బెంగాల్‌లో కమ్యూనిస్టుల కథ ముగిసినట్లేనా..?

posted on: May 19, 2016 3:59PM

భారతదేశ రాజకీయ చరిత్రలో కమ్యూనిస్టుల పాత్ర చాలా ప్రత్యేకం. అధికారంలో ఎవరున్నా వారి మాటకు ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుగా ఉంటుంది వారి తీరు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆవిర్భవించిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు హోరాహోరిగా తలపడ్డారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావించడంతో కమ్యూనిస్టుల ప్రభ మసకబారుతూ వచ్చింది. అయితే పశ్చిమబెంగాల్‌ మాత్రం వారికి ప్రత్యేకం. దశాబ్దాలకు దశాబ్దాలు అక్కడ అధికారంలో ఉండటం ద్వారా బెంగాల్‌ను వారు కంచుకోటగా మలుచుకున్నారు. వరుసగా 23 సంవత్సరాల పాటు జ్యోతిబసు ముఖ్యమంత్రిగా బెంగాల్‌ను చక్రవర్తిలా పాలించి దేశ రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించారు.

 

అలాంటి ఎర్రకోటను మమతాబెనర్జీ బద్దలు కొట్టారు. ఏడేళ్ల కిందట లోక్‌సభ ఎన్నికల్లో మమత తొలిసారి బెంగాల్‌ గడ్డపై తన ఆగమనాన్ని ఘనంగా చాటి హెచ్చరించారు. దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా గాలి కోదిలేయడంతో ముప్పు ముంచుకువచ్చింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎర్రసైన్యానికి షాకిచ్చారు మమత. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టిన ఎర్రన్నలు 75 స్థానాలతో సరిపెట్టుకున్నారు. దానిలోనూ కాంగ్రెస్ వాటానే ఎక్కువ లెఫ్ట్ కూటమికి 30 స్థానాలే వచ్చాయి. ఐదేళ్ల కిందటి ఫలితాలతో పోలిస్తే కమ్యూనిస్టులకు ఇది దారుణమైన ఓటమే అవుతుంది. క్రితం సారి ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలన్నీ కలిసి 60 సీట్లు సాధించాయి. ఇప్పుడు ఈ ఎర్ర పార్టీలన్ని కలిపి కేవలం 35 సీట్లకు పరిమితం అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో మమత విజయం ఖాయమని స్పష్టంగా కనిపించినా..శారదా కుంభకోణం, నిరంకుశ వైఖరి, అవినీతి తదితర కారణాలతో ఓటర్లు తమ పక్షాన నిలుస్తారని కమ్యూనిస్టులు భావించారు. దీనిని బట్టి   బెంగాల్లో "ఎర్ర" కథ ముగిసినట్లు కాదా..! 

google-ad-img
    Related Sigment News
    • Loading...