English | Telugu

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ అప్పుడప్పుడు వెండితెరపైనా సందడి చేస్తూ కుర్రకారుకి మత్తెక్కిస్తూ ఉంటుంది. అయితే బుల్లితెరపై గ్లామర్, సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్, డ్యాన్స్ లు వంటివి ఆమెకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే ఆమెకి సంబంధించిన ఏ న్యూస్ వినిపించిన బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అయితే తాజాగా రష్మీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.

రష్మీ గౌతమ్- సుడిగాలి సుధీర్ లవ్ లో ఉన్నారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటాని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఆన్ స్క్రీన్ మాత్రమే తాము లవర్స్, ఆఫ్ స్క్రీన్ లో తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి పెళ్లి గురించి అప్పుడప్పుడు గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా రష్మీ ఓ వ్యక్తిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడని, లాక్ డౌన్ లో కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రష్మీ తన భర్తతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటుందని, ప్రొఫెషన్ పరంగా అవకాశాలు తగ్గకూడదన్న ఉద్దేశంతో రష్మీ తన పెళ్లిని సీక్రెట్ గా ఉంచిందని అంటున్నారు.

కాగా, గతంలో యాంకర్ రవి సైతం తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టాడు. సడెన్ గా ఫ్యామిలీ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చాడు. రష్మీ కూడా అలాగే షాక్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.