English | Telugu
స్టేజ్ పై రెచ్చిపోయిన అరియానా, అషు రెడ్డి
Updated : Feb 1, 2022
బిగ్‌బాస్ రియాలీటీ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు అరియానా, అషురెడ్డి. సీజన్ 4లో అరియానా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాని కారణంగానే సీజన్ 5 కి సంబందించిన బిగ్‌బాస్ బజ్ కార్యక్రమానికి అరియానా హోస్ట్ గా వ్యవహరించి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఒక్కో కంటెస్టెంట్ ని ఆడుకుంది. ఆ తరువాత కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అరియానా తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది. అది కూడా అషురెడ్డి కారణంగా.
ఈ ఇద్దరు కలిసి స్టేజ్ పై రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోకి అషురెడ్డి క్యాప్షన్ కూడా ఇచ్చింది. హేట్ చేసేవాళ్లు హేట్ చేయండి అయితే మేము మాత్రం లవ్ చేస్తాం` అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఈ ఫొటోలో ఏముందంటే.. అరియానా గ్లోరీ, అషురెడ్డి ఇద్దరు కలిసి ఓ షోలో ఓ పాటకు డ్యాన్స్ చేసినట్టున్నారు. ఈ సందర్భంగా నడుముపై అషురెడ్డి ముద్దు పెట్టింది. తను ముద్దు పెడుతుంటే అరియానా గ్లోరీ సిగ్గుపడుతూ హోయలు పోయింది. ఇదొక అనంతమైన హావభావం అని అషురెడ్డి కామెంట్ చేసింది.
ఈ ఫొటోకు అందమైన కామెంట్ ని జతచేసిన అషురెడ్డి తన ఇన్ స్టా పేజ్‌లో షేర్ చేసింది. ఒక్కసారిగా షాక్ అయిన నెటిజన్స్ వామ్మో వీళ్ల తీరు మరోలా వుందిగా అంటూ రెచ్చిపోతున్నారు. కొందరేమో టూ హాట్ అంటూ హాట్ ఎమోజీలతో కామెంట్ చేస్తుంటే మరి కొందరు ఇలాంటి పోస్ట్ ల వల్ల ఏంటీ ఉపయోగం అని, దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారని మరి కొందరు వీరిపై మండిపడుతున్నారు. అరియానా గ్లోరీ నడుముని అషురెడ్డి ఎందుకు కిస్ చేసింది? అన్నది తెలియాలంటే `స్టార్ మా`లో ప్రసారం కానున్న సదరు ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.