English | Telugu

రౌడీల‌ని అల్లాడించిన డాక్ట‌ర్ బాబు

`కార్తీక దీపం` సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటోంది. ప్ర‌తీ ఎపిసోడ్ ట్విస్ట్ , ట‌ర్న్ ల‌తో సాగుతూ ఎం జ‌రుగుతుందో అనే ఉత్కంఠకు ప్రేక్ష‌కులు లోన‌య్యేలా చేస్తోంది. ఈ మంగ‌ళ‌వారం 1258వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటీ? .. దీప‌, డాక్ట‌ర్ బాబు ఏం చేయ‌బోతున్నారు? .. వీరిని రుద్రాణి, ఆమె మ‌నుషులు ఎలాంటి ఇబ్బందుల‌కు గురిచేయ‌బోతున్నారు? అన్న‌ది ఈ రోజు ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది.

భ‌ద్రం ఇచ్చిన 6 వేలు అడ్వాన్స్ తో రుద్రాణి ఇంటికి బ‌య‌లుదేరిన కార్తీక్ ...అనుమానంతో ఇంటికి వెళ‌తాడు. `దీప హోట‌ల్ లో ప‌ని చేస్తూ నాకు అబ‌ద్ధం చెప్పి ఉంటుందా? .. ఇంటికి వెళ్లి చూస్తాను. ఇంట్లో ఆనంద్ వుంటే ఆయ‌న చెప్పిన వంట మ‌నిషి దీపే` అనుకుంటూ భ‌ద్రం మాట‌లు గుర్తు చేసుకుంటూ ఇంటికి బ‌య‌లుదేరతాడు కార్తీక్‌. కార్తీక్ ఇంటికి వెళ్లేస‌రికి ఆనంద్ వుంటాడు. త‌న‌తో పిల్ల‌లు, దీప న‌వ్వుతూ ఆడుకుంటుంటారు.

సీన్ క‌ట్ చేస్తే .. కార్తీక్ ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు పై వెళ్తాంటాడు. అప్పుడే ఎదురుగా పిల్లిగ‌డ్డం రౌడీ, పెద్ద గ‌డ్డం రౌడీ కారులో వ‌స్తూ వుంటారు. అప్పుడే పిల్లిగ‌డ్డం రౌడీ.. కారు న‌డుపుతున్న పెద్ద గ‌డ్డం రౌడీతో `రేయ్ అబ్బులు గాడు లేడుగా.. వాళ్లావిడ‌కి బాగోలేద‌ని హాస్పిట‌ల్ కి తీసుకుని వెళ్లాడు క‌దా.. వాడు వ‌చ్చే దాకా నేనే మ‌న రుద్రాణి అక్క‌కు రైట్ హ్యాంట్ ` అంటాడు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య కొంత సేపు వాద‌న జ‌రుగుతుంది..ముందు బుర‌ద‌గుంట‌ వుంద‌ని అందులోంచి కార్ పోనిస్తే ముందు వ‌చ్చేవాడిపై ఆ బుర‌దంతా ప‌డుతుందని అలా చేద్దామ‌ని ఓ నిర్ణ‌యానికి వ‌స్తారిద్ద‌రూ.

అయితే వారి ముందు నుంచి న‌డుచుకుంటూ వ‌స్తున్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు కార్తీక్ (డాక్ట‌ర్ బాబు). ఇద్ద‌రు రౌడీలు కారుని వేగంగా న‌డ‌ప‌డం మొద‌లుపెడ‌తారు. త‌న‌వైపు వేగంగా దూసుకు వ‌స్తున్న కార్‌ని, అలాగే త‌న ప‌క్క‌న వున్న బుర‌ద‌గుంట‌ని గ‌మ‌నిస్తాడు కార్తీక్‌. ఆ వెంట‌నే ప‌క్క‌నే వున్న ఓ రాయిని ప‌ట్టుకుని కార్ వంక కోపంగా చూస్తూ అడుగులు వేస్తాడు. అది గ‌మ‌నించిన పెద్ద గ‌డ్డం, చ‌న్న‌గ‌డ్డం బిత్త‌ర‌పోతారు. త‌మ ఎదురుగా వుంది కార్తీక్ అని గ‌మ‌నించి అల్లాడిపోతారు. ఆ త‌రువాత స‌డ‌న్ బ్రేక్ వేస్తాడు పెద్ద గ‌డ్డం. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. డాక్ట‌ర్ బాబు ఏం చేశాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.