English | Telugu

రుద్రాణి ఇంటికి హిమ.. ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్ ఇప్పుడు సాగ‌దీత దోర‌ణి కార‌ణంగా మునుప‌టి వైభ‌వాన్ని కోల్పోయింది. సీరియ‌ల్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అనే స్థాయి నుంచి ఎప్పుడు ముగించేస్తారా? అని ప్రేక్ష‌కులు ఎదురుచూపే స్థాయికి ప‌డిపోయింది. దీంతో గ‌త కొన్ని రోజులుగా ఈ సీరియ‌ల్ రేటింగ్ దారుణంగా ప‌డిపోతూ వ‌స్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈ సీరియ‌ల్ సాగుతోంది.

Also Read:పెళ్లికి సిద్ధ‌మైన య‌ష్ - వేదల‌కు బిగ్ షాక్‌

ఇదిలా వుంటే ఈ సోమ‌వారం 1263వ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. మ‌రి ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. శౌర్య కు ఉన్న‌ట్టుండి గుండెనొప్పి రావ‌డం.. వైద్యం కోసం కార్తీక్ ప్ర‌తీ ఒక్క‌రినీ అభ్య‌ర్థించ‌డం ప‌లువురిని షాక్ గురిచేస్తోంది. అయితే ఎంత తిరిగినా అప్పు పుట్ట‌క‌పోవ‌డంతో చివ‌రికి రుద్రాణి చెంత‌కు చేరాల్సి వ‌స్తుంది. తీసుకో పారు 5 ల‌క్ష‌లు ఈ డ‌బ్బు నీకు ఇప్ప‌డు చాలా అవ‌స‌రం. నీ కూతురుని కాపాడుకో.. నాకు డ‌బ్బు పిచ్చి వుంది కానీ అంత‌కంటే ఎక్కువ‌గా పిల్ల‌లంటే ఇష్టం . అందుకే ఇస్తున్నా.. డ‌బ్బుది ఏముందు సారూ ఈ రోజు నాద‌గ్గ‌ర రేపు నీద‌గ్గ‌ర ఉంటుంది.. ఎలాగో ఓ పాప‌ని నాకే ఇవ్వాలిగా.. అంటుంది రుద్రాణి.

Also Read:బిగ్ షాక్‌..ఆనంద‌రావు - సౌంద‌ర్య వెళ్లిపోతున్నారా?

క‌ట్ చేస్తే... రుద్రాణి ఇంటి ముందుకు వెళ్లి చేతులు క‌ట్టుకుని .. నేను మీరు కోరుకున్నట్టే మీ ద‌గ్గ‌రే వుంటాను.. మా శౌర్య‌ని కాపాడండి ఆంటీ` అని ఏడుస్తుంది హిమ‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. హిమ చేసిన ప‌నికి డాక్ట‌ర్ బాబు, దీప ఎలా రియాక్ట్ అయ్యారు. రుద్రాణి .. హిమ కోరిన‌ట్టే శౌర్య‌ని కాపాడిందా? .. అందుకు డాక్ట‌ర్ బాబు, దీప అంగీక‌రించారా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.