన్ని రాజధానిగా హోదా మార్చడానికి వీల్లేదా? అంతగా ఈ చట్టంలో, ఈ తీర్మానంలో ఏముంది? అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ తీర్మానం కాదు. ఇది ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం అంటూ లీగల్ షీల్డ్. సపోజ్.. ఫర్ సపోజ్ వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, మరెవరైనా అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేనంతగా ఈ తీర్మానం ఒక మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇంతకీ అదేంటి?
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించిన సెక్షన్ 5 సవరణ అత్యంత కీలకం. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం.. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉండాలని ఉంది. కానీ, దాని పేరు అమరావతి అని ఎక్కడా స్పష్టంగా లేదు. ఈ చట్టానికి సవరణ చేసి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దగ్గర అమరావతి అనే పదాన్ని చేర్చాలని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం (మార్చి 28) తీర్మానం చేసింది. ఒక్కసారి పార్లమెంటు ఈ సవరణను ఆమోదిస్తే, అమరావతి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకునే నిర్ణయం కాబోదు.. ఇది కేంద్ర చట్టంలో ఒక భాగం అవుతుంది.
సాధారణంగా రాజధాని ఎక్కడా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. గతంలో జగన్ మూడు రాజధానుల బిల్లు తెచ్చినట్టు..అయితే ఒక సారి అమరావతి రాజథాని అని కేంద్ర ప్రభుత్వం రికగ్నైజేషన్ యాక్ట్ లోకి వెళ్తే.. దాన్ని మార్చాలంటే మళ్లీ పార్లమెంటు ఆమోదం కావల్సిందే. ఒక వేళ జగన్ వచ్చి మళ్లీ మూడు రాజధాని బిల్లు తెచ్చినా అది కేంద్ర చట్టానికి విరుద్ధం అవుతుంది. మళ్లీ కేసులు గట్రా అయ్యి కాలయాపన జరిగి.. ఎటూ గాకుండా పోతుంది. అచ్చెన్నాయుడు అన్నట్టు 2019లో జరిగినట్టు 2029లో గానీ జగన్ వస్తే.. ఇక ఆంధ్రప్రజల అవస్థ మళ్లీ మొదటికే వస్తుందన్నది గుర్తుంచుకోవాలి.
ఇంతకీ అమరావతి అంటే ఏమిటి? ఆ నిర్వచనం ఎలాంటిదని గమనిస్తే.. ఇది ఒక ఊరు కాదు.. రాజధాని అభివృద్ధి సాకార సంస్థ.. పరిధిలో నోటిఫై చేసిన ప్రాంతం. దీన్నే అమరావతిగా గుర్తించాలని ఈ తీర్మానంలో కోరారు. ఇందువల్ల రాజధాని విస్తీర్ణంపై కూడా చట్టబద్ధమైన క్లారిటీ వచ్చే అవకాశముంది. గతంలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పింది. ఇప్పుడీ తీర్మానం ద్వారా కేంద్రం చట్టం చేస్తే.. ఆ తీర్పునకు మరింత బలం చేకూరుతుంది. ఇందువల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని అంగుళం కూడా కదిలించలేదు. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు ధీమా.
ఈ తీర్మానం లక్ష్యం ఒక్కటే. రాజకీయ అస్తిరత నుంచి రాజధానిని కాపాడడం. ఒక వేళ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల పాట మొదలెట్టినా ఫలితం ఉండదు. అందుకే అసెంబ్లీలో అమరావతిని ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా చేసిన తీర్మానానికి అంత ప్రాముఖ్యత.మంత్రి లోకేష్ చెప్పినట్లు ఈ బిల్లును పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదానికి ప్రవేశ పెట్టి ఆమోదిస్తే.. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. రాజథాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగానికి సార్థకత చేకూరుతుంది.
ALSO ON TELUGUONE N E W S
ఎస్ జి ఎస్ వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వంలో ఎమ్ పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం "సుగ్రీవ". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. "సుగ్రీవ ఒక అందమైన కుటుంబ కథ చిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబం లో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటుంది, వాళ్ళు ఆ సమస్యలు ఎలా ఎదుర్కున్నారు అనేదే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్ పవన్ కుమార్ గారు ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. నర్తు చిరంజీవి గారి దర్శకత్వం అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి, గోవా మరియు వైజాగ్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించారు. సారధి స్టూడియోస్ లో డి ఐ తో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 24 న విడుదలకు సిద్ధంగా ఉంది" అని తెలిపారు.
సాయి కృప, సుమన్ శెట్టి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విజయ్, గగన గీతికా, అల్పురి సునీల్, వంశీ కోడలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ పట్నాయక్, విజయ్ కూరాకుల సంగీతం అందిస్తున్నారు.
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం "సుయోధన". వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ - సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ - చిన్న సినిమాలను ప్రేక్షకులకు చేర్చడంలో మా మీడియా మిత్రులు ముందుంటారు. సుయోధన చిత్రాన్ని కూడా వారే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, సాయికుమార్ పోటాపోటీగా నటించారు. మా డైరెక్టర్ మాధవ్ సినిమా చేసిన విధానం చూస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. అన్నారు.
డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ - సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ గారి నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "గూగుల్ మై ఫ్రెండ్". ఈ చిత్రాన్ని డాలర్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. "గూగుల్ మై ఫ్రెండ్" సినిమాకు టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ చిత్ర సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ - మా దర్శకుల సంఘం సభ్యులు, మా ఆత్మీయులు గోవింద్ డైరెక్ట్ చేస్తున్న గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్, టీజర్ ఇతర కంటెంట్ చూశాం. ఈ కంటెంట్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. ఒకేసారి తెలుగు, మరాఠీ భాషల్లో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రిలీజ్ కుదిరి ప్రొడ్యూసర్ కు డబ్బులు, గోవింద్ గారికి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - గూగుల్ మా ఫ్రెండ్ సినిమాను మా ఫ్రెండ్ గోవింద్ వరాహ రూపొందిస్తున్నారు. ఆయన బహు భాషల్లో సినిమాలు రూపొందించిన దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు, మరాఠీ భాషల్లో త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. అలాగే గోవింద్ వరాహ గారు మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ - మా స్నేహితుడు గోవింద్ గూగుల్ మై ఫ్రెండ్ అనే చిత్రాన్ని పలు భాషల్లో రూపొందిస్తుండటం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ సమక్షంలో సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మంచి సక్సెస్ రావాలని మేమంతా బ్లెస్ చేస్తున్నాం. గోవింద్ గారికి అన్ని భాషల్లో గుర్తింపు, విజయం రావాలి. అన్నారు.
డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ - రామానాయుడు గారు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించాలని ఎలా కంకణం కట్టుకున్నారో, గోవింద్ గారు కూడా బహు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, ఒరస్సా, మరాఠీ ఇలా వివిధ భాషల్లో సినిమాలు రూపొందిస్తున్నారు. గూగుల్ మై ఫ్రెండ్ సినిమా రిలీజ్ చేసిన ప్రతి భాషలో విజయం సాధించాలి. అన్నారు.
డైరెక్టర్ గోవింద్ వరాహ మాట్లాడుతూ - నేను తెలుగులో బాల, నేను నాన్న అబద్ధం, మనుషులతో జాగ్రత్త వంటి చిత్రాలు రూపొందించాను. మలయాళంలో కొన్ని చిత్రాలు రూపొందించాను. మరాఠీలో ఓ సినిమా తెరకెక్కించాను. తెలుగుతో పాటు ఇతర భాషల్లో గూగుల్ మై ఫ్రెండ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు మా మూవీ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. శైలేష్, సముద్ర, విజయ్ కుమార్, సాయిరాజేశ్, వీఎన్ ఆదిత్య గారు..ఇలా నా కుటుంబ సభ్యులైన వీరందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి దూరమవుతున్నానేమో అనిపించిన టైమ్ లో గూగుల్ మై ఫ్రెండ్ అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఇకపైనా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తాను. మా నిర్మాతలు ఇస్తున్న సపోర్ట్ వల్లే వరుసగా సినిమాలు చేయగలుగుతున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలు ఏఎం రత్నం, కెకె రాధమోహన్, చిట్టూరి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
టాలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'సుయోధన'. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, శ్రీరామనవమి కానుకగా మార్చి 27న విడుదలైంది. ఒక విభిన్నమైన పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ 'సుయోధన' ఏ మేరకు థ్రిల్ చేసిందో ఇప్పుడు చూద్దాం. (Suyodhana Movie Review)
కథ:
వరుణ్ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. సినిమాలో ప్రతి చిన్న శబ్దాన్ని సహజంగా రికార్డ్ చేయడం ఇతని పని. అయితే వరుణ్‌కు చిన్నప్పటి నుండి 'సుయోధన' అనే ఒక వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం విన్నప్పుడల్లా అతనికి దుర్యోధనుడి ఆకారం కళ్ళ ముందు కనిపిస్తూ భయపెడుతుంటుంది. మరోవైపు వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) ఒక నాటక కళాకారుడు, రాజకీయ నాయకుడు. ఒకానొక దశలో వరుణ్‌కు తన తండ్రిలోనే దుర్యోధనుడు కనిపిస్తాడు. ఈ క్రమంలోనే ప్రకాష్ హత్యకు గురవుతాడు. అసలు వరుణ్‌కు ఆ శబ్దం ఎందుకు వినిపిస్తుంది? తన తండ్రిని చంపింది ఎవరు? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
'సుయోధన' సినిమాని దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచే ఒక విధమైన సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తూ, ప్రేక్షకులలో ‘తర్వాతి సీన్ ఏంటి?’ అనే క్యూరియాసిటీని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ‘సౌండ్’ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం విశేషం.
దర్శకుడు ఎంచుకున్న 'ఫోలే ఆర్టిస్ట్' అనే బ్యాక్‌డ్రాప్ తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగుంది. సినిమాలో శబ్దాల ప్రాముఖ్యతను ఆయన ఎంతో బలంగా చూపించాడు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగినా.. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు ఆ లోటును భర్తీ చేస్తాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.
‘సుయోధన’ ఒక సాలిడ్ మిస్టరీ థ్రిల్లర్. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా మిస్టరీని చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. సస్పెన్స్, ఎమోషన్, టెక్నికల్ వాల్యూస్ కలగలిసిన ఈ సినిమాలో.. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్‌ను కథలో వాడుకున్న విధానం మెప్పించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ప్రియదర్శి మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. భయాందోళనలకు గురయ్యే యువకుడిగా, తన తండ్రి మరణం వెనుక రహస్యాన్ని ఛేదించే కొడుకుగా ఆయన పండించిన ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇక 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ తన గాంభీర్యమైన నటనతో సినిమాకు వెన్నెముకలా నిలిచారు. సీనియర్ నటి ప్రేమ తల్లి పాత్రలో ఒదిగిపోగా, హీరోయిన్ ద్రిషిక చందర్ తన పరిధి మేరకు బాగా నటించింది.
సాంకేతికంగా ఈ సినిమా రిచ్‌గా ఉంది. జై క్రిష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ థ్రిల్లర్ మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా...
వినూత్నమైన కాన్సెప్ట్ తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ 'సుయోధన'. అక్కడక్కడా కొంచెం ల్యాగ్ అనిపించినా, ఓవరాల్‌గా థ్రిల్లర్ ప్రియులను మెప్పించే చిత్రం ఇది.
రేటింగ్: 2.5/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
టాలీవుడ్‌లో ఇటీవల చిన్న సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది 'రేపు ఉదయం 10 గంటలకు'. చైతన్య రావు, హెబ్బా పటేల్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో కంటే ఓటీటీ వేదికగా ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. 'ఓ పిట్టకథ', 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' సినిమాల దర్శకుడు చందు ముద్దు ఒక క్రైమ్ మిస్టరీని డైరెక్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (Repu Udayam 10 Gantalaku Movie Review)
కథ:
ఈ సినిమా టైటిల్ సూచించినట్లుగానే కథ మొత్తం మరుసటి రోజు ఉదయం 10 గంటల లోపు జరగబోయే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఒక వ్యక్తి మరణంతో కథ మొదలవుతుంది. అంబులెన్స్ డ్రైవర్ మల్లేశం(అభినవ్ గోమఠం) ఒక డెడ్ బాడీని తీసుకుని హైదరాబాద్ నుంచి కాకినాడ బయల్దేరతాడు. ఆ మరణం వెనుక ఉన్న కారణాలేంటి? అసలు ఆ వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలతో ప్రేక్షుకుల్లో ఆసక్తి రేకెత్తుతుంది. మరోవైపు, పెళ్లికి సిద్ధమవుతున్న ఒక యువకుడు (చైతన్య రావు) తన కోరిక తీర్చుకోవడానికి ఒక వేశ్య (హెబ్బా పటేల్) దగ్గరకు వెళ్లడం, అక్కడ ఎదురయ్యే వింత పరిస్థితులు కథను మలుపు తిప్పుతాయి. వీరందరి జీవితాల్లో మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయం అత్యంత కీలకం కాబోతోంది. ఆ గడువు లోపు ఏం జరిగింది? అసలు విలన్ ఎవరు? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
నిజానికి ఇదొక మల్టీ-లీనియర్ కథాంశం. వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారందరూ ఒకే మలుపు వద్ద ఎలా కలిశారు అనేది ఆసక్తికరం. సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్‌తో పాటు అభినవ్ గోమఠం తనదైన శైలిలో కామెడీని పండించారు. స్క్రీన్‌ప్లేలో కొన్ని కన్ఫ్యూజన్ సీన్స్ ఉన్నప్పటికీ, క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ వచ్చే సీన్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. దర్శకుడు చెందు ముద్దు సినిమాను రన్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
దర్శకుడు చెందు ముద్దు గతంలో ‘ఓ పిట్ట కథ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన మేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో కొత్తగా ప్రయత్నించాడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను అందించేందుకు టీమ్ గట్టిగానే శ్రమించింది. కథలో మలుపులు, పాత్రల మధ్య ఉన్న కామన్ లింక్ రివీల్ అయ్యే విధానం బాగుంది. అయితే కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ డ్రామా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది.
టెక్నికల్ గా చూస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామకృష్ణ వీరపనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో పెద్దగా ప్రమోషన్ లేకపోవడంతో జనాల్లోకి వెళ్లలేకపోయినా, ఓటీటీలో మాత్రం ఈ మిస్టరీ కథకు మంచి ఆదరణ లభిస్తోంది. సస్పెన్స్ మరియు కామెడీ మిక్స్ అయిన సినిమాలు ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినా ఈ సినిమా మెప్పించింది.
నటీనటుల పనితీరు:
చైతన్య రావు తన పాత్రలో ఒదిగిపోయారు. ఒక వైపు కన్ఫ్యూజన్, మరోవైపు భయం కలిగించే సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. హెబ్బా పటేల్ తన బోల్డ్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ రోల్ తో మెప్పించింది. ఇక అభినవ్ గోమఠం తనదైన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వులు పూయించారు. కిరీటి దామరాజు, వాసు ఇంటూరి తమ పరిధి మేరకు నటించి కథకు బలాన్ని చేకూర్చారు.
ఫైనల్ గా...
క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి 'రేపు ఉదయం 10 గంటలకు' ఒక మంచి ఆప్షన్. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహకందని విధంగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ పక్కన పెడితే, ఈ వీకెండ్ ఓటీటీలో ఒక విభిన్నమైన సినిమా చూడాలనుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. ముఖ్యంగా ఆ గడువు లోపు ఏం జరుగుతుందనే ఉత్కంఠ చివరి వరకు మిమ్మల్ని కుర్చీకి కట్టిపడేస్తుంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
వేసవి అంటేనే కూలర్లు, ఏసీలు గుర్తుకు వస్తాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు. చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు. అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి?
1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది. ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్ పనితీరును అందిస్తుంది.
నైట్ బ్యాకప్ సెలక్షన్..
సోలార్ ఏసీ అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట బ్యాటరీ బ్యాకప్ అయిపోతే, దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది. సులభంగా చెప్పాలంటే, సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు.
పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.
*రూపశ్రీ.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు.
నవమి వైభవం!!
నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.
ఏకపత్నీ వ్రతుడు!!
ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.
రామాయణం!!
భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా. ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.
హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు. వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి.
రామనామం!!
రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.
వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది.
త్యాగరాజు అంటాడు
నిధి చాల సుఖమా రాముని స
న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని
రామదాసు అంటాడు
ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని
ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు.
ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం.
ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.
◆వెంకటేష్ పువ్వాడ.
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం, మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం. అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే..
ఆర్థిక పరిస్థితి గురించి
ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు. కొన్నిసార్లు ఇలాంటి సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి దొంగతనం లేదా మోసపోవడానికి దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం.
ఆరోగ్యం, వైద్య సమాచారం..
ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది. తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.
ఉదాహరణకు.. దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు.
ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు..
మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.
వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే ఎగతాళి చేయవచ్చు. కాబట్టి, ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి.
రిలేషన్స్, పర్సనల్ లైఫ్..
రిలేషన్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం గోప్యతకు భంగం కలిగించవచ్చు.
ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది. అంతేకాదు.. బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.
*రూపశ్రీ.
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారా? మంత్రుల శాఖల్లో భారీ ఎత్తున మార్పులతో పాటు.. కొందరికి ఉద్వాసన, మరొ కొందరికి చోటు కల్పించనున్నారా? అంటే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఔననే వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆరంచించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా మోడీ తన కేబినెట్ విస్తరణలో శాఖల మార్పు ఉండే మంత్రులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు చెబుతున్నారు. మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీకి చెందిన మంత్రులు పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడుల శాఖలను మార్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖను సైతం మారుస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ ఖాయమంటున్నారు. ఆయనకు స్వతంతర హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి శాఖ మార్చి అంతకంటే ప్రాధాన్యత ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఏపీ నుంచి అదనంగా మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిలో రాజమహేంద్రవరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు, అమలాపురం ఎంపీ హరీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే . బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అదలా ఉంచితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన తప్పదని కూడా తెలుస్తోంది. అలా ఉద్వాసన పలికిన మంత్రులకు పార్టీ పదవులు అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది అన్న భావనను నిలువెల్లా నింపుకున్న పార్టీ తెలుగుదేశం. అధకారంలో ఉన్నా, లేకున్నా తెలుగు జాతి అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 44 సంవత్సరాలు. 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చితికిపోయి, తెలుగు జాతి అవమానభారంతో కుంగిపోతున్న చారిత్రక సమయంలో కారు చీకటిలో కాంతి పుంజంలా తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించింది. సమాజమే దేవళం, ప్రజలే దేవుళ్ళు అని ఎలుగెత్తి చాటింది. నలభై నాలుగేళ్లుగా తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక , రాజకీయ, ఆర్ధిక పురోగమనంలో ప్రతి అడుగులోనూ తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర వేసింది. ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని పదిలం చేసుకుంది.
తెలుగు సినీ వినీలాకాశంలో దశాబ్దాల పాటు జగజ్జేయమానంగా వెలిగిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అరవైయేళ్ళ వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి.. తెలుగువాడిని, వేడినీ ప్రపంచానికి చాటారు.. పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచి అయన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై స్పూర్తి రగిలించిన తీరు అనితరసాధ్యం. తెలుగువారిలో నెలకొన్న నిస్తేజాన్ని పారదోలడానికి కంకణం కట్టుకున్న నందమూరి తారక రామారావును తెలుగు సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది. ఆత్మీయంగా హత్తుకుంది. తెలుగుదేశం అవతరణను తెలుగు జాతి రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా ఆహ్వానించింది. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! అని ఆయనిచ్చిన పిలుపునకు తెలుగుజాతి ఉవ్వెత్తున స్పందించింది. ఆంధ్రుల భవితను దేదీప్యమానం చేయాలని పరితపించిన ఎన్టీఆర్ కు కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది.
1983లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన చారిత్రక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టింది.
అప్పటి నుంచి తెలుగువారి కీర్తి పతాకను తెలుగుదేశం పార్టీ ప్రపంచం నలుచెరుగులా చాటుతూనే ఉంది. సమూల మార్పులు తీసుకురావడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తెలుగుదేశం పార్టీ ఆవిరళ కృషి చేసింది. ,చేస్తోంది. పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు అధికారంలోను, ప్రతిపక్షంగాను కూడా తెలుగుదేశం సదా ప్రజల పక్షానే నిలిచింది. ప్రజా ప్రయోజనాల కోసమే పరితపించింది.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
తెలుగు పౌరుషాన్ని తట్టిలేపిన కీర్తి ఎన్టీఆర్ దే అనడంలో సందేహం లేదు. ఇక తెలుగువారి జీవన ప్రమాణాలను పెంచిన ఘనత నిస్సందేహంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారాచంద్రబాబు నాయుడిది. విద్యా, ఉద్యోగ, ఆర్ధిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి ఎదుగుదల వెనుక అయన కృషి, దూరదృష్టి ఎవరూ కాదనలేరు. తెలుగు జాతికి ప్రపంచంలో ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే, తెలుగు ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని నిలిచేలా చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఒక రాజాకీయ శక్తిగా ఎదిగితే, చంద్రబాబు అధ్వర్యంలో రాజకీయంగానూ, ఆర్ధికంగానూ కూడా నిలబడింది. బలపడింది.
చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధునికతను సంతరించుకుంది. తెలుగువారి కీర్తీ ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసింది. ప్రపంచంలో జరుగుతున్నమార్పులను ముందే గ్రహించి, అందుకు అనుగుణంగా తెలుగువారిని, తెలుగు రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడంలో చంద్రబాబు దార్శనికత ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఏపీవైపు చూడక తప్పని పరిస్థితులను కల్పించింది. రాష్ట్ర విభజనతో పేరు వినా మరేం లేకుండా పోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తన నాయకత్వ పటిమతో దశ, దిశ నిర్దేశం చేసి, స్వర్ణాంధ్ర స్వప్నాన్ని సాకారం చేయడానికి రేయింబవళ్ళు శ్రమించారు. శ్రమిస్తున్న నిజమైన అభివృద్ది కాముకుడు నారా చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఈ 44 ఏళ్ల ప్రస్తానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. అన్నిటినీ అధిగమించి తెలుగువారి జీవీతాలలో తెలుగుదేశం పార్టీ ఒక భాగంగా మారింది.
అమరావతి రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం సంగతి సరే.. రేపు జగన్ వచ్చినా? ఈ ప్రాంతాన్ని రాజధానిగా హోదా మార్చడానికి వీల్లేదా? అంతగా ఈ చట్టంలో, ఈ తీర్మానంలో ఏముంది? అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ తీర్మానం కాదు. ఇది ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం అంటూ లీగల్ షీల్డ్. సపోజ్.. ఫర్ సపోజ్ వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, మరెవరైనా అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేనంతగా ఈ తీర్మానం ఒక మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇంతకీ అదేంటి?
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించిన సెక్షన్ 5 సవరణ అత్యంత కీలకం. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం.. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉండాలని ఉంది. కానీ, దాని పేరు అమరావతి అని ఎక్కడా స్పష్టంగా లేదు. ఈ చట్టానికి సవరణ చేసి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దగ్గర అమరావతి అనే పదాన్ని చేర్చాలని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం (మార్చి 28) తీర్మానం చేసింది. ఒక్కసారి పార్లమెంటు ఈ సవరణను ఆమోదిస్తే, అమరావతి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకునే నిర్ణయం కాబోదు.. ఇది కేంద్ర చట్టంలో ఒక భాగం అవుతుంది.
సాధారణంగా రాజధాని ఎక్కడా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. గతంలో జగన్ మూడు రాజధానుల బిల్లు తెచ్చినట్టు..అయితే ఒక సారి అమరావతి రాజథాని అని కేంద్ర ప్రభుత్వం రికగ్నైజేషన్ యాక్ట్ లోకి వెళ్తే.. దాన్ని మార్చాలంటే మళ్లీ పార్లమెంటు ఆమోదం కావల్సిందే. ఒక వేళ జగన్ వచ్చి మళ్లీ మూడు రాజధాని బిల్లు తెచ్చినా అది కేంద్ర చట్టానికి విరుద్ధం అవుతుంది. మళ్లీ కేసులు గట్రా అయ్యి కాలయాపన జరిగి.. ఎటూ గాకుండా పోతుంది. అచ్చెన్నాయుడు అన్నట్టు 2019లో జరిగినట్టు 2029లో గానీ జగన్ వస్తే.. ఇక ఆంధ్రప్రజల అవస్థ మళ్లీ మొదటికే వస్తుందన్నది గుర్తుంచుకోవాలి.
ఇంతకీ అమరావతి అంటే ఏమిటి? ఆ నిర్వచనం ఎలాంటిదని గమనిస్తే.. ఇది ఒక ఊరు కాదు.. రాజధాని అభివృద్ధి సాకార సంస్థ.. పరిధిలో నోటిఫై చేసిన ప్రాంతం. దీన్నే అమరావతిగా గుర్తించాలని ఈ తీర్మానంలో కోరారు. ఇందువల్ల రాజధాని విస్తీర్ణంపై కూడా చట్టబద్ధమైన క్లారిటీ వచ్చే అవకాశముంది. గతంలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పింది. ఇప్పుడీ తీర్మానం ద్వారా కేంద్రం చట్టం చేస్తే.. ఆ తీర్పునకు మరింత బలం చేకూరుతుంది. ఇందువల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని అంగుళం కూడా కదిలించలేదు. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు ధీమా.
ఈ తీర్మానం లక్ష్యం ఒక్కటే. రాజకీయ అస్తిరత నుంచి రాజధానిని కాపాడడం. ఒక వేళ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల పాట మొదలెట్టినా ఫలితం ఉండదు. అందుకే అసెంబ్లీలో అమరావతిని ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా చేసిన తీర్మానానికి అంత ప్రాముఖ్యత.మంత్రి లోకేష్ చెప్పినట్లు ఈ బిల్లును పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదానికి ప్రవేశ పెట్టి ఆమోదిస్తే.. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. రాజథాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగానికి సార్థకత చేకూరుతుంది.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది. వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది. అయితే వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే..
రోగనిరోధక శక్తి..
వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది.
బరువు..
వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్.
వ్యాధులు..
వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే..
రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.
*రూపశ్రీ.
హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే!
శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి.
ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.
బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!
..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు. ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది. మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే..
రెండు రూపాలు..
మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి. మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా, ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక, శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి.
తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి..
మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు, మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు.
ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి..
కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం ఏర్పడుతుంది.
లక్షణాలు..
మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి, వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి ఉంటాయి.
పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం, ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే.
చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు..
చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు. కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్, ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం.
మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
