English | Telugu

యష్‌.. వేదల‌ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర వీక్ష‌కుల్ని స‌రికొత్త ధారావాహిక `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం` విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. యంగ్ డైరెక్ట‌ర్ స‌రికొత్త క‌థ‌తో రూపొందిస్తున్న ఈ సీరియ‌ల్ రెండు భిన్న‌మైన వ్య‌క్తుల మ‌ధ్య ఓ పాప కోసం మొద‌ల‌య్యే ప్రేమ‌క‌థ‌గా సాగుతోంది. ఖుషీ సంతోషం కోసం య‌శోధ‌ర్ భార్య‌గా నాట‌కం ఆడ‌టానికి వేద అంగీక‌రిస్తుంది. య‌ష్ త‌న‌కు కాంట్రాక్ట్ ఇచ్చే పార్ట్న‌ర్ దంప‌తులు త‌న భార్య వేద అని అపార్థం చేసుకోవ‌డంతో త‌న కాంట్రాక్ట్ కోసం అదే నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తాడు.

Also Read: తుల‌సికి ఏం జ‌ర‌గ‌బోతోంది?

ఈ లోగా సంక్రాంతి సంబ‌రాల కోసం మీ ఇంటికే వ‌చ్చేస్తాన‌ని య‌ష్ పార్ట్న‌ర్ త‌న భార్య‌తో స‌హా య‌ష్ ఇంటికి వ‌చ్చేస్తాడు. అక్క‌డ వేద.. య‌ష్ భార్య‌గా మ‌ళ్లీ న‌టించ‌డానికి య‌ష్, అత‌ని సోద‌రుడు య‌శ్వంత్ ఒప్పిస్తారు. అయితే ఇదంతా గ‌మ‌నించిన వేద సోద‌రి త‌న త‌ల్లికి చెబుతుంది. దీంతో త‌న కూతురిని అమాయ‌కురాలిని చేసి ఆడుకుంటున్నార‌ని ఆగ్ర‌హించి వేద త‌ల్లి య‌ష్ ని అత‌ని పార్ట్న‌ర్ ఫ్యామిలీ ముందే నిల‌దీస్తుంది. త‌న కూతురికి అస‌లు పెళ్లే కాలేద‌ని, య‌ష్ కు, మాకు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పి అత‌న్ని అడ్డంగా బుక్ చేస్తుంది.

Also Read: ఇన్‌స్టాలో భ‌ర్త‌ను అన్‌ఫాలో అయిన శ్రీ‌జ‌.. ఆ ఇద్ద‌రూ విడిపోతున్న‌ట్లే!

అయితే జ‌రిగిన దాంట్లో య‌ష్ త‌ప్పు లేద‌ని, త‌నిచ్చే కాంట్రాక్ట్ ఎక్క‌డ ర‌ద్ద‌వుతుందోన‌న్న భ‌యంతోనే ఇలా చేశార‌ని య‌ష్ పార్ట్న‌ర్ గ్రహిస్తాడు. ఈ సంద‌ర్భంగా వేద‌ని అభినందించి య‌ష్ కు కాంట్రాక్ట్ అప్ప‌గిస్తాడు. ఆ త‌రువాత వేద తో గాలిప‌టాలు ఎగ‌రేయాల‌ని య‌ష్ కోరుకుంటాడు. ఇందుకు య‌శ్వంత్ పిలిచేద్దాం అంటాడు. వేద రాద‌ని, త‌ను ఎందుకొస్తుంద‌ని వాదిస్తాడు య‌ష్‌... ఇంత‌కీ య‌ష్‌, ఖుషీల‌తో క‌లిసి గాలిప‌టాలు ఎగ‌రేయ‌డానికి వేద వ‌చ్చిందా?.. వ‌స్తే య‌ష్‌, వేద‌ల మ‌ధ్య ఏం జ‌రిగింది? .. ఎలాంటి సంఘ‌ట‌న‌కు దారి తీసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...