English | Telugu

లవ్ మ్యారేజ్‌పై అరియనా ఫీలింగ్స్‌! నెటిజ‌న్స్ నుంచి వ‌రుస ప్ర‌పోజ‌ల్స్‌!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్యులకు, సెలబ్రిటీలకు దూరం తగ్గింది. తారలు నేరుగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా తన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ సెషన్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె ప్రేమ, పెళ్లి, క్రష్ ఇలా చాలా విషయాలపై స్పందించింది. పేరున్న యాంకర్ కానప్పటికీ ఆర్జీవీ ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయింది అరియనా.

ఆ ఇంటర్వ్యూతోనే బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది. ఇక హౌస్ లో ఆమె ఆట తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. కొందరు సెలబ్రిటీలు సైతం అరియనా యాటిట్యూడ్ ను మెచ్చుకున్నారు. ఇక తాజా సెషన్ లో అరియనా అబ్బాయిలపై తన ఫీలింగ్స్ బయటపెట్టి షాకిచ్చింది. "పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా..? ప్రేమ వివాహం చేసుకుంటావా..?" అని ఓ నెటిజన్ అడగ్గా.. "లవ్ మ్యారేజ్ చేసుకుంటా" అనే హింట్ ఇస్తూనే ఏ పెళ్లైనా కాంప్లికేషన్స్ తప్పవని బదులిచ్చింది. తనకు చాలా మందిపై క్రష్ ఉందని.. అయితే బయటకు చెప్పనని తెలిపింది.

అప్పుడప్పుడు కొంతమంది అబ్బాయిలను చూస్తే 'భలే ఉన్నాడే' అనే ఫీలింగ్ కలుగుతుందని.. మళ్లీ ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆలోచించి వెంటనే మర్చిపోతానని ఓపెన్ గా కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో అరియనాకు నెటిజన్ల నుండి వరుస ప్రపోజల్స్ రావడంతో ఉక్కిరిబిక్కిరైంది. కొందరు వాట్సాల్ప్ డీపీ, ఫోన్ వాల్ పేపర్ చూపించమని అడగ్గా.. వాటిని సైతం స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేసింది. తన ఫోటోలనే వాల్ పేపర్ గా, డీపీగా పెట్టుకుంది అరియనా.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.