English | Telugu

అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. వెంకీ మామ హోస్ట్ గా ఆహాలో కొత్త షో!

ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్స్ ఓటీటీలో సందడి చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ హోస్ట్ గా వ్యవహరించని నటసింహం బాలకృష్ణ సైతం ఓటీటీ వేదిక ఆహా కోసం హోస్ట్ గా మారి 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో అలరిస్తున్నారు. బాలయ్య ఎనర్జీకి, కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాలయ్య హోస్ట్ గా టాక్ షో చేస్తే బాగుంటుందని ఆలోచించి, అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న అల్లు అరవింద్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉత్సాహంతో అల్లు అర్జున్ మరో సీనియర్ హీరోని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు అందరూ ముద్దుగా వెంకీ మామ అని పిలుచుకునే విక్టరీ వెంకటేష్.

వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తనదైన కామెడీ టైమింగ్ తో నవ్విస్తుంటాడు వెంకీ మామ. ఇప్పటికే పలు సినిమా వేడుకల్లో ఆయన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో చేసి హిట్ కొట్టినట్లుగానే వెంకీతోనూ ఓ మంచి షో చేసి హిట్ కొట్టాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీనిని దృష్టిలో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఓ షోని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే హోస్ట్ గా వెంకీ మామ అదరగొడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...