English | Telugu

`కార్తీక‌దీపం` : లాయ‌ర్ సురేష్‌తో క‌లిసి మోనిత కొత్త కుట్ర‌

గ‌త కొంత కాలంగా బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. వంట‌ల‌క్క పాత్ర ధారి ప్రేమి వైధ్య‌నాథ్‌ని స్టార్‌ని చేసింది. ఇక డాక్ట‌ర్ బాబు పాత్ర‌లో న‌టించిన నిరుప‌మ్ ఓంకార్‌ని కూడా పాపుల‌ర్ స్టార్‌గా మార్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1206 ఎపిసోడ్‌లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న ఈ సీరియ‌ల్ ఈ శుక్ర‌వారం 1207వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.

బార‌సాల సాక్షిగా మోనిత క‌డుపు వెన‌కున్న కుట్ర‌ని బ‌య‌ట‌పెట్టి క‌ళ్లు బైర్లుక‌మ్మేలా చేసింది దీప‌. ఇదే సంద‌ర్భంగా దీప‌పై త‌న‌కున్న ప్రేమ‌ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు కార్తీక్‌. క‌ట్ చేస్తే ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించేదిగా వుంది. ఆ హైలైట్స్ ఏంటో చూద్దాం. దీప , శ్రావ్య ఒక‌టీమ్‌, ఆదిత్య‌, కార్తీక్ ఒక‌టీమ్‌గా ఏర్ప‌డి పొడుపుక‌థ‌ల పోటీ పెట్టుకుని హ్యాపీగా న‌వ్వుకుంటుంటారు. పిల్ల‌లు, ఆనంద‌రావు, సౌంద‌ర్య‌లు వాళ్ల‌ని చూసి మురిపిపోతుంటారు.

ఇలా కార్తీక్‌, దీప‌ల కుటుంబం ఆనందంపార‌వ‌శ్యంలో మునిగితేలుతుంటే మోనిత ఎలా వాళ్ల ఆనందాన్ని దూరంచేయాలా అని మ‌రో కుట్ర‌కు తెర‌లేపుతుంది. ఇందు కోసం ఓ మాస్ట‌ర్ ప్లాన్‌ని రెడీ చేసుకున్న మోనిత వెంట‌నే లాయ‌ర్ సేరుష్‌ని రంగంలోకి దించేస్తుంది. `మీరు ఏ దారిలో వెళ‌తారో నాకు తెలియ‌దు. సురేష్‌గారు డ‌బ్బులు ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర‌వాలేదు మ‌నం మాత్రం గెల‌వాలి.. మీరు నా రివేంజ్ తీర్చాలి` అంటుంది మోనిత‌. ఇంత‌కీ మోనిత చేసిన ప్లాన్ ఏంటీ? .. దీపని మళ్లీ ఏం చేయ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎనిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.