English | Telugu

భార్య‌ను హ‌త్తుకొని వ‌ల‌వ‌లా ఏడ్చిన శివారెడ్డి!

'స్టార్ మా'లో ప్ర‌సార‌మ‌వుతూ మంచి వీక్ష‌కాద‌ర‌ణ‌తో ముందుకు వెళ్తోన్న సెల‌బ్రిటీ గేమ్ షో 'ఇస్మార్ట్ జోడీ'. ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోకు సంబంధించి ప్ర‌స్తుతం సెకండ్ సీజ‌న్ న‌డుస్తోంది. టీవీ తార‌లు, డాన్స్ మాస్ట‌ర్లు, సినీ న‌టులు త‌మ లైఫ్ పార్ట‌న‌ర్స్‌తో ఈ షోలో పాల్గొంటున్నారు. విజేతల‌కు ఇస్మార్ట్ జోడీ ట్రోఫీ ల‌భిస్తుంది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో కౌశ‌ల్‌, ముక్కు అవినాశ్‌, విశ్వ‌, బాబా భాస్క‌ర్‌, మ‌హేశ్వ‌రి, ల‌హ‌రి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, శివారెడ్డి, హ‌ర్షిత‌, ప్రీతి నిగ‌మ్‌, ఏక్‌నాథ్ త‌మ జీవిత భాగ‌స్వాముల‌తో ఈ ట్రోఫీ కోసం ఫైట్ చేస్తున్నారు.

ప్ర‌తి శ‌ని, ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు ఈ షో ప్ర‌సార‌మ‌వుతోంది. ఈరోజు రాత్రి ప్ర‌సారం కానున్న ఎపిసోడ్‌లో క‌మెడియ‌న్ శివారెడ్డి ఎమోష‌న‌ల్ అయి, ఏడ‌వ‌డం అంద‌రి గుండెల్నీ బ‌రువెక్కించ‌నుంది. టాస్క్‌లో భాగంగా వంట చేస్తూ శివారెడ్డి భార్య స్వాతి మూకుడును వ‌ట్టి చేతుల్తో ప‌ట్టుకొని మంట మీంచి తీసి, కింద‌పెట్టింది. దీంతో ఆమె రెండు చేతుల వేళ్లూ కాలి ఎర్ర‌గా కందిపోయాయి.

Also read:సురేఖావాణి కూతురు షాకిచ్చింది

ఈ సంద‌ర్భంగా భార్య‌ను కావ‌లించుకొని తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యాడు శివారెడ్డి. "చాలా టాలెంట్ ఉంది. కానీ నా లైఫ్‌లో ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర నాకు అడ్డంకి వ‌చ్చేసి వెన‌క‌డుగు పోతుంటా. వేడిగా ఉన్న పెనం తీసి ఎప్పుడైతే పెట్టిందో అక్క‌డే నాకు ఫ్యూజ్‌లు ఔటైపోయిన‌య్‌. నేను తీస్తుంటే, త‌ను మూకుడు డైరెక్టుగా చేతుల్తో ప‌ట్టుకుంది. ఎర్ర‌గైంది చూడండి" అని ఆమె చేతివేళ్ల‌ను చూపిస్తూ ఏడ్చేశాడు శివారెడ్డి. స్వాతి కూడా ఏడుపు ఆపుకోలేక జ‌ల‌జ‌లా క‌న్నీరు కార్చేసింది. పోటీ కంటెస్టెంట్ అయిన ప్రీతి నిగ‌మ్ సైతం ఏడుపు ఆపుకోడానికి విఫ‌ల‌య‌త్నం చేసింది.

Also read:`జ‌బ‌ర్ద‌స్త్` నుంచి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయా?

నిజానికి ఇప్పుడున్న స్థాయికంటే శివారెడ్డి మంచి స్థితిలో ఉండాల్సింది. ఎంతో టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ, సినిమాల్లో క‌మెడియ‌న్‌గా మంచి పేరు వ‌చ్చినా, ఎందుక‌నో ఆశించిన రీతిలో అత‌డికి అవ‌కాశాలు రాలేదు. దీన్ని త‌ల‌చుకుంటూ 'ఇస్మార్ట్ జోడీ'లో అత‌ను ఎమోష‌న‌ల్ అయ్యాడు. పూర్తి ఎపిసోడ్ చూస్తే మ‌రిన్ని విష‌యాలు మ‌న‌కు తెలుస్తాయి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.