English | Telugu

రాజ‌నందిని ఎంట్రీ 

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న డైలీ సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌రాఠీ సీరియ‌ల్ `తులా ఫ‌టేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇప్ప‌టికి ఎనిమిది భాష‌ల్లో ఈ సీరియ‌ల్ రీమేక్ అయి విజ‌య‌వంతంగా ప్రసారం అవుతోంది. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో స‌రికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. `బొమ్మ‌రిల్లు` వెంక‌ట్ శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి నిర్మించారు. వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించించింది.

Also Read:రుద్రాణికి కార్తీక్ ఎవ‌రో తెలిసిపోతుందా?

ఈ సీరియ‌ల్ లోని ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, రామ్ జ‌గ‌న్‌, విశ్వ‌మోహ‌న్‌, అనూష సంతోష్, రాధాకృష్ణ‌, జ‌య‌ల‌లిత‌, వ‌ర్ష‌, క‌ర‌ణ్‌, ఉమాదేవి, మ‌ధుశ్రీ‌, జ్యోతిరెడ్డి, సందీప్ న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ శుక్ర‌వారం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించే అంకానికి చేర‌బోతోంది. రాజ‌నందిని ఆత్మ త‌న‌ని ఆదేశించ‌డంతో ఆర్య‌ని, త‌న‌ని కాపాడుకోవ‌డానికి అను ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటుంది. ఈ క్ర‌మంలో జ‌రిగే ప‌రిణామాల కార‌ణంగా ఆర్య ముందు దోషిగా నిలుస్తుండ‌టంతో అనుని ఏదైనా మాన‌సిక వైద్యునికి చూపించాల‌ని ఆర్య వర్ధ‌న్ నిర్ణ‌యించుకుంటాడు.

Also Read: చ‌లికాలంలో వేడిపుట్టిస్తున్న పూజ!

ఆ వెంట‌నే ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తాడు కూడా. ఇందులో భాగంగా ఓ మాన‌సిక వైద్యుని ద‌గ్గ‌రికి అనుని తీసుకెళ‌తాడు. త‌న‌ని పిచ్చిదానిగా ఆర్య భావిస్తున్నాడ‌ని తెలిసి అను కుమిలి కుమిలి ఏడుస్తుంది. మ‌న‌సులోనే బాధ‌ప‌డుతుంది. అయితే త‌న కూతురిని మాన‌సిక వైద్యుని వ‌ద్ద‌కు తీసుకొచ్చార‌ని గ్ర‌హించిన అను తండ్రి సుబ్ర‌హ్మ‌ణ్యం ఇది నిజం కాకూడ‌ద‌ని ప‌రుగు ప‌రుగున ఆసుప‌త్రికి వ‌స్తాడు. అయితే త‌న తండ్రి రాక‌ను గ‌మ‌నించిన అను అత‌ని కంట ప‌డ‌కుండా అక్క‌డి నుంచి ఆర్య‌తో క‌లిసి వెళ్లిపోతుంది.

Also Read:టూర్ లో శ్రీ‌హాన్‌.. హోమ్ ఐసోలేష‌న్‌లో సిరి..

ఇదే క్ర‌మంలో గుడిలోకి ముసుగుతో ఓ మ‌హిళ ఎంట్రీ ఇస్తుంది. ఆర్చ‌న చేయ‌మ‌ని పూజారికి కొబ్బ‌రి కాయ పూలున్న పాత్ర‌ని అంద‌జేస్తుంది. దీంతో అమ్మా మీ పేరేంట‌ని పూజారి అడ‌గ‌డంతో త‌న పేరు రాజ‌నంద‌ని అని చెప్పి త‌న ముఖం చూపిస్తుంది. దీంతో ఒక్క సారిగా పూజారి షాక్ కు గుర‌వుతాడు. ఇంత‌కీ అనుకు క‌నిపించిన రాజ‌నందిని నిజ‌మైతే మ‌రి గుడిలో అర్చ‌న కోసం వ‌చ్చిన ఈ రాజ‌నందిని ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.