English | Telugu

నేను సినిమాలు చేయ‌డం మా ఆయ‌న‌కు ఇష్టంలేదు!

కొణిదెల వారి గారాల‌ప‌ట్టి నిహారిక పెళ్లికి ముందు నాలుగు సినిమాలు చేసింది. 'ఒక మ‌న‌సు'తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ఆమె, త‌ర్వాత 'హ్యాపీ వెడ్డింగ్‌', 'ఒరు న‌ల్ల నాల్ పాతు సొల్రేన్‌', 'సూర్య‌కాంతం' సినిమాల్లో నటించింది. గ‌త ఏడాది చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డతో వివాహం త‌ర్వాత సినిమా న‌ట‌న‌కు దూర‌మైంది. భ‌ర్త‌కు ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్లే త‌ను సినిమాలు చేయ‌ట్లేద‌ని ఆమె చెప్పింది. అవును. 'ఆలీతో స‌ర‌దాగా' షోలో అలీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది నిహారిక‌. "నేను సినిమాలు చేయ‌డం మా ఆయ‌న‌కు ఇష్టం లేదు. నేను కూడా ఓకే అనుకున్నాను." అని ఆమె చెప్పింది.

అలా అని న‌ట‌న‌కు ఆమె దూరం కాలేదు. ప్ర‌స్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. "ఒక సూప‌ర్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే దాని డీటైల్స్ ఇవ్వ‌లేను. సూప‌ర్బ్ థీమ్‌. నిఖిల్ విజ‌యేంద్ర సింహ అలియాస్ యుట్యూబ‌ర్‌ నిఖిలూ అందులో లీడ్ యాక్ట‌ర్‌." అని నిహారిక తెలిపింది.

చిన్న‌వ‌య‌సులోనే ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చిందని అలీ అడిగిన ప్ర‌శ్న‌కు, "కొంత‌మంది యాక్ట్రెసెస్‌ను చూసుకుంటే పెళ్లి అయిన త‌ర్వాత వాళ్ల కెరీర్ అంత మార‌లేదు. నిజం చెప్పుకోవాలంటే, స‌మంత‌కు పెళ్లికి ముందు ఎంత క్రేజ్ ఉండిందో, పెళ్లి అయిన త‌ర్వాత కూడా అంతే క్రేజ్ ఉండింది. స్టిల్ షి ఈజ్ ఎ సూప‌ర్‌స్టార్‌. హిందీలోనూ కొంత‌మందిని చూశాను. పెళ్లి త‌ర్వాత కూడా అంత చేంజ్ ఏమీ ఉండ‌దు. పెళ్లి త‌ర్వాత యాక్టింగ్ ఎందుకు ఆపేశారో.. బ‌హుశా వాళ్ల‌కు వారి కార‌ణాలు ఉండొచ్చు." అని ఆమె చెప్పింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.