Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో గ్యాస్ నిధి.. ఆంధ్రప్రదేశ్ వాటా ఏది?
posted on: Jul 19, 2014 6:30PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజవాయు నిక్షేపాలకు కొదువలేదు. ఏ ప్రాంతంలోని వనరులు ఆ ప్రాంతానికి ఉపయోగపడాన్న ప్రాథమిక సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్ నిక్షేపాల విషయంలో మాత్రం అమలు కావడం లేదు. గ్యాస్ వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం జరగడం లేదన్న అభిప్రాయాలు, ఆందోళన వున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాస్ నిక్షేపం బయటపడింది. కృష్ణ - గోదావరి బేసిన్ ప్రాంతంలోని బంటుమిల్లి దగ్గర 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపం ఓఎన్జీసీ అన్వేషణలో బయటపడింది. ఇటీవలి కాలంలో బయటపడిన అతి పెద్ద గ్యాస్ నిక్షేపమిది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని సహజ వనరుల విషయంలో న్యాయమైన వాటా కోసం పోరాడటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే అవకాశం వుంది. ఇప్పుడు బంటుమిల్లిలో బయటపడిన గ్యాస్ నిక్షేపాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన హక్కును కాపాడుకోవాల్సిన అవసరం వుంది. తనకు దక్కాల్సిన న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు నిక్షేపాల విషయంలో ఆ రాష్ట్రం ప్రదర్శిస్తున్న హక్కును గ్యాస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రదర్శించాల్సిన అవసరం వుంది. ఇప్పటి వరకూ సహజ వాయువు విషయంలో ఆంధ్రప్రదేశ్ చేసిన త్యాగం చాలు. ఇంకా త్యాగాలు చేసి భారీగా నష్టపోయే కంటే, హక్కుకోసం పోరాడి ఆర్థిక అభివృద్ధిని సాధించడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వున్న కర్తవ్యం.



.jpg)


