English | Telugu

'ఫినాలే'లో ఊహించ‌ని గిఫ్ట్‌! దుఃఖాన్ని ఆపుకోలేక‌పోయిన మోనాల్‌!

గతేడాది బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత ఆ షోకి బదులుగా ఓంకార్ 'డాన్స్ ప్లస్' షోను మొదలుపెట్టాడు. ఆరుగురు జడ్జిలతో సరికొత్తగా ఈ షోను డిజైన్ చేశారు. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ను తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. కొరియోగ్రాఫర్లను తీసుకోవాల్సిన స్థానంలో ఆమెని ఎలా తీసుకుంటారనే విమర్శలు వినిపించాయి. కేవలం గ్లామర్ షో కోసం ఆమెని తీసుకొని ఉంటారనే కామెంట్స్ చేశారు.

ఏదైతేనేం మోనాల్ గ్లామర్, ఆమె ఎమోషన్ షోకి బాగానే కలిసొచ్చింది. ఫైనల్ గా ఈ షో ముగిసిపోయింది. అందరూ భావించినట్లుగానే సంకేత్ సహదేవ్ విజేతగా నిలిచాడు. శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. అయితే ఈ షోను మోనాల్ ఇంట్లో చిల్ అవుతూ చూసింది. ఫినాలే ఆదివారం నాడు మొదలైనప్పటికీ షూటింగ్ ముందే పూర్తయి ఉంటుంది. అలా మోనాల్ తన ఇంట్లో కూర్చొని బీర్ తాగుతూ షోని వీక్షించింది.

మోనాల్ వ్యక్తిగత జీవితం గురించి అందరినీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో చాలా సార్లు తన ఫ్యామిలీ విషయాలు చెప్పింది. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడం గురించి మోనాల్ ఇదివరకు చాలా సార్లు చెప్పింది. ఈ ఫినాలే ఎపిసోడ్ లో మోనాల్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు ఓంకార్. తండ్రి త‌న భుజంపై చేయివేసి నిల్చున్న‌ట్లుగా వేసిన పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో మోనాల్ ఎమోషనల్ అయింది.వ‌స్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.