English | Telugu
హైపర్ ఆది.. అనసూయకు చెప్పిన ఆ టింగులేంటీ?
Updated : Jan 29, 2022
బుల్లితెర హాస్య ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న కామెడీ షో `జబర్దస్త్`. గత కొంత కాలంగా కడుపుబ్బా నవ్వించే స్కిట్‌లతో నవ్వులు కురిపిస్తోంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ లో నూ తనదైన పంచ్‌లోతో ఆకట్టుకుంటున్న హైపర్ ఆది ఇందులోనూ తనదైన టైమింగ్ తో అదరగొడుతున్నాడు. ఈ షోకి కూడా రోజా, మనో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్‌గా అనసూయ వ్యవహరిస్తోంది. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే తనకు పేరు తెచ్చిన జబర్దస్త్ ని మాత్రం వీడటం లేదు.
Also Read:హీరోగా, నిర్మాతగా చరణ్ సేమ్ స్ట్రాటజీ!
తాజాగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో హైపర్ ఆది, అనసూయ, రాకెట్ రాఘవ అండ్ టీమ్ పాల్గొని హంగామా చేశారు. హైపర్ ఆది చేసిన రచ్చ మామూలుగా లేదు. టైమ్ చిక్కితే అనసూయపై హైపర్ ఆది పంచ్ లు వేస్తుంటాడన్నది తెలిసిందే. ఈ ప్రమోలోనూ అదే జరిగింది. ఛాన్స్ దొరికింది కదా అని హైపర్ ఆది .. అనసూయ విషయంలో రెచ్చిపోయాడు. తనదైన పంచ్‌లతో అనసూయని టీజ్ చేశాడు.
Also read:కళ్యాణి టైమ్ మాములుగా లేదసలు!
`నందమూరి నాయకా అందమైన కోరికా.. అనే పాటలో ప్రోమో స్టార్టయింది.. ఈ పాట ప్లే అవుతుండగానే అనసూయ, హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు. `మొన్న పుష్ప థాట్ నీకు ఎలా వచ్చింది అసలు? అని అనసూయ అడిగింది. `అసలు మనిద్దరి గురించి..మన మీటింగ్ ప్లాన్ చేయాలని, లేదా డేటింగ్ ప్లాన్ చేయాలని లేదా ఏదన్నా ఈటింగ్ ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుంటే.. అంటూ గ్యాప్ ఇచ్చాడు... హైపర్ ఆది. వెంటనే ఈ లాస్ట్ టింగు గురించి నాకు చెప్పలేదు రిహార్సల్ లో అని ఆదిని కొట్టేసింది. వెంటనే `అన్ని టింగులు చెబితే..ఇన్నిటింగులు వుండవు మన దగ్గర అని హైపర్ ఆది తిరగి పంచ్ వేశాడు.
నువ్వు చూస్తూ వుండు నేను కూడా ఏదో ఒక రోజు రోజాగారిలాగ అసెంబ్లీకి వెళ్తా` అంటుంది అనసూయ. వెంటనే అందుకున్న ఆది `నీకు ఆల్ రెడీ ఫెస్ బుక్ లైవ్ లోనే నీకు చాలా సమస్యలున్నాయి. మళ్లీ అసెంబ్లీ సమస్యలు ఇవన్నీ ఎందుకు.. అనగానే రోజా, మనో గోల్లున నవ్వేశారు. `జబర్దస్త్` తాజా ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ప్రసారం కానుంది.