English | Telugu

11 స‌ర్జ‌రీలు.. చావు బ్రతుకుల మధ్య టీవీ నటి!

బుల్లితెరపై 'స్వాతి' అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శరణ్య శశి. ఈ సీరియల్ లో తన అందంతో పాటు అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా గడిపింది. అక్కడ కూడా ఈమెకి మంచి పేరే దక్కింది. మలయాళంలో ఈమె నటించిన ఓ సీరియల్ కు ఉత్తమ నటి కేటగిరీలో అవార్డుని కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ నటి చావు బ్రతుకుల మధ్య అల్లాడుతోందని సమాచారం.

ఈ విషయాన్ని శరణ్య స్నేహితురాలు, తోటి నటి సీమా నాయర్ వెల్లడించింది. శరణ్య మంచి నటిగా రాణిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని.. అప్పటినుండి ఆమె మంచానికే పరిమితమైందని.. ట్రీట్మెంట్ అందిస్తున్నా కోలుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు శరణ్యకు 11 సర్జరీలు జరిగాయట. అయినప్పటికీ ఆమె కోలుకోలేదని.. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని సీమా నాయర్ తెలిపింది.

ఓ వ్యాధి ఆమె వెన్నెముక నుండి శరీరమంతా పాకుతున్నట్లు వైద్యులు తెలిపారని సీమా చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే ఆమె ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతుంద‌ని.. అలాంటి సమయంలో శరణ్య తల్లి, సోదరుడికి కరోనా సోకడంతో హాస్పిటల్ పాలయ్యారని.. దీంతో శరణ్య ఆరోగ్యం మరింత దారుణంగా త‌యార‌వుతోందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సీమా నాయర్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.