ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం, ఆందోళన ఇదే!

 

ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరుద్యోగ విద్యార్థుల ఆందోళనతో అట్టుడికిపోతోంది. తమకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే, ఇప్పుడు కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం ద్వారా తమకు అన్యాయం చేశారన్న అభిప్రాయం ఉస్మానియా విద్యార్థులలో బలంగా ఏర్పడింది. మంగళవారం పోలీసుల ఆంక్షలను కూడా తప్పించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని తార్నాక కూడలిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనలను, కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థులు చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలిస్తే....

 

1. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు.

 

2. ఉద్యమాలు కేసీఆర్‌కి కొత్తకావచ్చు గానీ, ఉస్మాయినా విద్యార్థులకు కాదు.

 

3. మొన్నటి వరకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు మా జీవితాల కోసం ఉద్యమించాం.

 

4. విద్యార్థిలోకం తీవ్రంగా ఉద్యమించాల్సిన పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకువచ్చారు.

 

5. కాంట్రాక్టు ఉద్యో్గులను పర్మినెంట్ చేసేముందు తెలంగాణలోని నిరుద్యోగుల గురించి కేసీఆర్ ప్రభుత్వం ఎంతమాత్రం ఆలోచించలేదు.

 

6. నిరుద్యోగ సమస్యను నిర్మూలించాల్సింది పోయి, తామేదో వాగ్దానం చేశామని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు.

 

7. దశాబ్దాల తరబడి ఉస్మానియా విద్యార్థులు చేసిన త్యాగాలు కేసీఆర్ ప్రభుత్వానికి గుర్తు రాలేదా?

 

8. ఉస్మానియాలో కేవలం ఒకరు ఇద్దరికి రాజకీయ భవిష్యత్తు కల్పించినంత మాత్రాన యావత్ విద్యార్థి లోకానికి మేలు చేసినట్టు కాదు..

 

9. కేసీఆర్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలి.

 

10. మేకు కాంట్రాక్ట్ కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. చదువుకున్న అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం అంతే.

 

11. ఏ ప్రభుత్వం రావాలని మేము ఉద్యమాలు చేశామో, ఆ ప్రభుత్వమే మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ వుండటం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేపట్టడం బాధాకరం.

 

12. ఈ ఉద్యమం నుంచి ఉస్మానియా విద్యార్థి లోకం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu