English | Telugu

అగ్నిపరీక్షలో ఒపీనియన్ ట్యాగ్ ఎవరికొచ్చిందంటే!


బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడానికి జియో హాట్ స్టార్ లో అగ్నిపరీక్ష ద్వారా ఎపిసోడ్ లని రిలీజ్ చేస్తున్నారు బిబి టీమ్. ఇక ఈ అగ్నిపరీక్ష ముగియడానికి మూడు ఎపిసోడ్ లే మిగిలి ఉన్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో పదిహేను మందిలో ఎవరికి ఏ ఒపీనియన్ ఉందో ట్యాగ్ ఇవ్వాలని టాస్క్ అందరు ఒకొక్క ఒపీనియన్ తమకి నచ్చని వారికి ఇస్తూ వచ్చారు. నాగ, హరీష్ కి ప్రసన్న కుమార్ ట్యాగ్ ఇచ్చాడు కానీ వాళ్ళు మేమ్ అది కాదు అని వాదించారు. దాంతో ప్రసన్న కుమార్ సైలెంట్ అయిపోయాడు. ఇక శ్రీముఖి అతని దగ్గరికి వచ్చి ఇలా ఉండకూడదు.. ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావని అతడిని అడుగుతుంది.

సిచువేషన్ జరిగినప్పుడు అది కాదు.. ఇది అని చెప్పాలనిపిస్తుంది కానీ ఇలాంటి చెప్పే సిచువేషన్ లో నేను మాట్లాడలేకపోతున్నాను అంటాడు. ఆ తర్వాత పదిహేను మందిలో ఒపీనియన్ టాస్క్ ఏడుగురికి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు అయిదుగురికి ఒపీనియన్ ఇచ్చారు. ఇంకా మిగిలింది కల్కి. తనకి ఒపీనియన్ ఛాన్స్ రాలేదు. ఎవరు తనకి ఒపీనియన్ చెప్పలేదు. దాంతో తనని స్టేజ్ మీదకి శ్రీముఖి పిలుస్తుంది. ఇన్ని రోజుల ప్రయాణంలో నీ మీద ఒక్కరికి కూడా ఒపీనియన్ లేకపోవడమేంటి? అంటే నువ్వు ఒక్కదానివి ఉన్నట్లు.. నిన్ను ఎవరు గుర్తించడం లేదని శ్రీముఖితో పాటు జడ్జెస్ అంటారు.

ఈ ఎపిసోడ్ వరకు నువ్వు పక్కన కూర్చోవాల్సిందేనని తనని పంపిస్తారు. ఇక ఆ తర్వాత అసలైన టాస్క్ మొదలవుతుంది. ఎవరైతే ఒపీనియన్ ఇచ్చిన కంటెస్టెంట్, ఒపీనియన్ తీసుకున్న కంటెస్టెంట్ ఉన్నారో వారిద్దరిని కలిసి ఒక జంటగా చేసి అలా ఏడు జంటలు చేశారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.