LATEST NEWS
హిందూ వ్యతిరేకత విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ ల మధ్య నేనంటే నేను గోప్ప అన్న సంవాదం నడుస్తోందా?  తాజాగా ఇరువురూ చెన్నైలోని ఓ వివాహ వేడుకలో కలుసుకుని పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు జగన్, ఉదయనిథి స్టాలిన్ హాజరయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎందరో అతిరథ మహారథులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి. జగన్ ఉదయనిథి స్టాలిన్ ఇరువురూ ఆ వివాహ వేడుకలో కలిసి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో నెటిజనులు వారి హిందూ వ్యతిరేక వైఖరిపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ లో భాగంగానే  స‌నాత‌న ధ‌ర్మం అనేది వైర‌స్ అని భ‌లే అన్నావ్  అని జ‌గ‌న్ రెడ్డి అంటే..  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన నీ ముందు నేనెంత అన్న చర్చ జరిగి ఉంటుందంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  హిందూ ధర్మంపై వ్యతిరేకత విషయంలో ఉదయనిధి స్టాలిన్, వైఎస్ జగన్ లలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అన్న డిబేట్ కు కూడా వీరిరువురి భేటీ దృశ్యాలు దోహదం చేశాయి. వీరిరువురిలో ఉదయనిథి స్టాలిన్ ఒక రకంగా బెటర్.. ఆయన ఎటువంటి దాపరికం లేకుండా తన హిందూ వ్యతిరేక వాణిని కుండబద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యక్తం చేశారు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి శషబిషలూ లేవు. అయితే జగన్ అలా కాదు.. ఓ పక్క తాను హిందూ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే.. చేతల్లో తన వ్యతిరేకత చూపుతుంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప‌ర‌కామ‌ణి చోరీ చాలా చిన్న వ్య‌వ‌హారం అనడం. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ అని ధృవపడినా, అందులో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ బుకాయించడం వరకూ జగన్ హిందూ వ్యతిరేకతను చాపకింద నీరులా కనిపించీ కనిపించకుండా చాటుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇద్దరే. హిందూ వ్యతిరేకత విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు.  
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పొలిటికల్ క్లియరెన్స్ ను రిజెక్ట్ చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పడం ఇది మూడో సారి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళ్లాలంటే  విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ అనుమతినే పొలిటికల్ క్లియరెన్స్ అంటారు.   అయితే తరచుగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్  మాన్ పర్యటనపై కేంద్రం ఈ పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. మాన్  విదేశీ పర్యటనకు కేంద్రం వరుసగా మూడో సారి అనుమతి నిరాకరించడం గమనార్హం.   ఈ ఏడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా నిరాకరించింది. అంతకు ముందు పారిస్ ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లాలని భావించిన పంజాబ్ సీఎం మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య,  విదేశీ పంజాబీల సహకారం కోసం మాన్ విదేశీ పర్యటనకు సంకల్పించారు.  కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది.   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (ఫిబ్రవరి 9) హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి హస్తిన చేరుకుంటారు. రాత్రికి ఆయన హస్తినలో బసచేసి మంగళవారం (ఫిబ్రవరి10)  కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్తమంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులతో ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు.  ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు   బకాయిల విడుదల,   పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన  నిర్మలా సీతారామన్ ను కోరే అవకాశం ఉందం టున్నారు. అదే విధంగా  జధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు.  ఈ  భేటీల  అనంతరం మంగళవారం సాయంత్రం  ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి  విజయవాడ చేరుకుంటారు.
ALSO ON TELUGUONE N E W S
  అకీరా నందన్ ఎంట్రీకి రంగం సిద్ధం పవన్ కళ్యాణ్ నుంచి శేఖర్ కమ్ములకు పిలుపు! పొలిటికల్ జానరా? లవ్ స్టోరీనా?   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనయుడు అకీరా నందన్(Akira Nandan) సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'ఓజీ'తోనే అకీరా వెండితెరకు పరిచయం అవుతాడని, అందులో టీనేజ్ ఓజీ పాత్రలో అతను కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ, అది ప్రచారానికే పరిమితమైంది. దీంతో 'ఓజీ' విడుదల సమయంలో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే అభిమానుల్లో ఆనందాన్ని నింపేలా త్వరలోనే అకీరా ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   అకీరా నందన్ డెబ్యూ మూవీ ఈ డైరెక్టర్ తోనే అంటూ గతంలో హరీష్ శంకర్, సుజీత్, త్రివిక్రమ్ వంటి పేర్లు వినిపించాయి. ఇప్పుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) పేరు తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి శేఖర్ కమ్ములకు పిలుపు వచ్చిందట. అకీరా నందన్ ను లాంచ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని, మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలని కోరారట. ప్రస్తుతం కమ్ముల అదే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.   స్టార్ వారసుల లాంచ్ కోసం ఎక్కువగా మాస్ దర్శకుల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి మారిపోయింది. స్టార్ వారసులు నటించిన సినిమా అయినా.. అందులో వైవిధ్యం లేకపోతే ప్రేక్షకులు ఆదరించట్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ములతో తన కుమారుడిని లాంచ్ చేయించాలని పవన్ నిర్ణయించుకున్నారట.   ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'లీడర్-2' చేస్తారని వార్తలొచ్చాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు అకీరా నందన్ తో కమ్ముల పొలిటికల్ మూవీ ప్లాన్ చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. లేదా ఆనంద్, గోదావరి, ఫిదా లాంటి ఓ మంచి లవ్ స్టోరీని చేస్తారేమో చూడాలి.   ఏది ఏమైనా శేఖర్ కమ్ములతో లాంచ్ చేయించాలనే ఆలోచన మంచిదే అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం మెగా అభిమానులకే కాకుండా, సాధారణ ప్రేక్షకులకు మొదటి సినిమాతోనే చేరువయ్యే అవకాశముంటుంది.    
   -ప్రేమ విషయంలో త్రిప్తి డిమ్రి ఏం చెప్పబోతోంది -ఈ నెల 13 న మరో సంచలనం తప్పదా! -చివరకి ప్రేమ విషయంలో ఏం చెప్తుంది  యానిమల్ లో ఏ ముహూర్తాన 'త్రిప్తి డిమ్రి'(Tripti Dimri)అడుగుపెట్టిందో కానీ, ఇండియన్  మూవీ లవర్స్ మొత్తం ఆమె గురించి ఆలోచించని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఆ ఆలోచనలకి గ్యాప్ ఇవ్వడం త్రిప్తి కి కూడా ఇష్టం లేదేమో, స్పిరిట్ పోస్టర్ లో గాయాలతో ఒంటి నిండా    బ్యాండేజ్ లు  వేసుకున్న ప్రభాస్ సిగరెట్ తాగడానికి వైట్ శారీలో ఉన్న త్రిప్తి  లైటర్ వెలిగించి హెల్ప్ చేస్తుంది. దీంతో స్పిరిట్ లో త్రిప్తి చేసే మ్యాజిక్ ఏ విధంగా ఉండబోతుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తన అప్ కమింగ్ మూవీ 'ఓ రోమియో'(O Romeo)పై కూడా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.తను ఈ చిత్రంలో 'ఆఫ్షా' అనే క్యారక్టర్ ని పోషిస్తుంది. చిత్ర బృందం రీసెంట్ గా ఇనిస్టా వేదికగా త్రిప్తి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. సదరు పోస్టర్ లో త్రిప్తి ఎక్స్ ప్రెషన్ ని చూస్తుంటే ప్రేమలో మోసపోయినట్టుగా అనిపిస్తుంది. మేకర్స్ కూడా అందుకు తగ్గట్టే 'ప్రేమ అనేది  'ఆఫ్షా' ని పట్టుకున్న శాపం అనే  వ్యాఖ్యలని జోడించడంతో త్రిప్తి రోల్ తో పాటు మూవీపై  అంచనాలు పెరిగాయి. అగ్ర హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor)త్రిప్తి జంటగా చెయ్యగా దిశా పటాని ,తమన్నా, నానాపటేకర్ వంటి అగ్ర శ్రేణి యాక్ట్రెస్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.  also read:  బాక్సాఫీస్‌ షేక్ చేస్తోన్న విత్ లవ్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా! విశాల్ భరద్వాజ్(Vishal bhardwaj)దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మించగా ఈ నెల 13 న థియేటర్స్ లోకి ల్యాండ్ కానుంది. యానిమల్ తర్వాత చేసిన చాలా సినిమాల విషయంలో త్రిప్తి తాను అనుకున్న రిజల్ట్ ని రాబట్టలేకపోయింది.మరి 'ఓ రోమియో' ద్వారా అయినా భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.      
  -విత్ లవ్ కి ఎందుకు అంత ఆదరణ -కథ ఏంటి -చూసిన వాళ్ళు ఏమంటున్నారు    కంటెంట్ ఉన్న సినిమాకి కట్ అవుట్ అక్కర్లేదనే నిజాన్ని గుర్తు చెయ్యడానికి అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. రావడమే కాదు సినీ వినీలాకాశంలో మెరవాలనే కోరిక ఉన్న ఎంతో మంది మేకర్స్ కి సంజీవిని లాగా తమ  స్టేటస్ ని పెంచుకుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'విత్ లవ్'(With LOve). తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 6 న తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ అయ్యి రోజు రోజు కి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హీరో, హీరోయిన్ దగ్గరనుంచి మిగతా క్యారెక్టర్స్ పోషించిన ఎవరి ముఖాలు కూడా సరిగా తెలియదు. కానీ మంచి వసూళ్లతో దూసుకుపోతూ లాభాల బాటలో పయనిస్తోంది. మరి ఆ  వివరాలు చూద్దాం.   ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు తమిళ, తెలుగు లాంగ్వేజస్ కలుపుకొని 1.6 కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ శనివారం కలెక్షన్లు పెరిగి 2.5 కోట్లు వసూలు చేయగా   మూడవ రోజైన ఆదివారం 3 కోట్లకి పైగా వసూలు చేసింది. దీంతో మూడు రోజుల వసూళ్లు  7.14 కోట్లకి చేరుకున్నాయి. నిర్మాణ సంస్థ అధికారకంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓవర్సీస్ మార్కెట్‌ కలుపుకొని వరల్డ్ వైడ్ గా 11 కోట్లకి పైగా  రాబట్టినట్టుగా చెప్పారు. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం తమిళనాడులోనే 6 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పసిలియన్ సంయుక్తంగా నిర్మించగా 4 కోట్ల రూపాయిల వరకు బడ్జెట్ అయినట్టుగా టాక్. మరి ఈ లెక్కన ఇప్పటికే లాభాల పట్టిన విత్ లవ్ ముందు ముందు ఈ మేర వసూళ్ళని అందుకుంటుందో చూడాలి. Also read: ఆ మూవీలో చేసిన హీరో, హీరోయిన్ రియల్ గానే చనిపోయారు.. అభిమానుల కన్నీళ్లు   నూతన దర్శకుడు మధన్(Madhan)దర్శకత్వం వచించగా అభిషన్ జీవింత్, ఇటీవల రోషన్ హీరోగా వచ్చిన 'ఛాంపియన్' హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా చేశారు. పెళ్లి చూపుల్లో పరిచయమైన సత్య సీలన్, మోనిషా  అనే యువతీ యువకులకి ఆ ఇద్దరు ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్స్ అని తెలుసుకుంటారు. ఆ విధంగా మొదలైన ఇద్దరి  ప్రయాణంలో ఫస్ట్ లవ్, బ్రేకప్, గతాన్ని తలుచుకోవడం, వదిలేసిన జ్ఞాపకాలని  మళ్ళీ స్పృశించడం అనే భావోద్వేగాల వైపు సాగుతూ ఒక కొత్త జోష్ ని అనుభూతిని విత్ లవ్ కలిగిస్తుంది.   
-ఎందుకు ఆ హీరో, హీరోయిన్ చనిపోయారు -మరో హీరోయిన్ నిద్రమాత్రలు మింగింది -కారణాలు ఏంటి! -ఇంతకీ ఆ సినిమా ఏంటి    సినిమా..అలసిపోయిన మనిషి శరీరానికి, మెదడుకి సరికొత్త నూతనోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు టన్నుల క్యాలరీల కొద్దీ శక్తీ ఇస్తుంది. సదరు శక్తీ మనిషికి సరికొత్త జన్మని ప్రసాదించినట్టే అవుతుందనే నానుడి కూడా ఎప్పట్నుంచో ఉంది. మూవీ లవర్స్ కి ఆ  ఈక్వెషన్ గురించి బాగా తెలుసు. కాకపోతే పైన చెప్పుకున్నవన్నీ మనకి దక్కడానికి 24 క్రాఫ్ట్స్ పడే కష్టం మన ఊహకి కూడా అందదు .ముఖ్యంగా హీరో, హీరోయిన్ తమ అభిమాన గణాన్ని అలరించాలనే ఉద్దేశ్యంలో నిద్రాహారాలు మాని సినిమా బాగా రావడం కోసం కష్టపడతారు.అలాంటి ఒక సినిమా అభిమానులకి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ సినిమాలో చేసిన హీరో ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే హీరోయిన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మరో హీరోయిన్ కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూద్దాం.  కలుసుకోవాలని(Kalusukovalani).. 2002 ఫిబ్రవరి 8 న థియేటర్స్ లో అడుగుపెట్టింది. అంటే నిన్నటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఉదయ్ కిరణ్(Uday Kiran), గజాల(Gajala), ప్రత్యూష(Prathyusha)జంటగా చెయ్యగా రఘురాజ్(Raghuraj) దర్శకత్వంలో దిల్ రాజు, గిరి, ప్రవీణ్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కిన కలుసుకోవాలని మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత ఉదయ్ కిరణ్ నుంచి వచ్చిన మూవీ. ఈ చిత్రం కూడా గత మూడు చిత్రాల లాగానే ఘన విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ అతి పెద్ద అసెట్.  2014 లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని   చనిపోయాడు. బయట రకరకాల కారణాలు వినిపిస్తున్నా అసలు విషయం ఆత్మ హత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ కే తెలియాలి.  Also read: మోక్షజ్ఞ సినిమా పరిస్థితి ఏంటి.. అనిల్ రావిపూడితో చేస్తే ఎలా ఉంటుంది!    ప్రత్యూష  కలుసుకోవాలని వచ్చిన రెండు వారాలకే మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. మరో హీరోయి గజాల కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. సరైన సమయానికి ఆమె స్నేహితులు వచ్చి కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ విధంగా  కలుసుకోవాలని మూవీ ఇప్పుడు వైరల్ గా మారింది.  వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 న మనసంతా నువ్వే  రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఉదయ్ కిరణ్ సినిమాల గురించి ప్రస్తావనకి రావడం కూడా ఇందుకు ఒక కారణం.     
  'పెళ్ళి చూపులు' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన తరుణ్ భాస్కర్(Tharun Bhascker).. టాలీవుడ్ లో ప్రతిభగల యువ దర్శకులలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవల హీరోగా 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాతో పలకరించిన తరుణ్ భాస్కర్.. త్వరలో మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'గాయపడ్డ సింహం'.   తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'గాయపడ్డ సింహం'(Gaaya Padda Simham). కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.    "గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది" అంటూ 'కేజీఎఫ్'లోని డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఆ డైలాగ్ స్ఫూర్తితోనే ఈ సినిమాకి 'గాయపడ్డ సింహం' అని టైటిల్ పెట్టారని అర్థమవుతోంది. అంతేకాదు, టీజర్ ను కూడా 'కేజీఎఫ్' సినిమాని గుర్తుచేస్తూ సరదాగా కట్ చేశారు. ఫరియా అబ్దుల్లాకు శుభలేఖ సుధాకర్ స్టోరీ చెబుతున్నట్టుగా టీజర్ రూపొందించిన తీరు ఆకట్టుకుంది.   'గాయపడ్డ సింహం'లో అమెరికా వెళ్లాలని కలలు కనే యువకుడి పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపిస్తున్నాడు. టీజర్ సరదాగా సాగింది. అక్కడక్కడా యాక్షన్ సీన్స్ కూడా మెరిశాయి. ఇక టీజర్ చివరిలో తాను డైరెక్ట్ చేసిన 'పెళ్ళి చూపులు' సినిమాపై తరుణ్ సెటైర్ వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పెళ్ళి చూపులు సీన్ ని రీక్రియేట్ చేస్తూ.. "పెళ్ళి చూపులు మీద మీ ఒపీనియన్ ఏంటి?" అని ఫరియా అడగగా.. "యావరేజ్ సినిమా ఓవర్ హైప్ అయింది అంతే" అంటూ తరుణ్ సమాధానం చెప్పడం విశేషం.   మొత్తానికి 'గాయపడ్డ సింహం' టీజర్ చూస్తే.. త్వరలో థియేటర్లలో సరికొత్త వినోదాన్ని చూడటం ఖాయమనిపిస్తోంది.   Also Read: పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ కాంబోలో భారీ మల్టీస్టారర్!    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.  కొందరైతే ఎంత గొప్ప గిఫ్ట్ ఇస్తే తమ ప్రేమ అంత గొప్పది అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ డబ్బు కంటే,  బహుమానం కంటే.. మనసులో ఉన్న ప్రేమ, భావం చాలా ముఖ్యమైనది. ప్రేమిస్తున్న వ్యక్తి తమకు ఎంత ప్రత్యేకం అనే విషయాలు తెలియజేయడానికి  డబ్బు పెట్టి బహుమానాలు కొని ఇవ్వాల్సిన అవసరం లేదని, మనస్ఫూర్తిగా కొన్ని పనులు చేయడం ద్వారా ప్రేమిస్తున్న వారిని సంతోషపెట్టవచ్చని అంటున్నారు.  ఇంతకీ డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రపోజ్ చేయడానికి  ఏం చేయాలి? తెలుసుకుంటే.. చేతి లేఖ.. నేటి డిజిటల్ యుగంలో, చేతితో రాసిన లేఖ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. మనసులో ఉన్న స్పష్టమైన భావాలను కాగితంపై ఉంచినప్పుడు  అది ఎదుటి వారి హృదయాన్ని నేరుగా చేరుతుంది. ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారో,  మొదటిసారి కలిసినప్పుడు ఎలా అనిపిస్తోందో..  వారితో  గడిపే క్షణాలు ఎంత విలువైనవో   వారికి తెలిసేలా మనసును ఆకట్టుకునే రాయవచ్చు. భాష మీద పట్టు,  మంచి అభిరుచి ఉన్నవారు అయితే చిన్న కవిత లేదా భావుకతతో కూడిన వాక్యాలను కలిపి రాయవచ్చు. సర్‌ప్రైజ్.. సర్‌ప్రైజ్‌లు అంటే ఎప్పుడూ ఖరీదైన హోటళ్లు లేదా పెద్ద పార్టీలు అని అర్థం కాదు.  లాంగ్ డ్రైవ్‌లను ఆస్వాదించే అభిరుచి ఉంటే  వారిని సాయంత్రం బయటకు తీసుకెళ్ళడం,  ఎక్కవ గందరగోళం లేని ప్రదేశంలో కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదా   టెర్రస్‌పై  విందును ప్లాన్ చేయడం చాలా బాగుంటాయి. ఎదుటి వారికి ప్రాధాన్యత ఇస్తే అదే వారికి గొప్ప బహుమానం. స్వీట్ మెమోరీస్.. ఒక ఖాళీ జాడి లేదా పెట్టె తీసుకొని చిన్న కాగితాలు కూడా తీసుకోవాలి. ప్రతి కాగితంపై  ఇద్దిరకి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం, ఒక ఫన్నీ క్షణం లేదా  భాగస్వామి లో ఉండే  మంచి అలవాటును  రాయాలి. ఈ బహుమతి చాలా ఎమోషనల్ గా ఉంటుంది.  ఇది మనసును హత్తుకునేలా చేస్తుంది. ఖరీదు..  బహుమతులు ఖరీదైనవి కానవసరం లేదు. ఫోటో ఫ్రేమ్, పేరుతో డిజైన్ చేయబడిన కాఫీ మగ్, కీచైన్ లేదా  సంబంధానికి రిలేటెడ్ గా ఉండే  ఏదైనా చిన్న వస్తువు మరింత హార్ట్ టచింగ్ గా ఉంటాయి. మనసులో ఉన్న ఆలోచన,  ఎదుటి వ్యక్తి మీద ప్రేమ మొదలైని బహుమతిలో ఎక్స్పెస్ చేయగలిగితే దాని విలువ ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. సమయం.. ప్రేమను వ్యక్తం చేయడమే కాదు.. ఎదుటి వ్యక్తి ప్రాధాన్యత అర్థం చేసుకోవడానికి  ముఖ్యంగా కేటాయించాల్సింది సమయం. కనీసం ఒక్కరోజైనా పూర్తీ సమయం వారితో గడపడానికి ప్రయత్నించడం,  సోషల్ మీడియా ఫోన్ డిస్టర్బ్ ఎక్కువ లేకుండా చూసుకోవడం వంటివి చేయాలి. ఒకరితో ఒకరు సమయం గడపడం,  జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం,  హాయిగా నవ్వడం.. ఇవన్నీ బంధానికి కొత్తదనాన్ని ఇస్తుంది. ప్రశంస.. చాలామంది తాము ఇష్టపడిన వ్యక్తిలో ఏ చిన్న తప్పు కనిపించినా దాన్న ఎత్తి చూపుతూ ఉంటారు.  వారిని నొప్పించేలా మాట్లాడుతూ ఉంటారు.  కానీ అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిలో ఉండే మంచి అలవాట్లు,  వారిలో ఉన్న ప్రత్యేకత చూడగలిగి,  వారిని మెచ్చుకుంటూ ఉంటే.. ఇద్దరి జీవితాలు బాగుంటాయి.  ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది.                             *రూపశ్రీ.
  స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 246 ఏళ్ల క్రితం భారతదేశంలో బ్రిటీషర్ల అవినీతిని,  వారి తప్పులను ధైర్యంగా బహిర్గతం చేసి, ప్రజలకు అందించిన వార్తాపత్రిక ఒకటుంది. నిజానికి ఈ వార్తాపత్రిక భారతదేశంలో స్వతంత్ర  జర్నలిజానికి పునాది వేసింది. ఆ వార్తా పత్రిక పేరే హిక్కీస్ బెంగాల్ గెజిల్. దీన్ని హికీ గెజిట్ అని, బెంగాల్ గెజిట్  లేదా కలకత్తా జనరల్ అడ్వర్డైజర్ అని వివిధ పేర్లతో పిలిచారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. జనవరి 29, 1780.. భారతదేశంలో అధికారిక జర్నలిజం యుగం జనవరి 29, 1780న ప్రారంభమైంది. జేమ్స్ అగస్టస్ హికీ అనే వ్యక్తి కలకత్తాలో దేశంలోని మొట్టమొదటి వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. ఇది "హికీ గెజిట్", "బెంగాల్ గెజిట్" లేదా "కలకత్తా జనరల్ అడ్వర్టైజర్" అని వివిధ పేర్లతో పిలువబడింది. సమాచారంపై అధికారంలో ఉన్నవారు గుత్తాధిపత్యం వహించిన కాలం అది. అటువంటి క్లిష్ట సమయాల్లో హిక్కీ రెండు పేజీల వార్తాపత్రికను ప్రచురించడం ద్వారా కమ్యూనికేషన్ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేశాడు. న్యాయం, ధైర్యం.. హికీ ఈ వార్తాపత్రికను సమాచార వనరుగా మాత్రమే కాకుండా స్వతంత్ర వేదికగా కూడా స్థాపించారని చెబుతారు. ఆయన వార్తాపత్రిక  అత్యంత గొప్ప లక్షణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నత స్థాయి అధికారులపై తిరుగులేని విమర్శలు చేయడం. ఆయన పరిపాలనలోని లోపాలను ప్రజలకు బహిర్గతం చేసి, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిగా పనిచేశారు. ఆయన నిర్భయంగా మొదలు పెట్టిన ఈ జర్నలిజం భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు పునాది వేసింది. అణచివేత.. హిక్కీ నిష్పాక్షికంగా  విమర్శించే వైఖరి ఈస్ట్  ఇండియా కంపెనీకి నచ్చలేదు. దీని వలన హిక్కీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆగ్రహానికి గురయ్యాడు. అతనికి భారీ జరిమానా విధించి,  జైలు శిక్ష కూడా విధించారు. కేవలం రెండేళ్లే.. ప్రభుత్వ ఒత్తిడి,  అణచివేత విధానాల కారణంగా, ఆ వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. చివరికి 1782లో, హికీ ప్రింటింగ్ ప్రెస్ జప్తు చేశారు.  ఈ చారిత్రాత్మక వార్తాపత్రిక ప్రచురణను శాశ్వతంగా నిలిపివేశారు. చెరగని ముద్ర.. వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉనికిలో ఉన్నప్పటికీ, అది భారత చరిత్రపై చెరగని ముద్ర వేసింది. ఈ వార్తాపత్రిక యొక్క అసలు కాపీలు ఇప్పటికీ లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో,  భారతదేశంలోని ఎంపిక చేసిన ఆర్కైవ్‌లలో భద్రపరిచారు. ఇదీ భారతదేశంలో ప్రారంభించిన మొదటి వార్తాపత్రిక ప్రభంజనం.                               *రూపశ్రీ.
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది.  కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది.  ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ,  1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది.   ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం,  సమయం చాలా తగ్గాయి. భారత తపాలా శాఖ.. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి.  వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది.  ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం. ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి  ఈ సర్వీస్ ను నడిపింది. అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.                                  *రూపశ్రీ.
హిందూ వ్యతిరేకత విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ ల మధ్య నేనంటే నేను గోప్ప అన్న సంవాదం నడుస్తోందా?  తాజాగా ఇరువురూ చెన్నైలోని ఓ వివాహ వేడుకలో కలుసుకుని పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు జగన్, ఉదయనిథి స్టాలిన్ హాజరయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎందరో అతిరథ మహారథులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి. జగన్ ఉదయనిథి స్టాలిన్ ఇరువురూ ఆ వివాహ వేడుకలో కలిసి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో నెటిజనులు వారి హిందూ వ్యతిరేక వైఖరిపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ లో భాగంగానే  స‌నాత‌న ధ‌ర్మం అనేది వైర‌స్ అని భ‌లే అన్నావ్  అని జ‌గ‌న్ రెడ్డి అంటే..  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన నీ ముందు నేనెంత అన్న చర్చ జరిగి ఉంటుందంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  హిందూ ధర్మంపై వ్యతిరేకత విషయంలో ఉదయనిధి స్టాలిన్, వైఎస్ జగన్ లలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అన్న డిబేట్ కు కూడా వీరిరువురి భేటీ దృశ్యాలు దోహదం చేశాయి. వీరిరువురిలో ఉదయనిథి స్టాలిన్ ఒక రకంగా బెటర్.. ఆయన ఎటువంటి దాపరికం లేకుండా తన హిందూ వ్యతిరేక వాణిని కుండబద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యక్తం చేశారు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి శషబిషలూ లేవు. అయితే జగన్ అలా కాదు.. ఓ పక్క తాను హిందూ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే.. చేతల్లో తన వ్యతిరేకత చూపుతుంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప‌ర‌కామ‌ణి చోరీ చాలా చిన్న వ్య‌వ‌హారం అనడం. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ అని ధృవపడినా, అందులో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ బుకాయించడం వరకూ జగన్ హిందూ వ్యతిరేకతను చాపకింద నీరులా కనిపించీ కనిపించకుండా చాటుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇద్దరే. హిందూ వ్యతిరేకత విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు.  
పంజాబ్ ముఖ్యమం్తరి భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పొలిటికల్ క్లియరెన్స్ ను రిజెక్ట్ చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పడం ఇది మూడో సారి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళ్లాలంటే  విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ అనుమతినే పొలిటికల్ క్లియరెన్స్ అంటారు.   అయితే తరచుగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్  మాన్ పర్యటనపై కేంద్రం ఈ పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. మాన్  విదేశీ పర్యటనకు కేంద్రం వరుసగా మూడో సారి అనుమతి నిరాకరించడం గమనార్హం.   ఈ ఏడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా నిరాకరించింది. అంతకు ముందు పారిస్ ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లాలని భావించిన పంజాబ్ సీఎం మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య,  విదేశీ పంజాబీల సహకారం కోసం మాన్ విదేశీ పర్యటనకు సంకల్పించారు.  కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది.   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (ఫిబ్రవరి 9) హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి హస్తిన చేరుకుంటారు. రాత్రికి ఆయన హస్తినలో బసచేసి మంగళవారం (ఫిబ్రవరి10)  కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్తమంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులతో ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు.  ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు   బకాయిల విడుదల,   పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన  నిర్మలా సీతారామన్ ను కోరే అవకాశం ఉందం టున్నారు. అదే విధంగా  జధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు.  ఈ  భేటీల  అనంతరం మంగళవారం సాయంత్రం  ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి  విజయవాడ చేరుకుంటారు.
నేటి వేగవంతమైన జీవితంలో, మనం చిన్న చిన్న అలవాట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు . కామన్ గా  ఆఫీసులో, ఇంట్లో లేదా బయటకు వెళ్లినప్పుడు నిలబడి నీరు తాగుతుంటారు.   దీని వల్ల ఏం జురుగుతుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇదేం చెడ్డ అలవాటు కాదులే అనుకుంటారు చాలామంది. కానీ ఆయుర్వేదం మాత్రం ఇది చాలా చెడ్డ అలవాటు అంటోంది.  శరీరానికి నీరు ఎంత ముఖ్యమైనదో.. నీరు తాగే పద్దతి కూడా అంతే ముఖ్యమని ఆయుర్వేదం చెబుతుంది. నిలబడి నీరు త్రాగడం క్రమంగా శరీరానికి హాని కలిగిస్తుందట.   దీని గురించి పూర్తీ విషయాలు తెలుసుకుంటే.. కూర్చుని నీరు తాగితే.. కూర్చుని సౌకర్యవంతంగా నీరు త్రాగినప్పుడు శరీరం దానిని నెమ్మదిగా గ్రహించడానికి సమయం ఉంటుంది. అయితే నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు వేగంగా గ్రహించబడుతుంది. శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇది క్రమంగా  ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలోని నీటి సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల నీరు సరిగ్గా ఉపయోగించబడకుండా కీళ్ళు, మోకాళ్ల చుట్టూ పేరుకుపోతుంది, దీని వలన చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు,బిగుసుకుపోవడం,  కీళ్ల సమస్యలు వస్తాయి. కూర్చిని నీరు తాగితే జరిగేది ఇదే.. కూర్చుని నీరు త్రాగినప్పుడు శరీరం దానిని ఫిల్టర్ చేసి, తరువాత దానిని మూత్రపిండాలకు పంపిస్తుంది. అయితే, నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు ఫిల్టర్ చేయకుండానే  మూత్రపిండాలకు చేరుతుంది, వాటిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. నిలబడి నీరు తాగితే.. నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు కడుపులోకి వేగంగా చేరుతుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లత్వం, గుండెల్లో మంట, మలబద్ధకం,  బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో జరిగే మార్పు.. శరీరం నీటిని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు, అది శరీర శక్తిని,  బలాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ పని లేకపోయినా  అలసిపోయి, నీరసంగా ఉన్నట్టు అనిపించవచ్చు. అందుకే ఇలా చేయాలి.. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నీరు త్రాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ హాయిగా కూర్చుని నీరు త్రాగాలి, అది కూడా  నెమ్మదిగా సిప్ బై సిప్  త్రాగాలి, తొందర తొందరగా నీరు తాగకూడదు. చాలా చల్లటి నీరు కూడా తాగకుండా ఉండటం మంచిది.  గది ఉష్ణోగ్రతలో ఉన్న  నీరు మంచిది, గోరు వెచ్చగా ఉన్న నీరు మంచిది.  గాజు లేదా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని త్రాగడం శ్రేష్టం.  ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగడం మంచిది కాదు.                                *రూపశ్రీ.  
డయాబెటిస్ చాలామందిని కుదిపేస్తున్న సమస్య.  ఒకప్పుడు 60ఏళ్ళు దాటిన వృద్దులలో డయాబెటిస్ కనిపించేది. కానీ నేటి కాలంలో మాత్రం 30 ఏళ్లు కూడా నిండకనే డయాబెటిస్ బారిన పడుతున్నారు.  మరీ దారుణం ఏమిటంటే.. చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య ఉంటోంది. అయితే రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు,  పరిశోధకులు అంటున్నారు.  ఇంతకీ డయాబెటిస్ రావడానికి రోజువారీ జీవితంలో చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. జన్యు సమస్య కాదు.. డయాబెటిస్ అనేది తల్లిదండ్రుల నుండి వస్తుందని చాలా మంది అనుకుంటారు.   దీన్ని జన్యు పరమైన సమస్యగా చెబుతారు. అయితే డయాబెటిస్  ఎక్కువగా  ఆధునిక జీవనసైలి,  ఆహారం, శరీరానికి కష్టం లేకపోవడం వంటి అలవాట్ల వల్ల వస్తోంది. ప్రాచీన ఆయుర్వేదం ఏం చెప్పిందంటే.. ప్రాచీన భారతీయ గ్రంథాలు అయిన చరక సంహితలో చరకాచార్యుడు డయాబెటిస్ ను మధుమేహం గా వివరించాడు. మూత్రంలో తీపి రుచి ఉండటం ద్వారా దీన్ని గుర్తించారట. సుశ్రుత సంహితలో సుశ్రుతుడు 20రకాల మధుమేహాలను చెప్పి వీటి లక్షణాలు,  కారణాలు,  చికిత్సలను కూడా తెలిపాడు. పై విషయాలను బట్టి చూస్తే.. మధుమేహం అనేది పూర్వ కాలం నుండే ఉన్నా.. అది నేటికాలంలో మనుషుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తోంది.   ఇన్సులిన్ వ్యవస్థ.. శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థ ఉంటుంది.  ఈ వ్యవస్థను పాడు చేసే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి.  వీటిని చాలా వరకు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది డయాబెటిస్ రావడానికి కారణం అవుతుంది. అల్పాహారం.. అల్పాహారాన్ని దాటవేడయం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనకు అంతరాయం కలుగుతుంది. బోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి.  ఇది క్రమంగా డయాబెటిస్ కు దారితీస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం.. ఒకప్పుడు బాగా పని చేసి.. అలసిపోయినప్పుడు కొద్దిసేపు కూర్చొనేవారు.  కానీ నేటికాలంలో ఆఫీసులలో గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. నాలుగు గంటలకు ఒకసారి బ్రేక్ పేరుతో కొద్దిసేపు లేచి తిరగడం చేస్తున్నారు. దీని వల్ల శరీర కణాలు ఇన్సులిన్ కు సున్నితంగా మారిపోతాయి. శరీరం గ్లూకోజ్ శోషణను ఇది నెమ్మదిస్తుంది.  ఇది శరీరంలో గ్లూకోజ్ పేరుకోవడానికి దారి తీస్తుంది.  ఆలస్యంగా,  భారీగా తినడం.. రాత్రి భోజనం ఎప్పుడూ 7 లేదా 8 గంటల లోపు తినాలని చెబుతుంటారు. గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు పెద్దలు.  అంటే సాయంత్రం ఇంట్లో దీపం వేయడం, రాత్రి ఆహారం తీసుకోవడం ఒకేసారి జరగాలని దీని ఉద్దేశ్యం.  అంతలోపు తీసుకోకపోయినా కనీసం 7 నుండి 8 లోపు తీసుకోవాలి.  కానీ  ఆలస్యంగా 10 గంటలకు పైన లేదా 11 గంటలకు పైన తినడం, అది కూడా చాలా భారీగా  తినడం చేస్తుంటారు. ఈ అలవాటు కొన్ని నెలలు,  ఏళ్ల పాటు కొనసాగితే డయాబెటిస్ పక్కాగా వస్తుంది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
శరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..!   ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది.  శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు.  అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు శరీరానికి అందవు,  ఎంత తిన్నా ఏం మార్పు లేదని చాలామంది కన్ప్యూజన్ అవుతుంటారు. అయితే ఆహారాల కాంబినేషన్ లు మ్యాజిక్ చేస్తాయి.  ఆహారంలో లభించే పోషకాల సినర్జిస్టిక్ ప్రభావం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మల్టీవిటమిన్లు సహజంగా మొత్తం ఆహారాలలో కనిపిస్తాయి. విటమిన్లు,  ఖనిజాలతో పాటు, అవి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఫైబర్.. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఇది శరీరంలోకి పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఎంజైమ్‌లు.. పోషకాలను విచ్ఛిన్నం చేసి నిర్దిష్ట మూలకాలను సక్రియం చేస్తాయి. ఫైటోకెమికల్స్.. పోషకాలను నష్టం నుండి రక్షిస్తాయి.  పోషకాలను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి. ఆహార కాంబినేషన్లు.. బెస్ట్ కాంబో.. సిట్రస్ పండ్లు లేదా ఆకుకూరలతో కూరగాయలు, గింజలతో పండ్లు. బెస్ట్ కలర్స్.. వివిధ రంగుల పండ్లు,  కూరగాయలు ముఖ్యమైన ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఆహార కొవ్వును సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి విటమిన్లు A, D, E,  K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అవసరం. కాల్షియం, విటమిన్-డి.. తగినంత విటమిన్ డి లేకుండా  శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించదు. అందువల్ల  కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో విటమిన్ డి ని సప్లిమెంట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బలమైన దంతాలు,  ఎముకలను నిర్వహించడానికి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్-సి, ఐరన్.. విటమిన్ సి తో ఐరన్ తీసుకోవడం వల్ల  శరీరం దానిని సులభంగా జీర్ణం చేస్తుంది. అందుకే పాలకూరతో నిమ్మకాయ, టమోటాలతో పప్పు, బెర్రీలతో బలవర్థకమైన తృణధాన్యాలు వంటి కాంబినేషన్లు మంచివిగా పరిగణించబడతాయి. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్.. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి ప్రోబయోటిక్స్ అవసరమైన బ్యాక్టీరియా. అవి జీర్ణక్రియకు సహాయపడతాయి,  రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, దోస,  కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాను నిర్వహించడానికి ప్రీబయోటిక్ ఆహారాలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్‌కు ఎరువుగా పనిచేసే ఒక రకమైన ఆహార ఫైబర్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆపిల్స్,  తృణధాన్యాలలో ప్రీబయోటిక్స్ కనిపిస్తాయి.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.