English | Telugu

గుప్పెడంత మ‌న‌సు` : జ‌గ‌తిని రిషీ ఏమ‌డిగాడు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. రిషీ. వసుల ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఆద్యంతం ఆక‌ట్టుకునే క‌థా క‌థ‌నాల‌తో సాగుతోంది. గ‌త కొర‌న్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ ఈ శుక్ర‌వారం 302వ ఎపిసోడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. రిషీ, ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర‌ల‌తో క‌లిసి ఇంట్లో కూర్చుని ` ఈరోజే లాస్ట్ ఎగ్జామ్‌...సెల‌వుల్లో మెషీన్ ఎగ్జామ్ మ‌రింత డ‌బుల్ చేయాలి` అంటాడు. ఇదే స‌మ‌యంలో మ‌హేంద్ర‌కు వ‌సు ఫోన్ చేస్తుంది.

ప‌క్క‌కు వెళ్లిన మ‌హేంద్ర `నేనే నీకు ఫోన్ చేయాల‌నుకుంటున్నాన‌మ్మా .. నీతో చాలా మాట్లాడాలి` అంటాడు అయితే రెస్టారెంట్‌లో సాయంత్రం క‌లుద్దామా` అంటుంది వ‌సు. రిషి వ‌స్తున్నది గ‌మ‌నించి మ‌హేంద్ర ఫోన్ క‌ట్ చేస్తాడు. అది గ‌మ‌నించిన రిషీ.. ఏంమీ త‌న‌తో మీకు ప‌ర్స‌న‌ల్స్‌.. అని ప్ర‌శ్నిస్తే.. అబ్బెబ్బే ఏమీ లేదు ఊరికే చేసింది అని క‌వ‌ర్ చేస్తాడు. మీరు రెస్టారెంట్లో క‌ల‌వాల‌నుకుంటున్నార‌ని అది త‌న‌కు తెలుస‌ని త‌న‌కు తెలుస‌ని రిషి మ‌న‌సులో అనుకుంటాడు.

మ‌రి అనుకున్న‌ట్టుగానే మ‌హేంద్ర‌, వ‌సు రెస్టారెంట్‌లో కలుసుకున్నారా? .. క‌లిస్తే ఏం మాట్లాడుకున్నారు? .. ఆ త‌రువాత ఏంజ‌రిగింది? .. రిషి వ‌చ్చాడా? .. జ‌గ‌తికి .. రిషి.. వ‌సు గురించి ఏం చెప్పాడు? .. అందుకు జ‌గ‌తి ఎలా రియాక్ట్ అయింది? .. వంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ త‌ప్ప‌కుండా చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.