LATEST NEWS
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికల సంఘం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో కేవలం తమ పార్టీ నేతల వాహనాలను మాత్రమే అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (ఏప్రిల్ 15) ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ, తన కారును తనిఖీ చేసేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోల్‌కతాలోని డమ్‌డమ్ విమానాశ్రయం సమీపంలో తన వాహనాన్ని నిలిపి సోదాలు చేసేందుకు అధికారులు సాహసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలకు అంత దమ్ముంటే, తన కారును కేవలం ఒకసారి కాదు.. రోజూ తనిఖీ చేయంని సవాల్ విసిరారు. ఎన్నికల వేళ కేవలం ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
తాజాగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును కూడా అధికారులు తనిఖీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ, బెంగాల్‌లో టీఎంసీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక, దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమత మండిపడ్డారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని అధికారులకు ముఖం మీదే చెప్పానని ఆమె స్పష్టం చేశారు.
బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గతంలోనూ కేంద్ర బలగాల మోహరింపు, అధికారుల బదిలీలపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి అధికారుల తీరును తప్పుబట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ తనిఖీల పర్వం మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే మూడు అత్యంత కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 16) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రధానంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
ఈ ప్రతిపాదనలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదనీ, కానీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రను సహించబోమని చెబుతున్నాయి.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడితే, కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఇలా ఉండగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే.. సభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లోక్ షభలో కనీసం 360 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఎన్డీయే కూటమికి సభలో ఉన్న బలం 292 మాత్రమే కావడంతో ఈ బిల్లు ఆమోదం పొందడం సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నారా లోకేష్ జీవిత విశేషాలు ఎలాంటివో పరిశీలిస్తే..లోకేష్ టీడీపీ పార్టీ జనానికి ఒక ఏడాది తర్వాత జన్మించారు. ఆయన జన్మదినం 1983 జనవరి 23. అదే టీడీపీ 1982 మార్చి 29న ఆవిర్భవించింది. అంటే పార్టీతో సమానంగా ఆయన జీవితం ఎదుగుతూ వచ్చింది.
ఇటు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడిగా, మరో సీఎం చంద్రబాబు తనయుడిగా లోకేష్ జీవితం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక తల్లి నారా భువనేశ్వరీ దేవి, సతీమణి బ్రాహ్మణి. లోకేష్ కి ఒక కొడుకు దేవాన్ష్. నారా లోకేష్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ లో సాగింది. గ్రాడ్యుయేషన్- అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్- ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆపై ప్రపంచ బ్యాంకులో పని చేసిన అనుభవం సైతం సాధించారు.
ఇక రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. లోకేష్ నేరుగా పదవుల్లోకి రాకుండా, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం తెరవెనుక పని చేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థాగత బాధ్యతలు ఎప్పుడు చేపట్టారో చూస్తే.. 2013లో పార్టీలోకి అధికారికంగా ప్రవేశించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ, వేలాది మంది కార్యకర్తలకు బీమా, ఇతర సౌకర్యాలు అందేలా చూశారు. మంత్రిగా సేవల విషయానికి వస్తే.. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో గ్రామాల్లో LED లైట్ల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణం.. ఐటీ కంపెనీలను విశాఖపట్నం, అమరావతికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2019లో అధికారం పోయాక.. మరీ ముఖ్యంగా తాను మంగళగిరిలో ప్రత్యక్ష ఎన్నికల్ల్లో ఓడిపోయాక.. నారా లోకేష్ లో తీవ్ర అంతర్మధనం మొదలైంది. తన బాడీ ఫిట్ నెస్ తో పాటు అన్ని అంశాల్లోనూ దృష్టి సారించారు. 2023లో యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయి. కొన్ని అనివార్య కారణాల వల్లీ ఈ యాత్ర మధ్యలో ఆగినా దాని ఇంపాక్ట్ పార్టీలో, కేడర్లో చాలా పెద్దగానే ఉందని చెప్పాలంటారు విశ్లేషకులు.
2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం విద్యా, ఐటీ, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలను చేపట్టారు. అసలు పార్టీ పరంగా ఇప్పటి వరకూ లోకేష్ ఏం చేశారో చూస్తే.. పార్టీ సభ్యత్వ నమోదును డిజిటలైజ్ చేయడంలో ఆయన కృషి అమోఘం. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే.. పంచాయతీ రాజ్ శాఖలో చేసిన సంస్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక ఎన్నికల విజయాల పరంగా చూస్తే.. 2019లో ఓటమి ఎదురైనా, పట్టు వదలకుండా ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ప్రజలకు చేరువయ్యారు.
2024లో అదే నియోజకవర్గంలో 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. నారా లోకేష్ తన విద్యా నైపుణ్యం, ఆధునిక ఆలోచనా ధోరణితో పార్టీని భవిష్యత్ తరాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.లోకేష్ తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిందే కార్యకర్తల నుంచి. పార్టీకి ఇదెంత మేలు చేస్తుందంటే.. కార్యకర్తల సంక్షేమంలో లోకేష్ ది కీలక పాత్ర కాబట్టి. పార్టీ అంటే కార్యకర్త కాబట్టి.. ఎంతైనా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఈ నిర్ణయం కార్యకర్తకొక పండగ రోజుగా భావిస్తున్నారంతా.
ALSO ON TELUGUONE N E W S
-రామాయణతో రాముడిని మరిపిస్తున్న రణబీర్
-అందరిలో భారీ అంచనాలు
-ఇప్పుడు ఆ రాముడే 'రణబీర్'కి సాయం
-ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం
స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor)ప్రస్తుతం 'రామాయణ'(Ramayana)లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో రాముడిగా కొన్ని తరాల పాటు తన 'రూపు'నే రామ భక్తుల్లో నిలబడి పోవడం ఖాయమనే సంకేతాలైతే చాలా బలంగా చెప్పాడు. అంతలా అయోధ్య రాముడిగా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ఇప్పుడు ఆ రాముడే రణబీర్ కి అత్యంత విలువైన బహుమతిని కట్టబెట్టాడు. మరి ఆ బహుమతి ఏంటో చూసేద్దాం.
టైం మ్యాగజైన్(Time magazine).. అమెరికా దేశానికి చెందిన ఈ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరెన్నికగన్నది, ప్రతిష్టాత్మకమైనది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపించే 100 మంది ప్రతిభావంతుల పేర్లని వెల్లడి చేస్తుంది. ఆ జాబితాలో చోటు సంపాదించాలంటే పెట్టి పుట్టాలనే మాట సెలబ్రిటీస్ నోటి వెంట వినిపిస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో రణబీర్ నిలిచాడు. రణబీర్ తప్ప మరో భారతీయ నటులు 2026 టైమ్స్ జాబితాలో లేరు. ఓన్లీ రణబీర్ నే ఉన్నాడు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే గత ఏడాది టైమ్స్ జాబితాలో సినీ పరిశ్రమ నుంచే కాకుండా ఏ రంగం నుంచి కూడా ఒక్క భారతీయుడు స్థానం సంపాదించలేదు. ఈ నేపథ్యంలో రణబీర్ కి ఆ అయోధ్య రాముడే టైం మ్యాగజైన్ 2026 లో చోటు కల్పించాడనే మాటలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
also read: Ott telugu: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఈ రోజే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్
రామాయణ వరల్డ్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. మరో వైపు లెజండ్రీ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలీ(Sanjay leela bhansali)దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' ని కూడా రణబీర్ ఇప్పటికే ప్రకటించాడు.
-రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ కొడుతుందా!
-ఇంకెందుకు ఆలస్యం ఓటిటిలోకి వెళ్ళండి
-మీ కోసమే వచ్చింది
దేవభూమిగా కేరళ రాష్టానికి ఉన్న కితాబు గురించి తెలిసిందే. చాలా ఏళ్ళ నుంచి సినీ ప్రియులకి అద్భుతమైన కథనంతో కూడిన సినిమాలని అందించే సినీభూమిగా కూడా కీర్తి గడించింది. మనుషుల్లో ఉండే మంచి, చెడులని బేసిక్ గా చేసుకొని ఎలాంటి భారీ తననానికి పోకుండా సృజనాత్మకత తో కూడిన చిత్రాలని మాత్రమే తెరకెక్కిస్తోంది. ఈ మధ్య కాలంలో హర్రర్, థ్రిల్లర్ సినిమాలని కూడా తెరకెక్కిస్తు పాన్ ఇండియా ప్రేక్షకులు తమపై పెట్టుకున్న నమ్మకానికి పది రేట్లు అధికంగా సినీ అనుభూతిని, వినోదాన్ని అందిస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక చిత్రం సైలెంట్ గా ఓటిటిలోకి షిఫ్ట్ అయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
'శంభవం ఆద్యం ఒన్ను'(sambhavam adhyayam onnu).. పక్కా మిస్టరీ థ్రిల్లర్. గత నెల 6 న థియేటర్స్ లోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఊహకి అందని కథ, కథనం ,ట్విస్టులు, నటీనటుల పెర్ ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ ఇలా అన్ని అంశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. టైమ్ లూప్ ఎలిమెంట్స్ జోడించడం స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పుడు ఈ మూవీ నిన్న అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఐఎమ్డీబీలోను టాప్ రేటింగ్ దక్కించుకుందంటే 'శంభవం ఆద్యం ఒన్ను' క్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు.
Also read: Dhurandhar 2: ధురంధర్ 2 ఫెయిల్ అవ్వాలని స్టార్ డైరెక్టర్స్ కోరిక.. కోహ్లి సంచలన కామెంట్స్
కథ విషయానికి వస్తే.. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం నేపథ్యంలో సాగుతుంది. ఇంతకంటే లోతుగా వెళ్లి కథ చెప్పడం సినీ దర్మం కాదు. మీరు కూడా వద్దనే అంటారనుకోండి. మరి లేటు చేయకుండా చూసెయ్యండి. అస్కర్ అలీ, వినీత్ కుమార్, సిద్దార్ధ్ భరతన్, సెంథిల్ కృష ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా జీతు(Jeethu) దర్శకుడు. ఫరాజ్ మహమ్మద్, ఫాహద్, ఫయేజ్ మహమ్మద్ నిర్మాతలు. జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేయగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
-1712 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతున్నా ధురంధర్ 2
-రెండు పార్టులు కలిపి 3000 కోట్లు
-ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా
-ఈ నేపథ్యంలో కోహ్లి కామెంట్స్ వైరల్
-పూర్తి మాటర్ చూద్దాం
ఒక పక్కన కింగ్ కోహ్లి(King Kohli)ఐపీఎల్ లో తన బ్యాటింగ్ విన్యాసాన్ని చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. తన దూకుడు చూస్తుంటే పలు రికార్డ్స్ స్వచ్ఛందంగాకోహ్లికి సరెండర్ అయ్యేలా ఉన్నాయి. మరోవైపు ధురంధర్ 2(Dhurandhar 2)పదిహేడు వందల పన్నెండుకోట్ల గ్రాస్ ని రాబట్టి మొత్తం రెండు పార్టులు కలిపి మూడువేల కోట్ల గ్రాస్ ని సాధించింది. ఆ ఫీట్ ని సాధించిన తొలి భారతీయ చిత్రం ధురంధర్ సిరీస్ నే. ఈ నేపథ్యంలో కోహ్లి ధురంధర్ 2 ప్లాప్ అవ్వాలని బాలీవుడ్ లో చాలా మంది కోరుకున్నారనే వ్యాఖ్యలు చేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో హై ప్రొటెన్షన్ సెక్యూరిటీ మధ్య చక్కర్లు కొడుతుంది. మరి అసలు వాస్తవమేంటో చూద్దాం.
కోహ్లి అలియాస్ కునాల్ కోహ్లి(Kunal Kohli).. బాలీవుడ్ లో విశిష్ట దర్శకుడిగా పేరు గడించాడు. రీసెంట్ గా ఆయన మాట్లాడుతు బాలీవుడ్ లో చాలా మంది ధురంధర్ 2 ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు. అలా కోరుకున్న వాళ్ళల్లో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. కనీసం సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ డే టాక్ బాగానే వచ్చినా సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గడం ఖాయమని, దీంతో ధురంధర్ 2 పరాజయం అంచున నిలుస్తుందనేది వాళ్ళ భావన. కానీ వాళ్ళ అంచనాలు తప్పి సోమవారం నుంచి మరింత కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సన్నీడియోల్ నుంచి వచ్చిన బోర్డర్ 2 ఫెయిల్ అవ్వాలని కూడా కోరుకున్నారు. కానీ మంచి విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీ మీకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. విజయం సాధించాలనేది మనకి ముఖ్యమని కునాల్ చెప్పుకొచ్చాడు.
ఇక పలు సినీ సైట్స్, సోషల్ మీడియాలో కోహ్లి ధురంధర్ 2 గురించి మాట్లాడాడనే న్యూస్ వస్తుంటే అందరు విరాట్ కోహ్లీ అనుకున్నారు. కానీ అసలు నిజం కునాల్ కోహ్లి. కునాల్ సుదీర్గ కాలం నుంచి బాలీవుడ్ లో దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 2002 లో హృతిక్ రోషన్, రాణి ముఖర్జీ ,కరీనా కపూర్ జంటగా వచ్చినా ముజ్ సే దోస్తీ కరే గే తొలి మూవీ. 2004 లో సైఫ్ అలీ ఖాన్, రాణీముఖర్జీ తో 'హమ్ తుమ్' ని తెరకెక్కించగా ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నాడు. 2006 లో అమీర్ ఖాన్, కాజల్ తో 'ఫనా' తో పాటు పలు చిత్రాలు చేసిన కునాల్ గత ఏడాది ఫిబ్రవరిలో 'బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. ధురంధర్ 2 గురించి మాట్లాడే సందర్భంలో తను కూడా దర్శకుడిగా సక్సెస్ అవ్వకూడదని ఇండస్ట్రీలో చాలా మంది తపన పడ్డారని చెప్పుకొచ్చాడు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనే పదానికి నిలువెత్తు రూపం రజనీకాంత్. ఆయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కేవలం స్టైల్ మాత్రమే కాదు, భావోద్వేగాలను పండించడంలోనూ, శత్రువుల భరతం పట్టే యాక్షన్ సీన్లను పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, రజనీకాంత్ తన కుటుంబం కోసం సామాన్య వ్యక్తి నుంచి ఒక వీరుడిలా ఎలా మారాడో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన శాంత స్వభావాన్ని వీడి, విశ్వరూపం చూపించిన ఆ సన్నివేశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
ఈ వీడియోలో ఒక రౌడీ ముఠా రజనీకాంత్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన చెల్లెలిని వేధిస్తూ, అవమానకరంగా మాట్లాడుతుంటారు. అంతకుముందు వరకు ఎన్నో అవమానాలను భరిస్తూ, స్తంభానికి కట్టేసి కొడుతున్నా మౌనంగా ఉన్న రజనీకాంత్, తన చెల్లెలి గౌరవానికి భంగం కలుగుతుందన్న తరుణంలో కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకుపడతాడు. ఆ రౌడీలను ఊచకోత కోస్తూ ఆయన చేసిన ఫైట్ చూసి అక్కడున్న వారంతా నిర్ఘాంతపోతారు.
రజనీకాంత్ తనలోని ఈ కోణాన్ని ఇన్నాళ్లూ దాచి ఉంచడం చూసి ఆయన తమ్ముడు (పోలీస్ ఆఫీసర్) ఆశ్చర్యపోతాడు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్న రౌడీల పరిస్థితి చూసిన డాక్టర్లు కూడా, "ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు, నరనరాల్లో పోరాడే శక్తి ఉన్నవాడు మాత్రమే ఇలా కొట్టగలడు" అని చెబుతారు. దీంతో ఆయన తమ్ముడు, "అన్నయ్య అసలు నువ్వు ఎవరు? బాంబేలో ఏం చేసేవాడివి?" అంటూ నిలదీస్తాడు. ఇన్నాళ్లూ తమ మధ్య ఒక సామాన్యుడిలా ఉన్న అన్నయ్య వెనుక ఇంతటి భీకరమైన గతం ఉందా అని కుటుంబం మొత్తం విస్మయానికి గురవుతుంది.
తమ్ముడు తన అన్నయ్యను అనుమానిస్తున్న తరుణంలో, తల్లి జోక్యం చేసుకుని రజనీకాంత్‌కు మద్దతుగా నిలుస్తుంది. "ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగేలా కష్టపడుతున్న వాడిని నేరస్తుడిలా నిలబెడతావా?" అని తమ్ముడిని గద్దిస్తుంది. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి వేస్తే ఏ మగాడైనా ఇలాగే స్పందిస్తాడని, తన కొడుకు చేసిన దానిలో తప్పేమీ లేదని స్పష్టం చేస్తుంది. ఈ సన్నివేశం కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక అన్నకు తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతను, ప్రేమను చాటి చెబుతుంది.
రజనీకాంత్ సినిమాల్లో యాక్షన్ సీన్లు కేవలం కొట్లాటలు మాత్రమే కాదు, వాటి వెనుక బలమైన సెంటిమెంట్ ఉంటుంది. ఈ వీడియోలో కూడా తన గతాన్ని దాచిపెట్టి కుటుంబం కోసం మౌనంగా దెబ్బలు తిన్న ఒక అన్న, వారి గౌరవం కోసం పులిలా మారడం ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుంది. రజనీకాంత్ నటన, ఆ పవర్‌ఫుల్ డైలాగులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలను చూసేందుకు మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
Satya Dev is trying something different with a never-seen-before character in the upcoming film Rao Bahadur. The makers have just released the first single, O Sundari, to kickstart the musical promotions. It is definitely a good attempt by music director Smaran Sai.
He has crafted a pure classic composition, and Vijay Yesudas sang it brilliantly, pouring real emotion into the track. Lyricist Rehman also wrote great, meaningful lyrics that fit the mood perfectly. However, while the overall effort and musical rendition deserve high praise, the song seems a bit too classical for the latest Gen Z audiences taste, who usually lean towards more modern, fast-paced tunes.
Visually, the song stands out thanks to the neat chemistry between the lead pair. Satya Dev carries his stylish vintage look with ease, and Deepa Thomas brings a graceful presence to the screen. Writer and director Venkatesh Maha always shows a penchant to deliver something unique, and his distinct aesthetic is quite visible here.
With presenter Mahesh Babu and producers Chinta Gopalakrishna Reddy, Anurag Reddy, and Sharath Chandra backing the project, the production values are undeniably strong. While O Sundari is a very well-made classical track, its reach among the regular commercial moviegoers will be interesting to observe.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు. అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన, ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే..
గురువు..
చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.
తల్లిదండ్రులను..
ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట.
పండితులు..
చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు. అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట.
కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు..
ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది.
సాధు స్వభావం ఉన్నవారు..
ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం.
*రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు, అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు.
ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం. వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే..
ఒంటరితనం..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు.
లోతైన మాటలు..
ఇంట్రోవర్ట్ లు చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు.
అతి ఆలోచనలు..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు , నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
తక్కువే.. కానీ బలమైన స్నేహాలు..
ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు. కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు. వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా, ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు.
వినడానికి ప్రాధాన్యత..
ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు. వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
*రూపశ్రీ.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి. ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే..
అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు.
అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు..
రాజ్యాంగ నిర్మాత..
భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత రాజ్యాంగమే.. ఈ బారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు.
విద్యావంతుడు..
అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు. అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యారు.
సామాజిక సంస్కర్త..
ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు.
భారతరత్న..
1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు.
సత్యాగ్రహి..
నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే.
న్యాయ శాఖ మంత్రి..
అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.
*రూపశ్రీ.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికల సంఘం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో కేవలం తమ పార్టీ నేతల వాహనాలను మాత్రమే అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (ఏప్రిల్ 15) ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ, తన కారును తనిఖీ చేసేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోల్‌కతాలోని డమ్‌డమ్ విమానాశ్రయం సమీపంలో తన వాహనాన్ని నిలిపి సోదాలు చేసేందుకు అధికారులు సాహసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలకు అంత దమ్ముంటే, తన కారును కేవలం ఒకసారి కాదు.. రోజూ తనిఖీ చేయంని సవాల్ విసిరారు. ఎన్నికల వేళ కేవలం ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
తాజాగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును కూడా అధికారులు తనిఖీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ, బెంగాల్‌లో టీఎంసీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక, దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమత మండిపడ్డారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని అధికారులకు ముఖం మీదే చెప్పానని ఆమె స్పష్టం చేశారు.
బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గతంలోనూ కేంద్ర బలగాల మోహరింపు, అధికారుల బదిలీలపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి అధికారుల తీరును తప్పుబట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ తనిఖీల పర్వం మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే మూడు అత్యంత కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 16) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రధానంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
ఈ ప్రతిపాదనలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదనీ, కానీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రను సహించబోమని చెబుతున్నాయి.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడితే, కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఇలా ఉండగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే.. సభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లోక్ షభలో కనీసం 360 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఎన్డీయే కూటమికి సభలో ఉన్న బలం 292 మాత్రమే కావడంతో ఈ బిల్లు ఆమోదం పొందడం సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నారా లోకేష్ జీవిత విశేషాలు ఎలాంటివో పరిశీలిస్తే..లోకేష్ టీడీపీ పార్టీ జనానికి ఒక ఏడాది తర్వాత జన్మించారు. ఆయన జన్మదినం 1983 జనవరి 23. అదే టీడీపీ 1982 మార్చి 29న ఆవిర్భవించింది. అంటే పార్టీతో సమానంగా ఆయన జీవితం ఎదుగుతూ వచ్చింది.
ఇటు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడిగా, మరో సీఎం చంద్రబాబు తనయుడిగా లోకేష్ జీవితం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక తల్లి నారా భువనేశ్వరీ దేవి, సతీమణి బ్రాహ్మణి. లోకేష్ కి ఒక కొడుకు దేవాన్ష్. నారా లోకేష్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ లో సాగింది. గ్రాడ్యుయేషన్- అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్- ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆపై ప్రపంచ బ్యాంకులో పని చేసిన అనుభవం సైతం సాధించారు.
ఇక రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. లోకేష్ నేరుగా పదవుల్లోకి రాకుండా, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం తెరవెనుక పని చేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థాగత బాధ్యతలు ఎప్పుడు చేపట్టారో చూస్తే.. 2013లో పార్టీలోకి అధికారికంగా ప్రవేశించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ, వేలాది మంది కార్యకర్తలకు బీమా, ఇతర సౌకర్యాలు అందేలా చూశారు. మంత్రిగా సేవల విషయానికి వస్తే.. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో గ్రామాల్లో LED లైట్ల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణం.. ఐటీ కంపెనీలను విశాఖపట్నం, అమరావతికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2019లో అధికారం పోయాక.. మరీ ముఖ్యంగా తాను మంగళగిరిలో ప్రత్యక్ష ఎన్నికల్ల్లో ఓడిపోయాక.. నారా లోకేష్ లో తీవ్ర అంతర్మధనం మొదలైంది. తన బాడీ ఫిట్ నెస్ తో పాటు అన్ని అంశాల్లోనూ దృష్టి సారించారు. 2023లో యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయి. కొన్ని అనివార్య కారణాల వల్లీ ఈ యాత్ర మధ్యలో ఆగినా దాని ఇంపాక్ట్ పార్టీలో, కేడర్లో చాలా పెద్దగానే ఉందని చెప్పాలంటారు విశ్లేషకులు.
2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం విద్యా, ఐటీ, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలను చేపట్టారు. అసలు పార్టీ పరంగా ఇప్పటి వరకూ లోకేష్ ఏం చేశారో చూస్తే.. పార్టీ సభ్యత్వ నమోదును డిజిటలైజ్ చేయడంలో ఆయన కృషి అమోఘం. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే.. పంచాయతీ రాజ్ శాఖలో చేసిన సంస్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక ఎన్నికల విజయాల పరంగా చూస్తే.. 2019లో ఓటమి ఎదురైనా, పట్టు వదలకుండా ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ప్రజలకు చేరువయ్యారు.
2024లో అదే నియోజకవర్గంలో 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. నారా లోకేష్ తన విద్యా నైపుణ్యం, ఆధునిక ఆలోచనా ధోరణితో పార్టీని భవిష్యత్ తరాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.లోకేష్ తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిందే కార్యకర్తల నుంచి. పార్టీకి ఇదెంత మేలు చేస్తుందంటే.. కార్యకర్తల సంక్షేమంలో లోకేష్ ది కీలక పాత్ర కాబట్టి. పార్టీ అంటే కార్యకర్త కాబట్టి.. ఎంతైనా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఈ నిర్ణయం కార్యకర్తకొక పండగ రోజుగా భావిస్తున్నారంతా.
వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇలా వాడితే అద్భుత ఫలితాలు!
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి Dr Chittibhotla Madhusudana Sarma గారు వివరించిన మరిన్ని విషయాలను ఈ VIDEO ద్వార తెలుసుకుందాం.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధాన అంశాలు:
కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వెల్లుల్లి ఎలా కరిగిస్తుంది?
గుండె ఆరోగ్యం: రక్తపోటును (High BP) అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా వెల్లుల్లి చేసే మేలు.
బరువు తగ్గడం (Obesity): శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర.
మధుమేహం (Diabetes): రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి?
సరైన పద్ధతి: వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలా లేక వేయించి తీసుకోవాలా? ఏ సమయంలో తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది?
వెల్లుల్లిని ఔషధంగా వాడేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు మోతాదు గురించి డాక్టర్ గారి సూచనలను ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. మీ ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరుచుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
మరిన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి, రాగి పాత్రలో నీళ్లు తాగడం కొంతమందికి హానికరం కావచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకూ రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదు? తెలుసుకుంటే..
రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు?
రాగి నీరు ఎక్కువ ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి, కడుపులోని సున్నితమైన పొరను ప్రభావితం చేస్తుంది. కడుపులో పుండ్లు లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలో నీరు తాగితే మంట, నొప్పి , ఎసిడిటీ పెరగడం జరిగే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థకు రాగి పాత్రలో నీరు మరింత చికాకు పెడుతుంది.
ఎసిడిటీ, అజీర్ణం..
ఇప్పటికే ఎసిడిటీ లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారికి, రాగి నీరు తాగడం హాని చేస్తుందట. రాగి నీటిలోని కొన్ని పదార్థాలు కడుపులోని యాసిడ్ స్థాయిలను పెంచి, గుండెల్లో మంట, కడుపులో మంట , పుల్లటి త్రేన్పులకు దారితీస్తాయి.
పిల్లలకు ఇవ్వకూడదు..
రోజుల వయసున్న శిశువుల నుండి పసిపిల్లల వరకు.. వారి జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రాగి నీరు పిల్లలలో తేలికపాటి నుండి తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు తాము తాగే నీటి పరిమాణాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.
గర్భవతులు..
గర్భిణీ స్త్రీలు రాగి నీరు చాలా తక్కువ మాత్రమే తీసుకోవాలి. అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు, ఇవి తల్లికి , పిండానికి హానికరం కావచ్చు.
లివర్, కిడ్నీ వీక్నెస్..
రాగి నీరు తాగాలని అనుకునే వారు ముందు వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే ఇది కాలేయం , మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇది శరీరంలో టాక్సిన్లు తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగించి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, 'ముద్రలు' కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే 'ముద్ర' అంటారు.
ఈ వీడియోలో TeluguOne Health మనకు కొన్ని ముఖ్యమైన యోగా ముద్రలను మరియు వాటి విశిష్టతను పరిచయం చేస్తోంది:
ముఖ్యమైన ముద్రలు - ఉపయోగాలు:
జ్ఞాన ముద్ర: జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.
వాయు ముద్ర: గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
శూన్య ముద్ర: చెవి సంబంధిత సమస్యలు మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
పృథ్వీ ముద్ర: శరీరంలో విటమిన్ల లోపాన్ని సరిచేయడానికి, అలసటను తగ్గించి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
సూర్య ముద్ర: బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం.
వరుణ ముద్ర: చర్మ సౌందర్యానికి, రక్త శుద్ధికి మరియు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.
వీటిని ఎలా వేయాలి?
ఈ ముద్రలను రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏ ముద్ర ఏ వేలితో వేయాలి మరియు అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి.
మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన వీడియోల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
