LATEST NEWS
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500లు చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల రుణాలను 50 శాతం మాఫీ చేస్తామన్నారు. అలాగే ఓ కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు . అలాగే కొత్తగా ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3 వేలు పింఛను ఇస్తామన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని విజయ్ హామీల వర్షం కురిపించారు. అలాగే మహిళలు తమ ఇళ్ల ముందు టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్ ముగ్గు వేయాలని సూచించారు.
తెలుగువన్ ‘వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన. రాబోయే రోజుల్లో లోక్ సభ సీట్ల సంఖ్య పెరగబోతోందా? అలా పెరిగితే ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు లాభమా లేక భారీ నష్టమా? ప్రముఖ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్‌తో 'వాస్తవ వేదిక' ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడైన కీలక అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతానికి పట్టం కడుతూ, దక్షిణ భారతాన్ని విస్మరిస్తున్నారన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి
చారిత్రక నేపథ్యంలో విభజన చిక్కులు
నియోజకవర్గాల విభజన అనేది కేవలం జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని డోలేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. 1971 తర్వాత ఇందిరా గాంధీ హయాంలో సీట్లను స్తంభింపజేయడం వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన వివరించారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తూ, జనాభాను పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమనే వాదన బలంగా వినిపిస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. ఒకవేళ ఉత్తరాదికి 600 సీట్లు వచ్చి, దక్షిణాదికి కేవలం 200 చిల్లర సీట్లు వస్తే, ఢిల్లీలో దక్షిణాది ఎంపీల వాయిస్ వినిపించదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములాపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 50% జనాభా, 50% జిడిపి (GDP) ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఫార్ములాపై కూడా చర్చ జరిగింది. కేవలం జనాభాను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, ఆర్థిక అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ చేసిన సూచనలు ఆచరణలో సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పడుతున్నా, రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం వెనుకబడిపోతున్నదని తెలుగువన్ ఎండీ తెలిపారు.
రాజకీయ వ్యూహాలు - చంద్రబాబు వర్సెస్ జగన్
ఈ పునర్విభజన ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో జరిగిన విభజన సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన చాతుర్యంతో వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల విషయానికొస్తే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని, సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ ద్వారా లెక్కలు వేస్తే అది వైసీపీకే మేలు చేస్తుందని విశ్లేషించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగితే ఈ ప్రమాదాన్ని అడ్డుకోవచ్చని, కానీ లోకేష్ టీమ్ కేవలం అంకెలకు పరిమితమైతే నష్టం తప్పదని అభిప్రాయపడ్డారు.
ప్రజా స్పందన మరియు రియల్ టైమ్ రియాక్షన్స్
ఈ చర్చపై సామాన్యుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. "మేము జనాభాను నియంత్రిస్తే మా సీట్లు తగ్గించడం ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం అందరూ ఏకం కావాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ వివక్ష అనే పదం మళ్ళీ తెరపైకి రావడం బీజేపీకి దక్షిణ భారత్‌లో సవాలుగా మారేలా కనిపిస్తోంది. మోడీ-అమిత్ షా ద్వయం దక్షిణాదిపై వివక్ష చూపుతోందన్న విమర్శలపై కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ముగింపు
మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును, సమాఖ్య స్ఫూర్తిని ప్రభావితం చేసే అంశం. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు ఢిల్లీలో తమ ఉనికిని కాపాడుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి
కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను గత ఎన్నికలకు ముందు స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకుని సాధించిన చూపిన నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే ఆయన యువగళం పాదయాత్రతో అన్ని తొలగిపోయాయి. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరించేశాయి. ఆ సమర్థత, ఆ గుర్తింపు ఫలితమే ఇప్పుడు ఆయనకు పార్టీలో ప్రమోషన్ దక్కింది.
అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు చాలా గట్టిగా జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారంటే.. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు. ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేశారు.
అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు.
ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని, సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి చంద్రబాబు మాటల స్ఫూర్తితో ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా వెరవలేదు. అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. విపక్షంలో ఉండి ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు. అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు. తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే ఇప్పుడాయనను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసింది.
నారా లోకేష్ కు ఈ నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్ర అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి అధికార వైసీపీ పన్నని కుట్రలు, చేయని కుతంత్రాలు లేవు. వాటన్నిటినీ ప్రజాదరణతో ఎదుర్కొని లోకేష్ ముందడుగు వేసిన తీరు నిజంగా నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు.
కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది. ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి. లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బంధాన్ని మరింత పటిష్టం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెడతారని అంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి లోకేశ్ మరింత బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ తెరపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటి విజయశాంతి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సమాజంలోని అన్యాయాలను ఎదిరించే పవర్‌ఫుల్ పాత్రల్లో ఆమె నటన అద్వితీయం. విజయశాంతి నటించిన ఆశయం సినిమాలోని అసెంబ్లీ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అధికార గర్వంతో విర్రవీగే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సాగే ఈ సీన్ చూస్తుంటే, ఆమెను ఎందుకు 'లేడీ అమితాబ్' అంటారో మరోసారి అర్థమవుతుంది.
ఈ వైరల్ వీడియోలో విజయశాంతి హోం మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి దుర్మార్గాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన వారే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడితే, ఆ వ్యవస్థను ఎలా ప్రశ్నించాలో ఈ సీన్లో అద్భుతంగా చూపించారు. "హోం మినిస్టరే నా శీలాన్ని దోచుకుంటే.. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ అకృత్యానికి సెల్యూట్ కొట్టి కాపలా కాస్తుంటే.. నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి?" అంటూ ఆమె సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
రాజకీయ బలంతో సామాన్యులను అణచివేసే నాయకుల నిజస్వరూపాన్ని బయటపెట్టడమే కాకుండా, తనపై జరిగిన వ్యక్తిగత దాడులను కూడా ఆమె దీటుగా ఎదుర్కొన్నారు. తన క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూసిన ప్రత్యర్థులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా పోలీసు అధికారులకు ఆమె ఇచ్చిన స్వేచ్ఛ, "ఎవరు తప్పు చేసినా.. ఆఖరికి నేను లేదా ముఖ్యమంత్రి అయినా సరే సంకెళ్లు వేసే అధికారం మీకు ఇస్తున్నాను" అన్న డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించే రేంజ్లో ఉంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు విజయశాంతి పర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి సినిమాల్లో అలాంటి గంభీరమైన పాత్రలు, పదునైన డైలాగులు కరువయ్యాయని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. విజయశాంతి వంటి పవర్‌ఫుల్ హీరోయిన్ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పవర్‌ఫుల్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
మూవీ పేరు: తిమ్మరాజుపల్లి టీవీ
నటీనటులు: సాయి తేజ్,వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి, చిట్టిబాబు, లతీష్ కీలపట్టు తదితరులు
సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్
ఎడిటింగ్:
మ్యూజిక్: వంశీ కాంత్ రేఖన
నిర్మాతలు: కిరణ్ అబ్బవరం, రహస్య
బ్యానర్: క ప్రొడక్షన్స్
రచన,ఎడిటింగ్, దర్శకత్వం: మునిరాజు
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 17 ,2026
హీరోగా తన చరిష్మా కొనసాగిస్తూ వస్తున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'తిమ్మరాజుపల్లి టీవీ'(Thimmaraju Palli Tv). ప్రచార చిత్రాలు పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించడంతో ప్రేక్షకుల చూపు తిమ్మరాజుపల్లిపై పడింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సతీష్(సాయి తేజ్) లైఫ్ ని సరదాగా గడిపే మధ్య తరగతి యువకుడు. తన ఊరి గ్రామస్థులు మొత్తం టీవీలో సినిమా చూడాలనుకున్నప్పుడు తలా కొంత డబ్బులు వసూలు చేసి సతీష్ కి ఇస్తే, తను టౌన్ కి వెళ్లి టీవీ, సినిమా క్యాసెట్ లు అద్దెకి తీసుకొస్తుంటాడు. శారద( వేద జలంధర్), సతీష్ ప్రేమించుకుంటారు. రాజప్ప(ప్రదీప్ కొట్టే), ఎల్లమ్మ( స్వాతి కరిమిరెడ్డి) కొత్తగా పెళ్ళైన జంట. ఇద్దరు కల్లాకపటం లేని మంచి మనుషులు. రాజప్ప ఎవరో కాదు స్వయానా శారదకి అన్నయ్య. రాజప్ప ఇంట్లో ఉండే టీవీ దొంగతనానికి గురవుతుంది. దీంతో సతీష్, శారద పెళ్ళికి రాజప్ప ఒప్పుకోడు. టీవీ దొంగతనానికి సతీష్, శారద పెళ్ళికి సంబంధం ఏంటి? టీవీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? టీవీ వెనక ఏమైనా కథ ఉందా? ఉంటే ఆ కథ ఏంటి? సతీష్, శారద ఒక్కటయ్యారా? టీవీ దొంగతనం వల్ల ఎల్లమ్మ, రాజప్ప మధ్య ఏమైనా కలహాలు వచ్చాయా? అనేదే తిమ్మరాజుపల్లి టీవీ
ఎనాలసిస్
ఇలాంటి కథతో మూవీ తెరకెక్కించడం మంచి ప్రయత్నమే.. కానీ సింగల్ పాయింట్ తో నడిచే సబ్జెట్ ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే తెరకెక్కించాలి. మన పాత వంశీ సినిమాలని చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. అలా కాకుండా టీవీ దొంతనం అనే సింగల్ పాయింట్ ని సీరియస్ గా తెరకెక్కించడమే కొంచం ఇబ్బందిగా ఉంటుంది. మూవీ మొత్తం కంప్లీట్ గా తిమ్మరాజుపల్లి అనే గ్రామంలోనే జరుగుతుంది కాబట్టి పల్లెటూరిలో ఉండే కామెడీ మనుషులని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.
ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే తన వాయిస్ ఓవర్ లో ఏదైతే చెప్పాడో ఆ కథ ఉండదు. సతీష్, శారద మధ్య వచ్చే లవ్స్ సీన్స్ నాచురల్ గా ఉన్నాయి. పాత రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తనకి నచ్చిన హీరో సినిమా క్యాసెట్ ఇస్తే మరింత ప్రేమని చూపించే వారు. ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య ప్రేమని చూపించిన విధానం బాగుంది. ఈ లైన్ మీదనే మరింత కథనాన్ని అల్లితే కావాల్సినంత స్టఫ్ దొరికేది. రాజప్ప, అతని తండ్రి మధ్య వచ్చే సీన్స్, రాజప్ప పెళ్లి సీన్స్ బాగున్నాయి.
మిగతా క్యారెక్టర్స్ మధ్య వచ్చిన సీన్స్ లో పసలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో సతీష్ తాను చేసిన ఛాలెంజ్ పైనే ఎక్కువ ఫోకస్ చెయ్యాల్సింది. అలా కాకుండా కథని నడపడానికి అనవసరమైన సీన్స్ చాలానే వచ్చాయి. రివర్స్ స్క్రీన్ ప్లే లో కూడా తెలిసిన కథనే మళ్ళీ ఎందుకు చెప్పారో అర్ధం కాదు. టివి దొంగతనం ఎవరు చేసారో కనుక్కునే ప్రాసెస్ లో వచ్చిన సీన్స్ మాత్రం బాగున్నాయి. మేకర్స్ అదృష్టం ఏంటంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుంది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
సతీష్ క్యారక్టర్ లో సాయి తేజ్ పెద్దగా సూటవ్వలేదు. పెర్ ఫార్మ్ పరంగా కూడా సోసో. రాజప్పగా ప్రదీప్ కొట్టే మాత్రం సూపర్ గా చేసాడు. మూవీ మొత్తానికి తన పెర్ఫార్మ్ నే హైలెట్. తెలుగు సినిమాకి ఒక కొత్త రకం రూపుతో కూడుకున్న నటుడు దొరికినట్టే. శారద, ఎల్లమ్మలుగా చేసిన వేద జలంధర్, స్వాతి తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు చేసి మెప్పించారు. మిగతా ఆర్టిస్టులు గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేకపోయినా ఊరిపెద్దగా చేసిన రామ చంద్ర మాత్రం పర్వాలేదనే స్థాయిలో చేసాడు. మూవీ మొత్తం ఒకే ఊరిలో తెరకెక్కించారు కాబట్టి కిరణ్ అబ్బవరం నిర్మాణ విలువుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాయి. మునిరాజు(Muniraju)దర్శకుడిగా మెప్పించాడు కానీ రచయితగా మెప్పించలేకపోయాడు.
బలాలు
1 . పల్లెటూరి వాతావరణం
2 .ఫొటోగ్రఫీ
3 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్
4 .ప్రీ క్లైమాక్స్
5 . క్లైమాక్స్
బలహీనతలు
1 . కథ
2 . కథనం
3 . మాటలు
4 . రాంగ్ కాస్టింగ్
చివరిగా చెప్పాలంటే మంచి ప్రయత్నం.. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.
రేటింగ్ 2 .5 / 5 అరుణాచలం
యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు టీవీ షోలతో పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో హాట్ ఫోటోలను పోస్ట్ చేసి, డబ్బు సంపాదిస్తుండటంపై ఇటీవల విమర్శలు కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన ఎనిమిది ఏళ్ల క్రితం నాటి ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అప్పట్లో 'తెలుగువన్' యూట్యూబ్ ఛానల్‌లో సంచలనం సృష్టించిన 'ఫన్ బకెట్'(Fun Bucket)లో విష్ణుప్రియ చేసిన కామెడీ స్కిట్లు ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
విష్ణుప్రియ కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, కామెడీ స్కిట్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ‘ఫన్ బకెట్’లో ఆమె చేసిన కామెడీ స్కిట్లు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే.
సుమారు ఎనిమిదేళ్ల క్రితం విష్ణుప్రియ ఫన్ బకెట్ వీడియోలలో చురుగ్గా పాల్గొంది. ముఖ్యంగా ఆమెలోని నాచురల్ కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఆ వీడియోలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిస్టర్ గా, గర్ల్ ఫ్రెండ్ గా, వైఫ్ గా ఆమె చేసిన నటన అప్పట్లోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
టీవీలో 30 అడుగుల పాము గురించి తమ్ముడితో మాట్లాడే సీన్, భర్తతో లాప్టాప్ డాక్యుమెంట్స్ విషయంలో చేసే గొడవ వంటివి ఇప్పటికీ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం విష్ణుప్రియ స్టార్ యాంకర్ గా ఎదిగినా, ఆ పాత వీడియోల్లోని ఆమె అమాయకత్వం, నటనను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
తన అల్లరి, స్పాంటేనియస్ డైలాగ్స్‌తో ఎనిమిదేళ్ల క్రితమే విష్ణుప్రియ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, కామెడీని కూడా పండించగలనని ఆమె అప్పట్లోనే నిరూపించుకుంది.
సోషల్ మీడియాలో మళ్ళీ హల్చల్ చేస్తున్న ఈ వీడియోలు, విష్ణుప్రియ అభిమానులకు ఒక మంచి థ్రోబాక్ మెమరీగా నిలుస్తున్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- హీరో శర్వానంద్ కు ఏమైంది?
- భార్య రక్షితా రెడ్డితో ఎందుకు దూరంగా ఉంటున్నారు?
- అసలు ఈ విడాకుల రచ్చకు కారణమేంటి?
- ఆ పని తెలిసే చేశారా? అనుకోకుండా జరిగిందా?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand), ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలిచారు. సక్సెస్ ఫుల్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్న శర్వానంద్, తన భార్య రక్షితా రెడ్డితో విడిపోతున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన చేసిన ఒక పని ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది.
ఫోటోలు డిలీట్:
సాధారణంగా సెలబ్రిటీలు తమ బంధానికి ముగింపు పలకాలనుకున్నప్పుడు మొదట చేసే పని సోషల్ మీడియాలో ఫోటోలను డిలీట్ చేయడం. గతంలో సమంత-చైతన్య, నిహారిక-చైతన్యల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు శర్వానంద్ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి భార్య రక్షితా రెడ్డితో కలిసి దిగిన పెళ్లి ఫోటోలను, ఇతర మెమోరీస్ ని పూర్తిగా డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రొఫైల్‌లో కేవలం తన సినిమాల పోస్టర్లు, వ్యక్తిగత ఫోటోలు మాత్రమే కనిపిస్తుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఏడాది తిరగకముందే మనస్పర్ధలు?
శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం 2023 జూన్ లో జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఎంతో అట్టహాసంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రక్షితతో శర్వానంద్ వివాహం అప్పట్లో ఒక పెద్ద వేడుకలా సాగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, పెళ్లయిన ఏడాది గడవకముందే వీరి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తాయని, గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మౌనం వెనుక మర్మమేంటి?
శర్వానంద్ ప్రస్తుతం 'బైకర్' (Biker) సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 'బైకర్' ప్రమోషన్స్ లో ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎంతో యాక్టివ్‌గా మాట్లాడుతున్న శర్వా, తన విడాకుల రూమర్లపై మాత్రం పెదవి విప్పడం లేదు. గతంలో ఇలాంటి ఏ చిన్న వార్త వచ్చినా ఆయన టీం వెంటనే స్పందించి ఖండించేది, కానీ ఈసారి స్వయంగా ఫోటోలు డిలీట్ చేసినా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
సినిమా రంగంలో ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి. చిన్న పాప భవిష్యత్తు దృష్ట్యా వీరిద్దరూ మళ్లీ కలిసి ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఫోటోల తొలగింపు కేవలం టెక్నికల్ కారణమా లేక నిజంగానే విడాకుల సంకేతమా అనేది శర్వానంద్ స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
- స్టాండప్ కామెడీ పేరుతో హద్దు మీరి వ్యాఖ్యలు
- డిప్యూటీ సీఎంనే టార్గెట్ చేస్తే.. చూస్తూ ఊరుకుంటారా?
- కటకటాల పాలైన అనుదీప్ కటికాల!
- బెయిల్ వచ్చినా తప్పని తిప్పలు!
స్టాండప్ కామెడీ పేరుతో సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సెటైర్లు వేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మెగా ఫ్యామిలీపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల (Anudeep Katikala) చేసిన కొన్ని కామెంట్స్ పెను వివాదానికి దారితీశాయి. అయితే అనుదీప్ ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేయడం, అతను బెయిల్‌పై విడుదల కావడం జరిగిపోయాయి. కానీ, ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
వివాదానికి కారణం ఏమిటి?
హైదరాబాద్‌కు చెందిన అనుదీప్ కటికాల ఇటీవల నిర్వహించిన ఒక షోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, వివాహాలపై కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ రామ్ చరణ్, నిహారిక కొణిదెలపై కూడా సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు వివాహాలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, అలాగే నిహారిక విడాకుల విషయంలో పవన్ సలహా తీసుకోవచ్చని చేసిన జోకులు మెగా అభిమానులకు, జనసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది.
పోలీసుల చర్య - అరెస్ట్ వివరాలు:
అనుదీప్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేత బడే వెంకట కృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుదీప్ కావాలనే పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దిగజార్చేలా, మహిళలను కించపరిచేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు అనుదీప్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అనుదీప్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నట్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 14న అక్కడ తన తండ్రితో కలిసి పార్కులో ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలులో కాకినాడకు తరలించారు.
క్షమాపణలు చెప్పినా తగ్గని వివాదం:
వివాదం ముదురుతోందని గమనించిన అనుదీప్, ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశం ఎవరినీ నొప్పించడం కాదని, కేవలం కామెడీ కోసమే అలా మాట్లాడానని వివరణ ఇచ్చాడు. అయితే, అతను చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
బెయిల్‌పై విడుదల
అనుదీప్‌ను కాకినాడ పోలీసులు గురువారం రాత్రి 9 గంటలకు కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి బి.శ్రీదేవి ముందు హాజరుపరిచారు. రాత్రి 12 గంటల వరకు వాదనలు కొనసాగాయి. రూ.10 వేల పూచీకత్తుతో అనుదీప్‌ను బెయిల్‌పై విడుదల చేశారు. నిబంధనల ప్రకారం విచారణకు సహకరించాలని ఆదేశించారు.
సజ్జనార్ ఏం చేయబోతున్నారు?
అయితే కాకినాడలో బెయిల్ వచ్చినప్పటికీ, హైదరాబాద్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కటికాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్.. వెంటనే విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
స్టాండప్ కామెడీ పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం తరచుగా వివాదాలకు కారణమవుతోంది. అనుదీప్ కటికాల ఉదంతం స్టాండప్ కమెడియన్లు తమ కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తుచేస్తోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు. అయితే అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల బంధం బాగుంటుంది. ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది. అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
మద్దతు..
అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు. అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే.. ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు.
గౌరవం, మర్యాద..
అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే, గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా, నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది.
బాధ్యత..
ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది. ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి, బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట.
ప్రేమ, అనుబంధం..
అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది, తెలియకుండానే కోడలి పట్ల ఆమెకు చాలా ఇష్టం ఏర్పడుతుంది.
మనసు విప్పి మాట్లాడటం..
ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.
*రూపశ్రీ.
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు. అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన, ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే..
గురువు..
చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.
తల్లిదండ్రులను..
ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట.
పండితులు..
చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు. అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట.
కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు..
ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది.
సాధు స్వభావం ఉన్నవారు..
ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం.
*రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు, అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు.
ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం. వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే..
ఒంటరితనం..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు.
లోతైన మాటలు..
ఇంట్రోవర్ట్ లు చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు.
అతి ఆలోచనలు..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు , నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
తక్కువే.. కానీ బలమైన స్నేహాలు..
ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు. కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు. వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా, ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు.
వినడానికి ప్రాధాన్యత..
ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు. వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
*రూపశ్రీ.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500లు చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల రుణాలను 50 శాతం మాఫీ చేస్తామన్నారు. అలాగే ఓ కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు . అలాగే కొత్తగా ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3 వేలు పింఛను ఇస్తామన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని విజయ్ హామీల వర్షం కురిపించారు. అలాగే మహిళలు తమ ఇళ్ల ముందు టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్ ముగ్గు వేయాలని సూచించారు.
తెలుగువన్ ‘వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన. రాబోయే రోజుల్లో లోక్ సభ సీట్ల సంఖ్య పెరగబోతోందా? అలా పెరిగితే ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు లాభమా లేక భారీ నష్టమా? ప్రముఖ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్‌తో 'వాస్తవ వేదిక' ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడైన కీలక అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతానికి పట్టం కడుతూ, దక్షిణ భారతాన్ని విస్మరిస్తున్నారన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి
చారిత్రక నేపథ్యంలో విభజన చిక్కులు
నియోజకవర్గాల విభజన అనేది కేవలం జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని డోలేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. 1971 తర్వాత ఇందిరా గాంధీ హయాంలో సీట్లను స్తంభింపజేయడం వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన వివరించారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తూ, జనాభాను పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమనే వాదన బలంగా వినిపిస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. ఒకవేళ ఉత్తరాదికి 600 సీట్లు వచ్చి, దక్షిణాదికి కేవలం 200 చిల్లర సీట్లు వస్తే, ఢిల్లీలో దక్షిణాది ఎంపీల వాయిస్ వినిపించదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములాపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 50% జనాభా, 50% జిడిపి (GDP) ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఫార్ములాపై కూడా చర్చ జరిగింది. కేవలం జనాభాను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, ఆర్థిక అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ చేసిన సూచనలు ఆచరణలో సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పడుతున్నా, రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం వెనుకబడిపోతున్నదని తెలుగువన్ ఎండీ తెలిపారు.
రాజకీయ వ్యూహాలు - చంద్రబాబు వర్సెస్ జగన్
ఈ పునర్విభజన ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో జరిగిన విభజన సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన చాతుర్యంతో వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల విషయానికొస్తే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని, సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ ద్వారా లెక్కలు వేస్తే అది వైసీపీకే మేలు చేస్తుందని విశ్లేషించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగితే ఈ ప్రమాదాన్ని అడ్డుకోవచ్చని, కానీ లోకేష్ టీమ్ కేవలం అంకెలకు పరిమితమైతే నష్టం తప్పదని అభిప్రాయపడ్డారు.
ప్రజా స్పందన మరియు రియల్ టైమ్ రియాక్షన్స్
ఈ చర్చపై సామాన్యుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. "మేము జనాభాను నియంత్రిస్తే మా సీట్లు తగ్గించడం ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం అందరూ ఏకం కావాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ వివక్ష అనే పదం మళ్ళీ తెరపైకి రావడం బీజేపీకి దక్షిణ భారత్‌లో సవాలుగా మారేలా కనిపిస్తోంది. మోడీ-అమిత్ షా ద్వయం దక్షిణాదిపై వివక్ష చూపుతోందన్న విమర్శలపై కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ముగింపు
మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును, సమాఖ్య స్ఫూర్తిని ప్రభావితం చేసే అంశం. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు ఢిల్లీలో తమ ఉనికిని కాపాడుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి
కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను గత ఎన్నికలకు ముందు స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకుని సాధించిన చూపిన నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే ఆయన యువగళం పాదయాత్రతో అన్ని తొలగిపోయాయి. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరించేశాయి. ఆ సమర్థత, ఆ గుర్తింపు ఫలితమే ఇప్పుడు ఆయనకు పార్టీలో ప్రమోషన్ దక్కింది.
అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు చాలా గట్టిగా జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారంటే.. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు. ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేశారు.
అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు.
ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని, సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి చంద్రబాబు మాటల స్ఫూర్తితో ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా వెరవలేదు. అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. విపక్షంలో ఉండి ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు. అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు. తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే ఇప్పుడాయనను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసింది.
నారా లోకేష్ కు ఈ నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్ర అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి అధికార వైసీపీ పన్నని కుట్రలు, చేయని కుతంత్రాలు లేవు. వాటన్నిటినీ ప్రజాదరణతో ఎదుర్కొని లోకేష్ ముందడుగు వేసిన తీరు నిజంగా నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు.
కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది. ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి. లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బంధాన్ని మరింత పటిష్టం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెడతారని అంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి లోకేశ్ మరింత బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ఈ ప్రత్యేక వీడియోలో, హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే ఆ ప్రమాదకరమైన సంకేతాల గురించి క్లియర్ గా వివరించడం జరిగింది.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు:
ముందస్తు లక్షణాలు: గుండెపోటు రావడానికి కొన్ని రోజుల ముందు శరీరంలో కనిపించే మార్పులు ఏమిటి?
నిర్లక్ష్యం చేయకూడని నొప్పులు: కేవలం ఛాతీ నొప్పి మాత్రమేనా? లేక ఇతర శరీర భాగాల్లో వచ్చే నొప్పులు కూడా గుండెపోటుకు సంకేతాలా?
అప్రమత్తత: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి?
ముందుజాగ్రత్త చర్యలు: ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చేయాల్సిన పనులు ఏమిటి?
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకోసమే కాదు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి.
హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే ఆ ప్రమాదకరమైన సంకేతాలు ఏమిటో తెలుసుకోండి. ఈ లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.
మరిన్ని ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు. ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు. అయితే.. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. పాలు తాగడం వల్ల నయం చేయలేని పార్కిన్సన్స్ వ్యాధికూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. పాలకు, పాల ఉత్పత్తులకు, పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి అసలు సంబంధం ఏంటి? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే..
పాలు, పార్కిన్సన్స్ వ్యాధి..
పాల ఉత్పత్తులు.. ముఖ్యంగా పాలు తీసుకునే వారికి పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చని చాలా అధ్యయనాలు వెల్లడించాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం, ముఖ్యంగా పురుషులలో, 20 నుండి 40 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. అయితే.. ఇది వ్యాధికి ప్రత్యక్ష కారణం కాదు, కేవలం ఒక సహసంబంధం మాత్రమే. దీనిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందని వైద్యులు అంటున్నారు.
పరిశోధనలు చెప్పింది ఇదే..
సుమారు 25 సంవత్సరాల పాటు ప్రజల ఆహారపు అలవాట్లను పరిశీలించిన తర్వాత, చాలా తక్కువ పాలను తీసుకునే వారితో పోలిస్తే, ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకునే వారికి పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలలో కనుగొనబడింది. అలాగే పాలు తాగడం వల్ల పురుషులలో పార్కిన్సన్స్ ప్రమాదం 1.8 రెట్లు, మహిళలలో 1.3 రెట్లు పెరుగుతుందని మరొక అధ్యయనం కూడా చెబుతోంది.
పాలతో ఎందుకు సమస్య అవుతోంది..
కొన్ని పరిశోధనల ప్రకారం, పాలలో ఉండే హెప్టాక్లోర్ ఎపాక్సైడ్ వంటి పురుగుమందుల అవశేషాలు మెదడుకు హానికరంగా ఉండవచ్చు. పాలలో ఉండే గెలాక్టోజ్ కూడా ఒక కారకమని, దీనిని అధిక పరిమాణంలో తీసుకున్నప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాల ఉత్పత్తులు మన పేగు మైక్రోబయోమ్‌ను ప్రభావితం చేసి, కొన్ని ప్రోటీన్ల ఉత్పత్తికి దారితీస్తాయని, తరువాత మెదడుకు చేరి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
పాలు తాగడం మానేయాలా?
వెంటనే పాలు లేదా పాల ఉత్పత్తులను మానేయాలని చెప్పడం దీని ఉద్దేశ్యం కాదు. మితంగా తీసుకోవడం చాలా అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎక్కువగా పాలు, ముఖ్యంగా తక్కువ కొవ్వు లేదా మీగడ తీసిన పాలు తీసుకుంటే, వాటిని కొద్దిగా తగ్గించడం మంచిది.
పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు..
భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చేతులు వణకడం, కండరాలు బిగుసుకుపోవడం, కదలికలు మందగించడం, శరీర భంగిమ దెబ్బతినడం వంటివి దీని లక్షణాలు. మలబద్ధకం, వాసన కోల్పోవడం, నిద్రలేమి, మానసిక స్థితిలో మార్పులు వంటివి మొదటి దశలో కనిపించే లక్షణాలు. ఈ వ్యాధిని పూర్తిగా నివారించడం సాధ్యం కాదని వైద్యులు భావిస్తున్నారు, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు.
*రూపశ్రీ.
వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇలా వాడితే అద్భుత ఫలితాలు!
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి Dr Chittibhotla Madhusudana Sarma గారు వివరించిన మరిన్ని విషయాలను ఈ VIDEO ద్వార తెలుసుకుందాం.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధాన అంశాలు:
కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వెల్లుల్లి ఎలా కరిగిస్తుంది?
గుండె ఆరోగ్యం: రక్తపోటును (High BP) అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా వెల్లుల్లి చేసే మేలు.
బరువు తగ్గడం (Obesity): శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర.
మధుమేహం (Diabetes): రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి?
సరైన పద్ధతి: వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలా లేక వేయించి తీసుకోవాలా? ఏ సమయంలో తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది?
వెల్లుల్లిని ఔషధంగా వాడేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు మోతాదు గురించి డాక్టర్ గారి సూచనలను ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. మీ ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరుచుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
మరిన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)