Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రప్రదేశ్‌కి ఎర్రచందనం చల్లదనం!
posted on: Jul 22, 2014 11:16AM

వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఒక దుంగ దొరికితే ఎలా వుంటుంది. ఆ వ్యక్తి ఆ దుంగని పట్టుకుని నీటిలో మునిగిపోకుండా తనను తాను కాపాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం అనే వరదలో కొట్టుకుని పోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఒక దుంగ దొరికింది. ఆ దుంగ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిగిపోకుండా తనను తాను కాపాడుకునే అవకాశం వుంది. ఆ దుంగ మరేదో కాదు.. ఎర్రచందనం దుంగ! రాయలసీమలోని పలు అటవీ ప్రాంతాలలో చాలాకాలంపాటు ఎర్రచందనం దుంగల చోరీ భారీ స్థాయిలో జరిగింది. అనేకసార్లు పోలీసులు ఎర్రచందనం దొంగలను పట్టుకుని అనేక లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు పోలీసుల స్వాధీనమయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాలలో నిల్వ చేస్తూ వచ్చారు. ఎంతోవిలువైన ఎర్రచందనం దుంగలు నిరుపయోగంగా ఎన్నోచోట్ల పడివున్నాయి. కొన్నిచోట్ల కొన్ని ఎర్రచందనం దుంగలు చెదలు పట్టి పాడైపోతున్నాయి కూడా. నిల్వలు పేరుకుపోతున్న ఎర్రచందనాన్ని అమ్మాలన్న అభిప్రాయాలు అధికారుల్లో వున్నప్పటికీ గతంలో రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకుండా పోయాయి. అవసరం కూడా చాలా ఉపాయాలను అందిస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఎంతో అవసరం. ఈ సమయంలో ఎర్రచందనం దుంగలను అమ్మాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడం సమయోచితం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి బోలెడంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే విలువైన ఎర్రచందనం నిల్వలను అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా రైతు రుణ మాఫీపై ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ కూడా రాష్ట్రంలో భారీగా నిల్వ వున్న ఎర్రచందనం దుంగలను అమ్మడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని ప్రభుత్వానికి సూచించింది. దాంతో ఎర్రచందనం దుంగలను వేలం ద్వారా అమ్మడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10 రోజుల్లో వేలం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్‌మెంట్ అధికారులు రాష్ట్రంలోని ఎర్రచందనం నిల్వలను అంచనా వేస్తున్నారు. ఇంతకాలం రాష్ట్ర ప్రజలకు ఎర్రచందనం దొంగల పట్టివేత, దుంగలు స్వాధీనం అనే వార్తలు మాత్రమే తెలుసు.. భవిష్యత్తులో ఎర్రచందనం దుంగలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చల్లదనాన్ని కూడా ఇస్తాయని తెలుస్తుంది.


.jpg)
.jpg)


