English | Telugu
రాజనందిని చెల్లెలు జెండేకి చిక్కబోతోందా?
Updated : Jan 29, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న థ్రిల్లర్ సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో, ఆసక్తికరమైన ట్విస్ట్ లతో ఈ సీరియల్ సాగుతోంది. వెంకట్ శ్రీరామ్, వర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్ బుల్లితెర వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. రాజనందిని ఆత్మ గా రావడం, ఆర్య వర్ధన్ ని వివాహం చేసుకున్న అనుని ఆవహించడం, తన హత్య వెనకున్న రహస్యాన్ని కనుక్కోమని ఆదేశించడం.. ఏమర పాటుగా వుంటే నువ్వూ, ఆర్య కూడా హత్య చేయబడతారని హెచ్చరించడంతో అసలు రాజనందని హత్య వెనక ఎవరున్నారో వెతకడం మొదలుపెడుతుంది అను.
Also Read:బిగ్ షాక్..ఆనందరావు - సౌందర్య వెళ్లిపోతున్నారా?
ఈ క్రమంలో అనుకు లభించిన ఆధారం రాజనందిని చెల్లెలు రాగసుధ. ఆమె ఫొటోని పట్టుకుని ఓ పురతన గుడికి ఆర్యతో కలిసి వెళుతుంది అఉ. అక్కడ రాగ సుధ గురించి ఆసక్తికర విషయాల్ని అక్కడి పూజారి అనుకు వివరిస్తాడు. దీంతో తన చెల్లెలు రాగసుధని ఎలాగైనా కలవాలని అను తపిస్తుంది. అక్కడే తను వచ్చేంత వరకు వుండాలని నిర్ణయించుకుని ఆర్యని వెళ్లకుండా చేస్తుంది. అయితే అనూహ్యంగా ఆర్యవర్ధన్ ఆఫీసులో ఇరుక్కున్న రాగ సుధ అక్కడి నుంచి బయటికి రావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు.
Also Read:త్రివిక్రమ్ తో మరో హ్యాట్రిక్ కి స్కెచ్!
ఈలోగా ఎవరో ఆడమనిషి ఆఫీసులో దూరిందని, వెతుకుతున్న క్రమంలో ఓ గదిలోకి వెళ్లి అక్కడి నుంచి బయటికి రాలేదని జెండే కనిపెడతడు. సీసీటీవిలో తను ఏ గదిలో వుందో తెలుసుకున్న జెండే గన్ తీసుకుని రాగసుధ వున్న గది వైపు వెళతాడు. చివరికి గది తలుపు తెరుస్తాడు.. తలుపు పక్కనే గాజు పెంకుని ఆయుధంగా మార్చుకున్న రాగసుధ దాడి చేయడానికి రెడీ అవుతుంది.. అది గమనించిన జెండే డోర్ వెనకున్న రాగసుధ శ్వాసని గమనించి గన్ ట్రిగ్గర్ పై వేలుపెడతాడు... ఆ తరువాత ఏం జరిగింది. జెండే ట్రిగ్గర్ నొక్కాడా? .. రాగసుధ చనిపోయిందా? అన్నది తెలియాలంటే ఈ శనివారం ఎపిసోడ్ చూడాల్సిందే.