English | Telugu

Illu illalu pillalu : నర్మదకి తన భర్త సపోర్ట్.. ఆనందరావు తెచ్చిన ప్రాబ్లమ్ అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -252 లో.....కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం ధీరజ్ కి చెప్పలేక ప్రేమ బాధపడుతుంది. అప్పుడే ధీరజ్ వచ్చి.. అప్పుడు నాకేదో చెప్తానని వచ్చావేంటి.. ఆ విశ్వ గాడి గొడవలో చిరాకుగా అలా నీతో మాట్లాడేసాను.. దానికి సారీ.. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలని వచ్చవని ధీరజ్ అడుగుతాడు. నాకు తెలుసు రా నేను బాధపడితే నువ్వు చూడలేవని ప్రేమ అనుకుంటుంది.

ఒకటి అడుగుతా చెప్పురా కళ్యాణ్ గాడు నన్ను మోసం చేసాడని జాలి తో పెళ్లి చేసుకున్నావ్ కదా.. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు హ్యాపీగా లేవు కదా అని ధీరజ్ తో ప్రేమ అంటుంటే ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. మాట వరుసకి కూడా అలా కాదు అనట్లేదు.. అలాంటప్పుడు నా బాధని నీకు ఎలా చెప్పుకోవాలని ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ధీరజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరొకవైపు నర్మద బాధపడుతుంటే సాగర్ వచ్చి.. ఏంటి నేను మాట మీద ఉండనని అనుకుంటున్నావా అని సాగర్ అంటాడు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయని నర్మద అంటుంది.

నాకు నువ్వు ఇంపార్టెంట్.. నీ ప్రేమ కావాలని నర్మద అంటుంది. నువ్వు నాకోసం మీ వాళ్ళని వదులుకొని వచ్చావ్.. అలాంటి నీ కోసం ఏదైనా చేస్తానని నర్మదతో సాగర్ అంటాడు. మరొకవైపు కలశం నుండి చెయ్ రావడం లేదని రామరాజుతో తిరుపతి అంటాడు. అప్పుడే ఆనందరావు వస్తాడు. పక్క వీధిలోకి వచ్చాను. శ్రీవల్లి ని చూసి వెళదామని వచ్చానని ఆనందరావు అంటాడు. శ్రీవల్లి వాళ్ళ నాన్నని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఎందుకు వచ్చావ్ నాన్న అని ఆనందరావుని శ్రీవల్లి కోప్పడుతుంది. ఇప్పుడు ఆ తిరుపతి చెయ్ కలషంలో నుండి బయటకి వస్తే అందులో ఉన్న గిల్టీ నగలని తెలుస్తాయి కదా అందుకే నేనొక ప్లాన్ తో వచ్చానని ఆనందరావు అంటుంటే.. మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ తెస్తావ్ వద్దని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.