English | Telugu

బిగ్ బాస్ 15 విన్న‌ర్ తేజ‌స్వి ఎంత డ‌బ్బు గెలుచుకుందంటే..

బిగ్ బాస్ 15 (హిందీ) రియాలిటీ గేమ్ షో ముగిసింది. స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ షోలో 24 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 120 రోజుల పాటు అల‌రించిన ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా టీవీ న‌టి తేజ‌స్వీ ప్ర‌కాశ్ నిలిచింది. బిగ్ బాస్‌-15 టైటిల్‌తో పాటు రూ. 40 ల‌క్ష‌లు క్యాష్ ప్రైజ్ అందుకుంది. బిగ్ బాస్ విన్న‌ర్‌గా నిల‌వ‌డంతో ఆమెకు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. పాపుల‌ర్ హిందీ సీరియ‌ల్ 'నాగిన్' సీక్వెల్‌లో ఆమెకు కీ రోల్ ల‌భించింది.

Also read:బన్నీ సంచలనం.. హిందీలో వంద కోట్ల మార్క్ దాటిన 'పుష్ప'!

ఈ షోలో ఫ‌స్ట ర‌న్న‌ర‌ప్‌గా సెహ‌జ్‌పాల్, థ‌ర్డ్ ప్లేస్‌లో తేజ‌స్వి బాయ్‌ఫ్రెండ్ క‌ర‌ణ్ కుంద్రా నిలిచారు. శిల్పా శెట్టి సోద‌రి న‌టి ష‌మితా శెట్టి నాలుగో స్థానంతో స‌రిపెట్టుకుంది. టీవీ స్టార్‌గా సంపాదించుకున్న పాపులారిటీతో టైటిల్ ఫేవ‌రేట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తేజ‌స్వి, అభిమానుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌లేదు.

Also read:'పవన్'ని పొగుడుతూ 'బన్నీ'పై షాకింగ్ కామెంట్స్!

28 సంవ‌త్స‌రాల తేజ‌స్వి త‌న పోరాట స్ఫూర్తి, తెంప‌రిత‌నంతో ఫైన‌ల్స్‌కి చేరుకుంది. ఈ షో మ‌ధ్య‌లో న‌టుడు క‌ర‌ణ్ కుంద్రాతో ప్రేమ‌లో ప‌డింది. అప్ప‌ట్నుంచీ ఫ్యాన్స్‌కు ఆ జంట ఫేవ‌రేట్ అయ్యింది.