English | Telugu

స్టోర్ రూమ్ లో బందీగా మ‌ల‌బార్ మాలిని!

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, ఆనంద్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. పార్ట‌న‌ర్ ఇచ్చే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎక్క‌డ ర‌ద్ద‌వుతుందోన‌ని య‌ష్ త‌న‌తో కొంత సేపు భార్య‌గా న‌టించ‌మ‌ని వేద‌ని కోర‌తాడు.

దీంతో ఖుషీ కోసం వేద స‌రే అంటుంది. ఇద్ద‌రు క‌లిసి భోగిమంట‌ల్లో పిడ‌క‌లు వేస్తున్న దృశ్యాన్ని చూసిన వేద సోద‌రి త‌ల్లి పండితారాధ్యుల సులోచ‌నకు చెబుతుంది. దీంతో ఆగ్ర‌హించిన వేద త‌ల్లి సులోచ‌న అస‌లు త‌న వేద‌కు పెళ్లే కాలేద‌ని, య‌ష్ కు త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని య‌ష్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. క‌ట్ చేస్తే.. శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

Also read:సుకుమార్ దర్శకత్వంలో ధనుష్!

అంత మంది ముందు య‌ష్ ని బుక్ చేసింద‌ని అత‌ని త‌ల్లి మ‌ల‌బార్ మాలిని .. వేద త‌ల్లి పండితారాధ్యుల సులోచ‌న‌పై ప‌గ ప‌డుతుంది. త‌న‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాల‌ని ఎద‌రుచూస్తూ వుండ‌గా మాలినికి ఎదురుప‌డుతుంది సులోచ‌న. దీంతో ఛాన్స్ దొరికింద‌ని వేద త‌ల్లిని దారుణంగా అవ‌మానిస్తుంది. అయితే త‌న‌కూ స‌మ‌యం దొరుకుతుంద‌ని ఎదురుచూసిన వేద త‌ల్లి.. మ‌ల‌బార్ మాలిని స్టోర్ రూమ్ లోకి వెళ్ల‌డం గ‌మ‌నించి త‌ను లోనికి వెళ్ల‌గానే త‌లుపులు మూసి గ‌డియ వేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? మ‌ల‌బార్ మాలిని ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంది? ఆ విష‌యం తెలిసి య‌ష్ .. వేద‌తో గొడ‌వ‌కు దిగాడా? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.